Psalms - కీర్తనల గ్రంథము 110 | View All

1. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చినవాక్కు నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయువరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము.
మత్తయి 22:44, మార్కు 12:36, మార్కు 16:19, లూకా 20:42-43, లూకా 22:69, అపో. కార్యములు 2:34-35, రోమీయులకు 8:34, 1 కోరింథీయులకు 15:25, ఎఫెసీయులకు 1:20, కొలొస్సయులకు 3:1, హెబ్రీయులకు 1:3-13, హెబ్రీయులకు 8:1, హెబ్రీయులకు 10:12-13, హెబ్రీయులకు 12:2, 1 పేతురు 3:22

ఈ కీర్తన ప్రాధాన్యతను గురించి ఎంత చెప్పినా అతిశయోక్తి కాదు. అభిషిక్తుణ్ణి అంటే ప్రభువైన యేసు క్రీస్తును గురించిన స్పష్టమైన అర్థవంతమైన కీర్తనలన్నింటిలోకి ఇది ఒకటి. క్రొత్త ఒడంబడిక గ్రంథంలో దీన్ని మిగతా అన్ని కీర్తనలకంటే ఎక్కువ సార్లు ప్రస్తావించడమో ఎత్తిరాయడమో జరిగింది (మత్తయి 22:41-45; మార్కు 12:35-37; లూకా 20:41-44; అపో. కార్యములు 2:34-35; 1 కోరింథీయులకు 15:25; హెబ్రీయులకు 1:13; హెబ్రీయులకు 5:6; హెబ్రీయులకు 7:17 హెబ్రీయులకు 7:21; హెబ్రీయులకు 10:13). క్రీస్తు దేవుని కుడివైపున కూర్చుంటాడని క్రొత్త ఒడంబడిక గ్రంథంలో చెప్పిన అన్ని సందర్భాల్లోనూ ఈ కీర్తనలోని మొదటి వచనం పైనే ఆధారపడి చెప్పడం జరిగింది – మత్తయి 26:64; మార్కు 14:62; మార్కు 16:19; లూకా 22:69; రోమీయులకు 8:34; ఎఫెసీయులకు 1:20; కొలొస్సయులకు 3:1; హెబ్రీయులకు 1:3; హెబ్రీయులకు 8:1; హెబ్రీయులకు 10:12; హెబ్రీయులకు 12:2; 1 పేతురు 3:22. సర్వాతీతుడైన దేవుడు దావీదు యొక్క ప్రభువు అనే వ్యక్తితో చెప్పిన కొన్ని మాటలు ఈ కీర్తనలో ఉన్నాయి. తన ప్రభువుతో దేవుడు మాట్లాడిన విషయం గానీ ఏమి మాట్లాడడన్నది గానీ దావీదుకు ఎలా తెలుసు? మార్కు 12:36 చూడండి. దేవుని మాటలను దేవుని ఆత్మ దావీదుకు తెలియజేశాడు. అభిషిక్తుడు దావీదు సంతతివాడై ఉండాలి (2 సమూయేలు 7:16; మత్తయి 1:1; మత్తయి 9:27; మత్తయి 12:23; మత్తయి 21:19; మత్తయి 22:42; యోహాను 7:42; రోమీయులకు 1:3; ప్రకటన గ్రంథం 22:16). అలాగైతే ఆయన దావీదుకన్నా ఎన్నో రెట్లు గొప్పవాడు, కేవలం దావీదుకే కాదు ప్రభువులందరికీ మనుషులందరికీ ప్రభువు (అపో. కార్యములు 10:36; రోమీయులకు 14:9; ఫిలిప్పీయులకు 2:10-11; 1 తిమోతికి 6:15; ప్రకటన గ్రంథం 19:16), పరలోకంనుంచి వచ్చిన ప్రభువు (1 కోరింథీయులకు 15:47). ఆయన దావీదు సంతతివాడే గాని దేవుని స్వభావం గలవాడై ఇప్పుడు దేవుని సింహాసనం పై కూచుని ఉన్న దేవుని కుమారుడు కూడా (ప్రకటన గ్రంథం 3:21). భూసంబంధమైన అధికారాలన్నీ శక్తులన్నీ సమసిపోయే ఘడియవరకు, ప్రపంచమంతటిపై బహిరంగంగా పరిపాలించేందుకు ఆయన తిరిగి వచ్చే వరకు అక్కడ దేవుని కుడివైపున ఆసీనుడై ఉంటాడు. కీర్తనల గ్రంథము 2:8-9 చూడండి. ఈ కీర్తనకు సరైన శీర్షిక “జయశీలి అయిన రాజు – యాజి”.

2. యెహోవా నీ పరిపాలనదండమును సీయోనులోనుండి సాగజేయుచున్నాడు నీ శత్రువులమధ్యను నీవు పరిపాలన చేయుము.
మత్తయి 26:64, మార్కు 14:62

మొదటి వాక్యానికి “నీ పరిపాలన విస్తరించేలా చేస్తాడు” అని అర్థం. ఆయన శత్రువులు ఆయనకు పాదపీఠంగా చెయ్యబడక మునుపు, ఆయన వారి మధ్యలో పరిపాలించక మునుపు అంటే వారు నాశనం కాక ముందు కాలం గురించి ఈ వచనం చెప్తున్నట్టుంది. ఈ పరిపాలన జెరుసలంలో ఆరంభమై ఇతర ప్రదేశాలకు వ్యాపిస్తుంది. తన సంఘం పైనా, మనుషుల తీరు తెన్నులపైనా యేసు ప్రస్తుతం రహస్యంగా కొనసాగిస్తూ ఉన్న పరిపాలననూ, ప్రపంచమంతటా ఆయన శుభవార్త వ్యాప్తినీ ఈ మాటలు సూచించవచ్చు (మత్తయి 28:18-20; లూకా 24:46-47; యోహాను 17:2; అపో. కార్యములు 2:32-33; ప్రకటన గ్రంథం 1:5). ప్రస్తుతం క్రీస్తు శత్రువులు చాలామంది భూమిపై అధికారంలో ఉన్నారు. అయితే పాపులు క్రీస్తువైపుకు మళ్ళడం ద్వారానూ, క్రీస్తు తన సంఘాన్ని కాపాడుకుంటూ రావడం ద్వారానూ అలాంటి అధికారుల మధ్యనే ఆయన బలప్రభావాలు వెల్లడి అవుతున్నాయి. ఆయన ఉద్దేశాలనెవరూ ఆటంక పరచలేరు. ఆయన పరిపాలనను, అధికారాన్ని ఎవరూ కూలద్రోయలేరు (కీర్తనల గ్రంథము 2:2-6; యోహాను 17:2). ఆయన తన ఇష్టప్రకారం రాజ్యాలనూ ప్రభుత్వాలనూ కూలద్రోస్తాడు. ఒక మనిషినీ గద్దెనెక్కించి మరొకణ్ణి కిందికి దింపుతాడు. ఆ వ్యక్తులకు ఇదేమీ ఎంతమాత్రమూ తెలియకపోయినా ఇలా చేస్తాడు.

3. యుద్ధసన్నాహదినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు. నీ ¸యౌవనస్థులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులైమంచు వలె అరుణోదయగర్భములోనుండి నీయొద్దకువచ్చెదరు

“మనసారా ముందుకు వస్తారు”– అనేదాన్ని “తమను తాము సమర్పించుకుంటారు” అని కూడా తర్జుమా చేయవచ్చు (రోమీయులకు 12:1 పోల్చిచూడండి). ఈ కృప యుగమంతా క్రీస్తు “బలపరాక్రమాలను కనుపరచే” రోజులే. ఆయన ప్రజలు సంతోషంతో ఆయన నాయకత్వం కింద చేరి ఆయన ఆత్మసంబంధమైన పోరాటానికి సాగిపోతారు. సణుక్కుంటూ అయిష్టంగా చేసే సేవ క్రీస్తుకు అక్కర్లేదు. మనస్పూర్తిగా, ఇష్టపూర్వకంగా ప్రేమతో చేసేదే ఆయన ఆశిస్తాడు. “పవిత్ర వస్త్రాలు”– అంటే యాజులు ధరించే వస్త్రాలు (నిర్గమకాండము 28:4; లేవీయకాండము 16:4). ఈ కీర్తనలో కనిపించే పరాక్రమశాలి అయిన రాజు తరువాత వచనంలో యాజిగా కనిపిస్తున్నాడు. ఆయన సైన్యంలో చేరినవారంతా క్రొత్త ఒడంబడిక అర్థం ప్రకారం యాజులే (నిర్గమకాండము 28:1 నోట్‌). “మంచు బిందువుల్లాగా”– మంచు బిందువులు మనుషుల మూలంగా కాక దేవుని మూలంగానే ఉదయకాలాన తాజాగా కనబడుతాయి. అవి స్వచ్ఛంగా అసంఖ్యాకంగా ఉండి మిలమిలలాడుతూ ఉంటాయి. క్రీస్తుకు చెందిన యువకులు అలా ఉంటారు (మీకా 5:7 పోల్చిచూడండి).

4. మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవైయుందువని యెహోవా ప్రమాణము చేసియున్నాడు, ఆయన మాట తప్పనివాడు.
యోహాను 12:34, హెబ్రీయులకు 5:6-10, హెబ్రీయులకు 6:20, హెబ్రీయులకు 7:11-15, హెబ్రీయులకు 7:17-28

ఈ వచనంలోని క్రీస్తును గురించిన భవిష్యద్వాక్కుకు ముందుమాటగా గంబీరమైన మాటలు కనిపిస్తున్నాయి. దేవుడొక వాగ్దానం చేశాడు. ఒక నిర్ణయం చేశాడు. దాన్ని మార్చే అవకాశం లేదు. అదేమిటంటే క్రీస్తు తన ప్రజలకు యాజి – అహరోనులాగా కాదు, మెల్కీసెదెకు లాగానే (ఆదికాండము 14:18-20 చూడండి). ఈ ఒక్క మాటతో దేవుడు మోషేద్వారా సీనాయి పర్వతం దగ్గర చేసిన యాజి ధర్మాలతో, జంతు బలులతో కూడిన ఒడంబడికను ఇకపై లెక్క చెయ్యకూడదన్న తన ఉద్దేశాన్ని తెలియజేశాడు (హీబ్రూ 7–10 అధ్యాయాలు). ధర్మశాస్త్రంలోని యాజి ధర్మాలు, బలులు ఇవన్నీ నీడలు, సాదృశ్యాలు, సూచనలు మాత్రమే. క్రీస్తు తనను తాను బలిగా అర్పించుకోవడం, శాశ్వతమైన ఆయన యాజిపదవి ఇవి వాస్తవాలు (నిర్గమకాండము 25:9; నిర్గమకాండము 28:1; లేవీయకాండము 1:2; హెబ్రీయులకు 8:2 హెబ్రీయులకు 8:5; హెబ్రీయులకు 10:1). ఆయనద్వారా మనం దేవుని సన్నిధానానికి ఒక సరికొత్త సజీవ మార్గం ద్వారా చేరుకోవచ్చు (హెబ్రీయులకు 10:19-22).

5. ప్రభువు నీ కుడిపార్శ్వమందుండి తన కోపదినమున రాజులను నలుగగొట్టును.
ప్రకటన గ్రంథం 6:17

ఈ వచనంలోని మాటలు ఎవరు ఎవరితో పలుకుతున్నది తెలుసుకోవడం కష్టం. క్రీస్తుతో యెహోవా మాట్లాడటం కొనసాగిస్తున్నాడా లేక దావీదు యెహోవాతో లేదా క్రీస్తుతో చెప్తున్నాడా? ఈ ప్రశ్నకు జవాబు అవసరం లేదేమో. తమ ఉద్దేశాల్లో పనుల్లో యెహోవాకు, క్రీస్తుకూ పరిపూర్ణమైన ఏకత్వం ఉంది. అందువల్ల యెహోవాను గురించి చెప్పగలిగిన దాన్ని క్రీస్తు విషయంలో కూడా చెప్పవచ్చు. క్రీస్తు యెహోవా అవతారం. తరువాతి రెండు వచనాలు మాత్రం క్రీస్తును గురించే. “ఆగ్రహ దినం” అంటే యుగాంతంలో దేవుని తీర్పు సమయం (2 థెస్సలొనీకయులకు 1:6-9; ప్రకటన గ్రంథం 6:15-17; ప్రకటన గ్రంథం 11:18; ప్రకటన గ్రంథం 15:1; ప్రకటన గ్రంథం 16:1; ప్రకటన గ్రంథం 19:15).

6. అన్యజనులకు ఆయన తీర్పు తీర్చును దేశము శవములతో నిండియుండును విశాలదేశము మీది ప్రధానుని ఆయన నలుగగొట్టును.
మత్తయి 25:31-34

“తీర్పు తీరుస్తాడు”– యెషయా 2:4; యోవేలు 3:12; యోహాను 5:22-23 యోహాను 5:27; అపో. కార్యములు 10:42; అపో. కార్యములు 17:31. “అధిపతి”– క్రొత్త ఒడంబడికలో ఇతణ్ణి క్రీస్తు విరోధి, న్యాయవిరోధి లేక “మృగం” (ప్రకటన 13 అధ్యాయం) అన్నారు. ఇతడు క్రీస్తుకు విరోధంగా తన సైన్యాలను నడిపించి పూర్తిగా నాశనమైపోతాడు (ప్రకటన గ్రంథం 19:19-21; 2 థెస్సలొనీకయులకు 2:3-8).

7. మార్గమున ఏటి నీళ్లు పానముచేసి ఆయన తల యెత్తును.

జయశాలి అయిన రాజు–యాజి యుద్ధభూమిలో తన శత్రువులను తరుముతున్న దృశ్యమిది. దేవుని పట్ల భయభక్తులు లేని ధోరణి, వ్యతిరేకత అంతటినీ అణగదొక్కేదాకా ఆయన విశ్రమించడు.Shortcut Links
కీర్తనల గ్రంథము - Psalms : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114 | 115 | 116 | 117 | 118 | 119 | 120 | 121 | 122 | 123 | 124 | 125 | 126 | 127 | 128 | 129 | 130 | 131 | 132 | 133 | 134 | 135 | 136 | 137 | 138 | 139 | 140 | 141 | 142 | 143 | 144 | 145 | 146 | 147 | 148 | 149 | 150 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |