Job - యోబు 2 | View All

1. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన మరియొక దినము తటస్థింపగా, వారితోకూడ అపవాది యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చెను.

2. యెహోవానీవు ఎక్కడనుండి వచ్చితివని వాని నడుగగా అపవాది భూమిలో ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచ రించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరమిచ్చెను.

3. అందుకు యెహోవానీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులు కలిగి చెడు తనము విసర్జించిన వాడు, భూమిమీద అతనివంటి వాడెవడును లేడు. నిష్కారణముగా అతనిని పాడుచేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను తన యథార్థతను వదలక నిలకడగా నున్నాడనగా
1 థెస్సలొనీకయులకు 5:22

యోబుకు వచ్చిన ఆపదలు అతని గుణాన్ని ఎంత మాత్రం మార్చలేకపోయాయి. ఆపదలు రాకముందు యోబు ఎంత నిర్దోషంగా నిజాయితీగా, దైవభక్తి గలిగి ఉన్నాడో ఇప్పుడూ అలానే ఉన్నాడని దేవుడతణ్ణి గురించి అంటున్నాడు (యోబు 1:1 యోబు 1:8).

4. అపవాదిచర్మము కాపాడు కొనుటకై చర్మమును, తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును గదా.

సైతాను ఇక్కడ అనేదేమంటే – యోబుకు వాటిల్లిన నష్టాల మూలంగా అతను దేవుణ్ణి దూషించలేదు నిజమే గాని ఇది యోబుకు దేవునిపై ఉన్న నిజమైన భక్తి వల్ల కాదు. తాను గనుక దేవుణ్ణి దూషిస్తే ఆయన తన ప్రాణం తీసేసుకుంటాడేమోనన్న భయంవల్లే. ప్రతివాడికీ తన దేహం గురించీ, ఆరోగ్యం గురించీ చాలా శ్రద్ధ ఉంటుంది. మనుషులు దాన్ని కాపాడుకునేందుకు లేనిపోని భక్తిశ్రద్ధలు నటించడంతో సహా ఏదైనా చేస్తారు అంటున్నాడు సైతాను. అయితే ఒక వ్యక్తి ఆరోగ్యం క్షీణించినప్పుడు అందుకు బాధ్యుడు దేవుడే అని అతనికి అనిపిస్తే అతడు దేవుని మీద తిరగబడతాడు. అతని భక్తికి మూలం స్వార్థం, పాపమేనని అప్పుడు తెలిసివస్తుంది. ఇదంతా సైతాను మానవ స్వభావం గురించి వేసిన అంచనా. భ్రష్ట స్థితిలో మనిషి ఉన్నప్పుడు ఈ అంచనా సరైనదే. అయితే యోబు విషయంలో ఇది సరి కాదు. (13-15 వచనాలు). దేవుడు మనుషులకు పాపవిముక్తి ప్రసాదించి వారి హృదయాల్లో మార్పు జరిగించేటప్పుడు ఆయనకోసం మనుషులు తమ ప్రాణాలనైనా ఇచ్చేసేలా వారిని తయారు చేస్తాడు (యోహాను 11:16; అపో. కార్యములు 20:24; అపో. కార్యములు 21:13; హెబ్రీయులకు 11:36-38; ప్రకటన గ్రంథం 12:11; లూకా 14:26; మత్తయి 10:38-39). తమకెలాంటి విపత్తు వాటిల్లినా మరణం వరకు కూడా అన్ని బాధలనూ సహించి దేవుణ్ణి ప్రేమించే తన పిల్లల వల్ల ఆయనకు గొప్ప మహిమ కలుగుతుంది.

5. ఇంకొక సారి నీవు చేయి చాపి అతని యెముకను అతని దేహమును మొత్తినయెడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచి పోవును అనెను.

6. అందుకు యెహోవా అతడు నీ వశమున నున్నాడు; అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చెను.
2 కోరింథీయులకు 12:7

దేవుని అనుమతి లేనిదే సైతాను మనుషులను ఏమీ చెయ్యలేడు (యోబు 1:12). అయితే దేవుడు సైతానుకు అనుమతి ఎందుకిస్తాడు? ఎందుకంటే అనుమతి ఇవ్వకపోవడం కంటే ఇవ్వడమే మేలని ఆయనకు తెలుసు. ఈ భూమిమీద ఉన్నప్పుడు ఈ విషయం మనకు పూర్తిగా అర్థం కాదు (యెషయా 55:8-9; రోమీయులకు 11:33-34).

7. కాబట్టి అపవాది యెహోవా సన్నిధినుండి బయలువెళ్లి, అరికాలు మొదలుకొని నడినెత్తివరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను.

సైతానుకు అదను చిక్కితే మనుషులను బాధించడానికి తనకు చేతనైనదంతా చేస్తాడు. ఒంటిమీద ఒక్క కురుపే ఎంతో బాధకరంగా ఉంటుంది. అలాంటప్పుడు మంట, దురద, యాతన పెట్టే పుండ్లు శరీరమంతటా లేవడం ఎంత దుర్భరమో భయంకరమో ఊహించుకోండి. ఈ రోగంవల్ల యోబు అనుభవించిన యాతన ఈ గ్రంథంలోని అనేక వచనాల ద్వారా అర్థమౌతున్నది (యోబు 2:8; యోబు 3:24; యోబు 6:10; యోబు 7:4-5; యోబు 13:28; యోబు 16:8 యోబు 16:17; యోబు 17:1; యోబు 19:20; యోబు 30:17 యోబు 30:30).

8. అతడు ఒళ్లు గోకుకొనుటకై చిల్ల పెంకు తీసికొని బూడిదెలో కూర్చుండగా

తీవ్రమైన దుఃఖానికి ఇది గుర్తు (యోబు 42:6; యిర్మియా 6:26; యోనా 3:6). తన జీవిత సర్వస్వం బూడిద పాలైనట్టు యోబు భావిస్తున్నాడు.

9. అతని భార్య వచ్చినీవు ఇంకను యథార్థతను వదలకయుందువా? దేవుని దూషించి మరణము కమ్మనెను.

తన సందేశాన్ని యోబుకు అందజేయడానికి, అతని దుఃఖాన్ని మరింత పెంచడానికీ సైతాను ఇప్పుడు అతని భార్యను సాధనంగా చేసుకున్నాడు. యోబుకు ప్రాప్తించిన భయంకరమైన నష్టాలనూ బాధలనూ అతని యథార్థతా, భక్తీ అడ్డుకోలేక పోయినప్పుడు ఇక వాటివల్ల లాభమేముంది అంటూ ఉంది యోబు భార్య. “దేవుణ్ణి తిట్టిపోసి చచ్చిపో”– అనడంలో ఆమె సైతాను ఉద్దేశాన్ని వెల్లడిస్తున్నది. ఆత్మహత్య చేసుకొమ్మని కాదు. యోబు దేవుణ్ణి దూషిస్తే ఆయన అతన్ని చంపేస్తాడనీ, అలానైనా అతని దైన్య స్థితినుంచి విడుదల కలుగుతుందనీ బహుశా ఆమె అభిప్రాయం కావచ్చు.

10. అందుకతడు మూర్ఖురాలు మాటలాడునట్లు నీవు మాటలాడుచున్నావు; మనము దేవునివలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయ మందును యోబునోటి మాటతోనైనను పాపము చేయలేదు.

తెలివితక్కువ అని అనువాదం చేసిన హీబ్రూ పదానికి బుద్ధితక్కువ అనీ నీతి లేకపోవడం అనీ కూడా అర్థం వస్తుంది. తెలివితక్కువదానా అని యోబు తన భార్యను తిట్టడం లేదు గాని తెలివితక్కువ ఆడదానిలాగా మాట్లాడుతున్నావు అని మాత్రం అన్నాడు. ఒక విషయం యోబుకు తెలుసు. అది మనం కూడా గ్రహించాలి. అదేమంటే ఒక్క రోజునే ఆమె కూడా తన పదిమంది పిల్లలను కోల్పోయింది. తన భర్త పడే వేదనలను చూస్తూవుంది. హఠాత్తుగా ఒక్క పిల్లవాడిని కోల్పోతేనే తల్లులు శోకంతో దాదాపు పిచ్చివాళ్ళై పోవచ్చు గదా. “తప్పిదం”– యోబు తన మాటల మూలంగా దేవునికి వ్యతిరేకంగా పాపం చేయకుండా సైతానును అబద్ధికుడిగా నిరూపించాడు. వాడి నోరు మూయించాడు. సైతాను ఓడిపోయాడు. ఇకపై ఈ కథలో మరెక్కడా సైతాను కనిపించడు.

11. తేమానీయుడైన ఎలీఫజు, షూహీయుడైన బిల్దదు నయమాతీయుడైన జోఫరు అను యోబు ముగ్గురు స్నేహి తులు అతనికి సంభవించిన ఆపదలన్నిటిని గూర్చి వినిన వారై, అతనితో కలిసి దుఃఖించుటకును అతనిని ఓదార్చు టకును పోవలెనని ఆలోచించుకొని తమ తమ స్థలములను విడిచి వచ్చిరి.

ఇరుగు పొరుగు ప్రదేశాలనుంచి నిజమైన స్నేహభావంతో, యోబును ఊరడించాలన్న సదుద్దేశంతో ఈ మనుషులు వచ్చారు. కానీ వారి ప్రయత్నం యోబు దుఃఖాన్ని ఇంకా పెంచింది (యోబు 16:2). యోబు దేహ సంబంధమైన బాధ మొదలైనప్పటినుంచి అతని మిత్రులు అతణ్ణి చూచేందుకు వచ్చేదాకా ఎంతకాలం గడిచిపోయిందో మనకు తెలియదు. కానీ యోబు 7:3 లో యోబు “నెలల తరబడి” అన్నాడు.

12. వారు వచ్చి దూరముగా నిలువబడి కన్ను లెత్తి చూచినప్పుడు, అతని పోల్చలేక తమ వస్త్రములను చింపుకొని ఆకాశము తట్టు తలలమీద ధూళి చల్లుకొని యెలుగెత్తి యేడ్చిరి.
మత్తయి 26:65

తూర్పు వారందరిలోకి గొప్పవాడైన వ్యక్తి (యోబు 1:3) అసహ్యకరమైన కురుపులతో బూడిదలో కూర్చుని ఉంటాడని ఆ స్నేహితులు మాత్రం ఎలా ఊహించగలరు? తెల్లబోయి, పట్టరాని శోకంతో గొల్లుమన్నారు (యెహోషువ 7:16; నెహెమ్యా 9:1; విలాపవాక్యములు 2:10; యెహెఙ్కేలు 27:30 పోల్చిచూడండి). పురాతన కాలంలో 7 రోజుల సంతాపం దినాలు అసామాన్యమేమీ కాదు (ఆదికాండము 50:10; 1 సమూయేలు 31:13).

13. అతని బాధ అత్యధికముగానుండెనని గ్రహించి యెవరును అతనితో ఒక్క మాటయైనను పలుకక రేయింబగలు ఏడు దినములు అతనితోకూడ నేలను కూర్చుండిరి.

యోబు నిజంగా మంచివాడేనా, న్యాయవంతుడేనా అన్న సందేహం ఈ 7 రోజుల్లో యోబు మిత్రులకు కలిగి ఉండవచ్చు. వారు తరువాత పలికిన మాటల్లో ఈ సందేహం బయటికి వచ్చింది. ఏదో ఘోర పాపం చేసి ఉండకపోతే ఇంత విపత్కరమైన పరిస్థితులు, ఇంత బాధ దేవుడు యోబు మీదికి ఎందుకు రానిస్తాడు అన్నది వాళ్ళకర్థం కాలేదు.Shortcut Links
యోబు - Job : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |