Psalms - కీర్తనల గ్రంథము 115 | View All

1. మాకు కాదు, యెహోవా మాకు కాదు నీ కృపాసత్యములనుబట్టి నీ నామమునకే మహిమ కలగునుగాక

యెహోవా దేవునికీ, లోక జాతులు దేవుళ్ళను పూజిస్తున్న విగ్రహాలకూ ఉన్న తేడాను ఈ కీర్తన వర్ణిస్తున్నది. ఆయన పరలోకంలో ఉన్నాడు. అవి భూమి పై ఉన్నాయి. ఆయన అన్నింటికీ యజమాని, ఎందుకంటే అన్నింటినీ చేసినది ఆయనే. విగ్రహాలు మనుషుల చేతుల్లో తయారయ్యాయి. ఆయన తన ఇష్టం వచ్చినట్టు చేస్తాడు. అవి బొత్తిగా ఏమీ చెయ్యలేవు. ఆయన్ను ఆరాధించేవారు శాశ్వతంగా దీవించబడుతారు. విగ్రహాలను పూజించేవారు అవి ఎలా పనికిమాలినవో వారు కూడా అలానే దేవునికి పనికి రానివారవుతారు. ఈ గట్టి పునాది పై ఈ కీర్తన రచయిత ప్రజను దేవునిలో నమ్మకం ఉంచాలనీ, ఆయన్ను స్తుతించాలనీ పురిగొల్పుతున్నాడు. దేవునికి అన్ని విషయాల్లోనూ మహిమ కలగాలని దేవుని నిజ సేవకులందరు కోరుతారు. తమకు పేరు ప్రతిష్ఠలు గానీ డబ్బు గానీ హెచ్చు ఉద్యోగం గానీ మనుషుల నుంచి ఘనత గానీ లభించాలని సేవ చేసేవారు దేవుని నిజ సేవకులు ఏ మాత్రం కాదు. దేవుడు కృపాసత్యాలకు దేవుడు. రక్షించగలవాడు ఆయనొక్కడే. తన ప్రజలను సంరక్షిస్తూ దీవిస్తూ, తనను సేవించేందుకు వారికి సామర్థ్యమిస్తూ ఉండేవాడు. గనుక ఆయనకే మహిమ అంతా చెందాలి.

2. వారి దేవుడేడి అని అన్యజనులెందుకు చెప్పుకొందురు?

కీర్తనల గ్రంథము 42:3. దేవుడు లేని ప్రజలు వేసే నిందలకు దేవుని నిజమైన పిల్లలంతా దుఃఖపడతారు. మనుషులు మన దేవుణ్ణి చూడలేరు. కాబట్టి మనకసలు దేవుడు లేడని కొందరు వ్యర్థంగా అనుకుంటారు.

3. మా దేవుడు ఆకాశమందున్నాడు తన కిచ్ఛవచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయు చున్నాడు

అయితే నిజ దేవుడు ఎక్కడ ఉండాలో అక్కడ (పరలోకంలో) ఉంటూ విశ్వాన్ని ఏలుతున్నాడు. ఆయన సంకల్పాలేవీ విఫలం కావు. ఆయన ఉద్దేశాలనెవరూ భంగపరచలేరు (కీర్తనల గ్రంథము 135:6; యెషయా 14:27; దానియేలు 4:35).

4. వారి విగ్రహములు వెండి బంగారువి అవి మనుష్యుల చేతిపనులు

కీర్తనల గ్రంథము 135:15-20 పోల్చి చూడండి. మనిషిని చేసిన దేవుణ్ణి వదిలి మనిషి చేసిన దేవుణ్ణి పూజించే మూర్ఖత్వం గురించి యెషయా 40:18-26; యెషయా 44:9-20 మరి కొన్ని చోట్ల చూడండి.

5. వాటికి నోరుండియు పలుకవు కన్నులుండియు చూడవు

సజీవుడైన దేవుడు సందేశాలిస్తాడు. విగ్రహాలు అలాంటివేమీ ఇవ్వలేవు (యిర్మియా 10:5). ఒకవేళ విగ్రహాలు అంతగా లోకప్రియం కావడానికి కారణమిదేనేమో – జరుగుతున్న వాటిని అవి చూడలేవు, వాటి గురించి ఏమీ చెప్పలేవు.

6. చెవులుండియు వినవు ముక్కులుండియు వాసనచూడవు

విగ్రహం ఎప్పుడూ ఏ ప్రార్థనా వినదు. సజీవుడైన దేవుడు ఎవరి ప్రార్థనైనా ఎప్పుడైనా వినగలడు – కీర్తనల గ్రంథము 65:2.

7. చేతులుండియు ముట్టుకొనవు పాదములుండియు నడువవు గొంతుకతో మాటలాడవు.
ప్రకటన గ్రంథం 9:20

8. వాటిని చేయువారును వాటియందు నమ్మికయుంచు వారందరును వాటివంటివారై యున్నారు.

బొమ్మలను పూజించేవారు తమ బొమ్మల్లాగే అయిపోతారు. దైవ సందేశాలను వినిపించలేకపోతారు, ఆయన సత్యాన్ని గ్రహించలేకపోతారు, దేవుని స్వరాన్ని వినలేకపోతారు, దేవుని సేవ ఏమీ చెయ్యలేకపోతారు. విగ్రహాలకేమీ లేనట్టుగానే ఆధ్యాత్మిక జ్ఞానం, సామర్థ్యం వారికేమీ ఉండవు.

9. ఇశ్రాయేలీయులారా, యెహోవాను నమ్ముకొనుడి. ఆయన వారికి సహాయము వారికి కేడెము

విగ్రహాల వైపు తిరగవలసిన అవసరం గతంలో గానీ ఇప్పుడు గానీ ఎవరికీ లేదు. నమ్మకం ఉంచాలంటే సజీవుడైన దేవుడున్నాడు. జీవితం అన్ని పరిస్థితుల్లోనూ మనల్ని ఆదుకోగలవాడు, పరిపూర్ణమైన సంరక్షణ ఇవ్వగలవాడు ఆయన. ఆయనలో నమ్మకం ఉంచడం ద్వారా శాశ్వత జీవం, ఆశీర్వాదాలు కలుగుతాయి.

10. అహరోను వంశస్థులారా, యెహోవాను నమ్ముకొనుడి. ఆయన వారికి సహాయము వారికి కేడెము

11. యెహోవాయందు భయభక్తులుగలవారలారా యెహోవాయందు నమ్మిక యుంచుడి ఆయన వారికి సహాయము వారికి కేడెము.

12. యెహోవా మమ్మును మరచిపోలేదు ఆయన మమ్ము నాశీర్వదించును ఆయన ఇశ్రాయేలీయుల నాశీర్వదించును అహరోను వంశస్థులనాశీర్వదించును

రచయిత ఈ విధంగా నమ్మకం ఉంచడం వల్ల కలిగిన ఫలితమేమిటంటే దేవుడు తన ప్రజలను దీవిస్తాడన్న దృఢ నిశ్చయం. వారు నిత్యం దేవుని జ్ఞాపకంలో, ఆయన హృదయంలో ఉంటారు (కీర్తనల గ్రంథము 98:3; కీర్తనల గ్రంథము 111:5; యెషయా 49:15).

13. పిన్నలనేమి పెద్దలనేమి తనయందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును.
ప్రకటన గ్రంథం 11:18, ప్రకటన గ్రంథం 19:5

14. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధిపొందించును.

15. భూమ్యాకాశములను సృజించిన యెహోవాచేత మీరు ఆశీర్వదింపబడినవారు.

ఆదికాండము 1:1; ఆదికాండము 14:19. ప్రపంచాల సృష్టికర్తే మనల్ని ఆశీర్వదిస్తే మనుషులు మనకు చేసేదానికి లెక్క చెయ్యడం ఎందుకు? (హెబ్రీయులకు 13:6)

16. ఆకాశములు యెహోవావశము భూమిని ఆయన నరుల కిచ్చియున్నాడు.

భూమి కూడా దేవునిదే. అయితే ఆయన దాన్ని మనిషి చేతుల్లో పెట్టాడు (కీర్తనల గ్రంథము 8:6-8; ఆదికాండము 1:28). అయితే మానవుడు పాపం చేసి భూమిని పాడు చేసి పారేశాడు.

17. మృతులును మౌనస్థితిలోనికి దిగిపోవువారును యెహోవాను స్తుతింపరు

అంటే చనిపోయినవారు ఈ భూమిపై దేవుణ్ణి స్తుతించరు అని కీర్తనకారుడి భావం. పాపవిముక్తి పొంది చనిపోయినవారు పరలోకంలో ఆయన్ను స్తుతిస్తారు – ప్రకటన గ్రంథం 7:9-17; ప్రకటన గ్రంథం 14:1-3; ప్రకటన గ్రంథం 15:2-4.

18. మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించెదము యెహోవాను స్తుతించుడి.Shortcut Links
కీర్తనల గ్రంథము - Psalms : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114 | 115 | 116 | 117 | 118 | 119 | 120 | 121 | 122 | 123 | 124 | 125 | 126 | 127 | 128 | 129 | 130 | 131 | 132 | 133 | 134 | 135 | 136 | 137 | 138 | 139 | 140 | 141 | 142 | 143 | 144 | 145 | 146 | 147 | 148 | 149 | 150 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |