Psalms - కీర్తనల గ్రంథము 8 | View All

1. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనుపరచువాడా,భూమియందంతట నీ నామము ఎంత ప్రభావముగలది.

2. శత్రువులను పగతీర్చుకొనువారిని మాన్పివేయుటకై నీ విరోధులనుబట్టి బాలురయొక్కయు చంటి పిల్లలయొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి యున్నావు.
మత్తయి 21:16

మత్తయి 21:16 లో యేసుప్రభువు ఈ మాటలను ఎత్తి చెప్పాడు. ఇస్రాయేల్ మత నాయకులు ఆయనకు శత్రువులై ఆయన్ను ఎదిరించారు. అయితే దేవుడు చిన్న పిల్లలకు జ్ఞాన ప్రకాశాన్నీ, స్తుతించే స్వరాన్నీ ఇచ్చాడు. మత్తయి 11:25 కూడా చూడండి.

3. నీ చేతిపనియైన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్రనక్షత్రములను నేను చూడగా

ప్రకృతినుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి (కీర్తనల గ్రంథము 19:1-3; యెషయా 40:26; రోమీయులకు 1:20).

4. నీవు మనుష్యుని జ్ఞాపకము చేసికొనుటకు వాడేపాటి వాడు?నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు?
హెబ్రీయులకు 2:6-8

ఈ బ్రహ్మాండమైన విశ్వంతో పోల్చుకుంటే మానవుడెంత అల్పుడు, లెక్కలేనివాడు (యెషయా 40:15-17 యెషయా 40:22-24).

5. దేవునికంటె వానిని కొంచెము తక్కువవానిగా చేసియున్నావు.మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి యున్నావు.

“తక్కువవాణ్ణి”– దీన్ని “దేవునికంటే కొంచెం తక్కువవానిగా చేశావు”– అని కూడా అనువదించవచ్చు. అయితే ఇలా చేస్తే మంచి అర్థం రాదు. మనిషి దేవుని కంటే “కొంచెం తక్కువవాడు” కాదు గాని ఎంతో తక్కువవాడు. ఆయనకు మనిషికి గ్రహించ శక్యం కాని తేడా ఉంది. దేవుడు సర్వశక్తిమంతుడైన సృష్టికర్త (ఆది 1 అధ్యాయం), మానవుడు దేవునిచేత చేయబడిన బలహీనుడు. “కిరీటం”– ఈ వాక్యం హెబ్రీయులకు 2:6-9 లో కనిపిస్తుంది. ఇది, ఈ కీర్తనలోని మిగిలిన వచనాలన్నీ మొదటి ఆదాము విషయంలో కొంతవరకు నెరవేరాయి (ఆదికాండము 1:26-28). కానీ చివరి ఆదాము అయిన యేసుక్రీస్తులో ఇవి సంపూర్తిగా నెరవేరుతాయి. ఆయనతో కలిసి ప్రపంచాన్ని ఏలే కొత్త జాతి ప్రజలకు యేసు నాయకుడు (2 తిమోతికి 2:12; ప్రకటన గ్రంథం 3:21; ప్రకటన గ్రంథం 5:10; ప్రకటన గ్రంథం 20:4).

6. నీ చేతిపనులమీద వానికి అధికారమిచ్చి యున్నావు.
1 కోరింథీయులకు 15:27, ఎఫెసీయులకు 1:22

హెబ్రీయులకు 2:8 ప్రకారం ఇది ఇంకా నెరవేరలేదు. కేవలం యేసుప్రభువు విషయంలో మాత్రమే ఇది పూర్తిగా నిజం (1 కోరింథీయులకు 15:27; ఎఫెసీయులకు 1:22).

7. గొఱ్ఱెలన్నిటిని, ఎడ్లనన్నిటిని అడవి మృగములను ఆకాశపక్షులను సముద్ర మత్స్యములను

మొత్తంమీద చూస్తే జంతుజాలంపై మనిషి పరిపాలనలో ఎన్నో లోపాలు కనిపిస్తున్నవి. ఈ పరిపాలన విషయంలో మానవ జాతి క్రూరంగా, పేరాశతో, అజ్ఞానంతో ప్రవర్తిస్తూ వచ్చింది. పైగా పరిపాలించాలని దేవుడు అప్పగించిన ఈ ప్రాణులను మనిషి తరచుగా పూజించాడు. యేసుప్రభువు రెండో సారి వచ్చినప్పుడు ఆశ్చర్యకరమైన మార్పులు పెద్ద ఎత్తున జరుగుతాయి.

8. సముద్రమార్గములలో సంచరించువాటి నన్నిటినివాని పాదములక్రింద నీవు ఉంచి యున్నావు.

9. యెహోవా మా ప్రభువాభూమియందంతట నీ నామము ఎంత ప్రభావముగలది!

యెహోవా మా ప్రభువు అని దావీదుతో కలిసి చెప్పగలిగినవారు ధన్యులు.Shortcut Links
కీర్తనల గ్రంథము - Psalms : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114 | 115 | 116 | 117 | 118 | 119 | 120 | 121 | 122 | 123 | 124 | 125 | 126 | 127 | 128 | 129 | 130 | 131 | 132 | 133 | 134 | 135 | 136 | 137 | 138 | 139 | 140 | 141 | 142 | 143 | 144 | 145 | 146 | 147 | 148 | 149 | 150 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |