Psalms - కీర్తనల గ్రంథము 133 | View All

1. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు! ఎంత మనోహరము!

శీర్షిక – 120వ కీర్తన శీర్షిక చూడండి. కీర్తనల గ్రంథము 133:1 దేవుని ప్రజల్లో ఐకమత్యం మంచిది, మనోహరమైనది. ఎందుకంటే అది దేవుని ప్రేమ ఫలితం, దేవుని సంకల్పం, ఆయన చర్యల వల్ల కలిగే ఫలితం. ఎందుకంటే ఐకమత్యం వల్ల కలిగే ఫలం మధుర సహవాసం, శాంతి, బల ప్రభావాలు. కొత్త ఒడంబడిక సంఘాలు ఐకమత్యం కలిగి ఉండడం, దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం అతి ప్రాముఖ్యమైన విషయం. ఎఫెసీయులకు 4:1-6 చూడండి. కాబట్టి సంఘ నాయకులు జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే సంఘాల్లో పాపంవల్ల, లేక తప్పుడు బోధలవల్ల, లేదా గర్విష్ఠులైన మనుషులవల్ల చీలికలు వస్తాయి (అపో. కార్యములు 20:30-31; రోమీయులకు 16:17-18; హెబ్రీయులకు 12:15-16).

2. అది తలమీద పోయబడి అహరోను గడ్డముమీదుగా కారి అతని అంగీల అంచువరకు దిగజారిన పరిమళ తైలమువలె నుండును

ఈ సమైక్యతను అహరోనును యాజిగా అభిషేకించి ప్రత్యేకించినందుకు ఉపయోగించే తైలంతో పోల్చాడు దావీదు (నిర్గమకాండము 29:7 నిర్గమకాండము 29:9). ఇది పవిత్రమైన, పరిమళ భరితమైన, ప్రత్యేకమైన నూనె. ఇది దేవునికి పూర్తిగా అంకితమైన స్థితిని సూచించే నూనె. నిర్గమకాండము 30:22-33 చూడండి. దేవునికి అంత మంచి పరిమళంగా ఉండే ఐకమత్యం, ఆయన సేవకు అంకితం కావడం గురించి అంత స్పష్టంగా మాట్లాడుతున్న ఐకమత్యం, పవిత్ర సంఘంలోని పవిత్ర జీవితాలకు సూచనగా ఉన్న ఐకమత్యం, ఇప్పుడు విశ్వాసులను అభిషేకించే దేవుని పవిత్రాత్మను గురించి తెలియజేసే ఐకమత్యం ఎంత శ్రేష్టమైనది, ఎంత విలువైనది.

3. సీయోను కొండలమీదికి దిగి వచ్చు హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలెనని యెహోవా సెలవిచ్చి యున్నాడు.

“సీయోను”– ప్రేమ, సత్యాలలో ఐక్యమైన దేవుని ప్రజల మధ్య దేవుని దీవెనలు ఉంటాయి. అక్కడ దేవుడు శాశ్వత జీవాన్నిచ్చే తన కృపా ప్రవాహాలను ఉంచుతాడు. “మంచు”– సామెతలు 19:12; యెషయా 18:4; యెషయా 26:19; హోషేయ 14:5. సంఘంపై ఎల్లప్పుడూ మెల్లగా కురుస్తూ ఉండే చల్లని, సేదదీర్చే జీవప్రదమైన మంచులాంటిది ఐకమత్యం. ఇది పరలోకం నుంచి వచ్చి దేవుని ప్రజలు గొప్ప నిధిగా అపురూపంగా ఉంచుకోవలసిన ఈవి.Shortcut Links
కీర్తనల గ్రంథము - Psalms : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114 | 115 | 116 | 117 | 118 | 119 | 120 | 121 | 122 | 123 | 124 | 125 | 126 | 127 | 128 | 129 | 130 | 131 | 132 | 133 | 134 | 135 | 136 | 137 | 138 | 139 | 140 | 141 | 142 | 143 | 144 | 145 | 146 | 147 | 148 | 149 | 150 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |