Song of Solomon - పరమగీతము 3 | View All

1. రాత్రివేళ పరుండియుండి నేను నా ప్రాణప్రియుని వెదకితిని వెదకినను అతడు కనబడక యుండెను.

దేవుడు దూరమైనట్టుగా, క్రీస్తు సన్నిధి తొలిగి పోయినట్టుగా అనిపించిన వేళ విశ్వాసికి విషమ పరీక్ష. అప్పుడేం చేస్తాడు? మళ్ళీ క్రీస్తును వెదకాలి (యోబు 23:3; కీర్తనల గ్రంథము 6:1-4; కీర్తనల గ్రంథము 13:1-3; కీర్తనల గ్రంథము 28:1-2; కీర్తనల గ్రంథము 38:21-22; కీర్తనల గ్రంథము 42:1-3; కీర్తనల గ్రంథము 63:1; కీర్తనల గ్రంథము 77:1-9; కీర్తనల గ్రంథము 105:4; కీర్తనల గ్రంథము 143:6-7; హోషేయ 5:6, హోషేయ 5:15; ఆమోసు 5:4, ఆమోసు 5:8). ఒక్కోసారి క్త్రెస్తవ అనుభవమంతా చీకటిలో, ఒంటరి దారిలో తిరుగుతున్నట్టు ఉంటుంది. అయితే దేవుడు కొందరు కావలివాళ్ళను నియమించాడు – క్రీస్తు దగ్గరకు దారి చూపించే విశ్వాస పాత్రులైన దైవ సేవకులు.

2. నేనిప్పుడే లేచెదను పట్టణము వెంబడిపోయి వెదకుదును సంతవీధులలోను రాజవీధులలోను తిరుగుదును నా ప్రాణప్రియుని వెదకుదును అని నేననుకొంటిని. నేను వెదకినను అతడు కనబడలేదు.

3. పట్టణమునందు సంచరించు కావలివారు నాకెదురు పడగా మీరు నా ప్రాణప్రియుని చూచితిరా? అని నేనడిగి తిని

4. నేను వారిని విడిచి కొంచెము దూరము పోగా నా ప్రాణప్రియుడు నాకెదురుపడెను వదలిపెట్టక నేనతని పట్టుకొంటిని నా తల్లి యింటికతని తోడుకొని వచ్చితిని నన్ను కనినదాని యరలోనికి తోడుకొని వచ్చితిని.

5. యెరూషలేము కుమార్తెలారా, పొలములోని యిఱ్ఱులనుబట్టియు లేళ్లనుబట్టియు మీచేత ప్రమాణము చేయించుకొని లేచుటకు ప్రేమకు ఇష్టమగువరకు మీరు లేపకయు కలతపరచకయు నుండుడని నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను.

6. ధూమ స్తంభములవలె అరణ్యమార్గముగా వచ్చు ఇది ఏమి? గోపరసముతోను సాంబ్రాణితోను వర్తకులమ్ము వివిధమైన సుగంధ చూర్ణములతోను పరిమళించుచు వచ్చు ఇది ఏమి?

ఇక్కడ స్నేహితులు మాట్లాడుతూ ఉన్నట్టు అనుకోవాలి. ఈ పుస్తకంలోని పరమ సత్యాలకు సూచనగా ఉన్న సొలొమోను రాజునూ అతని పెండ్లి కూతురునూ గురించి మాట్లాడుతున్నారు. సొలొమోను తన రాజ ఠీవి, వైభవమంతటితో తన వధువును తీసుకువెళ్ళడానికి వచ్చినట్టుంది (పరమగీతము 8:5 పోల్చిచూడండి). ఇందులో విశ్వాసుల విషయంలో ఆధ్యాత్మిక భావం లేకపోలేదు. ఈ పుస్తకంలోని ప్రత్యేకమైన గుణాల్లో ఒకటి ఏమిటంటే దృశ్యాలు హఠాత్తుగా మారిపోతూ ఉంటాయి. వధువు గొర్రెల కాపరుల పొలాల్లో తన ప్రియుని కోసం వెదుకుతూ ఉంది (పరమగీతము 1:7-8); వరుడు దగ్గరలో ఉన్నాడు (పరమగీతము 1:9-11); వారిద్దరూ రాజనగరులో జంటగా ఉన్నారు (పరమగీతము 1:12-17); హఠాత్తుగా వరుడు కొండల్లో ఉన్నాడు గాని ప్రియసఖి కోసం ఆమె ఇంటికి త్వరత్వరగా వచ్చి పిలుస్తున్నాడు (పరమగీతము 2:8-15); మళ్ళీ అతను కొండల్లో ఉన్నాడు, ఆమె ఒంటరిదైపోయింది (పరమగీతము 2:16-17} పరమగీతము 3:1-3); వారిద్దరూ ఆమె తల్లి ఇంట్లో ఒకటిగా ఉన్నారు (పరమగీతము 3:4-5); ఇప్పుడు వరుడు ఎడారి మార్గాన ఆర్భాటంతో వైభవంతో వస్తున్నాడు. ముందు కూడా ఈ పుస్తకం తీరు ఇలానే ఉంటుంది. అంటే, దీన్లో క్రమబద్ధమైన కథ ఆరంభం, మధ్యం, అంతం అంటూ సాఫీగా సాగదు. వధూవరుల మధ్య ఉన్న సంబంధాన్ని చిత్రీకరించే వివిధమైన సన్నివేశాలు చిన్నచిన్నవి కనిపిస్తాయి. ఇలా రాయడంలో ఉన్న ఆధ్యాత్మిక ఉద్దేశం ఏమిటంటే విశ్వాసులు క్రీస్తులో తమ జీవితంలో చవి చూడవలసిన వివిధమైన అనుభవాలను వివరించడం, క్రీస్తు సౌంధర్యాన్ని, వైభవాన్ని, తన సంఘం కోసం ఆయనకున్న లలితమైన ప్రేమను వెల్లడి చేయడం. ఈ భాగంలో ఆయన మహిమ, బలప్రభావాలను కొంతమట్టుకు చూడగలం (కీర్తనల గ్రంథము 45:3-5 పోల్చిచూడండి). విశ్వాసులు (వారికిది తెలిసివున్నా తెలియకపోయినా) ఈ లోకంలో మహిమ రాజు ప్రక్కన కూర్చునివుండి పరలోక సంబంధమైన పల్లకీలో సాగిపోతున్నారు. రాత్రివేళల్లో అపాయం వాటిల్లే అవకాశం ఉన్నప్పటికీ (వ 8) రాజుతో కలిసి వెళ్తున్న ఆయన వధువుకు కట్టుదిట్టమైన భద్రత ఉంది.

7. ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది అరువదిమంది శూరులు దానికి పరివారము వారు ఇశ్రాయేలీయులలో పరాక్రమశాలులు వారందరును ఖడ్గధారులు యుద్ధవీరులు

8. రాత్రి భయముచేత వారు ఖడ్గము ధరించి వచ్చు చున్నారు.

9. లెబానోను మ్రానుతో మంచమొకటి సొలొమోనురాజు తనకు చేయించుకొని యున్నాడు.

10. దాని స్తంభములు వెండిమయములు దాని పాదములు స్వర్ణమయములు దాని మెత్తలు ధూమ్రవర్ణవస్త్రముతో చేయబడెను ప్రేమను సూచించు విచిత్రమైన కుట్టుపనితో యెరూషలేము కుమార్తెలు దాని లోపలిభాగము నలంకరించిరి.

11. సీయోను కుమార్తెలారా, వేంచేయుడి కిరీటము ధరించిన సొలొమోనురాజును చూడుడి వివాహదినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటము చూడుడి ఆ దినము అతనికి బహు సంతోషకరము.Shortcut Links
పరమగీతము - Song of Solomon : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |