Psalms - కీర్తనల గ్రంథము 13 | View All

1. యెహోవా, ఎన్నాళ్లవరకు నన్ను మరచిపోవుదువు? నిత్యము మరచెదవా? నాకెంతకాలము విముఖుడవై యుందువు?

“ఎన్నాళ్ళు”– కీర్తనల గ్రంథము 6:3. దేవుడు తన ప్రజల నెప్పుడూ మర్చిపోడు (యెషయా 49:14-16; హెబ్రీయులకు 6:10). కానీ ఒక్కోసారి ఆయన మర్చిపోయినట్టు మనకు అనిపిస్తుంది (కీర్తనల గ్రంథము 42:9; కీర్తనల గ్రంథము 77:9; విలాపవాక్యములు 5:20). “ముఖం కనబడకుండా” – నిరాకరణనూ, కోపాన్నీ సూచిస్తుంది. ముఖకాంతి ప్రకాశింపజేయడం అనుగ్రహాన్నీ, అంగీకరణనూ సూచిస్తుంది (సంఖ్యాకాండము 6:22-27; ద్వితీయోపదేశకాండము 31:17-18; ద్వితీయోపదేశకాండము 32:30; కీర్తనల గ్రంథము 13:1; కీర్తనల గ్రంథము 27:9; కీర్తనల గ్రంథము 30:7; కీర్తనల గ్రంథము 69:17; కీర్తనల గ్రంథము 102:2; యెషయా 1:15).

2. ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడుదును?ఎంతవరకు నా హృదయములో పగలంతయు దుఃఖా క్రాంతుడనై యుందును?ఎంతవరకు నాశత్రువు నామీద తన్ను హెచ్చించుకొనును?

పవిత్రులకు అప్పుడప్పుడు అంతరంగంలో తీవ్రమైన సంఘర్షణలు చెలరేగుతూ ఉంటాయి. వారి తలంపులే వారికి నొప్పి, దుఃఖం కలుగజేస్తున్నాయి. పరిస్థితులు అలా ఎందుకు కలుగుతున్నాయో వారు అర్థం చేసుకోలేకపోతారు (యోబు 3:1). నిజంగా తరచుగా విశ్వాసులు పెనుగులాడవలసినది తమ మనస్సుల్లోని తలంపులతోనే. పరిస్థితులతో గానీ బయట శత్రువులతో గానీ కాదు. తమ అంతరంగంలోని పోరాటంలో వారు గెలిచి నమ్మకంతో దేవుని పై ఆధారపడితే అన్ని విషయాల్లో గెలుపు వారిదే. మనస్సులోని తలంపులన్నిటినీ క్రీస్తుకు విధేయమయ్యేలా చేసుకోవడం ఎంత ముఖ్యమో పౌలుకు తెలుసు (2 కోరింథీయులకు 10:5).

3. యెహోవా నా దేవా, నామీద దృష్టియుంచి నాకుత్తరమిమ్ము

దుర్మార్గులు గెలుస్తారన్న ఆలోచనే దావీదుకు కంటకప్రాయంగా ఉంది. మన బద్ధ శత్రువైన సైతాను మన పై గెలుస్తాడన్న తలంపు మనకు సహించరానిదిగా ఉండాలి.

4. నేను మరణనిద్ర నొందకుండను వాని గెలిచితినని నా శత్రువు చెప్పుకొనకుండనునేను తూలిపోయి యుండగా నా విరోధులు హర్షింపకుండను నా కన్నులకు వెలుగిమ్ము.

5. నేనైతే నీ కృపయందు నమ్మిక యుంచి యున్నాను నీ రక్షణవిషయమై నా హృదయము హర్షించుచున్నది

ఇక్కడ దావీదు తన మనస్సులో జరిగిన సంఘర్షణలో తాను గెలుపొందినట్టు, తన తలంపులలో తిరిగి మరోసారి పూర్తి నమ్మకం, ధైర్యం చేకూరాయని చూపిస్తున్నాడు. ఆందోళన చెందిన మనస్సుకు దేవుని కృప పై నమ్మకముంచడం గొప్ప ఔషధం. ప్రపంచాన్ని జయించేది నమ్మకమే (1 యోహాను 5:4-5). జయించాలంటే మన దృష్టి మన పై నుంచీ, మన కష్టాలనుంచీ దేవునివైపుకు మరలించాలి. పరిస్థితులను దేవుని మీది నమ్మకంతో చూడడం నిరుత్సాహాన్నీ నిరాశనూ కలిగించే తలంపులన్నిటినీ జయించగలదు.

6. యెహోవా నాకు మహోపకారములు చేసియున్నాడునేను ఆయనను కీర్తించెదను.Shortcut Links
కీర్తనల గ్రంథము - Psalms : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114 | 115 | 116 | 117 | 118 | 119 | 120 | 121 | 122 | 123 | 124 | 125 | 126 | 127 | 128 | 129 | 130 | 131 | 132 | 133 | 134 | 135 | 136 | 137 | 138 | 139 | 140 | 141 | 142 | 143 | 144 | 145 | 146 | 147 | 148 | 149 | 150 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |