Psalms - కీర్తనల గ్రంథము 37 | View All

1. చెడ్డవారిని చూచి నీవు వ్యసనపడకుము దుష్కార్యములు చేయువారిని చూచి మత్సరపడకుము.

ఇది మరో ప్రశస్తమైన కీర్తన. దావీదు దీన్ని తన వృద్ధాప్యంలో రాశారు (25 వ). దుర్మార్గులు వర్ధిల్లడం, విజయాల వెంట విజయాలు సాధించడం చూచి కంగారుపడుతున్నవారికి అద్భుతమైన ఆధ్యాత్మిక ఉపదేశం ఇందులో ఉన్నది. అయితే అన్ని ఉపదేశాల్లాగే దీన్ని అనుసరిస్తేనే దీనివల్ల లాభం కలిగేది. దుర్మార్గులు వర్ధిల్లడం విషయం ఈ కీర్తనలో ఎనిమిది హెచ్చరికలు లేక ఆదేశాలు ఉన్నాయి (వ 1, 3, 4, 5, 7, 8, 27, 34). వీటితోబాటు కనీసం పన్నెండు మధురమైన వాగ్దానాలున్నాయి (వ 4, 5, 6, 9, 11, 19, 22, 24, 27, 28, 29, 33, 34, 37, 40). పరిస్థితులు ఎంత దుర్భరమైనప్పటికీ విశ్వాసులు తొణకకుండా ప్రశాంతంగా, విశ్రాంతిగా, విశ్వాసంగల నిబ్బరమైన మనస్సుతో ఉండేందుకు వారిని ప్రోత్సహించడమే ఈ కీర్తన ముఖ్యోద్దేశం. యోహాను 14:1; యోహాను 16:33 లాంటి వచనాలలో యేసుప్రభువు పలికిన మాటల్లో ఈ కీర్తన సారాంశం ఉంది. దుర్మార్గులు వర్ధిల్లుతూ ఉంటే చాలామందికి కంగారు పుడుతుంది. మరికొందరు వారిని చూచి అసూయపడతారు. ఈ రెండు ధోరణులనూ మనల్ని అంటనీయకూడదు (కీర్తనల గ్రంథము 73:2-3; సామెతలు 3:31; సామెతలు 23:17; సామెతలు 24:1 సామెతలు 24:19; ఫిలిప్పీయులకు 4:6).

2. వారు గడ్డివలెనే త్వరగా ఎండిపోవుదురు. పచ్చని కూరవలెనే వాడిపోవుదురు

వినాశనంవైపుకు పరుగులు పెడుతున్నవారిని చూచి మనం గింజుకోవడం, అసూయపడడం ఎందుకు? (వ 10,20,35,36; కీర్తనల గ్రంథము 73:17-20; కీర్తనల గ్రంథము 90:5-6; కీర్తనల గ్రంథము 92:7; యాకోబు 1:11).

3. యెహోవాయందు నమ్మికయుంచి మేలుచేయుము దేశమందు నివసించి సత్యము ననుసరించుము

ఇలాంటి కంగారు, అసూయ రెంటికీ దేవునిలో నమ్మకమూ, ఆయనకోసం సత్కార్యాలలో మునిగిపోవడమే నివారణ మందు. “దేశం”– అంటే ఇస్రాయేల్. అప్పుడు దేవుని ప్రజలు అక్కడే నిలిచి ఉండాలి. కష్టాలు వచ్చాయని దేశాన్ని విడిచిపోకూడదు.

4. యెహోవానుబట్టి సంతోషించుము ఆయన నీ హృదయవాంఛలను తీర్చును.
మత్తయి 6:33

కీర్తనల గ్రంథము 21:2; కీర్తనల గ్రంథము 145:19. యెహోవాలో ఆనందించేవారు తమ హృదయ కోరికలు సఫలం కావడం చూస్తారు. ఎందుకంటే అవి దేవుని సంకల్పానికి అనుగుణంగానే ఉంటాయి. తమకు ఏది ఉండాలని ఆయన కోరుతాడో వారు అదే కోరుతారు. చాలామంది ఇహలోక సంబంధమైన విషయాలనూ శరీర సంబంధమైనవాటినీ ఆశించి అలాంటి స్వార్థపూరితమైన ప్రార్థనను దేవుడు వినలేదని ఆయనపై సణుక్కొంటారు.

5. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చును.

కీర్తనల గ్రంథము 55:22; కీర్తనల గ్రంథము 16:3; 1 పేతురు 5:7. మన జీవితం, మన మార్గాలు అనిశ్చియం. మన భారాలు మనకు దుర్భరాలు. దేవునిపై నమ్మకం ఉంచేవారికి తమంతట తాము చేసుకోలేని వాటిని దేవుడు చేసిపెడతాడు.

6. ఆయన వెలుగునువలె నీ నీతిని మధ్యాహ్నమునువలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును.

దూషణలు, అబద్ధాల మూలంగా మనస్తాపానికి గురైన విశ్వాసులకు ఈ వచనంలో విశ్రాంతి దొరుకుతుంది. వారి మంచి పేరు విషయం దేవుడే చూసుకుంటాడు. వారేమీ దిగులు చెందనవసరం లేదు.

7. యెహోవా యెదుట మౌనముగానుండి ఆయనకొరకు కనిపెట్టుకొనుము. తన మార్గమున వర్థిల్లువాని చూచి వ్యసనపడకుము దురాలోచనలు నెరవేర్చుకొనువాని చూచి వ్యసన పడకుము.

దేవుడు విశ్వాసుల పక్షంగా సరియైన సమయంలో సరియైన విధంగా జోక్యం కలుగజేసుకుంటాడు. దుర్మార్గుల శ్రేయస్సు, విజయాలను చూచి విశ్వాసులు ఆందోళన చెందకూడదు. ఇలా ఆందోళన చెందడం విశ్వాసులను పాపం చేసేందుకు దారి తీస్తుంది గాని ఏ రకమైన మేలూ చేకూర్చదు.

8. కోపము మానుము ఆగ్రహము విడిచిపెట్టుము వ్యసనపడకుము అది కీడుకే కారణము

9. కీడు చేయువారు నిర్మూలమగుదురు యెహోవాకొరకు కనిపెట్టుకొనువారు దేశమును స్వతంత్రించుకొందురు.

దేశం, భూలోకం ఈ రెండు పదాలకూ హీబ్రూ పదం ఒకటే. బహుశా ఇస్రాయేల్‌లోని న్యాయవంతులకు ఆ దేశం వారసత్వంగా కలుగుతుందని దావీదు ఉద్దేశం (11,22,29 వ). అయితే సాధుగుణం గలవారికి ఈ లోకమంతా వారసత్వంగా కలుగుతుందని క్రీస్తు మాట ఇచ్చాడు (మత్తయి 5:5).

10. ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడకపోవుదురు.

11. దీనులు భూమిని స్వతంత్రించుకొందురు బహు క్షేమము కలిగి సుఖించెదరు
మత్తయి 5:5

12. భక్తిహీనులు నీతిమంతులమీద దురాలోచన చేయుదురు వారినిచూచి పండ్లు కొరుకుదురు.
అపో. కార్యములు 7:54

14,32 వచనాలు. దుర్మార్గులు న్యాయవంతులను ద్వేషించడానికి కారణం కేవలం వారు న్యాయవంతులనే. వారికి వేరే కారణమేదీ అవసరం లేదు (యోహాను 15:19; 1 యోహాను 3:12).

13. వారి కాలము వచ్చుచుండుట ప్రభువు చూచు చున్నాడు. వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు.

14. దీనులను దరిద్రులను పడద్రోయుటకై యథార్థముగా ప్రవర్తించువారిని చంపుటకై భక్తిహీనులు కత్తి దూసియున్నారు విల్లెక్కుపెట్టి యున్నారు

దేవుడు, సామాజిక శాసనాలు గనుక దుర్మార్గుల్ని అదుపులో పెట్టకపోతే వారు త్వరలోనే న్యాయంకోసం నిలిచేవారందరినీ చంపేస్తారు.

15. వారి కత్తి వారి హృదయములోనే దూరును వారి విండ్లు విరువబడును.

16. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధనసమృద్ధికంటె శ్రేష్టము.

ధన సమృద్ధి కలిగి వక్రమార్గంలో నడవడం కంటే కొంచెమే కలిగి యథార్థవంతులై ఉండడం ఎంతో ఉత్తమం. విందు భోజనాలు చేస్తూ దుర్మార్గులుగా ఉండడం కంటే పస్తులుంటూ నిజాయితీని నిలబెట్టుకోవడం మేలు. ఈ మాటలను నీ హృదయం పలక మీద రాసుకో. సామెతలు 15:16; సామెతలు 16:8; 1 తిమోతికి 6:6-8 కూడా చూడండి.

17. భక్తిహీనుల బాహువులు విరువబడును నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు

18. నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును.

విశ్వాసులకు శాశ్వత వారసత్వం ఉంది – 1 కోరింథీయులకు 3:21-23; 2 కోరింథీయులకు 4:17; హెబ్రీయులకు 9:15; 1 పేతురు 1:3-4. అలాంటప్పుడు కొద్ది సంవత్సరాలుండి గతించిపోయే సంపదలున్నవారిని చూచి విశ్వాసులు అసూయ చెందడం దేనికి?

19. ఆపత్కాలమందు వారు సిగ్గునొందరు కరవు దినములలో వారు తృప్తిపొందుదురు.

20. భక్తిహీనులు నశించిపోవుదురు యెహోవా విరోధులు మేతభూముల సొగసును పోలియుందురు అది కనబడకపోవునట్లు వారు పొగవలె కనబడకపోవుదురు.

21. భక్తిహీనులు అప్పుచేసి తీర్చకయుందురు నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తురు.

22. యెహోవా ఆశీర్వాదము నొందినవారు భూమిని స్వతంత్రించుకొందురు ఆయన శపించినవారు నిర్మూలమగుదురు.

24. యెహోవా అతని చెయ్యి పట్టుకొని యున్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక యుండడు.

సామెతలు 24:16. పాప విముక్తి, రక్షణ పొందినవారు కూడా పడిపోయేందుకు అవకాశం ఉంది. దీన్ని మనం కాదనలేము. బైబిలు ఈ విషయంలో అనేక ఉదాహరణలను ఇస్తున్నది (ఆదికాండము 12:10-13; ఆదికాండము 13:10-11; ఆదికాండము 16:1-2; ఆదికాండము 26:6-10; ఆదికాండము 27:22-24; నిర్గమకాండము 32:1-5; సంఖ్యాకాండము 20:8-12; న్యాయాధిపతులు 16:1 న్యాయాధిపతులు 16:4; 2 సమూయేలు 11:1-27; 1 రాజులు 11:1-6; 2 దినవృత్తాంతములు 16:10; 2 దినవృత్తాంతములు 20:35; 2 దినవృత్తాంతములు 26:4-5 2 దినవృత్తాంతములు 26:16; మత్తయి 26:69-75; యాకోబు 3:2). అయితే వారు పూర్తిగా దేవుని తోడునుంచి కుప్పకూలిపోయి రక్షణ పోగొట్టుకోరు, నరకానికి పోరు. ఎందుకంటే దేవుడు వారి చెయ్యి విడిచిపెట్టడు (28 వ; యోహాను 10:28-29 మొ।।).

25. నేను చిన్నవాడనై యుంటిని ఇప్పుడు ముసలివాడనై యున్నాను అయినను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచియుండలేదు.

కొన్ని సార్లు దేవుడు న్యాయవంతులను కూడా విడిచిపెట్టినట్టు కొద్దికాలంపాటు వారికి అనిపిస్తుంది (యోబు, దావీదు, యిర్మీయా). అయితే ఇది నిజం కాదు. వారు, వారి సంతానం సాధారణంగా భిక్షమెత్తుకోవలసిన అవసరం ఉండదు. తరచుగా ఇతరులకు ఇవ్వడానికి చాలినంత వారి దగ్గర ఉంటుంది.

26. దినమెల్ల వారు దయాళురై అప్పు ఇచ్చుచుందురు వారి సంతానపువారు ఆశీర్వదింపబడుదురు.

27. కీడు చేయుట మాని మేలు చేయుము అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు

నిజమైన భక్తి విషయంలో చేయవలసినవి రెండు ఉన్నాయి. దుర్మార్గాన్ని విడిచిపెట్టడం మాత్రమే చాలదు. మంచి చేయడం కూడా అంత ముఖ్యమే (కీర్తనల గ్రంథము 34:14; యెషయా 1:16-17).

28. ఏలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు ఆయన తన భక్తులను విడువడు వారెన్న టెన్నటికి కాపాడబడుదురు గాని భక్తిహీనుల సంతానము నిర్మూలమగును.

29. నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు వారు దానిలో నిత్యము నివసించెదరు.

30. నీతిమంతుల నోరు జ్ఞానమునుగూర్చి వచించును వారి నాలుక న్యాయమును ప్రకటించును.

దుర్మార్గులకూ సన్మార్గులకూ ఎంత తేడా!

31. వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో నున్నది వారి అడుగులు జారవు.

32. భక్తిహీనులు నీతిమంతులకొరకు పొంచియుండి వారిని చంపజూతురు.

33. వారిచేతికి యెహోవా నీతిమంతులను అప్పగింపడు వారు విమర్శకు వచ్చినప్పుడు ఆయన వారిని దోషులుగా ఎంచడు.

34. యెహోవాకొరకు కనిపెట్టుకొని యుండుము ఆయన మార్గము ననుసరించుము భూమిని స్వతంత్రించుకొనునట్లు ఆయన నిన్ను హెచ్చించును భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు.

న్యాయం జరగడంలో చాలా ఆలస్యమైనట్టు అనిపిస్తుంది. కానీ న్యాయం జరగడం మాత్రం తప్పనిసరి. ఈ విషయంలో వేరే అభిప్రాయం ఏదీ పెట్టుకోకూడదు.

35. భక్తిహీనుడు ఎంతో ప్రబలియుండుట నేను చూచి యుంటిని అది మొలచిన చోటనే విస్తరించిన చెట్టువలె వాడు వర్ధిల్లి యుండెను.

ఈ విషయం చరిత్ర పుటల్లో పదే పదే రుజువైంది. రాజులు, దినవృత్తాంతాలు గ్రంథాలు చదివి చూడండి.

36. అయినను ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోయెను నేను వెదకితిని గాని వాడు కనబడకపోయెను.

37. నిర్దోషులను కనిపెట్టుము యథార్థవంతులను చూడుము సమాధానపరచువారి సంతతి నిలుచును గాని ఒకడైనను నిలువకుండ అపరాధులు నశించుదురు

38. భక్తిహీనుల సంతతి నిర్మూలమగును. యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము

39. బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయ దుర్గము. యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును వారు యెహోవా శరణుజొచ్చి యున్నారు గనుక

40. ఆయన భక్తిహీనుల చేతిలోనుండి వారిని విడిపించి రక్షించును.Shortcut Links
కీర్తనల గ్రంథము - Psalms : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114 | 115 | 116 | 117 | 118 | 119 | 120 | 121 | 122 | 123 | 124 | 125 | 126 | 127 | 128 | 129 | 130 | 131 | 132 | 133 | 134 | 135 | 136 | 137 | 138 | 139 | 140 | 141 | 142 | 143 | 144 | 145 | 146 | 147 | 148 | 149 | 150 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |