Psalms - కీర్తనల గ్రంథము 66 | View All

1. సర్వలోకనివాసులారా, దేవునిగూర్చి సంతోష గీతము పాడుడి. ఆయన నామప్రభావము కీర్తించుడి

దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి మానవులంతా ఆయన్ను గౌరవించాలని ఆశిస్తాడు. ఇక్కడ భవిష్యత్తు గురించిన అర్థం ఉంది. భూజనాలంతా దేవుణ్ణెరిగి ఆయన్ను స్తుతిస్తారని ప్రవక్తలు పలికారు (యెషయా 2:2-4; యెషయా 11:9).

2. ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించుడి

3. ఈలాగు దేవునికి స్తోత్రము చెల్లించుడి. నీ కార్యములు ఎంతో భీకరమైనవి నీ బలాతిశయమునుబట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చెదరు

కీర్తనల గ్రంథము 18:44; కీర్తనల గ్రంథము 81:15. వారు తిరుగుబాటు ధోరణిని వెల్లడించేందుకు భయపడి, విధేయులైనట్టు నటిస్తారు.

4. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును నీ నామమునుబట్టి నిన్ను కీర్తించును.(సెలా.)

5. దేవుని ఆశ్చర్యకార్యములను చూడ రండి నరులయెడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై యున్నాడు.

6. ఆయన సముద్రమును ఎండిన భూమిగా జేసెను జనులు కాలినడకచే దాటిరి. అక్కడ ఆయనయందు మేము సంతోషించితివిు.

నిర్గమకాండము 14:21; యెహోషువ 3:16. భయభక్తులు కొలిపే దేవుని ఘనకార్యాలకు ఇది మచ్చుతునకలు.

7. ఆయన తన పరాక్రమమువలన నిత్యము ఏలుచున్నాడు? అన్యజనులమీద ఆయన తన దృష్టియుంచియున్నాడు. ద్రోహులు తమ్ము తాము హెచ్చించుకొన తగదు.(సెలా.)

మోషే, యెహోషువల కాలంలో దేవుడు పరిపాలించాడు. ఇప్పుడూ పరిపాలిస్తున్నాడు. మరెప్పటికీ పరిపాలిస్తాడు. ఏమేమి జరుగుతున్నదీ ఆయనకు తెలుసు. తన ఉద్దేశాలను నెరవేర్చడానికి సంఘటనలను ఎలా తన వశంలో ఉంచుకోవాలో ఆయనకు తెలుసు. ఏ పాపం చేసినా అది విశ్వాన్ని ఏలే మహా శక్తిమంతుడైన దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినట్టే. అలాంటప్పుడు పాపం చేయడమన్నది పిచ్చితనం గాక గొప్పలు చెప్పుకునేందుకు కారణమెలా కాగలదు? తిరుగుబాటు చేసేవారు సృష్టికర్త తమను అణచలేడని భావిస్తూ ఉన్నారా ఏమిటి?

8. జనములారా, మా దేవుని సన్నుతించుడి గొప్ప స్వరముతో ఆయన కీర్తి వినిపించుడి.

ఇస్రాయేల్ యొక్క దేవుణ్ణి స్తుతించండని దావీదు లోక ప్రజలందరినీ ఎందుకు హెచ్చరిస్తున్నాడు? ఎందుకంటే ఆ దేవుడే సృష్టికర్త, ఏకైక నిజ దేవుడు. అన్ని జాతుల గురించీ ఆయనకు ఉన్నతమైన ఉద్దేశం ఉంది. తానే అన్ని జాతులకు దేవుణ్ణని చివరికి ప్రత్యక్షం చేసుకొంటాడు.

9. జీవప్రాప్తులనుగా మమ్మును కలుగజేయువాడు ఆయనే ఆయన మా పాదములు కదలనియ్యడు.

“ఆయన మనల్ని సజీవులుగా ఉంచుతున్నాడు” అని కూడా దీన్ని తర్జుమా చేయవచ్చు. మనం బ్రతుకుతున్నామంటే ఆయన మూలంగానే. మనం పడిపోకుండా నిలిచి ఉంటున్నామంటే అది ఆయన కృపే. ఆయననే స్తుతించండి.

10. దేవా, నీవు మమ్మును పరిశీలించియున్నావు. వెండిని నిర్మలము చేయురీతిగా మమ్మును నిర్మలులను చేసియున్నావు.
1 పేతురు 1:7

తన పిల్లల్లో ప్రతి వ్యక్తినీ దేవుడు పరీక్షిస్తాడు, క్రమశిక్షణ నేర్పిస్తాడు. మనం ఏమై ఉన్నామో దానిని, మన ఆలోచనలను, మన నమ్మకాలను, మన చర్యలను అన్నిటినీ ఆయన పరీక్షకు గురి చేసి శోధిస్తాడు. ఆయనమీద నమ్మకముంచిన వారికి ఈ లోకం పరీక్షా ప్రదేశం. దేవుని వెండిని (విశ్వాసులను) శుద్ధి చేసే కొలిమి ఇది. అంటే ఇక్కడ దేవుడు నమ్మకాన్నీ గుణాలనూ శుద్ధి చేస్తూ వికసింపజేస్తూ ఉన్నాడు. ఇది ఒక అరణ్య ప్రాంతం, ఒక ఎడారి. ఇక్కడ కఠినులైన మనుషులు విశ్వాసులను వేటాడి పట్టుకుని వారి పై మోయరాని బరువులను మోపడం, గర్విష్ఠులు వారిపై స్వారీ చేస్తూ వారిని ధూళిలో తొక్కివేయడం జరుగుతున్నది (అయితే ఇదంతా దేవుని మంచి ఉద్దేశాలు నెరవేరేందుకే). ఈ లోకాన్ని దేనితో పోల్చాలి? ఇది దేవునికి చెందిన లోహాన్ని ముందు కొలిమిలో కాల్చి తరువాత నీటిలో ముంచడం ద్వారా చేవ పెట్టడం, పదును చేయడం జరుగుతున్న స్థలం. ఈ విధంగా పవిత్రులు దృఢపడతారు. దావీదు వ్యక్తిగత జీవితంలో ఇలానే జరిగింది. నిజంగా దేవునికి చెందిన వారందరి జీవితాల్లో కూడా ఇలాంటిదే జరుగుతూ ఉంటుంది (యోహాను 16:33; హెబ్రీయులకు 12:7-11; 1 పేతురు 1:6-7; 1 పేతురు 4:1 1 పేతురు 4:12). ఈ వచనాల్లో ఈ పనులన్నీ చేస్తున్నది మనుషులే అయినప్పటికీ, వాటి వెనుక ఉన్నది దేవుని హస్తమే అని గమనించండి. ఆదికాండము 45:5; ఆదికాండము 50:20; అపో. కార్యములు 2:23 చూడండి. ఇలాంటి పరీక్షల గురించి ఆదికాండము 22:1; న్యాయాధిపతులు 2:22 నోట్స్ చూడండి. “వెండి”– వెండిని శుద్ధి చేసేందుకు ఎంతో శ్రద్ధ, నిపుణత అవసరం. కొలిమిలో మంట ఎక్కువ గానీ తక్కువ గానీ కాకూడదు. దేవుడు తన పిల్లలను విషమ పరీక్షలకు గురి చేయడంలో ఎంతో జాగ్రత్త వహిస్తాడు. ఎంతో ఓపిక చూపుతాడు. తమ పిల్లలను ప్రేమించని తల్లిదండ్రులు అడపాదడపా ఒక చెంప దెబ్బ మినహా మరి ఏ విధమైన క్రమశిక్షణా లేకుండా పెంచుతారు. దేవుడు తన పిల్లలను ప్రేమిస్తున్నాడు. కాబట్టి జాగ్రత్తగా వారికి క్రమశిక్షణ నేర్పుతాడు. విషమ పరీక్షలు మాకు వద్దని మనం తోసిపుచ్చితే శుద్ధి కావడానికి, పవిత్రం చేయబడడానికి నిరాకరిస్తున్నాం అన్నమాట.

11. నీవు బందీగృహములో మమ్ము ఉంచితివి మా నడుములమీద గొప్పభారము పెట్టితివి.

“బందీలు”– దీన్ని “వలలో వేయడం” అని కూడా తర్జుమా చేయవచ్చు. ఇలా జరిగించేది దేవుడే అన్నది గమనించండి.

12. నరులు మా నెత్తిమీద ఎక్కునట్లు చేసితివి మేము నిప్పులలోను నీళ్లలోను పడితివిు అయినను నీవు సమృధ్ధిగలచోటికి మమ్ము రప్పించి యున్నావు.

ఈ పరీక్షల ఫలితమేమిటో చూడండి. ఆ పరీక్షల్లో తన ప్రజల పట్ల తన ఉద్దేశమంతా నెరవేరిన తరువాత దేవుడు చాలు అన్నాడు. అప్పుడు తన ప్రజలకు గొప్ప దీవెనలు ప్రసాదించాడు. మనం ఈ భూమి పై ఉన్న కాలంలో కూడా విషమ పరీక్షలు ఎడతెరిపి లేకుండా రావు. మనల్ని వేడిమిలో ఎంతకాలం ఉంచాలో దేవునికి తెలుసు (1 పేతురు 1:7; 1 పేతురు 5:10; యాకోబు 1:3-4; హెబ్రీయులకు 12:11; 2 కోరింథీయులకు 4:17; రోమీయులకు 8:17-18; కీర్తనల గ్రంథము 71:20; కీర్తనల గ్రంథము 18:16-19; కీర్తనల గ్రంథము 103:13-14;)

13. దహనబలులను తీసికొని నేను నీ మందిరములోనికి వచ్చెదను.

విజయవంతంగా విషమ పరీక్షలను సహించడం దేవునికి చాలా కృతజ్ఞతలు అర్పించడానికి కారణం అవుతుంది. ఆ పరీక్షలలో మన దేవుని ప్రేమ హస్తం మన మేలుకోసం పనిచేస్తూ ఉండడం మనం గమనించి ఆయనకు ప్రీతిని కొలుపుతాయి అనుకున్న కానుకలను ఆయనకు అర్పించాలి. మన సంపూర్ణ హృదయాలనూ, మన శరీరాలనూ సజీవ యాగంగా ఆయనకు అర్పిద్దాం (రోమీయులకు 12:1-2). ఇప్పుడు ఆయన ఆశించేది ఇలాంటి అర్పణలనే.

14. నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మ్రొక్కుబడులను నా నోరు వచించిన మ్రొక్కుబడులను నేను నీకు చెల్లించెదను

15. పొట్టేళ్లను ధూపమును క్రొవ్విన గొఱ్ఱెలను తీసికొని నీకు దహనబలులు అర్పించెదను. ఎద్దులను పోతుమేకలను అర్పించెదను.(సెలా).

16. దేవునియందు భయభక్తులుగలవారలారా, మీరందరు వచ్చి ఆలకించుడి ఆయన నాకొరకు చేసిన కార్యములను నేను వినిపించెదను.

అతడు దేవునితో మాట్లాడాడు, ఇప్పుడు మనుషులతో కూడా మాట్లాడుతాడు. దేవుడు మనకోసం చేసిన దాన్ని ఇతరులకు చెప్పడం యుక్తం, ఇది మంచిది (కీర్తనల గ్రంథము 71:15-16; కీర్తనల గ్రంథము 107:2; మత్తయి 10:32). ఇతని సాక్ష్యంలో సారాంశం ఇది: దేవుడు దయ, ప్రేమ చూపాడు. అతని ప్రార్థనలను విన్నాడు. కీర్తనల గ్రంథము 65:2-3 నోట్ చూడండి.

17. ఆయనకు నేను మొఱ్ఱపెట్టితిని అప్పుడే నా నోట శ్రేష్ఠమైన కీర్తన యుండెను.

18. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన యెడల ప్రభువు నా మనవి వినకపోవును.
యోహాను 9:31

ఇక్కడి అర్థం ఇది కావచ్చు: తన హృదయంలో ఏవిధమైన చెడుతనమైనా ఉన్నట్టు తాను గమనించి దాన్ని అలానే ఉండనిస్తే, లేక తెలిసి తెలిసి పాపాన్ని మదిలో దాచుకుంటే దాన్ని ఒప్పుకోకుండా విడిచిపెట్టకుండా ఉంటే లేక తన ప్రార్థనలో దురాశలు, చెడు ఉద్దేశాలు ఏమన్నా ఉంటే దేవుడు అతని ప్రార్థన వినడు (సామెతలు 15:29; యెషయా 1:15; యెషయా 59:2; యోహాను 9:31; 1 యోహాను 3:21-22). హృదయంలో ఉండనిచ్చిన పాపం అడ్డుకున్నంత కంటే ప్రార్థనను మరేదీ అడ్డుకోవడం అసాధ్యం. దేవుడు చెడుతనాన్ని, కపటాన్ని ప్రోత్సహించేవాడు కాడు.

19. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి యున్నాడు ఆయన నా విజ్ఞాపన ఆలకించియున్నాడు

20. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు నాయొద్దనుండి తన కృపను తొలగింపలేదు; ఆయన సన్నుతింపబడును గాక.Shortcut Links
కీర్తనల గ్రంథము - Psalms : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114 | 115 | 116 | 117 | 118 | 119 | 120 | 121 | 122 | 123 | 124 | 125 | 126 | 127 | 128 | 129 | 130 | 131 | 132 | 133 | 134 | 135 | 136 | 137 | 138 | 139 | 140 | 141 | 142 | 143 | 144 | 145 | 146 | 147 | 148 | 149 | 150 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |