Thessalonians II - 2 థెస్సలొనీకయులకు 1 | View All

1. మన తండ్రియైన దేవునియందును ప్రభువైన యేసు క్రీస్తునందును ఉన్న థెస్సలొనీకయుల సంఘమునకు పౌలును, సిల్వానును, తిమోతియును శుభమని చెప్పి వ్రాయునది.

2. తండ్రియైన దేవునినుండియు ప్రభువైన యేసుక్రీస్తునుండియు కృపయు సమాధానమును మీకు కలుగును గాక.

3. సహోదరులారా, మేమెల్లప్పుడు మిమ్మునుగూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై యున్నాము. ఇది యుక్తమే; ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధిపొందుచున్నది. మీ అందరిలో ప్రతి వాడును ఎదుటివానియెడల చూపు ప్రేమ విస్తరించు చున్నది.

రోమీయులకు 1:8. “మీ నమ్మకం... అభివృద్ధి”, “ప్రేమభావం అధికమవుతూ”– 1 థెస్సలొనీకయులకు 3:10, 1 థెస్సలొనీకయులకు 3:12; 1 థెస్సలొనీకయులకు 4:10. వారి గురించి పౌలు ఆశించినది నెరవేరుతూ ఉంది. అతని ప్రార్థనలు ఫలించాయి.

4. అందువలన మీ హింసలన్నిటిలోను, మీరు సహించుచున్న శ్రమలలోను, మీ ఓర్పును విశ్వాసమును చూచి, మేము దేవుని సంఘములలో మీయందు అతిశయ పడుచున్నాము.

“హింసలలో బాధలలో”– 1 థెస్సలొనీకయులకు 1:6; 1 థెస్సలొనీకయులకు 2:14; 1 థెస్సలొనీకయులకు 3:3. “అతిశయంగా మాట్లాడుతూ”– 2 కోరింథీయులకు 7:14. ఇది గొప్పలు చెప్పుకోవడం కాదు – 1 థెస్సలొనీకయులకు 2:5. అక్కడి సంఘం పరిస్థితి పౌలుకు సంతోషం కలిగించింది. ఆ విషయం వారికి చెప్పడానికి అతనికి సంతోషంగా ఉంది.

5. దేనికొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని యెంచబడు నిమిత్తము, మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచనయైయున్నది.

“రుజువు”– మనం క్రీస్తులో నమ్మకం ఉంచడం కారణంగా మనకు వచ్చే హింసలనూ కష్టాలనూ ఓర్పుతో సహించడం మన నమ్మకం నిజమైనది అనేందుకు రుజువు. దేవుని తీర్పు న్యాయమైనది అనేందుకు కూడా ఇది రుజువే. ఇక్కడ దీనికి అర్థం స్పష్టంగా లేదు గాని దేవుడు వారిని ఎన్నుకున్నదీ వారి విషయంలో ఇంత వరకు జరిగించినదీ న్యాయమేనని వారు విశ్వాసంలో నిలకడగా ఉండడం వల్ల రుజువు అయింది. ఫిలిప్పీయులకు 1:27-28 పోల్చి చూడండి. “దేవుని రాజ్యానికి”– మత్తయి 4:17 నోట్. “తగినవారుగా”– లూకా 20:35; ప్రకటన గ్రంథం 3:4 పోల్చి చూడండి. ఎవరూ పాపవిముక్తికీ రక్షణకూ దేవుని రాజ్యంలో ప్రవేశించడానికీ అర్హులు కారు – రోమీయులకు 3:9, రోమీయులకు 3:19, రోమీయులకు 3:23; కొలొస్సయులకు 1:13-14. కానీ విశ్వాసులు తమ ప్రవర్తన ద్వారా, విశ్వాసంలో కొనసాగడం ద్వారా దేవుడు వారిని మార్చిన విషయాన్ని చూపిస్తారు, దేవుడు తన రాజ్యానికి తగినట్టు జీవించేలా వారికి సామర్థ్యం ఇచ్చిన విషయాన్నీ రుజువు చేస్తారు. “కడగండ్లు”– రోమీయులకు 8:17; మత్తయి 5:10. ఇది వారి అర్హతకు రుజువు. దేవుని రాజ్యం కోసం బాధలు అనుభవించేందుకు సిద్ధంగా ఉండనివారు ఆ రాజ్యానికి అర్హులు కారు.

6. ప్రభువైన యేసు తన ప్రభావమును కనుపరచు దూతలతోకూడ పరలోకమునుండి అగ్నిజ్వాలలలో ప్రత్యక్షమై,

“ప్రతిఫలమివ్వడం”– సంఖ్యాకాండము 31:1-3; ద్వితీయోపదేశకాండము 32:35, ద్వితీయోపదేశకాండము 32:41; రోమీయులకు 12:19; హెబ్రీయులకు 10:30. “న్యాయమే”– ఈ సత్యం బైబిలంతటా కనిపిస్తుంది (ద్వితీయోపదేశకాండము 32:4; కీర్తనల గ్రంథము 9:16; కీర్తనల గ్రంథము 11:7; కీర్తనల గ్రంథము 89:14; కీర్తనల గ్రంథము 111:7; సామెతలు 29:26; యెషయా 30:18; దానియేలు 4:37; రోమీయులకు 3:26; ప్రకటన గ్రంథం 15:3; ప్రకటన గ్రంథం 16:5-7). దేవుడు రెండు విధాలుగా తన న్యాయాన్ని చూపిస్తాడు. ఒకటి, పశ్చాత్తాపపడేందుకు నిరాకరించే దుర్మార్గులను శిక్షించడం ద్వారా; రెండు, తన రాజ్యం కోసం బాధలు అనుభవించినవారికి శాశ్వత విశ్రాంతి ఇవ్వడం ద్వారా (వ 7). రోమీయులకు 2:6-11 పోల్చి చూడండి.

7. దేవుని నెరుగనివారికిని, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయునప్పుడు
జెకర్యా 14:5

“దేవదూతలు”– మత్తయి 24:31; యూదా 1:14. “వెల్లడి అయ్యేటప్పుడు”– క్రీస్తు దుర్మార్గులను శిక్షించడానికి ప్రత్యక్షమయ్యేటప్పుడు ఆయన ప్రజలకు విశ్రాంతి కలుగు తుందని పౌలు చెప్పడం గమనించండి. మత్తయి 24:29-30; 1 కోరింథీయులకు 1:7; తీతుకు 2:13 పోల్చి చూడండి. “ఇలా జరుగుతుంది”– దేవుడు కొన్ని సార్లు ఇప్పుడే ఇక్కడే మనుషులకు ప్రతీకారం చేసి వారి బారినుంచి విశ్వాసులను విడిపించవచ్చు. కానీ చాలమట్టుకు ఇలాంటివి క్రీస్తు తిరిగి వచ్చే యుగాంత కాలంలో జరుగుతాయని చెప్పవచ్చు. అప్పుడు అన్నీ చక్కబడతాయి, లోపం లేని న్యాయం నెలకొంటుంది. మనుషులందరికీ ఇది కనిపిస్తుంది.

8. మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమపొందుచున్న మీకు మాతోకూడ విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే.
కీర్తనల గ్రంథము 79:6, యెషయా 66:15, యిర్మియా 10:25

“దేవుణ్ణి ఎరుగని”– ఒకే నిజ దేవుడు మనుషులకు తెలియదు. ఎందుకంటే ఆయన్ను తెలుసుకోవాలన్న కోరిక వారిలో లేదు. అలా తెలుసుకొనే అవకాశాలను వారు తిరస్కరిస్తారు కూడా. దేవునితో సహవాసం కన్న వారి పాపమే వారికి ముఖ్యం. యోహాను 3:19-20; రోమీయులకు 1:18-25; ఎఫెసీయులకు 4:17-19 పోల్చి చూడండి. “శుభవార్తకు లోబడని”– శుభవార్త విని తిరస్కరించిన వారి గురించి ఈ మాటలు రాసి ఉన్నట్టుంది. క్రీస్తుకు లోబడడం కన్న తమ స్వేచ్ఛ అనుకున్నదాన్నే వారు కోరుకుంటారు. క్రీస్తు శుభవార్త కేవలం నమ్మవలసింది మాత్రమే కాదు, లోబడవలసిందని గమనించండి. మత్తయి 7:21, మత్తయి 7:24; అపో. కార్యములు 5:32; రోమీయులకు 6:17; హెబ్రీయులకు 5:9; 1 పేతురు 1:22; 1 పేతురు 4:17 పోల్చి చూడండి. నిజానికి శుభవార్తను నిజంగా నమ్మడం ఒక వ్యక్తిలో దానిపట్ల విధేయతను కలిగిస్తుంది. నమ్మకాన్నీ విధేయతనూ విడదీయడం అసాధ్యం. యాకోబు 2:14-26 పోల్చి చూడండి. అపో. కార్యములు 22:10; హెబ్రీయులకు 11:4 నోట్స్ చూడండి. “అగ్నిజ్వాలలతో”– హెబ్రీయులకు 10:27; హెబ్రీయులకు 12:29; 2 పేతురు 3:7; ప్రకటన గ్రంథం 19:11-16; యెషయా 66:15; యెషయా 30:27; యెషయా 24:6. “దండన తెస్తాడు”– ఎవరినైనా సరే దండించడం దేవునికి ఇష్టం కాదు. యెహెఙ్కేలు 18:23, యెహెఙ్కేలు 18:30-32; యోవేలు 2:13; 2 పేతురు 3:9 చూడండి. కానీ మనుషులు పశ్చాత్తాపపడకుండా పాపంలోనే కొనసాగుతూ ఉంటే తన న్యాయం ప్రకారం దేవుడు వారిని శిక్షించవలసిందే, శిక్షిస్తాడు కూడా. నిర్గమకాండము 34:6-7; నహూము 1:3 పోల్చి చూడండి. దేవుడు దోషులను శిక్షించకుండా వదిలేస్తే ఆయన న్యాయవంతుడు అనిపించుకోడు. ప్రపంచమంతా నైతిక క్రమం తప్పి ప్రళయం, గందరగోళం సంభవిస్తుంది.

9. ఆ దినమున తన పరిశుద్ధులయందు మహిమపరచబడుటకును, విశ్వసించినవారందరి యందు ప్రశంసింపబడుటకును,ప్రభువు వచ్చినప్పుడు అట్టివారు
యెషయా 2:10-11, యెషయా 2:19, యెషయా 2:21

“మహిమ”– యెషయా 2:10, యెషయా 2:14, యెషయా 2:19, యెషయా 2:21. “వేరైపోయి”– ప్రకటన గ్రంథం 22:15-16. నాశనమైపోవడమంటే ఇదే. దీవెనలకూ ఆనందానికీ శాంతికీ ఏకైక మూలాధారం అయిన దేవునినుంచి మరి ఎన్నటికీ వేరైపోతారు. ఇది తమ జీవితాల్లో వారే కోరుకున్నది (వ 8), కాబట్టి వారికి లభించేది ఇదే. ఈ శిక్ష వారికి రావడం న్యాయమే. “శాశ్వత నాశనం”– 2 థెస్సలొనీకయులకు 2:3; మత్తయి 7:13; రోమీయులకు 9:22; గలతియులకు 6:8; ఫిలిప్పీయులకు 3:19; 1 థెస్సలొనీకయులకు 5:3; 1 తిమోతికి 6:9; 2 పేతురు 3:7, 2 పేతురు 3:12, 2 పేతురు 3:16; ప్రకటన గ్రంథం 17:8, ప్రకటన గ్రంథం 17:11. నాశనం అంటే అసలు ఉనికిలో లేకుండా నిర్మూలమైపోవడం కాదు గాని భయంకరమైన శాశ్వత వినాశన స్థితి. మత్తయి 25:46; లూకా 16:26 పోల్చి చూడండి.

10. ఆయన సముఖము నుండియు ఆయన ప్రభావమందలి మహిమనుండియు పారదోలబడి, నిత్యనాశనమను దండన పొందుదురు. ఏలయనగా మేము మీకిచ్చిన సాక్ష్యము మీరు నమ్మితిరి.
కీర్తనల గ్రంథము 68:35, కీర్తనల గ్రంథము 89:7, యెషయా 49:3

“పవిత్ర ప్రజ”– క్రీస్తులోని నిజ విశ్వాసులంతా (రోమీయులకు 1:1; 1 పేతురు 2:9). “మహిమ పొందడానికి”– యోహాను 17:10; ఎఫెసీయులకు 1:12, ఎఫెసీయులకు 1:14. “ఆశ్చర్య కారణంగా”– యేసు ఎంత ఆశ్చర్యకరుడో (యెషయా 9:6) ఒక రోజున సంపూర్ణంగా కనిపిస్తుంది. ఆయన్ను చూచినప్పుడు ఆశ్చర్యంతో నివ్వెరపోతాం. “వచ్చినప్పుడు”– 1 థెస్సలొనీకయులకు 5:2; యెషయా 2:12 పోల్చి చూడండి. “మీరు నమ్మారు గదా”– 1 థెస్సలొనీకయులకు 1:7-10. రాబోయే ఆ గొప్ప భాగ్యంలో చేరినవారు నిజంగా ధన్యులు. క్రీస్తును నమ్మినవారిలో మాత్రమే ఆయనకు మహిమ కలుగుతుంది. వారే ఆ మహిమలో పాలుపొందుతారు. మిగతావారంతా తమ అపనమ్మకం వల్ల, చెడు ప్రవర్తనల వల్ల ఆయనకు అగౌరవం కలిగిస్తూ ఉంటారు.

11. అందువలన మన దేవునియొక్కయు ప్రభువైన యేసు క్రీస్తుయొక్కయు కృపచొప్పున మీయందు మన ప్రభువైన యేసు నామమును, ఆయనయందు మీరును మహిమనొందునట్లు,

“ఎప్పుడూ ప్రార్థన చేస్తున్నాం”– రోమీయులకు 1:8-9; ఎఫెసీయులకు 1:16; ఎఫెసీయులకు 3:16; ఫిలిప్పీయులకు 1:4, ఫిలిప్పీయులకు 1:9; కొలొస్సయులకు 1:3, కొలొస్సయులకు 1:9, కొలొస్సయులకు 1:21; 1 థెస్సలొనీకయులకు 1:2; 1 థెస్సలొనీకయులకు 3:10. “పిలుపుకు”– ఎఫెసీయులకు 4:1; రోమీయులకు 1:7; రోమీయులకు 8:30. “తగినవారుగా”– వ 5; ఎఫెసీయులకు 4:1; ఫిలిప్పీయులకు 1:27; కొలొస్సయులకు 1:10; 1 థెస్సలొనీకయులకు 2:12. “బలంతో పూర్తి చేయాలని”– కీర్తనల గ్రంథము 90:17; యెషయా 26:12. ఆయన మనలో పని చేస్తున్నందువల్లనే మనలో మంచి ఉద్దేశాలూ విశ్వాస కార్యాలూ కనిపిస్తున్నాయి – ఫిలిప్పీయులకు 2:13; ఎఫెసీయులకు 2:10. ఆ ఉద్దేశాలను నెరవేర్చగలిగేదీ, ఆ కార్యాలను స్థిరపరచగలిగేదీ దేవుడు మాత్రమే.

12. మేలు చేయవలెనని మీలో కలుగు ప్రతి యాలోచనను, విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయుచు, మనదేవుడు తన పిలుపునకు మిమ్మును యోగ్యులుగా ఎంచునట్లు మీకొరకు ఎల్లప్పుడును ప్రార్థించుచున్నాము.
యెషయా 24:15, యెషయా 66:5, మలాకీ 1:11

“కృప”– విశ్వాసుల పాపవిముక్తికీ రక్షణకూ వారి దీవెనకూ సంబంధించినదంతా కేవలం దేవుని కృప మాత్రమే (రోమీయులకు 6:23; ఎఫెసీయులకు 2:8-9). “పేరుకు”– లోకం ఎదుట క్రైస్తవులు క్రీస్తు పేరును ఎత్తి పట్టుకుంటున్నవారు (1 పేతురు 4:16). “మీలో”– యేసు వచ్చినప్పుడు విశ్వాసులలో ఆయనకు మహిమ కలుగుతుంది (వ 10). ఇప్పుడు కూడా ఇలా జరుగుతూ ఉండాలి – 1 కోరింథీయులకు 6:20; 1 కోరింథీయులకు 10:31; కొలొస్సయులకు 3:17; 1 పేతురు 4:11. “మీకు ఆయనలో”– ఎవరిలోనైతే యేసుప్రభువు మహిమ కలుగుతుందో వారికి ఆయన తనలో మహిమ కలిగిస్తాడు. యోహాను 17:10, యోహాను 17:22; రోమీయులకు 8:30 పోల్చి చూడండి.Shortcut Links
2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians : 1 | 2 | 3 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |