Isaiah - యెషయా 21 | View All

1. సముద్రతీరముననున్న అడవిదేశమును గూర్చిన దేవోక్తి దక్షిణదిక్కున సుడిగాలి విసరునట్లు అరణ్యమునుండి భీకరదేశమునుండి అది వచ్చుచున్నది.

1. సముద్రతీరంలో ఉన్న అడవి ప్రాంతానికి విచారకరమైన సందేశం: అరణ్యం నుండి ఏదో వస్తోంది? నెగెవ్‌నుండి వీచే గాలిలా అది వస్తోంది. అది ఒక భయంకర దేశం నుండి వస్తోంది.

2. కఠినమైనవాటిని చూపుచున్న దర్శనము నాకు అను గ్రహింపబడియున్నది. మోసముచేయువారు మోసము చేయుదురు దోచుకొనువారు దోచుకొందురు ఏలామూ, బయలుదేరుము మాద్యా, ముట్టడివేయుము వారి నిట్టూర్పంతయు మాన్పించుచున్నాను.

2. జరుగబోయే దారుణమైన ఒక సంగతి నేను చూసాను. దేశద్రోహులు నీకు విరోధంగా లేవటం నేను చూశాను. వ్రజలు నీ ఐశ్వర్యం తీసుకోవటం నేను చూశాను. ఏలాము, వెళ్లి ఆ ప్రజలతో యుద్ధం చేయి. మాద్యా, పట్టణం చుట్టూరా నీ సైన్యాలను ఉంచి, దాన్ని జయించు. ఆ పట్టణంలో చెడు సడుగులన్నింటినీ నేను అంతం చేస్తాను.

3. కావున నా నడుము బహు నొప్పిగా నున్నది ప్రసవించు స్త్రీ వేదనవంటి వేదన నన్ను పట్టి యున్నది బాధచేత నేను వినలేకుండ నున్నాను విభ్రాంతిచేత నేను చూడలేకుండ నున్నాను.
యోహాను 16:21

3. ఆ భయంకర విషయాలు నేను చూశాను, ఇప్పుడు నేను భయపడ్తున్నాను. నా భయంవల్ల నా కడుపులో దేవేస్తోంది. ఆ బాధ ప్రసవవేదనలా ఉంది. నేను వినే విషయాలు నన్ను చాలా భయపెట్టేస్తాయి. నేను చూచే విషయాలు నన్ను భయంతో వణకిస్తాయి.

4. నా గుండె తటతట కొట్టుకొనుచున్నది మహా భయము నన్ను కలవరపరచుచున్నది నా కిష్టమైన సంధ్యవేళ నాకు భీకరమాయెను.

4. నేను దిగులుగా ఉన్నాను, భయంతో వణకిపోతున్నాను. సంతోషకరమైన నా సాయంపూట, భయం పుట్టే రాత్రిగా తయారయింది

5. వారు భోజనపు బల్లను సిద్ధముచేయుదురు తివాసీలు పరతురు అన్నపానములు పుచ్చుకొందురు. అధిపతులారా, లేచి కేడెములకు చమురు రాయుడి; ప్రభువు నాతో ఇట్లనెను

5. అంతా బాగానే వుందని ప్రజలు తలస్తున్నారు. ప్రజలు అంటారు: “బల్ల సిద్ధం చేయండి! బల్లమీద బట్ట పరచండి! తినండి! తాగండి!” కానీ ప్రజలు, “నాయకులారా, లేవండి, యుద్ధానికి సిద్ధపడండి” అని చెప్పాలి.

6. నీవు వెళ్లి కావలివాని నియమింపుము అతడు తనకు కనబడుదానిని తెలియజేయవలెను.

6. ఎందుకంటే నా ప్రభువు, నాతో ఈ విషయాలు చెప్పాడు: “వెళ్లి, పట్టణాన్ని కాపాడేందుకు ఒక మనిషికోసం చూడు.

7. జతజతలుగా వచ్చు రౌతులును వరుసలుగా వచ్చు గాడిదలును వరుసలుగావచ్చు ఒంటెలును అతనికి కనబడగా అతడు బహు జాగ్రత్తగా చెవి యొగ్గి నిదానించి చూచును

7. కావలివాడు గుర్రాల మీద సైనికుల్ని, గాడిదలు, లేక ఒంటెలను చూస్తే కావలివాడు జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా వినాలి.”

8. సింహము గర్జించునట్టు కేకలు వేసి నా యేలినవాడా, పగటివేళ నేను నిత్యమును కావలి బురుజుమీద నిలుచుచున్నాను రాత్రి అంతయు కావలి కాయుచున్నాను

8. అప్పుడు ఆ కావలివాడు ‘సింహం’ అనే హెచ్చరిక మాట గట్టిగా చెప్పాలి.” కావలివాడు యెహోవాతో చెప్పాడు: “నా ప్రభూ! ప్రతిరోజూ నేను కావలి కాస్తూ కావలి గోపురం మీద ఉన్నాను. ప్రతిరాత్రి నేను నిలబడి కావలి కాస్తూనే ఉన్నాను, కానీ

9. ఇదిగో జతజతలుగా రౌతుల దండు వచ్చుచున్నది అని చెప్పెను.బబులోను కూలెను కూలెనుదాని దేవతల విగ్రహములన్నిటిని ఆయన నేలనుపడవేసియున్నాడుముక్కముక్కలుగా విరుగగొట్టియున్నాడు అనిచెప్పుచు వచ్చెను.
ప్రకటన గ్రంథం 14:8, ప్రకటన గ్రంథం 18:2

9. అదిగో, వాళ్లు వచ్చేస్తున్నారు, బారులుతీరిన మనుష్యులు, గుర్రాల మీద సైనికులు నాకు కనబడుతున్నారు.” అప్పుడు పురుషుల్లో ఒకడు అన్నాడు: “బబులోను ఓడించబడింది. బబులోను నేల మట్టంగా కూలిపోయింది. దాని అబద్ధ దేవుళ్ల విగ్రహాలన్నీ నేలకు కొట్టబడ్డాయి ముక్కలు ముక్కలుగా విరిగి పోయాయి.”

10. నేను నూర్చిన నా ధాన్యమా, నా కళ్లములో నూర్చ బడినవాడా, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవావలన నేను వినిన సంగతి నీకు తెలియజెప్పియున్నాను.

10. యెషయా చెప్పాడు,”నా ప్రజలారా, ఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తిమంతుడైన యెహోవానుండి నేను విన్న వాటన్నింటినీ మీకు చెప్పాను. కళ్లంలో ధాన్యంలా మీరు చితుకగొట్ట బడతారు.

11. దూమానుగూర్చిన దేవోక్తి కావలివాడా, రాత్రి యెంత వేళైనది? కావలివాడా, రాత్రి యెంత వేళైనది? అని యొకడు శేయీరులోనుండి కేకలు వేసి నన్ను అడుగుచున్నాడు

11. దూమాను గూర్చిన విచారకరమైన సందేశం: శేయీరునుండి ఎవరో నన్ను పిలిచి అడుగుతున్నారు, “కావలివాడా, రాత్రి ఎంత వేళయింది? కావలివాడా, రాత్రి ఎంత వేళయింది?”

12. కావలివాడు ఉదయమునగును రాత్రియునగును మీరు విచారింపగోరినయెడల విచారించుడి మరల రండి అనుచున్నాడు.

12. కావలివాడు జవాబిచ్చాడు, “ఉదయం అవుతుంది, రాత్రి కూడా అవుతుంది. నీవు అడగాల్సింది ఏమైనా ఉంటే తిరిగి వచ్చి అడుగుము.”

13. అరేబియాను గూర్చిన దేవోక్తి దెదానీయులైన సార్థవాహులారా, సాయంకాలమున మీరు అరబి యెడారిలో దిగవలెను.

13. అరేబియాను గూర్చి విచారకరమైన సందేశం: దెదానునుండి వచ్చిన ఒంటెల ప్రయాణీకులు అరబి ఎడారిలో కొన్ని చెట్ల దగ్గర రాత్రి గడిపారు.

14. తేమాదేశనివాసులారా, దప్పిగొన్నవారికి నీళ్లు తెండి పారిపోవుచున్నవారికి ఎదురుగా ఆహారము తీసికొని రండి

14. దాహంతో ఉన్న కొందరు ప్రయాణీకులకు వారు నీళ్లు ఇచ్చారు. ప్రయాణం చేస్తున్న కొందరు ప్రజలకు తేమా ప్రజలు భోజనం పెట్టారు

15. ఖడ్గ భయముచేతను దూసిన ఖడ్గ భయము చేతను ఎక్కు పెట్టబడిన ధనుస్సుల భయముచేతను క్రూరయుద్ధ భయముచేతను వారు పారిపోవు చున్నారు

15. చంపడానికి సిద్ధంగా ఉన్న కత్తులనుండి ఆ ప్రజలు పారిపోతూ ఉన్నారు. గురిపెట్టి కొట్టడానికి సిద్ధంగా ఉన్న బాణాలనుండి వారు పారిపోతున్నారు. కష్టతరమైన యుద్ధంనుండి వారు పారిపోతున్నారు.

16. ప్రభువు నాకీలాగు సెలవిచ్చియున్నాడుకూలి వారు ఎంచునట్లుగా ఒక యేడాదిలోగానే కేదారు ప్రభావమంతయు నశించిపోవును.

16. ఆ సంగతులు జరుగుతాయని నా ప్రభువైన యెహోవా నాతో చెప్పాడు: “ఒక్క సంవత్సరంలో (కూలివాని కాలమానం ప్రకారం) కేదారు ఘనత అంతా పోతుంది.

17. కేదారీయుల బలాఢ్యుల విలుకాండ్లలో శేషించు వారు కొద్దివారగుదురు. ఈలాగు జరుగునని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చియున్నాడు.

17. ఆ సమయంలో కేదారు మహా వీరుల్లో కొద్దిమంది విలుకాండ్రు మాత్రమే బతికి ఉంటారు.” ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా ఈ సంగతులు నాకు చెప్పాడు.Shortcut Links
యెషయా - Isaiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |