Haggai - హగ్గయి 1 | View All

1. రాజైన దర్యావేషు ఏలుబడియందు రెండవ సంవత్సరము ఆరవ నెల మొదటి దినమున ప్రవక్తయగు హగ్గయి ద్వారా యూదా దేశముమీద అధికారియు షయల్తీయేలు కుమారుడునైన జెరుబ్బాబెలుకును ప్రధానయాజకుడును యెహోజాదాకు కుమారుడునైన యెహోషువకును యెహోవా వాక్కు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను సైన్యములకధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చున దేమనగా

“దర్యావేషు”– ఎజ్రా 4:24. ఇతడి పరిపాలన రెండో సంవత్సరం అంటే క్రీ.పూ. 520. ఇతడు దానియేలు 6వ అధ్యాయంలో కనిపించే దర్యావేషు కాదు. “జెరుబ్బాబెల్”– ఎజ్రా 2:2; ఎజ్రా 3:2; ఎజ్రా 4:2; ఎజ్రా 5:2; నెహెమ్యా 7:7; నెహెమ్యా 12:1; జెకర్యా 4:6-10. బబులోను చెరనుండి యూదులు తిరిగి వచ్చాక ఇతడు యూదాకు గవర్నరుగా ఉన్నాడు. “వచ్చింది”– యిర్మియా 1:2; హోషేయ 1:1; యోవేలు 1:1. “యెహోషువ”– జెకర్యా 3:1-9. “యాజి”– నిర్గమకాండము 28:1 నోట్.

2. సమయమింక రాలేదు, యెహోవా మందిర మును కట్టించుటకు సమయమింక రాలేదని యీ జనులు చెప్పుచున్నారే.

“సేనల ప్రభువు”– 1 సమూయేలు 1:3 దగ్గర నోట్. “చెప్పేదేమంటే”– తాము వినిపించే సందేశం దేవుని నుండి వచ్చిందని ప్రవక్తలకు తెలుసు గనుక వారు దాన్ని దేవుని పేరట ఆయన అధికారంతో ప్రకటించారు. “ఈ ప్రజలు” యూదా ప్రజలు. “కట్టడానికి”– యూదులు పదహారేళ్ళ క్రితమే ఆలయం పునాదులు వేశారు. అయితే పనిని కొనసాగించలేదు – ఎజ్రా 3:8-11; ఎజ్రా 4:1-5, ఎజ్రా 4:24.

3. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్తయగు హగ్గయిద్వారా సెలవిచ్చినదేమనగా

తమకైతే మంచి ఇళ్ళు కట్టుకొన్నారు గాని దేవుని ఇంటిని శిథిలాలుగానే ఉంచారు (దాదాపు 70 ఏళ్ళ క్రితం అది ధ్వంసం అయింది – 2 రాజులు 25:8-15). నేడు అనేకమంది క్రైస్తవుల్లాగానే ప్రజలు తమ విషయాలను చూచుకొంటూ దేవుని పనిని నిర్లక్ష్యం చేశారు. తమకోసమైతే చాలా సమయం ఉంది గాని దేవుని కోసం సమయం ఉన్నట్టు లేదు.

4. ఈ మందిరము పాడైయుండగా మీరు సరంబీవేసిన యిండ్లలో నిసించుటకు ఇది సమయమా?

5. కాబట్టి సైన్యములకధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా మీ ప్రవర్తననుగూర్చి ఆలోచించుకొనుడి.

“బాగా ఆలోచించండి”– వ 7; జెఫన్యా 2:15, జెఫన్యా 2:18; విలాపవాక్యములు 3:40; 2 కోరింథీయులకు 13:5; 1 పేతురు 1:13. తన ప్రజలు తమ స్థితిని గురించి ఆలోచించుకోవాలనీ కొన్ని విషయాలు ఎందుకు జరుగుతున్నాయో వారు అర్థం చేసుకోవాలనీ దేవుడు కోరాడు. మన విధానాలను మనం అర్థం చేసుకోవడం ద్వారా మనపట్ల దేవుని విధానాలను కొంతవరకు అర్థం చేసుకోగలం (కీర్తనల గ్రంథము 18:25-26; లేవీయకాండము 26:23-24 పోల్చి చూడండి).

6. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను, మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకయున్నది, పానము చేయుచున్నను దాహము తీరకయున్నది, బట్టలు కప్పు కొనుచున్నను చలి ఆగకున్నది, పనివారు కష్టముచేసి జీతము సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది.

తమను తామే కేంద్రంగా చేసుకొనే ఫలితం ఇదే – కాయకష్టం వల్ల వారికి దక్కేది కొంచెమే. వారు పేదరికంలో కృంగిపోతున్నారు. వారి డబ్బు సంచులకు రంధ్రాలున్నట్టు ఉంది. ఎంత త్వరగా డబ్బు సంపాదిస్తే అంత త్వరగా దాన్ని ఖర్చు పెట్టవలసి వస్తున్నది. తన పనిని ఉపేక్షించిన పాపానికి దేవుడు వారినిలా శిక్షిస్తున్నాడు.

7. కాగా సైన్యములకధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా మీ ప్రవర్తననుగూర్చి ఆలోచించుకొనుడి.

తన పేదరికానికి కారణం వారు గ్రహించి, దాని విషయం చర్య తీసుకోవాలని దేవుని ఉద్దేశం. వారు దేవుణ్ణి సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తే దేవుడు వారిని సంతోషపెడతాడు. వారు ఆయనను గౌరవిస్తే ఆయన వారిని ఘనపరుస్తాడు (వ 13; జెఫన్యా 2:19; 1 సమూయేలు 2:30; యెషయా 58:13-14; యోహాను 12:26; 2 కోరింథీయులకు 9:6-8). మనం మన సంగతులనే చూచుకొంటూ దేవుని ఇష్టాన్నీ, ఆయన ప్రతిష్ఠనూ లెక్కచెయ్య కుండా ఉంటే ఆయన ఆశీస్సులు కలగాలని ఎదురుచూచే హక్కు మనకు లేదు.

8. పర్వతములెక్కి మ్రాను తీసికొని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించినయెడల దానియందు నేను సంతోషించి నన్ను ఘనపరచుకొందునని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

9. విస్తారముగా కావలెనని మీరు ఎదురు చూచితిరి గాని కొంచెముగా పండెను; మీరు దానిని ఇంటికి తేగా నేను దానిని చెదరగొట్టితిని; ఎందు చేతనని యెహోవా అడుగుచున్నాడు. నా మందిరము పాడైయుండగా మీరందరు మీ మీ యిండ్లు కట్టుకొను టకు త్వరపడుటచేతనే గదా.

“ఊది ఎగరగొట్టి”– వారి ఆలోచన లేని స్వార్థపూరితమైన విధానాల మూలంగా దేవుడు వారిని వర్ధిల్లనీయకుండా కొన్ని పరిస్థితులను కల్పించాడు.

10. కాబట్టి మిమ్మునుబట్టి ఆకాశపుమంచు కురువకయున్నది, భూమి పండక యున్నది.

ఏకైక నిజ దేవుడే వర్షాన్ని ఇచ్చేది. ప్రజల పాపాలకు శిక్షగా ఆయన కొన్ని సార్లు వర్షం కురవకుండా చేస్తాడు. లేవీయకాండము 26:4, లేవీయకాండము 26:19; ద్వితీయోపదేశకాండము 28:22-24; 1 రాజులు 17:1; యిర్మియా 14:1, యిర్మియా 14:22.

11. నేను భూమికిని పర్వతములకును అనావృష్టి కలుగజేసి, ధాన్యము విషయములోను ద్రాక్షారసము విషయములోను తైలము విషయములోను భూమి ఫలించు సమస్తము విషయములోను మనుష్యుల విషయములోను పశువుల విషయములోను చేతిపనులన్నిటి విషయములోను క్షామము పుట్టించియున్నాను.

12. షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును యెహోజాదాకు కుమారుడును ప్రధానయాజకుడునగు యెహోషు వయు శేషించిన జనులందరును తమ దేవుడైన యెహోవా మాటలు ఆలకించి, తమ దేవుడైన యెహోవా ప్రవక్త యైన హగ్గయిని పంపించి, తెలియజేసిన వార్త విని యెహోవాయందు భయభక్తులు పూనిరి.

“మిగిలిన ప్రజలంతా”– అంటే బబులోను చెరనుండి తిరిగి వచ్చినవారు. ఒకప్పుడు యూదాలో నివసించిన అనేకమంది జనాలతో పోల్చుకుంటే వీరు చాలా కొద్దిమందే. “మాట విన్నారు”– ద్వితీయోపదేశకాండము 6:24; ద్వితీయోపదేశకాండము 11:13-15; ద్వితీయోపదేశకాండము 28:1-6; యోహాను 14:15. “భయభక్తులు”– ఆదికాండము 20:11; కీర్తనల గ్రంథము 34:11-14; కీర్తనల గ్రంథము 111:10; సామెతలు 1:7 నోట్స్.

13. అప్పుడు యెహోవా దూతయైన హగ్గయి యెహోవా తెలియ జేసిన వార్తనుబట్టి జనులకు ప్రకటించినదేమనగానేను మీకు తోడుగా ఉన్నాను; ఇదే యెహోవా వాక్కు.
మత్తయి 28:20

“యెహోవా పంపినవాడైన”– ప్రవక్త అంటే ఇదే. దేవుని నుండి అతనికి సందేశం అందింది. దాన్ని అతడు ప్రజలకు వినిపించాడు. “మీకు తోడుగా”– వారి విధేయత, భక్తి భావం మూలంగా ఆయన వారిని ఆశీర్వదించి వర్ధిల్లజేస్తాడు. అన్ని కాలాల్లోనూ దేవుని ప్రజలు మరింత కష్టించి, మరిన్ని ఘన విజయాలను సాధించేందుకు పురిగొలపడానికి దేవుని సన్నిధి వారితో ఉంటుందన్న వాగ్దానం ఒక్కటి చాలు – నిర్గమకాండము 33:14; యెహోషువ 1:5; న్యాయాధిపతులు 6:16; 1 దినవృత్తాంతములు 28:20; యిర్మియా 1:8; మత్తయి 28:20.

14. యెహోవా యూదాదేశపు అధికారియగు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలుయొక్క మనస్సును, ప్రధాన యాజకుడగు యెహోజాదాకు కుమారుడైన యెహోషువ మనస్సును,శేషించిన జనులందరి మనస్సును ప్రేరేపింపగా

“పురిగొలిపాడు”– ఎజ్రా 1:1, ఎజ్రా 1:5; ఫిలిప్పీయులకు 2:13 పోల్చి చూడండి.

15. వారు కూడివచ్చి, రాజైన దర్యావేషుయొక్క యేలుబడి యందు రెండవ సంవత్సరము ఆరవ నెల యిరువది నాలు గవ దినమున సైన్యములకు అధిపతియగు తమ దేవుని మందిరపు పనిచేయ మొదలుపెట్టిరి.Shortcut Links
హగ్గయి - Haggai : 1 | 2 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |