Turn Off
21st Century KJV
A Conservative Version
American King James Version (1999)
American Standard Version (1901)
Amplified Bible (1965)
Apostles' Bible Complete (2004)
Bengali Bible
Bible in Basic English (1964)
Bishop's Bible
Complementary English Version (1995)
Coverdale Bible (1535)
Easy to Read Revised Version (2005)
English Jubilee 2000 Bible (2000)
English Lo Parishuddha Grandham
English Standard Version (2001)
Geneva Bible (1599)
Hebrew Names Version
Hindi Bible
Holman Christian Standard Bible (2004)
Holy Bible Revised Version (1885)
Kannada Bible
King James Version (1769)
Literal Translation of Holy Bible (2000)
Malayalam Bible
Modern King James Version (1962)
New American Bible
New American Standard Bible (1995)
New Century Version (1991)
New English Translation (2005)
New International Reader's Version (1998)
New International Version (1984) (US)
New International Version (UK)
New King James Version (1982)
New Life Version (1969)
New Living Translation (1996)
New Revised Standard Version (1989)
Restored Name KJV
Revised Standard Version (1952)
Revised Version (1881-1885)
Revised Webster Update (1995)
Rotherhams Emphasized Bible (1902)
Tamil Bible
Telugu Bible (BSI)
Telugu Bible (WBTC)
The Complete Jewish Bible (1998)
The Darby Bible (1890)
The Douay-Rheims American Bible (1899)
The Message Bible (2002)
The New Jerusalem Bible
The Webster Bible (1833)
Third Millennium Bible (1998)
Today's English Version (Good News Bible) (1992)
Today's New International Version (2005)
Tyndale Bible (1534)
Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537)
Updated Bible (2006)
Voice In Wilderness (2006)
World English Bible
Wycliffe Bible (1395)
Young's Literal Translation (1898)
Telugu Bible Verse by Verse Explanation
పరిశుద్ధ గ్రంథ వివరణ
Telugu Bible Commentary
1. ఏలయనగా యెహోవా యాకోబునందు జాలిపడును ఇంకను ఇశ్రాయేలును ఏర్పరచుకొనును వారిని స్వదేశములో నివసింపజేయును పరదేశులు వారిని కలిసికొందురు వారు యాకోబు కుటుంబమును హత్తుకొనియుందురు
ధర్మశాస్త్రం పొల్లు పోకుండా నెరవేరవలసి ఉన్నట్టే ప్రవక్తల వచనాలన్నీ కూడా తు.చ. తప్పక నెరవేరాలి. ఈ వచనాలన్నీ (ముఖ్యంగా 2వ వచనం) యూదులు బబులోనునుండి స్వదేశానికి తిరిగి వెళ్ళినప్పుడు పూర్తిగా నెరవేరలేదన్నది స్పష్టమే. ఇస్రాయేల్ వారు తమను వధించిన వారిపై, చెరపట్టిన వారిపై ఇలాంటి అధికారాన్నీ, పరిపాలననూ చెలాయించినట్టు చరిత్ర ఆధారాలు ఈనాటికీ లేవు. కాబట్టి దీని సంపూర్ణమైన నెరవేర్పు రాబోయే కాలంలో ఉంటుందని భావించాలి. 1వ వచనంలో ‘దేవుడు మరో సారి ఇస్రాయేల్ప్రజలను ఎన్నుకొంటాడు’ అనే మాటను గమనించండి – అంటే కొంతకాలంపాటు వారిని వదిలేశాడన్నమాట. మత్తయి 21:43 చూడండి. దీన్ని మత్తయి 19:28; అపో. కార్యములు 1:6-7; రోమీయులకు 11:11-12, రోమీయులకు 11:15, రోమీయులకు 11:23-29; ప్రకటన గ్రంథం 7:1-8 తో పోల్చి చూడండి.
2. జనములు వారిని తీసికొనివచ్చి వారి స్వదేశమున వారిని ప్రవేశపెట్టుదురు ఇశ్రాయేలు వంశస్థులు యెహోవా దేశములోవారిని దాసులనుగాను పనికత్తెలనుగాను స్వాధీనపరచు కొందురు వారు తమ్మును చెరలో పెట్టినవారిని చెరలో పెట్టి
3. తమ్మును బాధించినవారిని ఏలుదురు.
బైబిల్లో రెండు బబులోనులను గురించిన వర్ణనలు ఉన్నాయి. ఒకటి యూఫ్రటీసు నదీతీరాన వెలసిన అక్షరాలా బబులోను నగరం. రెండోది ప్రకటన 17, 18 అధ్యాయాల్లోని సాదృశ్యరూపకమైన బబులోను. మామూలు నగరమైతే 2,500 ఏళ్ళ క్రితమే పతనమైపోయింది. రెండవ బబులోను పతనం ఇంకా జరగవలసి ఉంది. తరువాత రాబోయే వచనాలు ఈ రెండు బబులోనుల వినాశన కాలాలకు రెంటికీ వర్ణిస్తున్నాయను కోవడానికి అవకాశం ఉంది.
4. నీ బాధను నీ ప్రయాసమును నీచేత చేయింపబడిన కఠినదాస్యమును కొట్టివేసి యెహోవా నిన్ను విశ్రమింపజేయు దినమున నీవు బబులోనురాజును గూర్చి అపహాస్యపు గీతము ఎత్తి యీలాగున పాడుదువు బాధించినవారు ఎట్లు నశించిపోయిరి? రేగుచుండిన పట్టణము ఎట్లు నాశనమాయెను?
“దండం”– యెషయా 10:5, యెషయా 10:24.
5. దుష్టుల దుడ్డుకఱ్ఱను మానని హత్యచేత జనములను క్రూరముగా కొట్టిన ఏలికల రాజదండమును యెహోవా విరుగగొట్టియున్నాడు.
6. వారు ఆగ్రహపడి మానని బలాత్కారముచేత జనములను లోపరచిరి.
7. భూలోకమంతయు నిమ్మళించి విశ్రమించుచున్నది జనములు పాడసాగుదురు. నీవు పండుకొనినప్పటినుండి నరుకువాడెవడును మా మీదికి రాలేదని
ఒకవేళ బబులోను నగరం పతనమైపోగానే ఈ నెమ్మది ప్రశాంతత కలిగాయన్నదే నిజమైతే ఈ నెమ్మది ఎంతో కాలం నిలవలేదు.
8. నిన్నుగూర్చి తమాలవృక్షములు లెబానోను దేవదారువృక్షములు హర్షించును
9. నీవు ప్రవేశించుచుండగానే నిన్ను ఎదుర్కొనుటకై క్రింద పాతాళము నీ విషయమై కలవరపడుచున్నది. అది నిన్ను చూచి ప్రేతలను రేపుచున్నది భూమిలో పుట్టిన సమస్త శూరులను జనముల రాజుల నందరినివారి వారి సింహాసనములమీదనుండి లేపుచున్నది
“మృత్యు లోకం”– ఆదికాండము 37:35 నోట్స్.
10. వారందరు నిన్ను చూచినీవును మావలె బలహీనుడ వైతివా? నీవును మాబోటివాడవైతివా? అందురు.
దేవునితో నిమిత్తం లేకుండా మనిషి ఆర్జించిన ఘనత, వైభవం, సౌందర్యం అంతటికీ అంతం ఇదే. అయితే పరలోక సౌందర్యానికీ, మహిమకూ, దేవుడు విమోచించిన ప్రజలు క్రీస్తుతోపాటు వారసులౌతారు.
11. నీ మహాత్మ్యమును నీ స్వరమండలముల స్వరమును పాతాళమున పడవేయబడెను. నీ క్రింద పురుగులు వ్యాపించును కీటకములు నిన్ను కప్పును.
12. తేజోనక్షత్రమా, వేకువచుక్కా, నీవెట్లు ఆకాశమునుండి పడితివి? జనములను పడగొట్టిన నీవు నేలమట్టమువరకు ఎట్లు నరకబడితివి?లూకా 10:18, ప్రకటన గ్రంథం 8:10
ఈ మాటలు ఒక్క బబులోను రాజును ఉద్దేశించి మాత్రమే పలికినవని కొందరు వ్యాఖ్యాతల అభిప్రాయం. మరి కొంతమంది ఈ మాటలు అన్నది బబులోను రాజువెనక ఉన్న వ్యక్తి అంటే సైతాన్ను ఉద్దేశించేవని ఖచ్చితంగా చెప్తున్నారు (యెహోషువ 28:12-17లో ఇలాంటి మాటలే ఉన్నాయి). ఇద్దరినీ ఉద్దేశించి పలికినవి అనుకొనే అవకాశం లేకపోలేదు (మత్తయి 16:23 పోల్చి చూడండి). బబులోను రాజు మిడిసిపాటు, పరలోక రాజుపై అతని ఎదిరింపు, తిరుగుబాటుల వెనుక దయ్యాల రాజు ఉన్నాడు. లూకా 10:18; ప్రకటన గ్రంథం 12:7-9. ఈ వచనం ఈ యుగాంతానికి వర్తించేది అయి ఉండవచ్చు. “వేకువ చుక్కా”– ఒకప్పుడు సైతాను పరలోకంలో ప్రకాశమానమైన కాంతులీనే జీవి. అలానే బబులోను రాజు భూరాజులందరిలోకీ దేదీప్యమానమైన “చుక్క” లాంటివాడు. అయితే ఒక్క క్రీస్తు మాత్రమే ప్రకాశమానమైన వేకువచుక్క (ప్రకటన గ్రంథం 22:16). ఇక్కడ ఈ మాటలు వాడినది సైతాను నుద్దేశించే అయితే బహుశా వాణ్ణి అలా ఎందుకు వర్ణించవలసి వచ్చిందంటే దేవుని కుమారుడి స్థానం తానుండాలని ఆశించినందుకేమో.
13. నేను ఆకాశమున కెక్కిపోయెదను దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును ఉత్తరదిక్కుననున్న సభాపర్వతముమీద కూర్చుందునుమత్తయి 11:23, లూకా 10:15
సైతాను (లేక బబులోను రాజు) కాంక్షించిన దేమిటంటే అందరికంటే పైగా పేరుప్రతిష్ఠలు, అధికారం. 2 థెస్సలొనీకయులకు 2:3-4 చూడండి. ఫిలిప్పీయులకు 2:5-11 లో వెల్లడి అయిన క్రీస్తు గుణాన్ని పోల్చి చూడండి. నాయకులను రెండు గుంపులుగా విభజించవచ్చు – ఒకటి, సైతాను కోరికలు ఉన్నవారు, రెండు, క్రీస్తు కోరికలు ఉన్నవారు. “సభాపర్వతం”– ఇది పరలోక సంబంధమైన సీయోను పర్వతం అన్నారు కొందరు వ్యాఖ్యాతలు (హెబ్రీయులకు 12:22 లో ఉన్నట్టుగా). కీర్తనల గ్రంథము 89:5; 1 రాజులు 22:19; యోబు 1:6 కూడా చూడండి. మరికొందరు ఇస్రాయేల్వారి పై దేవుడు తన ఆలయంలో ఉండి పరిపాలించిన ఇస్రాయేల్లోని సీయోను కొండ అని అభిప్రాయపడ్డారు (కీర్తనల గ్రంథము 48:1-2; కీర్తనల గ్రంథము 80:1; కీర్తనల గ్రంథము 99:1). మరికొందరు మరొక రకంగా భావించారు. మొదటి అభిప్రాయం సత్యం అయ్యేందుకు అవకాశం లేకపోలేదు.
14. మేఘమండలముమీది కెక్కుదును మహోన్నతునితో నన్ను సమానునిగా చేసికొందును అని నీవు మనస్సులో అనుకొంటివిగదా?
15. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే.మత్తయి 11:23, లూకా 10:15
తమను తాము గొప్ప చేసుకునే వారి అంతం ఇదే. వారు మనుషుల నాయకులు కావచ్చు. లేక సైతాను, అతని మూకలు కావచ్చు.
16. నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచుచు ఇట్లు తలపోయుదురు
బబులోను రాజును ఉద్దేశించి అంటున్న మాటలని స్పష్టంగా తెలుస్తున్నది. ఈ మాటలు భూలోకానికి వర్తించేవి. 9-11 వచనాల్లో లాగా మృత్యులోకానికి కాదు. క్రీ.పూ. 605–538 కాలంలో భూమిపై అత్యంత అధికారం గల రాజు బబులోను రాజే. మాదీయవారు తనను ఓడించేంతవరకు అతడు దేవుని ప్రజలను బందీలుగా ఉంచుకొన్నాడు.
17. భూమిని కంపింపజేసి రాజ్యములను వణకించినవాడు ఇతడేనా? లోకమును అడవిగాచేసి దాని పట్టణములను పాడు చేసినవాడు ఇతడేనా? తాను చెరపట్టినవారిని తమ నివాసస్థలమునకు పో నియ్యనివాడు ఇతడేనా?
18. జనముల రాజులందరు ఘనత వహించినవారై తమ తమ నగరులయందు నిద్రించుచున్నారు.
19. నీవు సమాధి పొందక పారవేయబడిన కొమ్మవలె నున్నావు. ఖడ్గముచేత పొడువబడి చచ్చినవారి శవములతో కప్పబడినవాడవైతివి త్రొక్కబడిన పీనుగువలెనైతివి బిలముయొక్క రాళ్లయొద్దకు దిగుచున్నవానివలెనున్నావు
ఒక రాజుకు సవ్యమైన అంత్యక్రియలు జరగలేదంటే అది అతనికి చాలా అవమానకరం.
20. నీవు నీ దేశమును పాడుచేసి నీ ప్రజలను హతమార్చితివి నీవు సమాధిలో వారితోకూడ కలిసియుండవు దుష్టుల సంతానము ఎన్నడును జ్ఞాపకమునకు తేబడదు.
21. వారు పెరిగి భూమిని స్వతంత్రించుకొని పట్టణము లతో లోకమును నింపకుండునట్లు తమ పితరుల దోషమునుబట్టి అతని కుమారులను వధిం చుటకు దొడ్డి సిద్ధపరచుడి.
బబులోను రాజు కొడుకులిద్దరూ హతమౌతారు. అతని రాజ్యం, ప్రజలు నాశనమౌతారు.
22. సైన్యములకధిపతియగు యెహోవా వాక్కు ఇదే నేను వారిమీదికి లేచి బబులోనునుండి నామమును శేషమును కుమారుని మనుమని కొట్టి వేసెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
23. నేను దానిని తుంబోడికి స్వాధీనముగాను నీటి మడుగులగాను చేయుదును. నాశనమను చీపురుకట్టతో దాని తుడిచివేసెదను అని సైన్యములకధిపతియగు యెహోవా సెలవిచ్చు చున్నాడు.
24. సైన్యములకధిపతియగు యెహోవా ప్రమాణ పూర్వ కముగా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును నేను యోచించినట్లు స్థిరపడును.
దేవుడు సంకల్పించిన వాటన్నిటి విషయంలోనూ ఇది సత్యమే (వ 27). అయితే ఇక్కడ, ఆయన అష్షూరువారి నాశనం గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. తరువాతి వచనాన్నిబట్టి ఇది అర్థమౌతున్నది.
25. నా దేశములో అష్షూరును సంహరించెదను నా పర్వతములమీద వాని నలుగద్రొక్కెదను వాని కాడి నా జనులమీదనుండి తొలగిపోవును వాని భారము వారి భుజముమీదనుండి తొలగింప బడును.
“నా దేశంలో...నా కొండల మీద”– ఇది క్రీ.పూ. 703లో కనీసం కొంతవరకైనా నెరవేరింది (యెషయా 37:36-37). “కాడి”– యెషయా 9:4.
26. సర్వలోకమునుగూర్చి నేను చేసిన ఆలోచన ఇదే జనములందరిమీద చాపబడిన బాహువు ఇదే.
13-24 అధ్యాయాల్లో దేవుడు యెషయా కాలంలో తెలిసిన దేశాల్లో కొన్నిటిని గురించి మాట్లాడుతున్నాడు.
27. సైన్యములకధిపతియగు యెహోవా దాని నియమించి యున్నాడు రద్దుపరచగలవాడెవడు? బాహువు చాచినవాడు ఆయనే దాని త్రిప్పగలవాడెవడు?
వ 24.
28. రాజైన ఆహాజు మరణమైన సంవత్సరమున వచ్చిన దేవోక్తి
ఫిలిష్తీయవారి గురించి ఇతర వాక్కుల గురించి యిర్మీయా 47వ అధ్యాయం; యెహెఙ్కేలు 25:15-17; ఆమోసు 1:6-8; జెఫన్యా 2:4-7 చూడండి. “చనిపోయిన”– క్రీ.పూ. 715 ప్రాంతాల్లో.
29. ఫిలిష్తియా, నిన్ను కొట్టిన దండము తుత్తునియలుగా విరువబడెనని అంతగా సంతోషింపకుము సర్పబీజమునుండి మిడునాగు పుట్టును దాని ఫలము ఎగురు సర్పము.
“విరిగిపోయింది”– వారిని కొట్టిన దండం అష్షూరు (యెషయా 20:1. అష్డోదు ఫిలిష్తీయ పట్టణం). “సంతోషించకు”– వారి ఉపశమనం తాత్కాలికమే. వారి పైకి నాశనం రానున్నది (వ 30,31)
30. అప్పుడు అతిబీదలైనవారు భోజనము చేయుదురు దరిద్రులు సురక్షితముగా పండుకొందురు కరవుచేత నీ బీజమును చంపెదను అది నీ శేషమును హతము చేయును.
31. గుమ్మమా, ప్రలాపింపుమీ, పట్టణమా, అంగలార్పుమీ. ఫిలిష్తియా, నీవు బొత్తిగా కరిగిపోయియున్నావు ఉత్తరదిక్కునుండి పొగ లేచుచున్నది వచ్చువారి పటాలములలో వెనుకతీయువాడు ఒకడును లేడు.
32. జనముల దూత కియ్యవలసిన ప్రత్యుత్తరమేది? యెహోవా సీయోనును స్థాపించియున్నాడు ఆయన జనులలో శ్రమనొందినవారు దాని ఆశ్రయింతురు అని చెప్పవలెను.
అష్షూరువారు జెరుసలంను వశపరచుకోలేక పోయారు.