John II - 2 యోహాను 1 | View All

1. పెద్దనైన నేను, ఏర్పరచబడినదైన అమ్మగారికిని ఆమె పిల్లలకును శుభమని చెప్పి వ్రాయునది.

“ఎన్నికైనా”– మత్తయి 24:22, మత్తయి 24:24, మత్తయి 24:31; రోమీయులకు 8:33; ఎఫెసీయులకు 1:4; కొలొస్సయులకు 3:12; 1 పేతురు 1:1; 1 పేతురు 2:9; మొ।।. “అమ్మగారికి”– ఈ గ్రీకు పదం “కిరియ”. ఆ రోజుల్లో స్త్రీలకు ఉండే పేరు ఇది. యోహాను అందరికీ బాగా తెలిసిన ఒక విశ్వాసికి, ఆమె పిల్లలకు ఈ లేఖ రాస్తున్నాడు. “పెద్దనైన”– యోహాను క్రీస్తురాయబారి అయినప్పటికీ తన గురించి అలా రాసుకోవడం లేదు. ఇతరులు రాయబారులను పెద్దలని పిలిచేవారు. రాయబారులు కూడా తమ గురించి మాట్లాడేటప్పుడు కొన్ని సార్లు ఈ మాట వాడేవారు (1 పేతురు 5:1). ఈ మాటలో వయసు పైబడినవారనీ, క్రైస్తవ సంఘంలో నాయకులనీ కూడా అర్థం ఉంది. “మనలో ఉంటూ”– క్రీస్తు విశ్వాసులు తమ మనసులో సత్యాన్ని ఒప్పుకోవడం కన్నా ఎక్కువే చేస్తారు. ఆ సత్యాన్ని తమ హృదయాల్లోకి ఆహ్వానిస్తారు. అది వారి ప్రవర్తనంతటిమీదా ప్రభావం చూపుతూ అక్కడ నిలిచి ఉంటుంది. కీర్తనల గ్రంథము 51:6 పోల్చి చూడండి. “మనలో శాశ్వతంగా ఉండబోయే సత్యాన్ని”– హృదయంలో ఒక సారంటూ స్థిరంగా నాటుకున్న సత్యం అనంత యుగాలు ఉండిపోతుందని యోహానుకు నమ్మకం ఉంది.

2. నేనును, నేను మాత్రమే గాక సత్యము ఎరిగినవారందరును, మనలో నిలుచుచు మనతో ఎల్లప్పుడు ఉండు సత్యమునుబట్టి మిమ్మును నిజముగా ప్రేమించుచున్నాము.

“నిజమైన ప్రేమ”– అతని ప్రేమ మానవ అనుభూతి కాదు, లేక పరస్పరం ఉండే అప్యాయత కాదు. అది దైవిక ప్రేమ (“ఆగాపే”– 1 కోరింథీయులకు 13:1 నోట్ చూడండి). ఈ ప్రేమ ఎప్పుడూ సత్యం మీదే నిలిచి ఉంటుంది. ఇక్కడ సత్యం అంటే క్రీస్తు సందేశమే (యోహాను 1:27). దేవుడు తెలియజేసిన సత్యమంటే విశ్వాసులకు ప్రీతి ఉంటుంది కాబట్టి వారి మధ్య ప్రేమ ఉంటుంది.

3. సత్యప్రేమలు మనయందుండగా తండ్రియైన దేవుని యొద్దనుండియు, తండ్రియొక్క కుమారుడగు యేసుక్రీస్తునొద్దనుండియు కృపయు కనికరమును సమాధానమును మనకు తోడగును.

1 తిమోతికి 1:2. “తండ్రి కుమారుడైన”– తండ్రినీ, క్రీస్తునూ యోహాను ఏ విధంగా విడివిడిగా చెప్తున్నాడో చూడండి. క్రీస్తు తండ్రి కాడు. తండ్రి క్రీస్తు కాడు. శాశ్వతంగా ఒకే దేవత్వంలో వేరు వేరు వ్యక్తులుగా వారు ఉన్నారు. తండ్రి, కుమారుడు, పవిత్రాత్మల గురించి మత్తయి 3:16-17; మత్తయి 5:16; మత్తయి 28:19; యోహాను 3:16; యోహాను 17:1; మొదలైన నోట్స్ చూడండి. “మీకు తోడుగా ఉంటాయి”– యోహాను కేవలం ఏదో భక్తిపూర్వకమైన అభివందనాలు చెప్పడం లేదు. దేవుని కృప, కరుణ, శాంతి ఆయన నిజ విశ్వాసులతో ఉంటాయనడంలో అతనికి ఏ సందేహమూ లేదు (కీర్తనల గ్రంథము 23:6 పోల్చి చూడండి). కృప అనేది దేవుని హృదయంలో నుంచి పెల్లుబికే ఊట. బయటికి ప్రవహించే కృపే కరుణ. దానికి ఫలితం శాంతి.

4. తండ్రివలన మనము ఆజ్ఞను పొందినప్రకారము నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి1 నడుచుచుండుట కనుగొని బహుగా సంతోషించుచున్నాను.

“ఆనందం”– ఒక వ్యక్తికి ఆనందం కలిగించేదేమిటో తెలిస్తే ఆ వ్యక్తి గుణగణాల గురించి చాలా మట్టుకు తెలుసుకోవచ్చు.

5. కాగా అమ్మా, క్రొత్త ఆజ్ఞ నీకు వ్రాసినట్టు కాదు గాని మొదటనుండి మనకు కలిగిన ఆజ్ఞనే వ్రాయుచు, మనము ఒకరి నొకరము ప్రేమింపవలెనని నిన్ను వేడుకొనుచున్నాను.

యోహాను 13:34. “తండ్రివల్ల...ఆజ్ఞ”– ద్వితీయోపదేశకాండము 5:33; ద్వితీయోపదేశకాండము 10:12; 1 రాజులు 2:3; యెషయా 30:21; యిర్మియా 6:16. పశ్చాత్తాపపడాలన్న దేవుని ఆజ్ఞ (అపో. కార్యములు 17:30) దుర్మార్గత, అబద్ధాలు, మోసం అన్నింటినీ విడిచిపెట్టి సత్యంలో నడుచుకోవాలన్న ఆజ్ఞే.

6. మనమాయన ఆజ్ఞలప్రకారము నడుచుటయే ప్రేమ; మీరు మొదటనుండి వినిన ప్రకారము ప్రేమలో నడుచుకొనవలెను అనునదియే ఆ ఆజ్ఞ.

యోహాను 14:15, యోహాను 14:21, యోహాను 14:23. దేవుడు చెప్పినది చేయకుండా ఆయన్ను ప్రేమిస్తున్నామని చెప్పుకోవడం మోసకరం, వ్యర్థం.

7. యేసుక్రీస్తు శరీరధారియై వచ్చెనని యొప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి యున్నారు.

“శరీరంతో వచ్చాడని”– యోహాను 1:14. క్రీస్తు నిజమైన మానవ స్వభావం గల మనిషి అయ్యాడు (హెబ్రీయులకు 2:14, హెబ్రీయులకు 2:17). నిజానికి ఆయనిప్పుడు సజీవంగా లేచి, మహిమలో ఉన్నప్పటికీ ఆయనకింకా ఆ స్వభావం ఉంది. దానితోబాటే ఆయన తిరిగి వస్తాడు. “వంచకులు”– మత్తయి 24:4, మత్తయి 24:24; రోమీయులకు 16:18; 2 కోరింథీయులకు 11:13-15. వంచకుల నాయకుడి దగ్గర్నుంచి వారు వస్తారు (ప్రకటన గ్రంథం 12:9). “క్రీస్తువిరోధి”– 1 యోహాను 2:18, 1 యోహాను 2:22; 1 యోహాను 4:3 – అంటే క్రీస్తుకు వ్యతిరేకంగా లేచి ఆయన స్థానం ఆక్రమించాలని చూచేవాడు.

8. అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధియునై యున్నాడు. మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలము పొందునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి.

కపట బోధకుల మాటలు వింటూ, వారి ప్రభావంలో పడిపోయే నిజ విశ్వాసులు తమ రక్షణను కోల్పోరు గానీ మిగతా అంతటినీ పోగొట్టుకోవచ్చు. ప్రకటన గ్రంథం 3:11; 2 తిమోతికి 2:5; 1 కోరింథీయులకు 3:12-15; 1 కోరింథీయులకు 9:27 పోల్చి చూడండి. “పూర్ణ బహుమతి”– ప్రకటన గ్రంథం 22:12.

9. క్రీస్తుబోధ యందు నిలిచియుండక దానిని విడిచి ముందునకుసాగు ప్రతివాడును దేవుని అంగీకరింపనివాడు; ఆ బోధయందు నిలిచియుండువాడు తండ్రిని కుమారుని అంగీకరించు వాడు.

“అతిక్రమించి”– కొంతమంది తాము చాలా ముందుకు ఆలోచించగలవారమనీ, క్రీస్తు సత్యాన్ని విడిచిపెట్టి ముందుకు దాటి పోగలమనీ అనుకుంటారు. తమకు దేవుడు లేడని అలాంటివారు బయట పెట్టుకుంటూ ఉంటారు అంతే. 1 యోహాను 2:19 పోల్చి చూడండి.“నిలిచి ఉండే”– యోహాను 8:32; 2 తిమోతికి 3:14. సత్యంలో నిలిచి ఉండేవారు దేవుడు తమలో ఉన్నాడని కనపరుస్తూ ఉంటారు.

10. ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చినయెడల వానిని మీ యింట చేర్చుకొనవద్దు; శుభమని వానితో చెప్పను వద్దు.

“ఎవరైనా...వస్తే”– క్రీస్తు బోధించినదానికి విరుద్ధంగా బోధించేవారి విషయం మాట్లాడుతున్నాడు యోహాను. అబద్ధ బోధకులను మన ఇళ్ళల్లోకి రానియ్యకూడదు. ఎక్కడా వారితో సహవాసం చెయ్యకూడదు. వారికి వందనాలు కూడా చెప్పకూడదు (2 కోరింథీయులకు 6:15; రోమీయులకు 16:17). అలా చేస్తే మనకు మనం ప్రమాదం కొనితెచ్చుకున్నవారం అవుతాం. అంతేగాక వారి ఉపదేశాలు మంచివేనేమో అన్న అభిప్రాయాన్ని ఇతరుల్లో కలిగిస్తాం.

11. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియలలో పాలివాడగును.

“చెడ్డ పనుల్లో”– క్రీస్తు ఉపదేశానికి వ్యతిరేకమైన ఉపదేశాన్ని నేర్పడం చెడ్డ పనే. అసలు మనుషులకు సాధ్యమైన అతి దుర్మార్గమైన పనుల్లో ఇదొకటి. విశ్వాసులకు అందులో ఎలాంటి భాగం ఉండకూడదు, ఉన్నట్టు కనిపించకూడదు, దానికి ఏ విధంగానూ సహాయపడకూడదు.

12. అనేక సంగతులు మీకు వ్రాయవలసియుండియు సిరాతోను కాగితముతోను వ్రాయ మనస్సులేక మీ సంతోషము పరిపూర్ణమవునట్లు మిమ్మును కలిసికొని ముఖా ముఖిగా మాటలాడ నిరీక్షించుచున్నాను
సంఖ్యాకాండము 12:8

“ఆనందం”– సత్యంలో, నిజమైన క్రైస్తవ సహవాసంలో ఉండే ఆనందం.

13. ఏర్పరచబడిన నీ సహోదరి పిల్లలు నీకు వందనములు చెప్పుచున్నారు.

ఈ అమ్మగారి సోదరి కూడా విశ్వాసి అని కనిపిస్తున్నది. ఆమె, ఆమె పిల్లలు ఆ సమయంలో యోహాను ఉన్న ఊళ్ళోనే ఉన్నట్టున్నారు.Shortcut Links
2 యోహాను - 2 John : 1 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |