Psalms - కీర్తనల గ్రంథము 15 | View All

1. యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగినవాడెవడు? నీ పరిశుద్ధ పర్వతముమీద నివసింపదగిన వాడెవడు?

ఇంతకుముందు కీర్తనకూ దీనికీ ఎంత తేడా! ఇక్కడ ఒక ప్రశ్న ఉదయిస్తున్నది. అందరూ భ్రష్టులైతే దేవుణ్ణెవరూ అన్వేషించకుండా, మేలు చేయకుండా ఉంటే (కీర్తనల గ్రంథము 14:2-3), ఈ అధ్యాయంలో వర్ణించిన లక్షణాలు ఎవరికైనా ఉండడం ఎలా సాధ్యం? నిందకు తావీయకుండా, మంచినే జరిగిస్తూ మనస్ఫూర్తిగా సత్యం పలుకుతూ ఉండడం ఎలా? దీనికి జవాబేమిటంటే తన కృపలో ప్రేమలో దేవుడు మనుషులను వెతుకుతూ ఉన్నాడు. వారిని క్షమిస్తూ ఉన్నాడు. వారిని రక్షిస్తూ మారుస్తూ వారికి కొత్త స్వభావాన్ని ఇస్తున్నాడు. వారిని పవిత్రపరచే పనిని ఆరంభిస్తున్నాడు. ఈ విధంగా వారు తన సన్నిధానంలో ఉంటూ శాశ్వత కాలం తనతో ఆనందించేలా వారిని సిద్ధం చేస్తున్నాడు. హృదయంలో దేవుని పని గనుక జరక్కపోతే ఏ మనిషీ ఈ కీర్తనలో రాసి ఉన్న ప్రకారం జీవించలేడు, ఆయన సన్నిధి కోసం సిద్ధపడలేడు.

2. యథార్థమైన ప్రవర్తన గలిగి నీతి ననుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే.

ఇక్కడ కనిపించే న్యాయవంతుడైన మనిషి గుణాల వర్ణన యేసుప్రభువుకు సరిగ్గా అతికినట్టు సరిపోతున్నది. ఆయనతో ఐక్యమై ఆయన న్యాయవంతమైన స్వభావంలో పాల్గొనివుంటే మనం కూడా ఆయన జీవించినట్టు జీవించగలం (రోమీయులకు 6:3-8; ఎఫెసీయులకు 4:22-24; 1 యోహాను 2:3-6). ఏదో కొద్దిమంది అసాధారణమైన పవిత్రులు మాత్రమే కాదు, క్రీస్తులో నమ్మకం ఉంచేవారంతా నిందారహితులుగా బ్రతకాలి (1 కోరింథీయులకు 1:8; ఫిలిప్పీయులకు 2:14-15; 2 పేతురు 3:14). మనందరం నిత్యం సత్యమే పలకాలి (ఎఫెసీయులకు 4:15 ఎఫెసీయులకు 4:25; కొలొస్సయులకు 3:9-10). నిజ దేవుడు సత్య స్వరూపి (కీర్తనల గ్రంథము 31:5). మనం సత్యాన్ని ప్రేమించాలనీ సత్యాన్నే పలకాలనీ ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. అలా చెయ్యనివారు గొప్ప ఆపదలో ఉన్నారు (సామెతలు 12:22; 2 థెస్సలొనీకయులకు 2:10-11; ప్రకటన గ్రంథం 21:8 ప్రకటన గ్రంథం 21:27; ప్రకటన గ్రంథం 22:15). అబద్ధాలాడే వారు సైతాను పిల్లలు (యోహాను 8:44). సైతానుకు పడే శిక్ష వారికీ పడుతుంది.

3. అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడుతన పొరుగువానిమీద నింద మోపడు

4. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు అతడు యెహోవాయందు భయభక్తులు గలవారిని సన్మానించును అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు.

నీచత్వం, దుర్మార్గం అంటే పవిత్రుడైన దేవుని దృష్టిలో హేయం గనుక పవిత్రులైన మనుషుల దృష్టిలో కూడా అది ఇలానే ఉంటుంది. కీర్తనల గ్రంథము 5:5 చూడండి. నిజంగా న్యాయవంతులైన వారు ఎంత నష్టమైనా కష్టమైనా తమ మాట నిలబెట్టుకుంటారు

5. తన ద్రవ్యము వడ్డికియ్యడు నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు ఈ ప్రకారము చేయువాడు ఎన్నడును కదల్చబడడు.

“వడ్డీ”– నిర్గమకాండము 22:25; లేవీయకాండము 25:35-37. “లంచం”– నిర్గమకాండము 23:8; ద్వితీయోపదేశకాండము 10:17; ద్వితీయోపదేశకాండము 16:19; సామెతలు 15:27; సామెతలు 17:23; యెషయా 5:22-23. “కదల్చదు”– కీర్తనల గ్రంథము 16:8; కీర్తనల గ్రంథము 55:22; కీర్తనల గ్రంథము 66:8-9; కీర్తనల గ్రంథము 112:6; 2 పేతురు 1:10. ఈ రెండు కీర్తనలు, అంటే 14వ కీర్తన 15వ కీర్తన ఒకదాని వెంట ఒకటి ఉన్నాయి. మొదటిదాన్లో మనిషి తన స్వభావాన్ని బట్టి ఎలాంటి వాడన్నది చెప్తున్నది. రెండోదైతే క్రీస్తులో ఉన్న మనిషిని దేవుడు ఎలా మార్చగలడు అన్నదాన్ని వెల్లడిస్తూ ఉంది. రోమ్ వారికిలేఖలో 7, 8 అధ్యాయాలు చూడండి.Shortcut Links
కీర్తనల గ్రంథము - Psalms : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114 | 115 | 116 | 117 | 118 | 119 | 120 | 121 | 122 | 123 | 124 | 125 | 126 | 127 | 128 | 129 | 130 | 131 | 132 | 133 | 134 | 135 | 136 | 137 | 138 | 139 | 140 | 141 | 142 | 143 | 144 | 145 | 146 | 147 | 148 | 149 | 150 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |