Psalms - కీర్తనల గ్రంథము 23 | View All

1. యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు.
యోహాను 10:11, ప్రకటన గ్రంథం 7:17

ఇక్కడ యెహోవా తన ప్రజల కాపరి అని రాసి ఉంది. యోహాను 10:11 లో యేసుప్రభువు తాను మంచి కాపరిని అని చెప్పుకున్నాడు. యేసు యెహోవా అవతారం అన్నదానికి ఇది ఆధారం కీర్తనల గ్రంథము 24:7 కీర్తనల గ్రంథము 24:10; కీర్తనల గ్రంథము 96:10-13; యెషయా 6:1; జెకర్యా 12:10; ఆదికాండము 16:7; నిర్గమకాండము 3:14 కూడా చూడండి. లూకా 2:11 నోట్ చూడండి. విశ్వాసులకు ఇద్దరు వేరువేరు కాపరులు లేరు. ఉండవలసిన అవసరం కూడా లేదు. దావీదు తన్ను తాను గొర్రెగా భావించుకొంటున్నాడు. క్రీస్తు విశ్వాసులంతా ఆయన గొర్రెలే. ఆయన వెల ఇచ్చి కొనుక్కొన్న స్వార్జితం. వారు స్వభావ సిద్ధంగా ఆయన గొర్రెలు కారు గాని వారి హృదయాల్లో దేవుడు జరిగించిన పనివల్లే (ఎఫెసీయులకు 2:3-10). వారు క్రీస్తు స్వరాన్ని విని, ఆయనలో నమ్మకం ఉంచి ఆయన్ను అనుసరిస్తూ ఉంటారు (యోహాను 10:25-27). “కొదువ”– మన కాపరి మనకు కొదువ లేకుండా అన్నీ ఇస్తాడన్నది మనం సందేహించరాదు. మనం కోరుకున్నవన్నీ ఆయన ఇవ్వకపోవచ్చు గానీ ఆయన్ను అనుసరించి ఆయనలో నమ్మకం ఉంచితే మనకు అవసరమైన వాటన్నిటినీ ఇస్తాడు (కీర్తనల గ్రంథము 37:25; మత్తయి 6:25-33; ఫిలిప్పీయులకు 4:19). మన శారీరక, ఆధ్యాత్మిక జీవితానికి అవసరతలన్నిటినీ ఆయన తీరుస్తాడని అర్థం.

2. పచ్చికగల చోట్లను ఆయన నన్ను పరుండజేయు చున్నాడు శాంతికరమైన జలములయొద్ద నన్ను నడిపించుచున్నాడు.
ప్రకటన గ్రంథం 7:17

మంచి కాపరి తన గొర్రెలకు విశ్రాంతి ఇస్తాడు (మత్తయి 11:28-30). వారిని ముందుకు నడిపిస్తాడు (యోహాను 10:4). ఆయన వారిని ఎక్కడికి నడిపించినప్పటికీ అక్కడ ఆయన వాక్కులు, ఆయన సహవాసం అనే పచ్చిక బయళ్ళు ఉంటాయి. పవిత్రాత్మ మూలంగా పారే లోతైన జలాలు ఉంటాయి.

3. నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు తన నామమునుబట్టి నీతిమార్గములలో నన్ను నడిపించుచున్నాడు.

“సేద”– విశ్వాసులు ఈ లోకంలో ఉన్నంత కాలం అలసట, విషమ పరీక్షలు తప్పవు. కొన్ని సార్లు వారు క్రుంగిపోయి నిరాశ చెందాలనే దుష్‌ప్రేరేపణకు గురి అవుతారు. అలాంటి సమయాల్లో కాపరి వారి దరిచేరి వారి ఆత్మలకు సేదదీర్చి ఊరడిస్తాడు. ఆయన మనలను నీతిన్యాయాల మార్గంలోనే నడిపిస్తాడు. ఎన్నడూ వక్రమార్గాల్లో గానీ మోసకరమైన విశాల వీధుల్లో గానీ భ్రష్టత్వం, పాపం ఉన్న దారుల్లో గానీ నడిపించడు. ఈ మంచి కాపరి నిన్ను అబద్ధాల్లో ఇరికించే చెడ్డ దారుల్లో గానీ మంచి చట్టాన్ని మీరే విధానంలో న్యాయం తప్పి ప్రవర్తించవలసి వచ్చిన మార్గాల్లో గానీ నడిపించాడని ఎన్నడూ నీవు అనకూడదు. ఆయన ఎన్నడూ అలా చేయడు. ఆయన నామం, ఆయన తండ్రి మహిమ తన గొర్రెలతో ముడిపడి ఉన్నాయి. ఆయన వారినెప్పుడూ సత్యం, న్యాయం, యథార్థతతో కూడిన దారుల్లోనే నడిపిస్తాడు.

4. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడైయుందువు నీ దుడ్డుకఱ్ఱయు నీదండమును నన్ను ఆదరించును.

క్రీస్తు గొర్రెలకు చీకట్లు, కృంగదీసే పరీక్షలు, చివరికి మరణం కూడా వాటిల్లుతాయి. కొన్ని సార్లు కీడు వారి చుట్టు ముడుతుంది. అయితే వారి కాపరి సర్వశక్తి గల సృష్టికర్త. ఆయన వారితోనే ఉంటాడు. వారికి భయమెందుకు? (లూకా 12:4-7; యోహాను 14:1; రోమీయులకు 8:15; 2 తిమోతికి 1:7; హెబ్రీయులకు 2:14-15; హెబ్రీయులకు 13:6; 1 యోహాను 4:18; ప్రకటన గ్రంథం 2:10). చిన్న మందా, భయపడకండి. “ఆదరణ”– క్రీస్తు గొర్రెల ఆదరణ వారిపై ఆయనకున్న అధికారమే, ఆయన తన ఇష్ట ప్రకారం వారి గురించి శ్రద్ధ వహిస్తున్నాడన్న విషయమే. ఆయన దండం, చేతికర్ర వీటిని సూచిస్తున్నాయి.

5. నా శత్రువుల యెదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు నూనెతో నా తల అంటియున్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది.
లూకా 7:46

మనల్నెవరూ వ్యతిరేకించకపోతే, మనకెవరూ శత్రువులు లేకపోతే అసలు ఇంతకూ మనం ఆ కాపరిని అనుసరిస్తున్నామా, ఆయన న్యాయం, నిజాయితీ కోసం ధైర్యంగా నిలబడుతున్నామా అంటూ మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. క్రీస్తును ద్వేషించిన ప్రపంచం ఆయన గొర్రెలను మాత్రం ప్రేమిస్తుందా? (యోహాను 15:18-19). సైతాను, వాడి అనుచరులు అయితే ఆ గొర్రెలను తీవ్రతతో ద్వేషిస్తారు. అయితే సైతాను కోపాగ్నితో మండిపడుతూ, శత్రువులు మనల్ని చుట్టుముడుతూ ఉన్న సమయంలోనే మన మంచి కాపరి మంచి మంచి పదార్థాలతో మనకు విందు సిద్ధం చేస్తున్నాడు. వినయ వంతుడై సేవ చేసే కాపరిలాగా ఆయన మనకు భోజనం వడ్డించి పవిత్రాత్మ అనే పవిత్ర తైలంతో మన తలలను అభిషేకిస్తాడు. ఈ విధంగా మనకు అన్ని విషయాల్లోనూ చాలినంతకంటే ఎక్కువే ఉంటుంది.

6. నేను బ్రదుకు దినములన్నియు కృపాక్షేమములే నా వెంట వచ్చును చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసెదను.

ఇలాంటి కాపరి తోడై ఉండగా దావీదులాగా ఇప్పటి విశ్వాసులు కూడా సంపూర్ణమైన విశ్వాస నిశ్చయతను అనుభవించవచ్చు (యోహాను 10:27-28; రోమీయులకు 5:9-10; రోమీయులకు 8:37-39; ఫిలిప్పీయులకు 1:6; 2 తిమోతికి 4:18; 1 పేతురు 1:5). మన కాపరి మనకు ముందు నడుస్తాడు; మేలు, అనుగ్రహం వెన్నంటి వస్తాయి. జీవన యాత్రలో మనకు తోడుగా వస్తున్నవి ఎంత శ్రేష్ఠమైనవి! మనం ఆయన మందకు చెందినవారమైతే అనంత యుగాలకు ఆయన సంరక్షణలో క్షేమంగా ఉంటాం.Shortcut Links
కీర్తనల గ్రంథము - Psalms : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114 | 115 | 116 | 117 | 118 | 119 | 120 | 121 | 122 | 123 | 124 | 125 | 126 | 127 | 128 | 129 | 130 | 131 | 132 | 133 | 134 | 135 | 136 | 137 | 138 | 139 | 140 | 141 | 142 | 143 | 144 | 145 | 146 | 147 | 148 | 149 | 150 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |