Judges - న్యాయాధిపతులు 3 | View All

1. ఇశ్రాయేలీయులకును కనానీయులకును జరిగినయుద్ధము లన్నిటిని చూడనివారందరిని శోధించి

1. ishraayēleeyulakunu kanaaneeyulakunu jariginayuddhamu lanniṭini chooḍanivaarandarini shōdhin̄chi

2. ఇశ్రాయేలీయుల తరతరములవారికి, అనగా పూర్వము ఆ యుద్ధములను ఏ మాత్రమును చూడనివారికి యుద్ధముచేయ నేర్పునట్లు యెహోవా ఉండనిచ్చిన జనములు ఇవి.

2. ishraayēleeyula tharatharamulavaariki, anagaa poorvamu aa yuddhamulanu ē maatramunu chooḍanivaariki yuddhamucheya nērpunaṭlu yehōvaa uṇḍanichina janamulu ivi.

3. ఫిలిష్తీయుల అయిదుగురు సర్దారుల జనులును, కనానీయులందరును, సీదోనీయులును, బయల్హెర్మోను మొదలుకొని హమాతునకు పోవు మార్గమువరకు లెబానోను కొండలో నివసించు హివ్వీయులును,

3. philishtheeyula ayiduguru sardaarula janulunu, kanaaneeyulandarunu, seedōneeyulunu, bayal'hermōnu modalukoni hamaathunaku pōvu maargamuvaraku lebaanōnu koṇḍalō nivasin̄chu hivveeyulunu,

4. యెహోవా మోషేద్వారా తమ తండ్రుల కిచ్చిన ఆజ్ఞలను వారు అనుసరింతురో లేదో తెలిసికొను నట్లు ఇశ్రాయేలీయులను పరిశోధించుటకై ఆ జనములను ఉండనిచ్చెను.

4. yehōvaa mōshēdvaaraa thama thaṇḍrula kichina aagnalanu vaaru anusarinthurō lēdō telisikonu naṭlu ishraayēleeyulanu parishōdhin̄chuṭakai aa janamulanu uṇḍanicchenu.

5. కాబట్టి ఇశ్రాయేలీయులు, కనానీయులు హిత్తీయులు అమోరీయులు

5. kaabaṭṭi ishraayēleeyulu, kanaaneeyulu hittheeyulu amōreeyulu

6. పెరిజ్జీ యులు హివ్వీయులు ఎబూసీయులను జనులమధ్య నివసించుచు వారి కుమార్తె లను పెండ్లిచేసికొనుచు, వారి కుమారులకు తమ కుమార్తెల నిచ్చుచు, వారి దేవతలను పూజించుచు వచ్చిరి

6. perijjee yulu hivveeyulu ebooseeyulanu janulamadhya nivasin̄chuchu vaari kumaarthe lanu peṇḍlichesikonuchu, vaari kumaarulaku thama kumaarthela nichuchu, vaari dhevathalanu poojin̄chuchu vachiri

7. అట్లు ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిని దోషులై, తమ దేవుడైన యెహోవాను మరచి బయలుదేవతలను దేవతా స్తంభములను పూజించిరి.

7. aṭlu ishraayēleeyulu yehōvaa sannidhini dōshulai, thama dhevuḍaina yehōvaanu marachi bayaludhevathalanu dhevathaa sthambhamulanu poojin̄chiri.

8. అందునుగూర్చి యెహోవా కోపము ఇశ్రాయేలీయులమీద మండగా ఆయన అరా మ్నహరాయిముయొక్క రాజైన కూషన్రిషాతాయిము చేతులకు దాసులగుటకై వారిని అమ్మివేసెను. ఇశ్రాయేలీ యులు ఎనిమిది సంవత్సరములు కూషన్రిషాతాయిమునకు దాసులుగానుండిరి

8. andunugoorchi yehōvaa kōpamu ishraayēleeyulameeda maṇḍagaa aayana araa mnaharaayimuyokka raajaina kooshanrishaathaayimu chethulaku daasulaguṭakai vaarini ammivēsenu. Ishraayēlee yulu enimidi samvatsaramulu kooshanrishaathaayimunaku daasulugaanuṇḍiri

9. ఇశ్రాయేలీయులు యెహోవాకు మొఱ్ఱపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడగు ఒత్నీయేలును రక్షకునిగా ఇశ్రా యేలీయులకొరకు నియమించి వారిని రక్షించెను.

9. ishraayēleeyulu yehōvaaku morrapeṭṭagaa yehōvaa kaalēbu thammuḍaina kanaju yokka kumaaruḍagu otneeyēlunu rakshakunigaa ishraayēleeyulakoraku niyamin̄chi vaarini rakshin̄chenu.

10. యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చెను గనుక అతడు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతియై యుద్ధమునకు బయలుదేరగా యెహోవా అరామ్నహరాయిము రాజైన కూషన్రిషాతాయిమును అతని చేతికప్పగించెను, ఆతడు కూషన్రిషాతాయిమును జయించెను.

10. yehōvaa aatma athani meediki vacchenu ganuka athaḍu ishraayēleeyulaku nyaayaadhipathiyai yuddhamunaku bayaludheragaa yehōvaa araamnaharaayimu raajaina kooshanrishaathaayimunu athani chethikappagin̄chenu, aathaḍu kooshanrishaathaayimunu jayin̄chenu.

11. అప్పుడు నలువది సంవత్సరములు దేశము నెమ్మదిపొందెను. అటుతరువాత కనజు కుమారుడైన ఒత్నీయేలు మృతినొందెను.

11. appuḍu naluvadhi samvatsaramulu dheshamu nemmadhipondhenu. Aṭutharuvaatha kanaju kumaaruḍaina otneeyēlu mruthinondhenu.

12. ఇశ్రాయేలీయులు మరల యెహోవా దృష్టికి దోషు లైరి గనుక వారు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా ఇశ్రాయేలీయులతో యుద్ధముచేయుటకు మోయాబు రాజైన ఎగ్లోనును బలపరచెను.

12. ishraayēleeyulu marala yehōvaa drushṭiki dōshu lairi ganuka vaaru yehōvaa drushṭiki dōshulainanduna yehōvaa ishraayēleeyulathoo yuddhamucheyuṭaku mōyaabu raajaina eglōnunu balaparachenu.

13. అతడు అమ్మోనీయులను అమాలేకీయులను సమకూర్చుకొనిపోయి ఇశ్రాయేలీయులను ఓడగొట్టి ఖర్జూరచెట్ల పట్టణమును స్వాధీనపరచుకొనెను.

13. athaḍu ammōneeyulanu amaalēkeeyulanu samakoorchukonipōyi ishraayēleeyulanu ōḍagoṭṭi kharjooracheṭla paṭṭaṇamunu svaadheenaparachukonenu.

14. ఇశ్రాయేలీయులు పదునెనిమిది సంవత్సరములు మోయాబు రాజునకు దాసులైరి.

14. ishraayēleeyulu padunenimidi samvatsaramulu mōyaabu raajunaku daasulairi.

15. ఇశ్రా యేలీయులు యెహోవాకు మొఱ్ఱ పెట్టగా బెన్యామీ నీయుడైన గెరా కుమారుడగు ఏహూదను రక్షకుని వారి కొరకు యెహోవా నియమించెను. అతడు ఎడమచేతి పని వాడు. అతనిచేతను ఇశ్రాయేలీయులు మోయాబు రాజైన ఎగ్లోనుకు కప్పము పంపగా

15. ishraayēleeyulu yehōvaaku morra peṭṭagaa benyaamee neeyuḍaina geraa kumaaruḍagu ēhoodanu rakshakuni vaari koraku yehōvaa niyamin̄chenu. Athaḍu eḍamachethi pani vaaḍu. Athanichethanu ishraayēleeyulu mōyaabu raajaina eglōnuku kappamu pampagaa

16. ఏహూదు మూరెడు పొడవుగల రెండంచుల కత్తిని చేయించుకొని, తన వస్త్ర ములో తన కుడి తొడమీద

16. ēhoodu mooreḍu poḍavugala reṇḍan̄chula katthini cheyin̄chukoni, thana vastra mulō thana kuḍi thoḍameeda

17. దానిని కట్టుకొని, ఆ కప్పము మోయాబురాజైన ఎగ్లో నుకు తెచ్చెను. ఆ ఎగ్లోను బహు స్థూలకాయుడు.

17. daanini kaṭṭukoni, aa kappamu mōyaaburaajaina eglō nuku tecchenu. aa eglōnu bahu sthoolakaayuḍu.

18. ఏహూదు ఆ కప్పము తెచ్చి యిచ్చిన తరువాత కప్పము మోసిన జనులను వెళ్లనంపి

18. ēhoodu aa kappamu techi yichina tharuvaatha kappamu mōsina janulanu veḷlanampi

19. గిల్గాలు దగ్గర నున్న పెసీలీమునొద్దనుండి తిరిగి వచ్చిరాజా, రహస్యమైన మాట ఒకటి నేను నీతో చెప్పవలె ననగా అతడుతనయొద్ద నిలిచినవారందరు వెలుపలికి పోవు వరకు ఊరకొమ్మని చెప్పెను.

19. gilgaalu daggara nunna peseeleemunoddhanuṇḍi thirigi vachiraajaa, rahasyamaina maaṭa okaṭi nēnu neethoo cheppavale nanagaa athaḍuthanayoddha nilichinavaarandaru velupaliki pōvu varaku oorakommani cheppenu.

20. ఏహూదు అతని దగ్గ రకు వచ్చినప్పుడు అతడు ఒక్కడే చల్లని మేడ గదిలో కూర్చుండియుండెను. ఏహూదునీతో నేను చెప్ప వలసిన దేవునిమాట ఒకటి యున్నదని చెప్పగా అతడు తన పీఠముమీదనుండి లేచెను.

20. ēhoodu athani dagga raku vachinappuḍu athaḍu okkaḍē challani mēḍa gadhilō koorchuṇḍiyuṇḍenu. Ēhooduneethoo nēnu cheppa valasina dhevunimaaṭa okaṭi yunnadani cheppagaa athaḍu thana peeṭhamumeedanuṇḍi lēchenu.

21. అప్పుడు ఏహూదు తన యెడమచేతిని చాపి తన కుడి తొడమీదనుండి ఆ కత్తి తీసి కడుపుమీద అతని పొడిచెను.

21. appuḍu ēhoodu thana yeḍamachethini chaapi thana kuḍi thoḍameedanuṇḍi aa katthi theesi kaḍupumeeda athani poḍichenu.

22. పడియును కత్తివెంబడి దూరగా క్రొవ్వుకత్తిపైని కప్పుకొనినందున అతని కడుపు నుండి కత్తిని తీయలేకపోయెను, అది వెనుకనుండి బయటికి వచ్చి యుండెను.

22. paḍiyunu katthivembaḍi dooragaa krovvukatthipaini kappukoninanduna athani kaḍupu nuṇḍi katthini theeyalēkapōyenu, adhi venukanuṇḍi bayaṭiki vachi yuṇḍenu.

23. అప్పుడు ఏహూదు పంచపాళిలోనికి బయలువెళ్లి తన వెనుకను ఆ మేడగది తలుపువేసి గడియ పెట్టెను.

23. appuḍu ēhoodu pan̄chapaaḷilōniki bayaluveḷli thana venukanu aa mēḍagadhi thalupuvēsi gaḍiya peṭṭenu.

24. అతడు బయలువెళ్లిన తరువాత ఆ రాజు దాసులు లోపలికివచ్చి చూడగా ఆ మేడగది తలుపులు గడియలు వేసియుండెను గనుక వారు అతడు చల్లని గదిలో శంకానివర్తికి పోయియున్నాడనుకొని

24. athaḍu bayaluveḷlina tharuvaatha aa raaju daasulu lōpalikivachi chooḍagaa aa mēḍagadhi thalupulu gaḍiyalu vēsiyuṇḍenu ganuka vaaru athaḍu challani gadhilō shaṅkaanivarthiki pōyiyunnaaḍanukoni

25. తాము సిగ్గువింతలు పడువరకు కనిపెట్టినను అతడు ఆ గది తలుపు లను తీయకపోగా వారు తాళపు చెవిని తెచ్చి తలుపులు తీసి చూచినప్పుడు వారి యజమానుడు చనిపోయి నేలను పడియుండెను.

25. thaamu sigguvinthalu paḍuvaraku kanipeṭṭinanu athaḍu aa gadhi thalupu lanu theeyakapōgaa vaaru thaaḷapu chevini techi thalupulu theesi chuchinappuḍu vaari yajamaanuḍu chanipōyi nēlanu paḍiyuṇḍenu.

26. వారు తడవు చేయు చుండగా ఏహూదు తప్పించుకొని పెసీలీమును దాటి శెయీరాకు పారి పోయెను.

26. vaaru thaḍavu cheyu chuṇḍagaa ēhoodu thappin̄chukoni peseeleemunu daaṭi sheyeeraaku paari pōyenu.

27. అతడు వచ్చి ఎఫ్రాయిమీయుల కొండలో బూరను ఊదగా ఇశ్రాయేలీయులు మన్యప్రదేశమునుండి దిగి అతని యొద్దకు వచ్చిరి.

27. athaḍu vachi ephraayimeeyula koṇḍalō booranu oodagaa ishraayēleeyulu manyapradheshamunuṇḍi digi athani yoddhaku vachiri.

28. అతడు వారికి ముందుగా సాగి వారితోనా వెంబడి త్వరగా రండి; మీ శత్రువు లైన మోయాబీయులను యెహోవా మీ చేతి కప్పగించు చున్నాడనెను. కాబట్టి వారు అతని వెంబడిని దిగివచ్చి మోయాబు నెదుటి యొర్దాను రేవులను పట్టుకొని యెవనిని దాటనియ్యలేదు.

28. athaḍu vaariki mundhugaa saagi vaarithoonaa vembaḍi tvaragaa raṇḍi; mee shatruvu laina mōyaabeeyulanu yehōvaa mee chethi kappagin̄chu chunnaaḍanenu. Kaabaṭṭi vaaru athani vembaḍini digivachi mōyaabu neduṭi yordaanu rēvulanu paṭṭukoni yevanini daaṭaniyyalēdu.

29. ఆ కాలమున వారు మోయాబీయు లలో బలముగల శూరులైన పరాక్రమ శాలులను పదివేల మందిని చంపిరి; ఒకడును తప్పించుకొనలేదు. ఆ దిన మున మోయాబీయులు ఇశ్రాయేలీయుల చేతిక్రింద అణపబడగా దేశము ఎనుబది సంవత్సరములు నిమ్మళముగా ఉండెను.

29. aa kaalamuna vaaru mōyaabeeyu lalō balamugala shoorulaina paraakrama shaalulanu padhivēla mandhini champiri; okaḍunu thappin̄chukonalēdu. aa dina muna mōyaabeeyulu ishraayēleeyula chethikrinda aṇapabaḍagaa dheshamu enubadhi samvatsaramulu nimmaḷamugaa uṇḍenu.

30. అతనితరువాత అనాతు కుమారుడైన షవ్గురు న్యాయాధి పతిగా ఉండెను. అతడు ఫిలిష్తీయులలో ఆరువందల మందిని మునుకోల కఱ్ఱతో హతముచేసెను;

30. athanitharuvaatha anaathu kumaaruḍaina shavguru nyaayaadhi pathigaa uṇḍenu. Athaḍu philishtheeyulalō aaruvandala mandhini munukōla karrathoo hathamuchesenu;

31. అతడును ఇశ్రాయేలీయులను రక్షించెను.

31. athaḍunu ishraayēleeyulanu rakshin̄chenu.


Shortcut Links
న్యాయాధిపతులు - Judges : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |

Support & Donate Us | Google Play Store | సజీవ వాహిని - Sajeeva Vahini 2009-2023. info@sajeevavahini.com
Sajeeva Vahini, Hyderabad & Chennai, India. SajeevaVahini.org Email: , . Whatsapp: 8898 318 318 or call us: +918898318318
Content on this website is prepared manually by Sajeeva Vahini, India. Our Content is free and open to use for any kind of distrubution. We request to carry a physical bible to churches rather than using bible on mobile or tablets. Please email any information for any suspected content/audio subject to piracy/copyright act on this website can be considered/removed. Which can help us to improve better. Note: we dont have any data/content related to Life Way Study Bible as a part of Sajeeva Vahini Notes or Verse Explanations.