Psalms - కీర్తనల గ్రంథము 42 | View All

1. దుప్పి నీటివాగులకొరకు ఆశపడునట్లు దేవా, నీకొరకు నా ప్రాణము ఆశపడుచున్నది.

శీర్షిక – కోరహు సంతతివారు (సంఖ్యాకాండము 16:32 చూడండి) అంటే యెహోవా భజనలు చేసేందుకు ఉన్న ఒక గాయక బృందం (1 దినవృత్తాంతములు 6:1 1 దినవృత్తాంతములు 6:7 1 దినవృత్తాంతములు 6:16; 1 దినవృత్తాంతములు 9:19; 1 దినవృత్తాంతములు 26:1). ఇక్కడ హీబ్రూ పదాలకు కోరహు సంతతి వారి “యొక్క” అనీ కోరహు సంతతివారి “కోసం” అనీ రెండు అర్థాలు వస్తాయి. దీనికి బహుశా “కోసం” అని వచ్చే అర్థమే సరైనది కావచ్చు. ఎందుకంటే గాయక బృందంలోని వారంతా కలిసి ఏకవచనం వాడుకొంటూ ఒక కీర్తనను తయారు చేయడం అసాధారణం. ఇందులో భాష దావీదు కలంనుంచి వెలువడినట్టు ధ్వనిస్తూ ఉంది. ఈ కీర్తనకు “ఆధ్మాత్మిక నిరుత్సాహం, అందుకు కారణాలు, నివారణోపాయాలు” అని పేరు పెట్టవచ్చు. ఈ కవి విషయంలో ఇలాంటి స్థితికి కారణాలు అయిదు. ఇతడు దేవుణ్ణి వెతికాడు గాని ఆయన సన్నిధిని చేరే తాజా అనుభవాన్ని పొందలేకపోయాడు (1,2 వ). దేవుడు అతణ్ణి వదలివేసినట్టుగా కనిపిస్తూ ఉంది కాబట్టి అతని శత్రువులు అతణ్ణి ఎత్తిపొడుస్తూ ఉన్నారు (3 వ). ఇంతకు ముందు అతడు అనుభవించిన ఆనందకరమైన మంచి రోజులతో ఇప్పటి కష్ట కాలాన్ని పోల్చుకున్నాడు (4 వ). దేవుడు తన పైకి పంపిన కష్టాలు దుఃఖాలలో తాను మునిగిపోయి ఉన్నట్టు అతను భావిస్తున్నాడు (7 వ). తాత్కాలికంగా దేవుడు తన్ను మర్చిపోయాడని అతనికి అనిపించింది (9 వ). నివారణోపాయాలను వెతకకుంటే ఒక వ్యక్తిని ఎడతెగకుండా పట్టి పీడించే శక్తిగల కారణాలే ఇవి. 5,6,11 వచనాల్లో దీనికి నివారణ సూచిస్తున్నాడు. తన నిరుత్సాహానికి అర్థం లేదని గ్రహిస్తున్నాడు. “ఎందుకు” అనే మాటను బట్టి ఇది అర్థమౌతున్నది. ఈ కష్టకాలంలో కూడా దేవుడే తన దేవుడు, తన రక్షకుడు కాబట్టి తాను ఇలాంటి నిరుత్సాహానికి లొంగకూడదని అతను గ్రహిస్తున్నాడు. కనుక దైవ ధ్యానంలో మునిగేందుకు అతడు నిశ్చయించుకున్నాడు (6 వ). తన ఆశాభావం, నమ్మకం దేవునిలోనే పెట్టుకోవాలని తన్ను తాను ప్రోత్సహించు కుంటున్నాడు. ఇప్పటికీ మనో వ్యాకులతకూ ఆందోళన చెందిన మనసులకూ కృంగిన హృదయాలకూ సరియైన నివారణోపాయం ఇదే.

2. నా ప్రాణము దేవునికొరకు తృష్ణగొనుచున్నది జీవము గల దేవునికొరకు తృష్ణగొనుచున్నది దేవుని సన్నిధికి నేనేప్పుడు వచ్చెదను? ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడెదను?
ప్రకటన గ్రంథం 22:4

మనం కృంగిపోయినప్పుడు వెతకవలసినదేమిటో రచయిత ఇక్కడ చూపిస్తున్నాడు. సంపదలు, పేరుప్రతిష్ఠలు, అధికారం కావు. కేవలం దేవుడిచ్చే వరాలే కాదు. మనం వెతకవలసినది సాక్షాత్తు దేవుణ్ణే. విశ్వాన్ని సృష్టించినవారితో వ్యక్తిగత అనుభవం కలగడం ఈ ప్రపంచంకంటే మనం సంపాదించుకోగలిగినది మరి దేనికంటే ఎంతో విలువైనది.

3. నీ దేవుడు ఏమాయెనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్లు నా కన్నీళ్లు నాకు అన్నపానము లాయెను.

4. జనసమూహముతో పండుగచేయుచున్న సమూహ ముతో నేను వెళ్లిన సంగతిని సంతోషముకలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసికొనగా నా ప్రాణము నాలో కరగిపోవుచున్నది.

5. నా ప్రాణమా, నీవు ఏల క్రుంగియున్నావు? నాలో నీవేల తొందరపడుచున్నావు? దేవునియందు నిరీక్షణ యుంచుము. ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను.
మత్తయి 26:38, మార్కు 14:34, యోహాను 12:27

6. నా దేవా, నా ప్రాణము నాలో క్రుంగియున్నది కావున యొర్దాను ప్రదేశమునుండియు హెర్మోను పర్వతమునుండియు మిసారు కొండ నుండియు నేను నిన్ను జ్ఞాపకము చేసికొనుచున్నాను.

ఈ కీర్తనను దావీదే గనుక రాసివుంటే దావీదు కనాను దేశం వెలుపల ఉన్న సమయంలో ఈ నిరుత్సాహం అతనికి కలిగింది. అబ్‌షాలోం చేసిన తిరుగుబాటు సమయంలో దావీదు యొర్దాను నది దాటి పారిపోయినప్పుడు ఇది జరిగిందేమో (2 సమూ 16,17 అధ్యాయాలు).

7. నీ జలప్రవాహధారల ధ్వని విని కరడు కరడును పిలుచుచున్నది నీ అలలన్నియు నీ తరంగములన్నియు నా మీదుగా పొర్లి పారియున్నవి.

విశ్వాసులకు కొన్ని సార్లు తాము కష్టాల్లో మునకలు వేస్తున్నట్టు అనిపిస్తుంది (కీర్తనల గ్రంథము 18:16; కీర్తనల గ్రంథము 69:1-2; కీర్తనల గ్రంథము 88:7).

8. అయినను పగటివేళ యెహోవా తన కృప కలుగ నాజ్ఞాపించును రాత్రివేళ ఆయననుగూర్చిన కీర్తనయు నా జీవదాతయైన దేవునిగూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును.

దారుణమైన కష్టాలలో, నిరుత్సాహంలో అతడు దేవుని మీద తన నమ్మకాన్ని విడిచి పెట్టలేదు. దేవుడు అన్ని పరిస్థితుల్లోనూ తన ప్రజలతో ఉన్నారు (యెషయా 43:2; యెషయా 50:10). “రాత్రి”– యోబు 35:10. “నాకు జీవదాతగా ఉన్న దేవుడు”– అపో. కార్యములు 3:15; అపో. కార్యములు 17:25.

9. కావుననీవేల నన్ను మరచి యున్నావు? శత్రుబాధచేత నేను దుఃఖాక్రాంతుడనై సంచరించ వలసి వచ్చెనేమి అని నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను.

“ఆధారశిల”– ద్వితీయోపదేశకాండము 32:4 నోట్.

10. నీ దేవుడు ఏమాయెనని నా శత్రువులు దినమెల్ల అడుగుచున్నారు. వారు తమ దూషణలచేత నా యెముకలు విరుచు చున్నారు.

11. నా ప్రాణమా, నీవేల క్రుంగియున్నావు? నాలో నీవేల తొందరపడుచున్నావు? దేవునియందు నిరీక్షణ యుంచుము, ఆయనే నా రక్షణకర్త నా దేవుడు ఇంకను నేనాయనను స్తుతించెదను.
మత్తయి 26:38, మార్కు 14:34, యోహాను 12:27Shortcut Links
కీర్తనల గ్రంథము - Psalms : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114 | 115 | 116 | 117 | 118 | 119 | 120 | 121 | 122 | 123 | 124 | 125 | 126 | 127 | 128 | 129 | 130 | 131 | 132 | 133 | 134 | 135 | 136 | 137 | 138 | 139 | 140 | 141 | 142 | 143 | 144 | 145 | 146 | 147 | 148 | 149 | 150 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |