Zechariah - జెకర్యా 1 | View All

1. దర్యావేషు ఏలుబడియందు రెండవ సంవత్సరము ఎనిమిదవ నెలలో యెహోవా వాక్కు ప్రవక్తయు ఇద్దోకు పుట్టిన బెరక్యా కుమారుడునైన జెకర్యాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా
మత్తయి 23:25

“దర్యావేషు”– హగ్గయి 1:1; ఎజ్రా 4:24. జెకర్యా, హగ్గయి సమకాలికులు. “ఇద్దో”– ఎజ్రా 5:1; ఎజ్రా 6:14; నెహెమ్యా 12:4, నెహెమ్యా 12:16. “ప్రవక్త”– ఆదికాండము 20:7 నోట్. “వచ్చిన”– యిర్మియా 1:2; హోషేయ 1:1; యోవేలు 1:1.

2. యెహోవా మీ పితరులమీద బహుగా కోపించెను.

“పూర్వీకుల”– యిర్మియా 7:18, యిర్మియా 7:20; యిర్మియా 8:19; యిర్మియా 11:17; యిర్మియా 32:31-35. యూదా ప్రజలు దేవునికి దూరమై, ఆయన ఒడంబడికను భంగం చేసి ఇతరుల దేవుళ్ళను పూజించారు. అందువల్ల ఆయన వారిపైకి బబులోనువారిని రప్పించాడు. వారు జెరుసలంను ధ్వంసం చేసి ప్రజల్ని చెరగొనిపోయారు – 2 దినవృత్తాంతములు 36:15-21. ఇప్పుడు వారిలో మిగిలిన వారు తిరిగి వచ్చారు. వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. “కోపగించాడు”– సంఖ్యాకాండము 25:3; కీర్తనల గ్రంథము 90:7-11 నోట్స్.

3. కాబట్టి నీవు వారితో ఇట్లనుము సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చున దేమనగామీరు నాతట్టు తిరిగినయెడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు; ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు.
యాకోబు 4:8

“సేనల ప్రభువు”– 1 సమూయేలు 1:3 నోట్. “తిరగండి”– యిర్మియా 4:1; హోషేయ 14:1; మలాకీ 3:7; యాకోబు 4:8. తన విధిని వారు నెరవేరిస్తే తన వంతు దేవుడు నెరవేరుస్తాడు అన్నది ఖాయం – నిర్గమకాండము 34:6-7; యెహెఙ్కేలు 18:30-32.

4. మీరు మీ పితరులవంటివారై యుండవద్దు; పూర్వికులైన ప్రవక్తలు సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగామీ దుర్మార్గ తను మీ దుష్‌క్రియలను మాని తిరుగుడని వారికి ప్రకటించినను వారు వినకపోయిరి, నా మాట ఆలకించక పోయిరి; ఇదే యెహోవా వాక్కు.

“పూర్వం ఉన్న ప్రవక్తలు”– యెషయా, యోవేలు, మీకా, యిర్మీయా మొదలైనవారు. “వినలేదు”– యిర్మియా 7:13, యిర్మియా 7:25; యిర్మియా 11:7-8; యిర్మియా 25:3-7. దేవుడు చెప్తున్న దాన్ని పట్టించుకోని ఏ ప్రజ అయినా, ఏ వ్యక్తి అయినా ఆపద కొనితెచ్చుకుంటున్నాడన్నమాట. హెబ్రీయులకు 12:25 పోల్చి చూడండి.

5. మీ పితరు లేమైరి? ప్రవక్తలు నిత్యము బ్రదుకుదురా?

మనుషులు మైదానంలో గడ్డిలాగా గతించిపోతారు గానీ దేవుని వాక్కు శాశ్వతంగా నిలుస్తుంది – యెషయా 40:6-8; 1 పేతురు 1:24-25. ఇస్రాయేల్ యూదాల మీదికి వచ్చిన శిక్ష ఆ వాక్కు నెరవేర్పు మూలానే.

6. అయినను నా సేవకులైన ప్రవక్తలకు నేను సెలవిచ్చిన మాటలును కట్టడలును మీ పితరుల విషయములో నెరవేరలేదా? నెరవేరగా వారు తిరిగిమన ప్రవర్తననుబట్టియు క్రియలను బట్టియు యెహోవా మనకు చేయదలచిన ప్రకారముగా ఆయన అంతయు మనకు చేసియున్నాడని చెప్పుకొనిరి.
ప్రకటన గ్రంథం 10:7, ప్రకటన గ్రంథం 11:18

7. మరియదర్యావేషు ఏలుబడియందు రెండవ సంవ త్సరము శెబాటు అను పదకొండవ నెల యిరువది నాలుగవ దినమున యెహోవా వాక్కు ప్రవక్తయు ఇద్దోకు పుట్టిన బెరక్యా కుమారుడునైన జెకర్యాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.

దేవుడు జెకర్యాకు ఇచ్చిన ఎనిమిది దర్శనాల్లో ఇది మొదటిది (వ 18; జెకర్యా 2:1; జెకర్యా 3:1; జెకర్యా 4:1; జెకర్యా 5:1; జెకర్యా 6:1) – ఇవన్నీ ఒకే రాత్రిలో; వచ్చినట్టు ఉంది. తన ప్రవక్తలకు తన సత్యాన్ని, సందేశాలను వెల్లడించేందుకు దేవుడు వాడుకున్న ఒక పద్ధతి దర్శనాల నివ్వడం. ఆదికాండము 15:1; యెషయా 1:1; దానియేలు 2:19; అపో. కార్యములు 9:10; అపో. కార్యములు 10:3 చూడండి.

8. రాత్రి ఎఱ్ఱని గుఱ్ఱమునెక్కిన మనుష్యు డొకడు నాకు కనబడెను; అతడు లోయలోనున్న గొంజి చెట్లలో నిలువబడియుండగా అతని వెనుక ఎఱ్ఱని గుఱ్ఱము లును చుక్కలు చుక్కలుగల గుఱ్ఱములును తెల్లని గుఱ్ఱము లును కనబడెను.
ప్రకటన గ్రంథం 6:2-4-5, ప్రకటన గ్రంథం 19:11

“ఎర్రని గుర్రం”– ఎరుపురంగు రక్తపాతానికి సూచన కావచ్చు (ప్రకటన గ్రంథం 6:4). తెలుపు విజయానికీ శాంతికీ సూచన కావచ్చు (ప్రకటన గ్రంథం 19:11-15 పోల్చి చూడండి). గోధుమ రంగు ఆ రెండు రంగులు కలసి వేటిని సూచిస్తాయో వాటికి సూచన కావచ్చు. “వ్యక్తి”– ఈ వ్యక్తి యెహోవా దూత (వ 11), అంటే దేవుని కుమారుడై ఉన్నట్టుంది. ఈ “దేవదూత” గురించి నోట్ ఆదికాండము 16:7 చూడండి. “గుర్రాలు”– వీటి అంతరార్థం వ 10లో ఉంది. ఇది ఈ లోకంలో తన పనికోసం దేవుడు పంపిన దూతలు కావచ్చు (2 రాజులు 6:17; కీర్తనల గ్రంథము 78:49; కీర్తనల గ్రంథము 91:11-12; దానియేలు 10:12-13, దానియేలు 10:20; హెబ్రీయులకు 1:14; ప్రకటన గ్రంథం 7:1; ప్రకటన గ్రంథం 12:7; ప్రకటన గ్రంథం 15:1 పోల్చి చూడండి).

9. అప్పుడునా యేలినవాడా, యివి ఏమని నేనడుగగా నాతో మాటలాడు దూతఇవి ఏమి యైనది నేను నీకు తెలియజేతుననెను.

జెకర్యాతో మాట్లాడుతున్న దూత, యెహోవా దూత (వ 11) ఒకరు కాదు.

10. అప్పుడు గొంజి చెట్లలో నిలువబడియున్నవాడు ఇవి లోకమంతటను తిరుగులాడుటకు యెహోవా పంపించిన గుఱ్ఱములని చెప్పెను.

“లోకమంతటా”– యోబు 1:6-7. దేవుని సంకల్పాన్ని నెరవేర్చేందుకు ఆయన దూతలు లోకమంతటా సంచారం చేస్తుంటారు.

11. అవి గొంజిచెట్లమధ్యను నిలువబడిన యెహోవా దూతను చూచిమేము లోకమంతట తిరుగులాడివచ్చి యున్నాము; ఇదిగో లోకులందరు శాంతముకలిగి నిమ్మళ ముగా ఉన్నారని చెప్పెను.

వ 8. యెహోవా దూతకు ఇతర దూతలందరిపై అధికారం ఉంది. వారంతా ఆయనకు తన కార్యకలాపాలను వినిపిస్తూ ఉంటారు. “నెమ్మదిగా, శాంతంగా”– మాదీయ పారసీక రాజులు బబులోనును ఓడించిన తరువాత కొంత కాలంగా లోకంలో ఉన్న పరిస్థితి ఇది.

12. అందుకు యెహోవా దూతసైన్యములకధిపతియగు యెహోవా, డెబ్బది సంవత్సరములనుండి నీవు యెరూషలేముమీదను యూదా పట్టణములమీదను కోపముంచియున్నావే; యిక ఎన్నాళ్లు కనికరింపకయుందువు అని మనవిచేయగా
ప్రకటన గ్రంథం 6:10

యూదాలోని స్థితిని గురించి దేవుని కుమారుడు తండ్రి అయిన దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. యోహాను 17:1; రోమీయులకు 8:34; 1 తిమోతికి 2:5; హెబ్రీయులకు 7:25; 1 యోహాను 2:1 పోల్చి చూడండి. “డెబ్భై సంవత్సరాల”– 2 దినవృత్తాంతములు 36:21; యిర్మియా 25:11-12; యిర్మియా 29:10; దానియేలు 9:2.

13. యెహోవా నాతో మాటలాడిన దూతకు ఆదరణయైన మధుర వచనములతో ఉత్తరమిచ్చెను.

తండ్రి అయిన దేవుడు తన కుమారుని విన్నపం విని తన ప్రవక్త ద్వారా యూదాప్రజలకు ఆదరణ సందేశాన్ని పంపించాడు. “దూత”– వ 9.

14. కాబట్టి నాతో మాటలాడు చున్న దూత నాతో ఇట్లనెను-నీవు ప్రకటన చేయ వలసినదేమనగా సైన్యములకు అధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను యెరూషలేము విషయములోను సీయోనువిషయములోను అధికాసక్తి కలిగియున్నాను;

“ఆసక్తి”– హీబ్రూ పదాన్ని “రోషం” అని కూడా అనువదించవచ్చు. జెకర్యా 8:2; నిర్గమకాండము 20:5; నిర్గమకాండము 34:14; Jole 2:18; యాకోబు 4:5 చూడండి. దేవుని ఆసక్తి లేక రోషం వెనుక ప్రేమ ఉంది. యూదా ప్రజల పట్ల దేవుని ప్రేమ గొప్పది. అందువల్ల తననుండి వారి హృదయాలను తిప్పివేసే ప్రతిదాని విషయం అంటే ఆయనకు రోషం. వారిని బాధించే ఏ జాతి అయినా ఆయన కోపానికి గురి కావలసిందే.

15. నిమ్మళముగా ఉన్న అన్యజనులమీద నేను బహుగా కోపించుచున్నాను; ఏలయనగా నేను కొంచెము కోపపడగా కీడుచేయవలెనన్న తాత్పర్యముతో వారు సహాయులైరి.

16. కాబట్టి యెహోవా సెలవిచ్చున దేమనగావాత్సల్యముగలవాడనై నేను యెరూషలేము తట్టు తిరిగియున్నాను; అందులో నా మందిరము కట్ట బడును; యెరూషలేముమీద శిల్పకారులు నూలు సాగ లాగుదురు; ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు.

“నా ఆలయాన్ని”– దీని నెరవేర్పు కోసం ఎజ్రా 6:14-15 చూడండి. “కొలత”– జెరుసలం తిరిగి కట్టడం గురించి చెప్పేమాట (యిర్మియా 31:38-40).

17. నీవు ఇంకను ప్రకటన చేయవలసినదేమనగా ఇక నా పట్టణములు భాగ్యముతో మరి ఎక్కువగా నింపబడును, ఇంకను యెహోవా సీయోనును ఓదార్చును, యెరూషలేమును ఆయన ఇకను కోరుకొనును.

“ఓదారుస్తాడు”– యోహాను 40:1. “ఎన్నుకొంటాడు”– జెకర్యా 2:12; జెకర్యా 3:2; యెషయా 14:1.

18. అప్పుడు నేను తేరిచూడగా నాలుగు కొమ్ములు కన బడెను.

ఇస్రాయేల్ యూదాలను ధ్వంసం చేసిన దేశాల నాశనాన్ని చూపే దర్శనం. “కొమ్ములు” అధికారాన్నీ శక్తినీ సూచిస్తాయి (1 సమూయేలు 2:10; కీర్తనల గ్రంథము 18:2; దానియేలు 7:7-8; లూకా 1:69; ప్రకటన గ్రంథం 17:12). ఇక్కడ దేవుని ప్రజలను చెల్లాచెదురు చేసిన జాతులను ఇవి సూచిస్తున్నాయి. వీరిలో ముఖ్యులు అష్షూరు, బబులోను. నాలుగు అనేది లోకం నాలుగు మూలలకు సూచన కావచ్చు.

19. ఇవి ఏమిటివని నేను నాతో మాటలాడు చున్న దూతనడుగగా అతడుఇవి యూదావారిని ఇశ్రా యేలువారిని యెరూషలేము నివాసులను చెదరగొట్టిన కొమ్ములనెను.

20. యెహోవా నలుగురు కంసాలులను నాకు కనుపరచగా

“లోహకారులు”– ఈ కొమ్ములు గుర్తుగా ఉన్న జాతులను చితగ్గొట్టడానికి దేవుడు వాడబోతున్న దేశాలు, లేదా ఇతర శక్తులు. కానీ లోహకారులంటే కేవలం నాశనం చెయ్యడం అని కాక నిర్మించే పనికి దేనికైనా సూచన.

21. వీరేమి చేయబోవుచున్నారని నేనడిగి నందుకు ఆయన ఎవడును తలయెత్తకుండ యూదావారిని చెదరగొట్టిన కొమ్ములు ఇవే. అయితే వాటిని భయపెట్టుటకును, యూదాదేశస్థులనందరిని చెదరగొట్టుటకై వారిమీద బలాత్కారము జరిగించిన అన్యజనుల కొమ్ము లను పడగొట్టుటకును వీరు వచ్చియున్నారని నాకు సెలవిచ్చెను.Shortcut Links
జెకర్యా - Zechariah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |