Psalms - కీర్తనల గ్రంథము 2 | View All

1. అన్యజనులు ఏల అల్లరి రేపుచున్నారు? జనములు ఏల వ్యర్థమైనదానిని తలంచుచున్నవి?
ప్రకటన గ్రంథం 11:18, అపో. కార్యములు 4:25-26

అభిషిక్తుని గురించిన కీర్తనల్లో ఇది మొదటిది. అంటే ప్రభువైన యేసు క్రీస్తును గురించిన భవిష్యద్వాక్కులు ఉన్న కీర్తనలన్నమాట. ఇలాంటి కీర్తనల్లో అతి ప్రాముఖ్యమైనవి కొన్ని 16, 22, 40, 45, 69, 72, 89, 110. ఈ రెండో కీర్తనను క్రొత్త ఒడంబడికలో కొన్ని సార్లు ఎత్తి రాయడం జరిగింది. 1,2 వచనాలు అపో. కార్యములు 4:25-26 లోను; 7వ వచనం అపో. కార్యములు 13:33; హెబ్రీయులకు 1:5; హెబ్రీయులకు 5:5 లోనూ కనిపిస్తున్నాయి. 9వ వచనంతో ప్రకటన గ్రంథం 2:27; ప్రకటన గ్రంథం 12:5; ప్రకటన గ్రంథం 19:15 లకు సంబంధం ఉంది. క్రీస్తు ఈ లోకానికి రాకముందు వందల సంవత్సరాలక్రితమే ఆయన గురించి రాసివున్న గంబీరమైన భవిష్యద్వాక్కు ఈ కీర్తనంతా.

2. మనము వారి కట్లు తెంపుదము రండివారి పాశములను మనయొద్ద నుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు
ప్రకటన గ్రంథం 19:19, ప్రకటన గ్రంథం 6:15, ప్రకటన గ్రంథం 7:18, ప్రకటన గ్రంథం 11:18, అపో. కార్యములు 4:25-26

మొదటి వచనంలోని ప్రశ్నకు ఇక్కడ జవాబు ఉంది. ప్రజలను వారి పాలకులే రెచ్చగొడుతున్నారు. వెలుగు, సత్యం, పవిత్రతలకూ, వీటన్నిటి రూపు దాల్చిన దేవునికీ వ్యతిరేకంగా ప్రజలు, వారి నాయకులు తమ విరోధ భావాన్ని వెల్లడి చేస్తున్నారు (యోహాను 3:19-20; యోహాను 15:18-19; రోమీయులకు 1:30; రోమీయులకు 8:7). ఈ వచనంలో పరిపాలకులు వ్యర్థంగా కుట్ర పన్నుతున్నది విశ్వానికి నిజ దేవుడైన యెహోవాకూ, ఆయన అభిషిక్తునికీ వ్యతిరేకంగా. పాత ఒడంబడిక రోజుల్లో రాజులు, ప్రవక్తలు, యాజులు అభిషేకం పొందేవారు (నిర్గమకాండము 28:41); (1 సమూయేలు 15:1); (1 సమూయేలు 16:12); (1 రాజులు 19:16). క్రొత్త ఒడంబడికలో యేసు క్రీస్తే అభిషిక్తుడు. ఆయనే తన ప్రజలకు రాజు, ప్రవక్త, యాజి. ఈ కీర్తనలో ఆయన రాజరికం మాత్రమే కనిపిస్తూవుంది. ఈ వచనంలో కనిపించే పరిపాలకుల వ్యతిరేకతా, కుట్రలూ ప్రత్యేకించి క్రీస్తు సిలువ మరణానికి సంబంధించినవి (అపో. కార్యములు 4:25-26). కానీ యేసుప్రభువుకు వ్యతిరేకంగా లేచిన వారందరికీ, అది ఏ కాలమైనా, ఈ వచనం వర్తిస్తుంది.

3. భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికిని విరోధముగా నిలువబడుచున్నారు ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు.

తిరుగుబాటు, పాపం నిండిన మానవ హృదయం అసలు రంగు ఇదే. పాపంలో పడిన మానవులకు దేవుడూ, ఆయన అభిషిక్తుడూ తమను ఏలడం ఇష్టం ఉండదు (1 సమూయేలు 8:6-8; లూకా 19:14; యోహాను 19:15-16). వారు తమకిష్టం వచ్చినట్టు చేయగోరుతారు. దేవుని అమూల్య వాక్కునూ, జీవమిచ్చే ఆజ్ఞలనూ తమను దాస్యంలో బంధించి ఉంచే బంధకాలుగా ఎంచుతారు. ఈ విధంగా వారు తమ గొప్ప దుర్మార్గతతో కూడా తమ గొప్ప అజ్ఞానాన్ని బయట పెట్టుకుంటారు. వారు బానిసత్వం అని భావిస్తున్నది ఘనమైన స్వతంత్రత, వారు స్వతంత్రత అనుకుంటున్నది భయంకరమైన పాప దాస్యం. నిజ దేవునికి విరోధంగా తిరగబడి ఆయన వశం, అధికారం నుంచి దూరం కావాలని చూచే పతిత మానవ లోకమంతటికీ ఈ వచనంలో ఉన్నవారు ప్రతినిధులుగా ఉన్నారు. అభిషిక్తుడైన యేసుప్రభువు పట్ల వారి తీరునుబట్టి ఈ విషయం రుజువౌతున్నది.

4. ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు ప్రభువు వారినిచూచి అపహసించుచున్నాడు

దేవుడు నవ్వుతున్నాడు, వినోదంగా కాదు, దుర్బలమైన మనుషులు తన పథకాలను వ్యతిరేకించేందుకు చేస్తున్న ప్రయత్నాలను చూచి తిరస్కార భావంతో నవ్వుతున్నాడు (కీర్తనల గ్రంథము 37:12-13; సామెతలు 1:25-26). దేవుని నవ్వుతో మనుషుల దుర్మార్గతకు వ్యతిరేకంగా ఆయన తీవ్ర కోపం కలిసివుంది.

5. ఆయన ఉగ్రుడై వారితో పలుకును ప్రచండ కోపముచేత వారిని తల్లడింపజేయును

దేవునికీ, ఆయన అభిషిక్తుడైన యేసు క్రీస్తుకూ వ్యతిరేకంగా పోరాడే వారందరిమీదికీ ఆయన కోపం సంపూర్ణంగా దిగివస్తుంది (యోహాను 3:36; రోమీయులకు 1:18; రోమీయులకు 2:5 రోమీయులకు 2:8; 2 థెస్సలొనీకయులకు 1:6-10; ప్రకటన గ్రంథం 6:16-17; ప్రకటన గ్రంథం 19:15).

6. నేను నా పరిశుద్ధ పర్వతమైన సీయోను మీదనా రాజును ఆసీనునిగా చేసియున్నాను

దేవుడు ఎన్నుకొన్న రాజు అంటే ఆయన అభిషేకించిన యేసుప్రభువే. సీయోను అంటే జెరుసలం. అయితే పరలోక జెరుసలం కూడా ఉంది. అక్కడ ఇప్పుడు యేసు తన తండ్రి సింహాసనం పై కూచుని ఉన్నాడు (గలతియులకు 4:26; హెబ్రీయులకు 12:22; ప్రకటన గ్రంథం 3:21).

7. కట్టడను నేను వివరించెదను యెహోవా నాకీలాగు సెలవిచ్చెను నీవు నా కుమారుడవు నేడు నిన్ను కనియున్నాను.
మత్తయి 3:17, మత్తయి 17:5, మార్కు 1:11, మార్కు 9:7, లూకా 3:22, లూకా 9:35, యోహాను 1:49, అపో. కార్యములు 13:33, హెబ్రీయులకు 1:5, హెబ్రీయులకు 5:5, హెబ్రీయులకు 7:28, 2 పేతురు 1:17

ఇక్కడ, దీని తరువాతి రెండు వచనాల్లో అభిషిక్తుడైన రాజు తానే మాట్లాడుతున్నాడు. మనుషుల ఎలాంటి వ్యతిరేకతా ఎన్నటికీ ఆపలేని విషయాలు కొన్నిటిని దేవుడు నిర్ణయించాడు. ఈ వచనం బేత్లెహేములో యేసుప్రభువు జన్మానికి గానీ ప్రపంచం పుట్టక మునువు నిత్యత్వంలో ఎప్పుడో గతంలో జరిగిన సంఘటనకు గానీ వర్తించదు. క్రీస్తు రాయబారి పౌలు క్రీస్తు చనిపోయినవారిలో నుంచి సజీవంగా లేచిన సందర్భంలో ఈ వచనాల్ని ఎత్తి చెప్పాడు (అపో. కార్యములు 13:32-33). యేసు దేవుని కుమారుడని రుజువైనది ఆయన సజీవంగా లేచినప్పుడే (రోమీయులకు 1:4). క్రీస్తు తన తండ్రి సింహాసనానికి ఎక్కిపోయినది కూడా ఆ సమయంలోనే (హెబ్రీయులకు 1:3; ఫిలిప్పీయులకు 2:9-11).

8. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతములవరకు సొత్తుగాను ఇచ్చెదను.
హెబ్రీయులకు 1:2, ప్రకటన గ్రంథం 2:26-27, ప్రకటన గ్రంథం 19:15

భూమికి, దానిలో ఉన్న వాటిన్నిటికీ న్యాయంగా హక్కుదారుడు యేసుప్రభువే. అయితే ఆయన ఇప్పటికింకా తన వారసత్వాన్ని పొందలేదు. జనాలన్నీ, రాజ్యాలన్నీ ప్రత్యక్షంగా ఆయన హస్తగతమయ్యే ఘడియ రానున్నది (ప్రకటన గ్రంథం 11:15-18). యెషయా 2:1-4 పోల్చిచూడండి.

9. ఇనుపదండముతో నీవు వారిని నలుగగొట్టెదవు కుండను పగులగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగులగొట్టెదవు
ప్రకటన గ్రంథం 12:5, ప్రకటన గ్రంథం 2:26-27, ప్రకటన గ్రంథం 19:15

తండ్రి ఇచ్చినవాటిని క్రీస్తు ఎందుకు నాశనం చేయాలి? నాశనం చేయడు. భక్తిహీనమైన రాజకీయాధికారులను ఆయన చెల్లాచెదురు చేస్తాడు. సర్వ జనాలలో తిరుగుబాటు చేసే శక్తులన్నిటినీ తుత్తునియలు చేస్తాడు. ప్రపంచమంతటినీ పూర్తిగా తన అదుపులోకి తెచ్చుకుంటాడు (ప్రకటన గ్రంథం 19:11-16).

10. కాబట్టి రాజులారా, వివేకులై యుండుడి భూపతులారా, బోధనొందుడి.

క్రీస్తు రాజు గనుక ఆయనకు లోబడుతూ సేవ చేస్తూ ఉండడంలోనే నిజమైన జ్ఞానం ఉంది. భయం, భక్తి, ఆనందం ఈ మూడింటి కలయిక చూడండి. దేవునితో వాస్తవమైన ఆధ్యాత్మిక అనుభవం కలగడంలో ఇవి మూడూ తప్పనిసరి. “భయం” గురించి కీర్తనల గ్రంథము 34:11-14; కీర్తనల గ్రంథము 111:10; కీర్తనల గ్రంథము 128:1; సామెతలు 1:7 నోట్స్ చూడండి.

11. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి గడగడ వణకుచు సంతోషించుడి.
ఫిలిప్పీయులకు 2:12

12. ఆయన కోపము త్వరగా రగులుకొనును కుమారుని ముద్దుపెట్టుకొనుడి; లేనియెడల ఆయన కోపించును అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు.ఆయనను ఆశ్రయించువారందరు ధన్యులు.

2వ వచనంలో అభిషిక్తుణ్ణి, 6వ వచనంలోని రాజును ఇక్కడ కుమారుడు అని పిలవడం కనిపిస్తున్నది. కుమారుడంటే దేవుని కుమారుడు. కుమారునికి తన తండ్రి స్వభావం ఉంటుంది. యేసు కాలంలో ఉన్న యూదులు తాను దేవుని కుమారుణ్ణి అని ఆయన అన్నప్పుడు తనకు దేవుని స్వభావం ఉందనీ, తానే దేవుణ్ణనీ ఆయన చెప్పుకొంటున్నాడని తెలుసుకున్నారు (యోహాను 10:33-38). పురాతన కాలాల్లో ఒక పరిపాలకుణ్ణి ముద్దు పెట్టుకోవడమంటే ఆయన అధికారాన్ని గుర్తిస్తూ ఉన్నట్టు సూచించడం (1 సమూయేలు 10:1). అంతేగాక ఆరాధించాలని ప్రజలు అనుకొన్న వాటికి గౌరవ మర్యాదలను సమర్పిస్తున్నట్టు సూచన (1 రాజులు 19:18; హోషేయ 13:2). కుమారుణ్ణి ముద్దు పెట్టుకోవడమంటే ఆయనకు వ్యతిరేకంగా చేస్తున్న తిరుగుబాటునంతటినీ మాని, హృదయ పూర్వకంగా ఆయనకు లోబడి ఆయన్ను రాజుగా స్వీకరించి ప్రభువుగా ఆరాధించడమే. ఇలా చేయనివారిపై ప్రమాదం పొంచి ఉంది. ఆయన కోపం అంతింత కాదు. ఆయితే పశ్చాత్తాపంతో ఆయనవైపు తిరిగినవారి పట్ల ఆయన కృప మరింత గొప్పది. “ఆశ్రయించు” అని అనువదించిన హీబ్రూ పదానికి నమ్మడం అని కూడా అర్థం వస్తుంది. గనుక భాషాంతరంలో ఈ పదాన్ని అలా తర్జుమా చేయడం యుక్తం. క్రీస్తులో నమ్మకముంచడం ఒక్కటే దేవునితో సఖ్యతకూ క్షేమానికీ విముక్తికీ మార్గం (యోహాను 3:18 యోహాను 3:36; యోహాను 5:24; రోమీయులకు 5:1 రోమీయులకు 5:9-10). “ఆశ్రయం” గురించి ఇతర రిఫరెన్సులు కీర్తనల గ్రంథము 7:1 దగ్గర చూడండి.Shortcut Links
కీర్తనల గ్రంథము - Psalms : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114 | 115 | 116 | 117 | 118 | 119 | 120 | 121 | 122 | 123 | 124 | 125 | 126 | 127 | 128 | 129 | 130 | 131 | 132 | 133 | 134 | 135 | 136 | 137 | 138 | 139 | 140 | 141 | 142 | 143 | 144 | 145 | 146 | 147 | 148 | 149 | 150 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |