Psalms - కీర్తనల గ్రంథము 136 | View All

1. యెహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరముండును.

ఇది దేవుని అనుగ్రహాన్ని బట్టీ, ప్రేమను బట్టి ఆయన్ను స్తుతించే కీర్తన. అవి ఆయన మంచితనం(వ 1)లో నుంచి ప్రవహిస్తూ ఉన్నాయి. అనంత దేవాది దేవునినుంచి, విశ్వాన్నేలే రాజునుంచి అవి వస్తున్నాయి (వ 2,3). దేవుని అనుగ్రహం, ప్రేమ వెల్లడి అవుతున్నది సృష్టిలోను (వ 4-9), తన ప్రజలను ఆయన ఈజిప్ట్‌నుంచి విడిపించడంలోను (వ 10-15), వారిని ఎడారిలో ఆయన చక్కగా నడిపించడంలోను (వ 16), వాగ్దానం చేసిన సొత్తును వారికివ్వడంలోను (వ 17-22), దీనులపై దయ చూపడంలోను (వ 23), శత్రువులనుంచి కాపాడ్డంలోను (వ 24), తాను సృష్టించిన జీవులను పోషించడంలోను (వ 25). క్రొత్త ఒడంబడిక మాటల్లో చెప్పాలంటే అమిత శక్తివంతుడైన సృష్టికర్త కృప, ప్రేమ ఆయన ప్రజలను పాపం అనే చెరనుండి విడిపించి, జీవితయాత్రలో పరలోక వారసత్వానికి వారిని క్షేమంగా నడిపిస్తూ, వారి బద్ధశత్రువు సైతానునుండీ వాడి సైన్యాల బారినుంచీ వారిని తప్పించి, ఈ జీవిత కాలంలోను తరువాత శాశ్వతంగా కూడా వారిని క్షేమంగా ఉంచుతాయి. “మంచివాడు”– కీర్తనల గ్రంథము 100:5; కీర్తనల గ్రంథము 106:1; కీర్తనల గ్రంథము 118:1; కీర్తనల గ్రంథము 145:9. “కృతజ్ఞతలు”– కీర్తనల గ్రంథము 7:17; కీర్తనల గ్రంథము 50:14-15; కీర్తనల గ్రంథము 56:12; లేవీయకాండము 7:12-13; ఎఫెసీయులకు 5:20; 1 థెస్సలొనీకయులకు 5:18. “ఎప్పటికీ”– 2 దినవృత్తాంతములు 5:13; ఎజ్రా 3:11. దేవుని అనుగ్రహం, ప్రేమ ఇంతకు ముందెన్నడూ నిలిచిపోలేదు. మరింకెన్నడూ నిలిచిపోదు. అవి ఆయన మార్పులేని స్వభావంలోనుంచి ప్రవహిస్తాయి (1 యోహాను 4:8 యోహాను 4:16).

2. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరముండును.

కీర్తనల గ్రంథము 135:5 కీర్తనల గ్రంథము 135:15; ద్వితీయోపదేశకాండము 10:17. బైబిలు దేవుడైన యెహోవా మనుషులచేత దేవుళ్ళని పిలవబడే వారందరికన్నా పైనున్నవాడు. నిజానికి అలాంటివారు అసలు దేవుళ్ళు కారు – కీర్తనల గ్రంథము 96:5; కీర్తనల గ్రంథము 115:4-11 చూడండి.

3. ప్రభువుల ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరముండును.

1 తిమోతికి 6:15; ప్రకటన గ్రంథం 19:16. ఆయన విశ్వానికంతటికీ అధినాధుడు, పరిపాలకుడు, యజమాని.

4. ఆయన ఒక్కడే మహాశ్చర్యకార్యములు చేయువాడు ఆయన కృప నిరంతరముండును.

కీర్తనల గ్రంథము 77:14; కీర్తనల గ్రంథము 107:27; యోబు 9:10; దానియేలు 4:3; దానియేలు 6:27. ఆయనొక్కడే గొప్ప వింతలు చేయగలవాడు, వాటిని ఆయన ఒంటరిగానే చేస్తాడు. ఎవరూ ఆయనకు తోడుండనక్కరలేదు.

5. తన జ్ఞానముచేత ఆయన ఆకాశమును కలుగజేసెను ఆయన కృప నిరంతరముండును.

సృష్టిలోని వింతలివి. ఆది 1 అధ్యాయం చూడండి. మనుషులకు, ఇతర జీవులకు భూమిని నివాస యోగ్యం చేయడంలో దేవుని అనుగ్రహం, ప్రేమ వెల్లడి అయ్యాయి.

6. ఆయన భూమిని నీళ్లమీద పరచినవాడు ఆయన కృప నిరంతరముండును.

7. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు ఆయన కృప నిరంతరముండును.

8. పగటి నేలుటకు ఆయన సూర్యుని చేసెను ఆయన కృప నిరంతరముండును.

9. రాత్రి నేలుటకు ఆయన చంద్రుని నక్షత్రములను చేసెను ఆయన కృప నిరంతరముండును.

10. ఐగుప్తుదేశపు తొలిచూలులను ఆయన హతము చేసెను ఆయన కృప నిరంతరముండును.

దేవుని ప్రజలను ఆయన ఈజిప్ట్‌నుంచి విడిపించడంలో కనిపించిన అద్భుతాలు, దేవుని అనుగ్రహం ఇక్కడ కనబడుతున్నాయి. అయితే దేవుడంత అనుగ్రహం, ప్రేమ గలవాడైతే ఈజిప్ట్‌వారి తొలిచూలు సంతానాన్నీ, సముద్రంలో ఈజిప్ట్ సైన్యాలన్నిటినీ ఎందుకు సంహరించాడు? ఎందుకంటే ఆయన న్యాయమూర్తి అయిన దేవుడు కూడా. క్రూరత్వానికి ఆయన ప్రతీకారం చేస్తాడు. ఆయన కృపను నిరాకరించే హృదయ కాఠిన్యాన్ని, అహంకారాన్ని శిక్షిస్తాడు (కీర్తనల గ్రంథము 2:4-5; రోమీయులకు 2:4-5; 2 థెస్సలొనీకయులకు 1:6-9; హెబ్రీయులకు 2:1-3).

11. వారి మధ్యనుండి ఇశ్రాయేలీయులను ఆయన రప్పించెను ఆయన కృప నిరంతరముండును.

12. చేయి చాచి తన బాహుబలముచేత వారిని రప్పించెను ఆయన కృప నిరంతరముండును.

13. ఎఱ్ఱసముద్రమును ఆయన పాయలుగా చీల్చెను. ఆయన కృప నిరంతరముండును.

14. ఆయన ఇశ్రాయేలీయులను దాని నడుమ దాటిపో జేసెను ఆయన కృప నిరంతరముండును.

15. ఫరోను అతని సైన్యమును ఎఱ్ఱసముద్రములో ఆయన ముంచివేసెను ఆయన కృప నిరంతరముండును.

16. అరణ్యమార్గమున ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చెను ఆయన కృప నిరంతరముండును.

దేవుడు ఎడారి ప్రయాణంలో ప్రదర్శించిన అద్భుతాలు, కృప ఎంత గొప్పవి! ఆ చరిత్ర నిర్గమ 15వ అధ్యాయంలో ఆరంభమై ద్వితీయోపదేశకాండం ముగింపుతో ముగిస్తుంది.

17. గొప్ప రాజులను ఆయన హతముచేసెను ఆయన కృప నిరంతరముండును.

18. ప్రసిద్ధినొందిన రాజులను ఆయన హతముచేసెను ఆయన కృప నిరంతరముండును.

19. అమోరీయుల రాజైన సీహోనును ఆయన హతము చేసెను ఆయన కృప నిరంతరముండును.

20. బాషాను రాజైన ఓగును ఆయన హతము చేసెను ఆయన కృప నిరంతరముండును.

21. ఆయన వారి దేశమును మనకు స్వాస్థ్యముగా అప్పగించెను ఆయన కృప నిరంతరముండును.

కీర్తనల గ్రంథము 78:55; యెహోషువ 12:1; యెహోషువ 14:1. దేవుడు విశ్వాసుల కోసం ఒక శాశ్వత వారసత్వాన్ని కూడా సిద్ధపరిచాడు (1 పేతురు 1:4). వారు దాన్ని పొందకూడదని వారికి అడ్డంకులు కల్పించే వారిని ఆయన నాశనం చేస్తాడు.

22. తన సేవకుడైన ఇశ్రాయేలునకు దానిని స్వాస్థ్యముగా అప్పగించెను ఆయన కృప నిరంతరముండును.

23. మనము దీనదశలోనున్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసికొనెను ఆయన కృప నిరంతరముండును.

కీర్తనల గ్రంథము 78:39; కీర్తనల గ్రంథము 103:14; 1 సమూయేలు 2:8; లూకా 1:47-48. పేదలకు, వినయం గలవారికి, దీనులకు కృప చూపటం దేవుని కెంతో ఇష్టం.

24. మన శత్రువుల చేతిలోనుండి మనలను విడిపించెను ఆయన కృప నిరంతరముండును.

25. సమస్త జీవులకును ఆయన ఆహారమిచ్చుచున్నాడు ఆయన కృప నిరంతరముండును.

26. ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరముండును.

పరలోక దేవుడు – ఎజ్రా, నెహెమ్యా, దానియేలు గ్రంథాల్లో దేవునికి సామాన్యంగా వాడిన పేరిది. ఇది దేవుడు అన్నిటికీ పైనున్నవాడని, అన్నిటినీ పరిపాలిస్తున్నాడని సూచిస్తున్నది. ఆయనకు కృతజ్ఞతలు అర్పిద్దాం (కీర్తనల గ్రంథము 34:1; ఎఫెసీయులకు 5:4 ఎఫెసీయులకు 5:20; కొలొస్సయులకు 3:17; 1 థెస్సలొనీకయులకు 5:18; హెబ్రీయులకు 13:15). ఆయన కృప ప్రవాహానికి ఆనకట్టలేదు గనుక మన కృతజ్ఞతార్పణకు కూడా ఆనకట్ట ఉండకూడదు.Shortcut Links
కీర్తనల గ్రంథము - Psalms : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114 | 115 | 116 | 117 | 118 | 119 | 120 | 121 | 122 | 123 | 124 | 125 | 126 | 127 | 128 | 129 | 130 | 131 | 132 | 133 | 134 | 135 | 136 | 137 | 138 | 139 | 140 | 141 | 142 | 143 | 144 | 145 | 146 | 147 | 148 | 149 | 150 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |