Hosea - హోషేయ 1 | View All

1. ఉజ్జియా యోతాము ఆహాజు హిజ్కియా అను యూదారాజుల దినములలోను, యెహోయాషు కుమారుడైన యరొబాము అను ఇశ్రాయేలురాజు దినములలోను బెయేరి కుమారుడైన హోషేయకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు.

“హోషేయ”– ఈ పేరుకు అర్థం “రక్షించు” లేక “రక్షణ”. “వచ్చిన వాక్కు”– 2 సమూయేలు 24:11; 1 రాజులు 16:7; యెషయా 38:4; యిర్మియా 1:2; యెహెఙ్కేలు 1:3. “యూదా రాజులు”– యెషయా 1:1. యెషయా, హోషేయ ఇద్దరూ సమకాలికులు, ఒకే కాలంలో దేవుని మూలంగా పలికారు. “యెహోయాషు కొడుకు”– 2 రాజులు 14:23-29.

2. మొదట యెహోవా హోషేయద్వారా ఈ మాట సెలవిచ్చెను జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించియున్నారు గనుక నీవు పోయి, వ్యభిచారము చేయు స్త్రీని పెండ్లాడి, వ్యభిచారమువల్ల పుట్టిన పిల్లలను తీసికొనుము అని ఆయన హోషేయకు ఆజ్ఞ ఇచ్చెను.

“హోషేయ ద్వారా మాట్లాడడం”– 2 సమూయేలు 23:2; యిర్మియా 1:9; మత్తయి 22:43; అపో. కార్యములు 28:25; 2 తిమోతికి 3:16; హెబ్రీయులకు 4:7; 2 పేతురు 1:21. “వ్యభిచారం”– ఆత్మ సంబంధమైన వ్యభిచారం అని దేవుని ఉద్దేశం. ఇస్రాయేల్‌ప్రజలు దేవుని పట్ల నమ్మక ద్రోహం జరిగించారు గనుక ఈ మాట వాడుతున్నాడు. నిర్గమకాండము 34:15; లేవీయకాండము 17:7; ద్వితీయోపదేశకాండము 31:16; న్యాయాధిపతులు 2:17; యిర్మియా 2:2, యిర్మియా 2:20; యెహెఙ్కేలు 16:15-34; యెహెఙ్కేలు 23:2-3 చూడండి. ఆధ్యాత్మిక విషయాల్లో దేవుణ్ణి విడిచిపెట్టడం అనేది మనుషులు చేయగలిగిన అతి అసహ్యకరమైన పని. “వ్యభిచారం చేసిన స్త్రీని”– దీనికి అర్థం బహుశా ఇదై ఉండవచ్చు – తరువాతి కాలంలో హోషేయకు నమ్మక ద్రోహం చేస్తుందని ఆయనకు ముందుగానే తెలిసిన ఒక స్త్రీని పెళ్ళి చేసుకోమని దేవుడు అతనికి చెప్తున్నాడు (దానియేలు 3:1).

3. కాబట్టి అతడుపోయి దిబ్లయీము కుమార్తెయైన గోమెరును పెండ్లిచేసికొనెను. ఆమె గర్భవతియై అతనికొక కుమారుని కనగా

గోమెరు అంటే “లోప రహితం”. అయితే ఆమెలో అన్నీ లోపాలే. తన ప్రజల్లో దేవుడు లోపరాహిత్యాన్ని కోరుతున్నాడు (మత్తయి 5:48 పోల్చిచూడండి). అయితే వ్యక్తిగతంగా గోమెరు ఎలాంటిదో ఒక జాతిగా ఇస్రాయేల్ కూడా అంత నీచంగా తయారైంది.

4. యెహోవా అతనితో ఈలాగు సెల విచ్చెను ఇతనికి యెజ్రెయేలని పేరుపెట్టుము. యెజ్రెయేలులో యెహూ యింటివారు కలుగజేసికొనిన రక్త దోషమును బట్టి ఇక కొంతకాలమునకు నేను వారిని శిక్షింతును, ఇశ్రాయేలువారికి రాజ్యముండకుండ తీసి వేతును.

“యెజ్రేల్”– గలలీ కొండలకు దక్షిణాన ఇస్రాయేల్ దేశం ఉత్తర దిక్కున ఉన్న విశాలమైన లోయ, లేక మైదానం. హోషేయ ఇస్రాయేల్‌వారికి సూచనగా తన కొడుకుకు యెజ్రేల్ అని పేరు పెట్టాలి. యెషయా 8:3, యెషయా 8:18 పోల్చిచూడండి. ఈ పేరుకు అర్థం “దేవుడు చెదరగొట్టివేస్తాడు”. తాను ఏమి చెయ్యబోతున్నాడో సూచిస్తున్నాడు దేవుడు. “కొంత కాలానికి”– 2 రాజులు 17:1-23. “యెహూ”– 1 రాజులు 19:16. ఇస్రాయేల్‌లో ఇతడు అధికారంలోకి వచ్చిన వైనం, యెజ్రేల్ లోయలో జరిగిన ఘోర వధ 2 రాజులు 9, 10 అధ్యాయాల్లో చూడవచ్చు. దుర్మార్గుడైన అహాబు రాజవంశాన్ని శిక్షించేందుకు దేవుడు వాడుకున్న సాధనం యెహూ. అయితే యెహూ వంశంవారి దుర్మార్గాన్ని బట్టి దేవుడు వారిని శిక్షించాడు. యెషయా 10:5-6, యెషయా 10:12; యిర్మియా 51:20-25. “ఇస్రాయేల్ రాజ్యాన్ని”– యాకోబు (ఇస్రాయేల్‌) సంతానమైన పది గోత్రాలవల్ల ఏర్పడింది. యూదా రాజ్యం, ఇస్రాయేల్ రాజ్యం వేరు వేరు – వ 7. 1 రాజులు 12వ అధ్యాయంలో ఈ చీలిక ఎలా వచ్చింది చూడవచ్చు.

5. ఆ దినమున నేను యెజ్రెయేలు లోయలో ఇశ్రాయేలు వారి విల్లును విరుతును.

సమరయ అష్షూరు సైన్యాలకు లొంగిపోవడానికి కొద్ది నెలల ముందు ఇస్రాయేల్‌వారి సైనిక శక్తి యెజ్రేల్ లోయలో నాశనం అయింది.

6. పిమ్మట ఆమె మరల గర్భవతియై కుమార్తెను కనగా యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా దీనికి లోరూహామా అనగా జాలి నొందనిది అని పేరు పెట్టుము; ఇకమీదట నేను ఇశ్రాయేలువారిని క్షమించను, వారియెడల జాలిపడను.
1 పేతురు 2:10

“లో-రుహామా”– అంటే “వాత్సల్యం పొందనిది” – దేవుడు 200 సంవత్సరాల పాటు ఉత్తర రాజ్యాన్ని ఓపికగా సహించాడు. ఏలీయా, ఎలీషాల వంటి ప్రవక్తలను వారి దగ్గరికి పంపించాడు. 2 రాజులు 17:13 చూడండి. అయితే వారు ఆయన ప్రేమను తృణీకరించి ఆయన ఆజ్ఞలను కాలదన్నారు. ఇక ఆయన సహించలేక ఆ రాజ్యాన్ని అంతమొందించాడు. ఆదికాండము 6:3, ఆదికాండము 6:6-7; సామెతలు 1:22-29; యిర్మియా 7:13, యిర్మియా 7:25 పోల్చిచూడండి.

7. అయితే యూదావారియెడల జాలిపడి, విల్లు ఖడ్గము యుద్ధము గుఱ్ఱములు రౌతులు అను వాటిచేత కాక తమ దేవుడైన యెహోవాచేతనే వారిని రక్షింతును.
తీతుకు 2:13

యూదా పట్ల మరో 120 సంవత్సరాలు దేవుడు ప్రేమ చూపాడు. చివరికి వారు కూడా ఇస్రాయేల్ వెళ్ళిన మార్గాన్నే వెళ్ళారు. “విల్లు...కాదు”– కీర్తనల గ్రంథము 33:16-17; యెషయా 37:36-37; జెకర్యా 4:6.

8. లోరూ హామా (జాలినొందనిది) పాలువిడిచిన తరువాత తల్లి గర్బవతియై కుమారుని కనినప్పుడు

9. యెహోవా ప్రవక్తకు సెలవిచ్చినదేమనగా మీరు నా జనులు కారు, నేను మీకు దేవుడనై యుండను గనుక లోఅమ్మీ (నాజనము కాదని) యితనికి పేరు పెట్టుము.

“లో–అమ్మి”– అంటే “నా జనం కానిది”– వారు దేవుణ్ణి తిరస్కరిస్తున్నారు కాబట్టి తాత్కాలికంగా దేవుడు కూడా వారిని తిరస్కరిస్తున్నాడు. ద్వితీయోపదేశకాండము 31:16-18 లో ఆయన మోషే ద్వారా పలికిన వాక్కులకు అనుగుణంగానే ఇది జరిగింది. లేవీయకాండము 26:14-39; ద్వితీయోపదేశకాండము 28:15-68 పోల్చి చూడండి.

10. ఇశ్రాయేలీయుల జనసంఖ్య అమితమై లెక్కలేని సముద్రపు ఇసుకంత విస్తారమగును; ఏ స్థలమందుమీరు నా జనులు కారన్నమాట జనులు వారితో చెప్పుదురో ఆ స్థలముననేమీరు జీవముగల దేవుని కుమారులైయున్నా రని వారితో చెప్పుదురు.
రోమీయులకు 9:26-28, 2 కోరింథీయులకు 6:18, 1 పేతురు 2:10

రోమీయులకు 9:26 లో ఆధ్యాత్మికంగా యూదేతర ప్రజలు దేవుని వైపుకు తిరగడం అనే విషయానికి ఈ వాక్కులను పౌలు అన్వయిస్తూ రాశాడు. ఇస్రాయేల్ జాతి విషయంలో ఇది అక్షరాలా నెరవేరదు అని ఇందులో ఉద్దేశం కాదు. రోమీయులకు 11:26-29 చూడండి. ఇక్కడ హోషేయ మూలంగా దేవుడు చెప్పేది ఇస్రాయేల్ వారిని తాను తిరస్కరించడం శాశ్వతం కాదని. “ఇసుక”– ఆదికాండము 22:17; ఆదికాండము 32:12. “స్థలం”– అంటే ఇస్రాయేల్ దేశం. ఇస్రాయేల్ తన ప్రజ కారని దేవుడు చెప్పినది అక్కడే. అందువల్ల వారిని తన కుమారులని ఆయన చెప్పబోయేది కూడా అక్కడే. యాకోబు సంతతి ప్రజలు పూర్వ క్షేమస్థితిని తిరిగి పొంది, రూపాంతరం చెందుతారని రాసినట్టుగా ఉంది. హోషేయ 2:23; లేవీయకాండము 26:40-45; యెషయా 11:12; యిర్మియా 23:5-6; యిర్మియా 30:1-3; యిర్మియా 31:27-28; యెహెఙ్కేలు 37:11-14; ఆమోసు 9:14-15 పోల్చి చూడండి.

11. యూదావారును ఇశ్రాయేలు వారును ఏకముగా కూడుకొని, తమ పైన నొకనినే ప్రధానుని నియమించుకొని తామున్న దేశములోనుండి బయలుదేరుదురు; ఆ యెజ్రెయేలు దినము మహా ప్రభావముగల దినముగానుండును.

“మళ్ళీ ఒకటే అవుతాయి”– యెహెఙ్కేలు 37:15-23. “ఒకే ఒక నాయకుణ్ణి”– దానియేలు 3:5; యిర్మియా 30:21; యెహెఙ్కేలు 37:24-25. “యెజ్రేల్ రోజు”– దేవుడు ఒకప్పుడు తన ప్రజల్ని శిక్షించిన ఆ గొప్ప లోయలో వారిని దీవించే రోజు.Shortcut Links
హోషేయ - Hosea : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |