Isaiah - యెషయా 51 | View All

1. నీతిని అనుసరించుచు యెహోవాను వెదకుచు నుండు వారలారా, నా మాట వినుడి మీరు ఏ బండనుండి చెక్కబడితిరో దాని ఆలోచించుడి మీరు ఏ గుంటనుండి తవ్వబడితిరో దాని ఆలోచించుడి

రాబోయే బబులోను చెరను ఈ భాగం సూచిస్తున్నది. దేవుణ్ణి వెదికి (వ 1), జెరుసలంకు తిరిగి వచ్చేవారితో దేవుడు మాట్లాడుతున్నాడు (యిర్మియా 29:10-14 పోల్చి చూడండి). వారు లెక్కకు కొద్దిమందే గాని, వారి జాతి మూలపురుషుణ్ణి ఒక్కసారి గుర్తు చేసుకొమ్మని దేవుడు చెప్తున్నాడు. దేవుడు అతణ్ణి పిలిచినప్పుడు అతనికి సంతతి లేదు. అయితే తరువాతి కాలంలో ఇస్రాయేల్ గొప్ప ప్రజ అయింది (ఆదికాండము 22:7; నిర్గమకాండము 1:7). దేవుడు సీయోనును స్వర్గసీమగా మారుస్తానని మాట ఇచ్చాడు. అక్కడ అనేకులకు ఆనంద కారణం ఉంటుంది.

2. మీ తండ్రియైన అబ్రాహాము సంగతి ఆలోచించుడి మిమ్మును కనిన శారాను ఆలోచించుడి అతడు ఒంటరియై యుండగా నేను అతని పిలిచితిని అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది యగునట్లు చేసితిని.

3. యెహోవా సీయోనును ఆదరించుచున్నాడు దాని పాడైన స్థలములన్నిటిని ఆదరించి దాని అరణ్యస్థలములను ఏదెనువలె చేయుచున్నాడు దాని యెడారి భూములు యెహోవా తోటవలె నగు నట్లు చేయుచున్నాడు ఆనంద సంతోషములును కృతజ్ఞతాస్తుతియు సంగీతగానమును దానిలో వినబడును

4. నా ప్రజలారా, నా మాట ఆలకించుడి నా జనులారా, నాకు చెవియొగ్గి వినుడి. ఉపదేశము నాయొద్దనుండి బయలుదేరును జనములకు వెలుగు కలుగునట్లుగా నా విధిని నియమింతును.

కేవలం జెరుసలంకు దీవెనే గాక మరింకేదో ఉద్దేశం దేవుని మనస్సులో ఉంది (యెషయా 2:2-4; యెషయా 9:7; యెషయా 42:1, యెషయా 42:4).

5. నేను ఏర్పరచు నా నీతి సమీపముగా ఉన్నది నేను కలుగజేయు రక్షణ బయలుదేరుచున్నది నా బాహువులు జనములకు తీర్పుతీర్చును ద్వీపవాసులు నా తట్టు చూచి నిరీక్షణ గలవారగుదురు వారు నా బాహువును ఆశ్రయింతురు.

6. ఆకాశమువైపు కన్నులెత్తుడి క్రింద భూమిని చూడుడి అంతరిక్షము పొగవలె అంతర్ధానమగును భూమి వస్త్రమువలె పాతగిలిపోవును అందలి నివాసులు అటువలె చనిపోవుదురు నా రక్షణ నిత్యముండును నా నీతి కొట్టివేయబడదు.

యెషయా 34:4; యెషయా 24:4; హెబ్రీయులకు 1:10-12; హెబ్రీయులకు 12:25-29. “శాశ్వతంగా”– వ 8; యెషయా 45:17; తీతుకు 1:2. అలాగైతే మనం ఎన్నుకోవలసినదేమిటి? క్షణికమైన లోకమా లేక శాశ్వతమైన పరలోకమా?

7. నీతి అనుసరించువారలారా, నా మాట వినుడి నా బోధను హృదయమందుంచుకొన్న జనులారా, ఆలకించుడి మనుష్యులు పెట్టు నిందకు భయపడకుడి వారి దూషణ మాటలకు దిగులుపడకుడి.

“నీతినిజాయితీ”– వ 1. “హృదయాలలో”– ద్వితీయోపదేశకాండము 6:6; కీర్తనల గ్రంథము 119:11; యిర్మియా 31:33. “నిందలు”– యజమానినే వారు ద్వేషించి దూషించినప్పుడు (యెషయా 49:7; యెషయా 50:6) సేవకులకు కూడా అదే గతి పట్టక తప్పుతుందా (మత్తయి 10:25; యోహాను 15:18-20). అయితే విశ్వాసులు భయపడేందుకు బదులు ఆనందంతో ఉప్పొంగిపోవచ్చు (వ 12; రోమీయులకు 5:3; 2 కోరింథీయులకు 12:10; 1 పేతురు 4:12-16).

8. వస్త్రమును కొరికివేయునట్లు చిమ్మట వారిని కొరికి వేయును బొద్దీక గొఱ్ఱెబొచ్చును కొరికివేయునట్లు వారిని కొరికివేయును అయితే నా నీతి నిత్యము నిలుచును నా రక్షణ తరతరములుండును.

9. యెహోవా బాహువా, లెమ్ము లెమ్ము బలము తొడుగు కొమ్ము పూర్వపుకాలములలోను పురాతన తరములలోను లేచి నట్లు లెమ్ము రాహాబును తుత్తునియలుగా నరికివేసినవాడవు నీవే గదా? మకరమును పొడిచినవాడవు నీవే గదా?

దేవుని ఆత్మ వశుడై యెషయా ఇప్పుడు న్యాయవంతుల ప్రతినిధిగా మాట్లాడుతున్నాడు. దేవుడు గొప్ప దీవెనలిస్తానని మాట ఇచ్చాడు. యెషయా దాని నెరవేర్పు కోసం ప్రార్థిస్తున్నాడు. ఎర్ర సముద్రం దగ్గర దేవుడు తన ప్రజ తరఫున ఘనకార్యాలు చేసిన విధంగానే ఇప్పుడూ చెయ్యాలి (నిర్గమకాండము 14:21-31). “రాహాబు”– ఈజిప్ట్ (యోబు 9:13; మొ।।).

10. అగాధ జలములుగల సముద్రమును ఇంకిపోజేసిన వాడవు నీవే గదా? విమోచింపబడినవారు దాటిపోవునట్లు సముద్రాగాధ స్థలములను త్రోవగా చేసినవాడవు నీవే గదా?

11. యెహోవా విమోచించినవారు సంగీతనాదముతో సీయోనునకు తిరిగి వచ్చెదరు నిత్యసంతోషము వారి తలలమీద ఉండును వారు సంతోషానందము గలవారగుదురు దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును.

యెషయా 35:10 నోట్.

12. నేను నేనే మిమ్ము నోదార్చువాడను చనిపోవు నరునికి తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడుదువు?

దేవుడు మళ్ళీ మాట్లాడసాగుతున్నాడు. “ఓదార్చేవాణ్ణి”– వ 3; యెషయా 40:1; యెషయా 49:13. “మనుషులకు”– వ 7; మత్తయి 10:26-28. “గడ్డి”– యెషయా 40:6.

13. బాధపెట్టువాడు నాశనము చేయుటకు సిద్ధపడునప్పుడు వాని క్రోధమునుబట్టి నిత్యము భయపడుచు, ఆకాశములను వ్యాపింపజేసి భూమి పునాదులనువేసిన యెహోవాను నీ సృష్టికర్తయైన యెహోవాను మరచుదువా? బాధపెట్టువాని క్రోధము ఏమాయెను?

దేవుని ప్రజ మనుషులకు భయపడ్డారంటే వారు దేవుడిచ్చే ఓదార్పునూ, ఆయన బలప్రభావాలనూ మరచిపోవచ్చు.

14. క్రుంగబడినవాడు త్వరగా విడుదల పొందును అతడు గోతిలోనికి పోడు చనిపోడు అతనికి ఆహారము తప్పదు.

“బందీలు”– వ 1 నోట్ చూడండి.

15. నేను నీ దేవుడనైన యెహోవాను సముద్రముయొక్క కెరటములు ఘోషించునట్లు దాని రేపువాడను నేనే. సైన్యములకధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు.

“సముద్రం”– యోబు 26:12; కీర్తనల గ్రంథము 107:24-25; యిర్మియా 31:35. అలాగైతే బబులోను గాని, దేవుని ప్రజల శత్రువులెవరైనా గాని ఆయనకు ఎదురు నిలవగలరా?

16. నేను ఆకాశములను స్థాపించునట్లును భూమి పునాదులను వేయునట్లును నాజనము నీవేయని సీయోనుతో చెప్పునట్లును నీ నోట నా మాటలు ఉంచి నా చేతినీడలో నిన్ను కప్పియున్నాను.
ఎఫెసీయులకు 6:17

“నా ప్రజలు”– యెషయా 41:8-10; యెషయా 43:1, యెషయా 43:15; యెషయా 44:1-2, యెషయా 44:21. “నోట”– వ 7; నిర్గమకాండము 4:11-12; యిర్మియా 1:9. “చేతి”– యెషయా 49:2; కీర్తనల గ్రంథము 91:1-2. ఇక్కడ భద్రత ఉన్నదన్నమాట ఖాయం.

17. యెరూషలేమా, లెమ్ము లెమ్ము యెహోవా క్రోధపాత్రను ఆయన చేతినుండి పుచ్చు కొని త్రాగినదానా, తూలిపడజేయు పాత్రలోనిదంతటిని త్రాగినదానా, నిలువుము.
ప్రకటన గ్రంథం 14:10, ప్రకటన గ్రంథం 16:19

ఈ వచనాలు యెషయా జీవిత కాలాన్ని దాటిపోయి ఉన్నాయి. జెరుసలం దాని దుర్మార్గత మూలంగా దేవుని కోపమనే పాత్రలోనిది త్రాగాలి. ఈ పాత్ర ధ్వంసం, నాశనం, కరవు, ఖడ్గం (వ 19). వీటికి శత్రు సైన్యాలు కారణం. జెరుసలం అనుభవించిన శిక్ష అంతవరకు చాలు అని దేవుడు నిర్ణయించాక ఆయన దానిని ఓదార్చి, దాని శత్రువులు ఆ కోప పాత్రలోనిది త్రాగేలా చేస్తాడు. “పాత్ర” గురించి యిర్మియా 25:15-29; యెహెఙ్కేలు 23:32-34; జెకర్యా 12:2; యోహాను 18:11; ప్రకటన గ్రంథం 14:10 చూడండి.

18. ఆమె కనిన కుమారులందరిలో ఆమెకు దారి చూప గలవాడెవడును లేకపోయెను. ఆమె పెంచిన కుమారులందరిలో ఆమెను చెయిపట్టు కొనువాడెవడును లేకపోయెను.

19. ఈ రెండు అపాయములు నీకు సంభవించెను నిన్ను ఓదార్చగలవాడెక్కడ ఉన్నాడు? పాడు నాశనము కరవు ఖడ్గము నీకు ప్రాప్తించెను, నేను నిన్నెట్లు ఓదార్చుదును? నీ కుమారులు మూర్ఛిల్లియున్నారు దుప్పి వలలో చిక్కు పడినట్లు వీధులన్నిటి చివరలలో వారు పడియున్నారు.

“రెండు”– యెషయా 40:1-2.

20. యెహోవా క్రోధముతోను నీ దేవుని గద్దింపుతోను వారు నిండియున్నారు.

21. ద్రాక్షారసములేకయే మత్తురాలవై శ్రమపడినదానా, ఈ మాట వినుము.

“బాధపడేదానా”– అంటే జెరుసలం.

22. నీ ప్రభువగు యెహోవా తన జనులనిమిత్తము వ్యాజ్యెమాడు నీ దేవుడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఇదిగో తూలిపడజేయు పాత్రను నా క్రోధ పాత్రను నీ చేతిలోనుండి తీసివేసియున్నాను నీవికను దానిలోనిది త్రాగవు.

“ప్రజల పక్షాన వాదించే”– యెషయా 49:24; జెకర్యా 14:3. ఈ చివరి వాక్యాన్ని చూడండి. జెరుసలంను బబులోనువారు ఆక్రమించుకునే సమయాన్ని దాటిపోయి ఏదో తరువాతి కాలాన్ని ఈ భాగం సూచిస్తున్నదని భావించేందుకు ఇది రుజువు. ఎందుకంటే ఆ తరువాత కూడా మరోసారి జెరుసలం దేవుని కోప పాత్రలోనిది త్రాగవలసి వచ్చింది (లూకా 19:41-44; 1 థెస్సలొనీకయులకు 2:16). అంతేగాక దాన్ని శత్రువులు త్రాగవలసిన ఒక పాత్రలాగా అది దేవుని చేతిలో ఉంటుంది (జెకర్యా 12:2).

23. నిన్ను బాధపరచువారిచేతిలో దాని పెట్టెదను మేము దాటిపోవునట్లు క్రిందికి వంగి సాగిలపడుమని వారు నీతో చెప్పగా నీవు నీ వీపును దాటువారికి దారిగాచేసి నేలకు దానిని వంచితివి గదా వారికే ఆ పాత్రను త్రాగనిచ్చెదను.Shortcut Links
యెషయా - Isaiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |