Chronicles II - 2 దినవృత్తాంతములు 7 | View All

1. సొలొమోను తాను చేయు ప్రార్థనను ముగించి నప్పుడు అగ్ని ఆకాశమునుండి దిగి దహనబలులను ఇతర మైన బలులను దహించెను; యెహోవా తేజస్సు మంది రమునిండ నిండెను,

1. When Shlomo had finished praying, fire came down from heaven and consumed the burnt offering and the sacrifices; and the glory of ADONAI filled the house,

2. యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేకయుండిరి.

2. so that the [cohanim] could not enter the house of ADONAI; because the glory of ADONAI filled ADONAI's house.

3. అగ్నియు యెహోవా తేజస్సును మందిరముమీదికి దిగగా చూచి ఇశ్రాయేలీయులందరును సాష్టాంగనమస్కారము చేసియెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతర ముండునని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించిరి.

3. All the people of Isra'el saw when the fire came down, and the glory of ADONAI was on the house; they bowed down with their faces to the ground on the flooring; prostrating themselves, they gave thanks to ADONAI, 'for he is good, for his grace continues forever.'

4. రాజును జనులందరును యెహోవా ఎదుట బలులు అర్పించిరి.

4. Then the king and all the people offered sacrifices before ADONAI.

5. రాజైన సొలొమోను ఇరువది రెండువేల పశువులను లక్ష యిరువది వేల గొఱ్ఱెలను బలులుగా అర్పించెను; యాజకులు తమ తమ సేవాధర్మములలో నిలుచుచుండగను, లేవీయులు యెహోవా కృప నిరంతరము నిలుచుచున్నదని వారిచేత ఆయనను స్తుతించుటకై రాజైన దావీదు కల్పించిన యెహోవా గీతములను పాడుచు వాద్యములను వాయించుచు నిలుచుచుండగను, యాజకులు వారికి ఎదురుగా నిలిచి బూరలు ఊదుచుండగను, ఇశ్రాయేలీయు లందరును నిలిచియుండగను

5. King Shlomo offered a sacrifice of 22,000 oxen and 120,000 sheep. Thus the king and all the people dedicated the house of God.

6. రాజును జనులందరును కూడి దేవుని మందిరమును ప్రతిష్ఠచేసిరి.

6. The [cohanim] stood at their appointed stations, while the [L'vi'im] used the instruments that David the king had provided for making music to ADONAI in order to 'give thanks to ADONAI, for his grace continues forever,' by means of the praises David had composed. Opposite them the [cohanim] sounded trumpets; and all Isra'el stood up.

7. మరియు తాను చేయించిన యిత్తడి బలిపీఠము దహన బలులకును నైవేద్యములకును క్రొవ్వుకును చాలనందున యెహోవా మందిరము ముంగిటనున్న నడిమి ఆవరణమును సొలొమోను ప్రతిష్ఠించి, అక్కడ దహనబలులను సమాధాన బలిపశువుల క్రొవ్వును అర్పించెను.

7. Shlomo also consecrated the center of the courtyard in front of the house of ADONAI; because he had to offer the burnt offerings and the fat of the peace offerings there. For the bronze altar which Shlomo had made could not receive the burnt offering, the grain offering and the fat.

8. ఆ సమయ మందు సొలొమోనును, అతనితో కూడ హమాతునకు పోవు మార్గము మొదలుకొని ఐగుప్తు నదివరకున్న దేశములో నుండి బహు గొప్ప సమూహముగా కూడివచ్చిన ఇశ్రాయేలీయులందరును ఏడు దినములు పండుగ ఆచరించి

8. So Shlomo celebrated the festival at that time for seven days, together with all Isra'el, an enormous gathering; [[they had come all the way]] from the entrance of Hamat to the [Vadi] [[of Egypt]].

9. యెనిమిదవనాడు పండుగ ముగించిరి; ఏడు దినములు బలిపీఠమును ప్రతిష్ఠచేయుచు ఏడు దినములు పండుగ ఆచరించిరి.

9. On the eighth day they held a solemn assembly, having observed the dedication of the altar for seven days and the festival for seven days.

10. ఏడవ నెల యిరువది మూడవ దినమందు దావీదునకును సొలొమోనునకును తన జనులైన ఇశ్రాయేలీయులకును యెహోవా చేసిన మేలుల విషయమై సంతోషించుచును మనోత్సాహము నొందుచును, ఎవరి గుడారములకు వారు వెళ్లునట్లు అతడు జనులకు సెలవిచ్చి వారిని పంపివేసెను.

10. Then, on the twenty-third day of the seventh month, he sent the people away to their tents full of joy and glad of heart for all the goodness ADONAI had shown to David, to Shlomo and to Isra'el his people.

11. ఆ ప్రకారము సొలొ మోను యెహోవా మందిరమును రాజనగరును కట్టించి, యెహోవా మందిరమందును తన నగరునందును చేయుటకు తాను ఆలోచించినదంతయు ఏ లోపము లేకుండ నెరవేర్చి పని ముగించెను.

11. Thus Shlomo finished the house of ADONAI and the royal palace. Everything that Shlomo had set his heart on making in the house of ADONAI and in his own palace he accomplished successfully.

12. అప్పుడు యెహోవా రాత్రియందు సొలొమోనునకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెనునేను నీ విన్నపము నంగీకరించి యీ స్థలమును నాకు బలులు అర్పించు మందిర ముగా కోరుకొంటిని.

12. ADONAI appeared to Shlomo by night and said to him, 'I have heard your prayer and have chosen this place for myself as a house of sacrifice.

13. వాన కురియకుండ నేను ఆకాశ మును మూసివేసినప్పుడే గాని, దేశమును నాశనము చేయు టకు మిడతలకు సెలవిచ్చినప్పుడే గాని, నా జనులమీదికి తెగులు రప్పించినప్పుడే గాని,

13. If I shut up the sky, so that there is no rain; or if I order locusts to devour the land; or if I send an epidemic of sickness among my people;

14. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ముతాము తగ్గించుకొని ప్రార్థనచేసి నన్ను వెదకి తమ చెడుమార్గములను విడిచినయెడల, ఆకాశమునుండి నేను వారి ప్రార్థనను విని, వారి పాపమును క్షమించి, వారి దేశమును స్వస్థపరచుదును.

14. then, if my people, who bear my name, will humble themselves, pray, seek my face and turn from their evil ways, I will hear from heaven, forgive their sin and heal their land.

15. ఈ స్థలమందు చేయబడు ప్రార్థనమీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును,

15. Now my eyes will be open and my ears will pay attention to the prayer made in this place.

16. నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దాని కోరుకొని పరిశుద్ధపరచితిని, నా దృష్టియు నా మనస్సును నిత్యము దానిమీద నుండును.

16. For now I have chosen and consecrated this house, so that my name can be there forever; my eyes and heart will always be there.

17. నీ తండ్రియైన దావీదు నడచినట్లుగా నీవును నా కనుకూల వర్తనుడవై నడచి, నేను నీకాజ్ఞాపించిన దానియంతటి ప్రకారముచేసి, నా కట్టడలను నా న్యాయ విధులను అనుసరించినయెడల

17. As for you, if you will live in my presence, as did David your father, doing everything I have ordered you to do, and keeping my laws and rulings;

18. ఇశ్రాయేలీయులను ఏలు టకు స్వసంతతివాడు ఒకడు నీకుండకపోడని నేను నీ తండ్రియైన దావీదుతో చేసియున్న నిబంధననుబట్టి నేను నీ రాజ్యసింహాసనమును స్థిరపరచుదును.

18. then I will establish the throne of your rulership, as I covenanted with David your father when I said, 'You will never lack a man to be ruler in Isra'el.'

19. అయితే మీరు త్రోవ తప్పి, నేను మీకు నియమించిన కట్టడలను ఆజ్ఞలను విడచి, యితర దేవతలను అనుసరించి వాటికి పూజానమ స్కారములు చేసిన యెడల

19. But if you turn away and abandon my regulations and [mitzvot] which I have set before you, and go and serve other gods, worshipping them;

20. నేను మీకిచ్చిన నా దేశ ములోనుండి మిమ్మును పెల్లగించి, నా నామమునకు నేను పరిశుద్ధపరచిన యీ మందిరమును నా సన్నిధినుండి తీసివేసి, సమస్త జనములలో దానిని సామెత కాస్పదముగాను నిందకాస్పదముగాను చేయుదును.

20. then I will pull them up by the roots out of the land I have given them. This house, which I consecrated for my name, I will eject from my sight; and I will make it an example to avoid and an object of scorn among all peoples.

21. అప్పుడు ప్రఖ్యాతి నొందిన యీ మందిరమార్గమున పోవు ప్రయాణస్థులందరును విస్మయమొందియెహోవా ఈ దేశమునకును ఈ మందిరమునకును ఎందుకు ఈ ప్రకారముగా చేసెనని యడుగగా

21. This house, now so exalted- everyone passing by will be shocked at the sight of it and will ask, 'Why has ADONAI done this to this land and to this house?'

22. జనులుఈ దేశస్థులు తమ పితరులను ఐగుప్తు దేశమునుండి రప్పించిన తమ దేవుడైన యెహోవాను విసర్జించి యితర దేవతలను అనుసరించి వాటికి పూజానమ స్కారములు చేసినందున యెహోవా ఈ కీడంతయు వారి మీదికి రప్పించెనని ప్రత్యుత్తరమిచ్చెదరు.

22. But the answer will be, 'It's because they abandoned ADONAI the God of their ancestors, who brought them out of the land of Egypt, and took hold of other gods, worshipping and serving them; this is why [[ADONAI]] brought all these calamities on them.''



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Chronicles II - 2 దినవృత్తాంతములు 7 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

సొలొమోను ప్రార్థనకు దేవుని సమాధానం.

సొలొమోను ప్రార్థనకు దేవుని నుండి మంచి స్పందన లభించింది. పాపులపై ప్రసాదించబడిన దైవిక దయలు, వాటిని స్వీకరించేవారిని గాఢంగా ఆకట్టుకునే విధంగా వెల్లడి చేయబడ్డాయి, అతని మహిమ మరియు పవిత్రతను నొక్కి చెబుతాయి. ప్రజలు పూజల్లో నిమగ్నమై దేవుడికి మొక్కులు చెల్లించుకున్నారు. పాపం చేసిన వారికి ఆయన తనను తాను దహించే అగ్నిగా వెల్లడిస్తుండగా, అతని ప్రజలు తమ మార్గదర్శక కాంతిగా ఆయనలో ఓదార్పుని పొందగలరు. నిజానికి, ఈ ప్రత్యక్షతలో దేవుని మంచితనాన్ని గుర్తించడానికి వారికి కారణం ఉంది. ప్రభువు దయచేతనే మనము సేవించబడము; బదులుగా, మా తరపున ఒక త్యాగం జరిగింది, దీని కోసం మనం లోతైన కృతజ్ఞత కలిగి ఉండాలి.
నిజమైన విశ్వాసంతో మానవాళి పాపాల కోసం రక్షకుని వేదన మరియు మరణాన్ని నిజంగా ఆలోచించే ఎవరైనా వారి దైవిక దుఃఖం తీవ్రమవుతుంది, పాపం పట్ల వారి అసహ్యత తీవ్రతరం అవుతుంది, వారి ఆత్మ మరింత అప్రమత్తంగా ఉంటుంది మరియు వారి జీవితం పవిత్రమైనది. సొలొమోను దేవుని పవిత్ర స్థలాన్ని అందంగా తీర్చిదిద్దడంలో మరియు తన స్వంత ప్రయత్నాలను మెరుగుపరచుకోవడంలో తన ఉద్దేశాలన్నింటినీ సమర్థవంతంగా నెరవేర్చుకున్నాడు. దేవుని సేవతో తమ ప్రయాణాన్ని ప్రారంభించేవారు తమ వ్యక్తిగత పనులలో కూడా విజయం సాధించే అవకాశం ఉంది. సోలమన్ యొక్క ప్రశంసలు అతను ప్రారంభించిన దాని ద్వారా చూడడానికి అతని అచంచలమైన నిబద్ధతలో ఉంది; అతని శ్రేయస్సు దేవుని దయ యొక్క ఫలితం.
కాబట్టి, మనం భక్తితో సంప్రదించి, అతిక్రమణకు దూరంగా ఉందాం. మనము ప్రభువు యొక్క అసంతృప్తిని గూర్చిన భక్తిపూర్వక భయమును కలిగియుందుము, ఆయన దయలో మన నిరీక్షణను ఉంచుదాము మరియు మనము ఈ మార్గములో నడచుచున్నప్పుడు ఆయన ఆజ్ఞలను శ్రద్ధగా పాటించుదాము.



Shortcut Links
2 దినవృత్తాంతములు - 2 Chronicles : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |