Matthew - మత్తయి సువార్త 1 | View All

‘యేసు” అనే పేరుకు (హీబ్రూ “యెహోషువ” అనే పేరు లాగానే) “యెహోవా రక్షిస్తాడు” అని అర్థం. “క్రీస్తు” అనేది గ్రీకు భాషా పదం. దీని అర్థం “అభిషిక్తుడు”. హీబ్రూ పదం “మెస్సీయ”కు ఉన్న అర్థమే గ్రీకు “క్రీస్తు”కూ ఉంది. మత్తయి ఈ శుభవార్త రాయడంలో అతని గొప్ప ఉద్దేశాల్లో ఒకటి పాత ఒడంబడికలో వాగ్దానం చేయబడిన మెస్సీయ యేసేనని చూపడం. పాత ఒడంబడిక ప్రకారం మెస్సీయను దేవుడు అభిషేకిస్తాడు, అంటే దేవుడాయన్ను పాత ఒడంబడికలోని వాగ్దానాలను నెరవేర్చేందుకు ప్రత్యేకించి ప్రతిష్ఠిస్తాడు. ఆయన ప్రవక్తగా, యాజిగా, రాజుగా ఉంటాడు (ద్వితీయోపదేశకాండము 18:15; 2 సమూయేలు 7:11; కీర్తనల గ్రంథము 2:2-9; కీర్తనల గ్రంథము 89:27-29; కీర్తనల గ్రంథము 110:1, కీర్తనల గ్రంథము 110:4; యెషయా 7:14; యెషయా 9:6-7; యెషయా 11:1-9; యెషయా 52:13-15; జెకర్యా 6:12-13). పాత ఒడంబడిక ప్రకారం అభిషిక్తుడు జాతి పిత అయిన అబ్రాహాముకు, ఇస్రాయేల్‌వారి రాజులందరిలోకీ గొప్ప రాజైన దావీదుకూ సంతానమై ఉండాలి. యేసుప్రభువు విషయంలో ఇది వాస్తవం అని చూపేందుకు మత్తయి ఈ వంశావళిని ఇస్తున్నాడు. ఈ వంశావళులు రహస్య సమాచారమేమీ కాదు. అవి అందరికీ అందుబాటులో ఉన్నాయి. కావాలనుకున్న ఏ యూదుడైనా వీటిని సరిచూసుకోవచ్చు. బైబిల్లో “కుమారుడు” అనే మాటను అనేక రకాలైన సంబంధాలను సూచించేందుకు వాడారు. కొన్ని సార్లు మామూలుగానే ఒక వ్యక్తికి పుట్టిన కొడుకు అని అర్థం వస్తుంది. ఇదిగాక మనుమడు, శిష్యుడు, అతి ప్రియమైన వ్యక్తి, లేక ఏ తరంలో అయినా పుట్టిన ఆ సంతతివాడు అనే అర్థాలు కూడా ఉన్నాయి. ఇక్కడ యేసు ఆయన మానవ స్వభావాన్ని బట్టి తనకు వెయ్యి సంవత్సరాలకు ముందు జీవించిన దావీదు సంతతికీ, రెండు వేల సంవత్సరాలకు ముందు జీవించిన అబ్రాహాము సంతతికీ చెందినవాడు అని అర్థం.

“ఇస్సాకు”– ఆదికాండము 21:3, ఆదికాండము 21:12. “యాకోబు”– ఆదికాండము 25:26. “అన్నదమ్ములు”– ఆదికాండము 29:35. అభిషిక్తుడు యూదా వంశంలోనుంచి రావాలి (ఆదికాండము 49:10; కీర్తనల గ్రంథము 89:27-29. దావీదు యూదా సంతతివాడు). అందువల్ల యాకోబుకు పుట్టిన మిగతా కొడుకుల సంగతిని మత్తయి చెప్పడం లేదు.

4. పెరెసు ఎస్రోమును కనెను,ఒ ఎస్రోము అరామును కనెను, అరాము అమీ్మన ాదాబును కనెను, అమ్మీనాదాబును నయస్సోనును కనెను;
రూతు 4:13, రూతు 4:17-22, 1 దినవృత్తాంతములు 2:10-12

5. నయస్సోను శల్మానును కనెను, శల్మాను రాహాబునందు బోయజును కనెను, బోయజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెష్షయిని కనెను;
రూతు 4:13, రూతు 4:17-22, 1 దినవృత్తాంతములు 2:10-12

“రాహాబు”– యెహోషువ 2:1-21; యెహోషువ 6:25. “రూతు”– రూతు 4:13-22. కనాను జాతికి చెందిన రాహాబు, మోయాబు జాతికి చెందిన రూతు ఇస్రాయేల్ జాతికి చెందినవారు కారు. వీరిద్దరి విషయమూ చూస్తుంటే పాపులైన మనుషుల పట్ల దేవుని కృప, కరుణలు కొంతవరకు అర్థం అవుతాయి. వీరిద్దరూ దేవుని కృపవల్ల మార్పు చెంది అభిషిక్తుడు రానున్న వంశంలోకి చేర్చబడ్డారు.

6. యెష్షయి రాజైన దావీదును కనెను. ఊరియా భార్యగానుండిన ఆమెయందు దావీదు సొలొమోనును కనెను.
రూతు 4:17, రూతు 4:22, 2 సమూయేలు 12:24, 1 దినవృత్తాంతములు 2:13-15

“దావీదు”– 1 సమూయేలు 16:1; 1 సమూయేలు 17:12. “సొలొమోను”– 2 సమూయేలు 12:24. “భార్య”– బత్‌షెబ. 2 సమూయేలు 11,12 అధ్యాయాల్లో ఉన్న దావీదు బత్‌షెబల కథ మానవ భ్రష్టత్వాన్ని, పాతకాన్ని జయించే దేవుని అధిక కృపను గురించి మరో సారి మనకు తెలియజేస్తుంది.

7. సొలొమోను రెహబామును కనెను; రెహబాము అబీయాను కనెను, అబీయా ఆసాను కనెను;
1 దినవృత్తాంతములు 3:10-14

8. ఆసా యెహోషాపాతును కనెను, యెహోషాపాతు యెహోరామును కనెను, యెహోరాము ఉజ్జియాను కనెను;

ఉజ్జియా తండ్రి అమజ్యా. యెహోరాం అతనికి ముత్తాత. ఇక్కడ కూడా కుమారుడు అంటే సంతతివాడు అని అర్థం.

9. ఉజ్జియా యోతామును కనెను,యోతాము ఆహాజును కనెను, ఆహాజు హిజ్కియాను కనెను;

10. హిజ్కియా మనష్షేను కనెను, మనష్షే ఆమోనును కనెను, ఆమోను యోషీయాను కనెను;

యోషీయా యెకొన్యా (యెహోయాకీను) తాత.

12. బబులోనుకు కొనిపోబడిన తరువాత యెకొన్యా షయల్తీ యేలును కనెను, షయల్తీయేలు జెరుబ్బాబెలును కనెను;
1 దినవృత్తాంతములు 3:17, 1 దినవృత్తాంతములు 3:19, ఎజ్రా 3:2

13. జెరుబ్బాబెలు అబీహూదును కనెను, అబీహూదు ఎల్యా కీమును కనెను, ఎల్యాకీము అజోరును కనెను;

14. అజోరు సాదోకును కనెను, సాదోకు ఆకీమును కనెను, ఆకీము ఎలీహూదును కనెను;

15. ఎలీహూదు ఎలియాజరును కనెను, ఎలియాజరు మత్తానును కనెను, మత్తాను యాకో బును కనెను;

16. యాకోబు మరియ భర్తయైన యోసేపును కనెను, ఆమెయందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను.

మత్తయి ఇక్కడ ఎంత జాగ్రత్తగా రాస్తున్నాడో చూడండి. మరియ యేసుకు తల్లి. అయితే యోసేపు సామాజిక చట్టం ప్రకారం తప్పించి యేసుకు తండ్రి కాడు. ఈ అధ్యాయం మిగతా భాగమంతట్లో ఇది స్పష్టం అవుతున్నది. మత్తయికి యేసు చట్టబద్ధంగా దావీదు సంతతివాడు అని నిరూపిస్తే చాలు. లూకా రాసిన వంశావళిలో (లూకా 3:23-28) అతని ఉద్దేశం మరియ మూలంగా యేసుప్రభువు శారీరికంగా కూడా దావీదు సంతతివాడే అని చూపడం కావచ్చు.

17. ఇట్లు అబ్రాహాము మొదలుకొని దావీదు వరకు తరము లన్నియు పదునాలుగు తరములు. దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలమువరకు పదు నాలుగు తరములు; బబులోనుకు కొనిపోబడినది మొదలు కొని క్రీస్తు వరకు పదునాలుగు తరములు.

“బబులోనుకు తీసుకువెళ్ళిన”– 1 దిన 36వ అధ్యాయంలో చూడండి. మత్తయి ఈ వంశావళిలో కొన్ని పేర్లను రాయలేదు – అహజ్య, యోవాషు, అమజ్యా, యెహోయాకీం రాజుల పేర్లు లేవు. యేసుప్రభువు అబ్రాహాము, దావీదుల వంశంవాడని చూపించేందుకు ఆ వంశవృక్షంలోని పేర్లన్నిటినీ ఈ జాబితాలో పెట్టడం అనవసరం. మత్తయి ఈ వంశవృక్షాన్ని, బహుశా కంఠతా పెట్టేందుకు వీలుగా, 14 పేర్లున్న మూడు విభాగాలుగా చేశాడు. ఈ విధంగా ఇందుకోసం వంశవృక్షాలను కుదించి విభాగాలుగా చెయ్యడం యూదుల్లో కొత్త సంగతి ఏమీ కాదు.

18. యేసు క్రీస్తు జననవిధ మెట్లనగా, ఆయన తల్లియైన మరియ యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మవలన గర్భవతిగా ఉండెను.
నిర్గమకాండము 33:20

ఇస్రాయేల్‌వారిలో స్త్రీ పురుషులకు ప్రదానం జరిగిన తరువాత, వివాహం జరిగేవరకు వారిద్దరూ కలిసి జీవించలేదు. అయితే ఈ ప్రదానం వారిద్దరినీ చట్టపరంగా ఏకం చేసింది. వారిద్దరినీ భార్యభర్తలు అన్నారు కూడా. “పవిత్రాత్మ”– యేసు దేవుని కుమారుడు. ఆయనకు యోసేపు చట్టపరంగా తండ్రి. ఆయన నిజమైన తండ్రి దేవుడే. అంటే ఆయన మానవత్వం దేవుని ఆత్మ శక్తివల్ల మరియలో రూపొందింది (వ 20; లూకా 1:35). అంటే దేవుడు ఏదో మానవాకారంలో మరియ దగ్గరికి వచ్చాడనీ ఒక రకం అవతారం ఎత్తాడనీ ఏమాత్రం అర్థం కాదు. ఇలాంటిది అవసరం లేదు, ఇలా జరగలేదు కూడా. యేసులో భ్రష్ట స్వభావమూ ఏ పాపమూ లోపమూ లేని మానవత్వం, దైవత్వం రెండూ ఒకే వ్యక్తిలో కలిసి ఉన్నాయి. ఆయన సంపూర్ణ దేవుడు, సంపూర్ణ మానవుడు కూడా. పవిత్రాత్మను గురించి ఇతర నోట్స్‌లు, రిఫరెన్సులు మత్తయి 3:11, మత్తయి 3:16; లూకా 1:15, లూకా 1:35; లూకా 4:1; లూకా 11:13; యోహాను 1:33; యోహాను 7:39; యోహాను 14:16-17, యోహాను 14:26; యోహాను 16:7-8; యోహాను 20:22; అపో. కార్యములు 1:5, అపో. కార్యములు 1:8; అపో. కార్యములు 2:4, అపో. కార్యములు 2:38; 1 కోరింథీయులకు 12:13; గలతియులకు 3:14; ఎఫెసీయులకు 5:18. ఆదికాండము 1:2 నోట్ కూడా చూడండి.

19. ఆమె భర్తయైన యోసేపు నీతిమంతుడైయుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను.

“న్యాయవంతుడు”– ఇలా అనువదించిన గ్రీకు పదానికి అర్థం ఇతరుల పట్ల న్యాయంగా నిష్‌పక్షపాతంగా ప్రవర్తించేవాడు; దేవుని పట్ల, దేవుని వాక్కు విషయంలో యథార్థంగా భక్తిభావంతో ఉండేవాడు. మరియ వ్యభిచారం విషయంలో దోషి అనీ ఆమెతో తెగతెంపులు చేసుకోవాలనీ యోసేపు తప్పుగా భావించాడు. అయితే అతడు మంచివాడు, మరియను ఎంతో ప్రేమించి ఉంటాడు కాబట్టి ఆమె పట్ల దయగా వ్యవహరించాలని అనుకున్నాడు. మరియ సంగతి చూస్తే దేవుని సంకల్పం ప్రకారం చేసేవాళ్ళను మనుషులు అపార్థం చేసుకుని లేనిపోని నేరాలు మోపి, ప్రమాదాలకు గురిచేసే అవకాశం ఉందని అర్థం చేసుకోవచ్చు. ఇస్రాయేల్‌వారి చట్టం ప్రకారం వ్యభిచారానికి శిక్ష మరణం (ద్వితీయోపదేశకాండము 22:23-24).

20. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడవైన యోసేపూ, నీ భార్యయైన మరియను చేర్చు కొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మవలన కలిగినది;

దేవదూతల గురించి నోట్ ఆదికాండము 16:7. దేవదూత అని అనువదించిన గ్రీకు పదానికి వార్తాహరుడు, సందేశం తీసుకొని వచ్చినవాడు అని అర్థం. పరలోకం నుంచి వచ్చిన ఆత్మరూపుడు అని ఇక్కడ అర్థం. కలల గురించి మత్తయి 2:13 నోట్ చూడండి.

21. తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు2 అను పేరు పెట్టుదువనెను.

.“యేసు”– వ 1. పాపులైన మనుషుల్ని పాపవిముక్తుల్ని చేసి రక్షించడానికే యేసుప్రభువు వచ్చాడు, వారిని నాశనం చెయ్యడానికి కాదు (లూకా 19:10; యోహాను 3:17). వారిని వారి పాపాల తాలూకు శిక్ష నుంచి, దాని శక్తిప్రభావాల నుంచి విడుదల చేసి, దేవుని సన్నిధిలో శాశ్వతమైన నీతిన్యాయాలు, ధన్యత, శాంతి, ఆనందాలు ఉండే స్థితిలోకి తేవడానికి ఆయన వచ్చాడు (లూకా 4:18-19; అపో. కార్యములు 26:18). ఆయన మనుషులను వారి పాపాల్లో రక్షించడు, వారి పాపాలనుంచి రక్షిస్తాడు. ఆయన ప్రజలు ఎవరంటే ఆయన్ను స్వీకరించి ఆయనలో నమ్మకం ఉంచినవారు (యోహాను 1:12-13), దేవుడు ఆయనకు ఇచ్చినవారు (యోహాను 6:37; యోహాను 17:6).

22. ఇదిగో కన్యక గర్భవతియై కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు

క్రొత్త ఒడంబడిక గ్రంథంలో చాలా భాగం పాత ఒడంబడిక వాగ్దానాల నెరవేర్పును తెలిపే సంఘటనలు కనిపిస్తాయి. బైబిలంతా సంపూర్ణంగా దేవుని ఆత్మావేశంవల్ల రాయబడిందని నమ్మేందుకు ఇది బలమైన కారణం. దేవుడు తానే స్వయంగా తన ప్రవక్తలద్వారా మాట్లాడిన విషయం గమనించండి. మత్తయి 2:15; మత్తయి 4:4; మత్తయి 15:4; మత్తయి 22:43-44; అపో. కార్యములు 1:16; అపో. కార్యములు 4:25; అపో. కార్యములు 28:25; హెబ్రీయులకు 1:5, హెబ్రీయులకు 1:8, హెబ్రీయులకు 1:10, హెబ్రీయులకు 1:13; హెబ్రీయులకు 3:7; హెబ్రీయులకు 4:3, హెబ్రీయులకు 4:7; హెబ్రీయులకు 5:5-6; హెబ్రీయులకు 7:21; హెబ్రీయులకు 8:8; హెబ్రీయులకు 10:5, హెబ్రీయులకు 10:15; హెబ్రీయులకు 13:5 చూడండి. 2 తిమోతికి 3:16; 2 పేతురు 1:21 కూడా చూడండి.

23. అని ప్రభువు తన ప్రవక్తద్వారా పలికిన మాట నెరవేరు నట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము.
యెషయా 7:14, యెషయా 8:8, యెషయా 8:10

“ఇమ్మానుయేలు”– యోహాను 7:14. యేసుప్రభువు పుట్టుక, జీవితం, మరణం, సజీవంగా తిరిగి లేవడం వీటన్నిటి పునాది పాత ఒడంబడిక భవిష్యత్ వాక్కు పైనే స్థిరంగా నిలిచి ఉందని రుజువు చేసేందుకు మత్తయి దాదాపు 50 సార్లు పాత ఒడంబడిక భవిష్యద్వాక్కులను ఎత్తి రాశాడు. భూమిపై యేసు జీవితం దైవావతారమైన ఇమ్మానుయేలు జీవితం, దేవుని స్వభావాన్నీ పనులనూ వాటి సంపూర్ణ సౌందర్యంతో మహిమతో వెల్లడి చేసిన జీవితం (యోహాను 1:1, యోహాను 1:14, యోహాను 1:18; కొలొస్సయులకు 2:9; హెబ్రీయులకు 1:3).

24. యోసేపు నిద్రమేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారముచేసి, తన భార్యను చేర్చుకొని

దేవుని ఆజ్ఞకు వెంటనే విధేయత చూపడం ద్వారా యోసేపు తాను న్యాయవంతుణ్ణని (వ 19) నిరూపించుకున్నాడు. నిజమైన న్యాయవర్తన దేవునిపట్ల విధేయత కలిగిస్తుంది. కలిగించకపోతే అది న్యాయవర్తనే కాదు.

25. ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను; అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను.Shortcut Links
మత్తయి - Matthew : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |