శీర్షిక – యేసుప్రభువును తన సంఘానికి రాజుగానూ పరలోక సంబంధమైన వరునిగానూ చిత్రీకరించే మహిమాన్వితమైన కీర్తన ఇది. 2,6,7,11 లాంటి వచనాలను బట్టి చూస్తే ఇది ఏ భూరాజును ఉద్దేశించి రాసినది కాదని స్పష్టమౌతున్నది. క్రొత్త ఒడంబడికలో హెబ్రీయులకు 1:8-9 లో ఈ కీర్తన 6,7 వచనాలు క్రీస్తును ఉద్దేశించినవని రచయిత రాశాడు. ఈ కీర్తన మూలాంశాన్ని ప్రకటించి 2-9 వచనాల్లో ఈ రాజుతో మాట్లాడుతున్నాడు; 10-15 వచనాల్లో సంఘం క్రీస్తుకు పెండ్లి కుమార్తెగా చిత్రీకరించబడింది; ఆ పైన మళ్ళీ రాజుతో పలికిన ముగింపు వాక్యాలు ఉన్నాయి (16,17 వ).
దివ్య పరమ రాజు సౌంధర్యం, వైభవం, దయ, బలప్రభావాలు, పవిత్ర స్వభావం గురించిన ఆలోచనలు కవి హృదయమంతా నిండి పొంగి పొరలుతున్నాయి. నిజంగా ఓ “మంచి విషయమే” అతని మనసంతా నిండిపోయింది. మన ఆలోచనల్లో నిండే వేరే విషయమేదీ దీనికంటే శ్రేష్ఠమైనది ఉండబోదు.