Hosea - హోషేయ 4 | View All

1. ఇశ్రాయేలువారలారా, యెహోవా మాట ఆల కించుడి. సత్యమును కనికరమును దేవునిగూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవుట చూచి యెహోవా దేశనివాసులతో వ్యాజ్యెమాడుచున్నాడు.
ప్రకటన గ్రంథం 6:10

“యెహోవా వాక్కు”– హోషేయ 1:1. “నేరం మోపుతూ”– ఇస్రాయేల్ ఉత్తర రాజ్యంపై (వ 15). వారి తప్పులను మరెక్కువగా వెల్లడి చేస్తూ దేవుడు వారిపై నేరం మోపుతున్నాడు. “విశ్వసనీయత...లేవు”– కీర్తనల గ్రంథము 12:1; కీర్తనల గ్రంథము 18:25-26; కీర్తనల గ్రంథము 78:8, కీర్తనల గ్రంథము 78:37. “దేవుణ్ణి...లేదు”– హోషేయ 2:20 చూడండి. యెహోవాను వారు వ్యక్తిగతంగా తెలుసుకోలేదు. తెలుసుకోవాలన్న కోరికా లేదు. రోమీయులకు 1:28 చూడండి.

2. అబద్ధసాక్ష్యము పలు కుటయు అబద్ధమాడుటయు హత్య చేయుటయు దొంగిలించుటయు వ్యభిచరించుటయు వాడుకయ్యెను; జనులు కన్నము వేసెదరు, మానక నరహత్యచేసెదరు.

ఏ ప్రజల్లోనైతే విశ్వసనీయత, కనికరం, దేవుణ్ణి గురించిన జ్ఞానం ఉండవో ఆ ప్రజల భ్రష్ట స్వభావానికి అదుపు చాలా తక్కువ. దేవునికి అతి హేయమైన దుర్మార్గతలోకి కన్నుమిన్ను గానక వేగంగా చొరబడవచ్చు (సామెతలు 6:16-19).

3. కాబట్టి దేశము ప్రలాపించుచున్నది, దాని పశువులును ఆకాశ పక్షులును కాపురస్థులందరును క్షీణించుచున్నారు, సముద్ర మత్స్యములు కూడ గతించిపోవుచున్నవి.

ఇస్రాయేల్ లాగా జీవించే ప్రజలకు భయంకరమైన శిక్షలు ఉంటాయి. వారి పాపాలకు వచ్చిన శిక్షలలో వారి దేశమంతటికీ భాగముంటుంది. “శోకిస్తూ”– యెషయా 24:3-6; యిర్మియా 4:23-28; రోమీయులకు 8:21-22.

4. ఒకడు మరియొకనితో వాదించినను ప్రయోజనము లేదు; ఒకని గద్దించినను కార్యము కాకపోవును; నీ జనులు యాజకునితో జగడమాడువారిని పోలియున్నారు.

ప్రజలూ అంతా సమానంగా దోషులే. అందువల్ల ఎవరూ వేరొకరి పై నేరం మోపకూడదు. రోమీయులకు 2:1-4 పోల్చి చూడండి. “యాజిమీద నేరం”– ద్వితీయోపదేశకాండము 17:12 ప్రకారం ఇలా నేరం మోపేవాళ్ళకు మరణ శిక్ష విధించాలి. యాజులను గురించి నోట్ నిర్గమకాండము 28:1.

5. కాబట్టి పగలు నీవు కూలుదువు, రాత్రి నీతోకూడ ప్రవక్త కూలును. నీ తల్లిని నేను నాశనముచేతును.

“ప్రవక్తలు”– యెషయా 18:7; యిర్మియా 2:8, యిర్మియా 2:26; యిర్మియా 5:13, యిర్మియా 5:31; యిర్మియా 6:13; యెహెఙ్కేలు 13:2 పోల్చి చూడండి. “పగలు...రాత్రి”– విశ్రాంతి లేకుండా పాపం చేస్తున్నారు. పాపం కఠినుడైన యజమానిలాగా తన బానిసల చేత ఎడతెగకుండా ఆ పని చేయిస్తుంది – యోహాను 8:34. “తల్లి”– ఇస్రాయేల్ రాజ్యం.

6. నా జనులు జ్ఞానములేనివారై నశించుచున్నారు. నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడవు కాకుండ నేను నిన్ను విసర్జింతును; నీవు నీ దేవుని ధర్మ శాస్త్రము మరచితివి గనుక నేనును నీ కుమారులను మరతును.

దేవుని గురించీ ఆయన త్రోవల గురించీ జ్ఞానం లేకపోవడం ప్రజల్నీ పెద్ద ఎత్తున నాశనం చేస్తుంది – సామెతలు 1:29-32; సామెతలు 10:21; యెషయా 1:3; ఎఫెసీయులకు 4:18-19. “జ్ఞానాన్ని తోసివేశారు”– ఇప్పుడు దేవుడు యాజులతో మాట్లాడుతున్నాడు. దేవుణ్ణి గురించిన జ్ఞానం వారికి లేకపోవడం వాళ్ళు బుద్ధి పూర్వకంగా తెచ్చుకున్న పరిస్థితే. దేవుడు, ఆయన విధానాలు వారికి తెలియదు. ఎందుకంటే తెలుసుకోవాలన్న కోరిక వారికి లేదు. “ఉపదేశాన్ని తలచుకోలేదు”– వారు చేయవలసిన అతి ప్రాముఖ్యమైన దానిని వారు చేయలేదు (ద్వితీయోపదేశకాండము 31:9-13; 2 దినవృత్తాంతములు 17:8-9; ఎజ్రా 7:10). “నీ పిల్లలను తలచుకోను”– దేవునికి ఏది అతి ప్రాముఖ్యమో దాన్ని వారు నిర్లక్ష్యం చేశారు. వారికి ప్రాముఖ్యమైన దాన్ని దేవుడూ తలచుకోడు. కీర్తనల గ్రంథము 18:25-26; గలతియులకు 6:7 పోల్చి చూడండి.

7. తమకు కలిమి కలిగినకొలది వారు నాయెడల అధికపాపము చేసిరి గనుక వారి ఘనతను నీచస్థితికి మార్చుదును.

8. నా జనుల పాపములను ఆహారముగ చేసికొందురు గనుక జనులు మరి యధికముగా పాపము చేయవలెనని వారు కోరుదురు.

ప్రజలు పాపం చేసినప్పుడు అర్పణలను యాజులు తమ వద్దకు తెచ్చి అర్పించాలని కోరేవారు. యాజులు ఆ అర్పణలు కొన్నిటిని తినేవారు – లేవీయకాండము 6:24-29. ప్రజలు ఎంత ఎక్కువ పాపం చేస్తే అన్ని ఎక్కువ అర్పణలు తెచ్చారు. యాజులు వంతు అంత ఎక్కువైంది.

9. కాబట్టి జనులకు ఏలాగో యాజకులకును ఆలాగే సంభవించును; వారి ప్రవర్తనను బట్టి నేను వారిని శిక్షింతును, వారి క్రియలనుబట్టి వారికి ప్రతికారము చేతును.

ప్రజలు కూడా తమ మత నాయకులు, ఉపదేశకుల్లాగా అవుతారు. వారిలాగానే శిక్షకు గురవుతారు. “ప్రతీకారం”– ద్వితీయోపదేశకాండము 32:35; 1 రాజులు 2:32, 1 రాజులు 2:44; కీర్తనల గ్రంథము 28:4; సామెతలు 24:12.

10. వారు యెహోవాను లక్ష్య పెట్టుటమానిరి గనుక వారు భోజనము చేసినను తృప్తి పొందక యుందురు, వ్యభిచారము చేసినను అభివృద్ధి నొందక యుందురు.

“తృప్తి అనిపించదు”– లేవీయకాండము 26:26; మీకా 6:14.

11. వ్యభిచారక్రియలు చేయుటచేతను ద్రాక్షారసము పానముచేయుటచేతను మద్యపానము చేతను వారు మతిచెడిరి.

“వ్యభిచారం”– బహుశా సాదృశ్యంగాను, అక్షరాలా కూడా వారు వ్యభిచరిస్తున్నారని భావం కావచ్చు. అంటే వారి పాపాలు వ్యభిచారం, నిజమైన దేవుణ్ణి విడిచి విగ్రహాలను పూజించడం కూడా (వ 13). ఈ రెండూ తరచుగా కలిసే కనిపిస్తాయి. “ద్రాక్షమద్యం”– హోషేయ 7:5, హోషేయ 7:14; సామెతలు 20:1; సామెతలు 23:31. “వ్యభిచార మనస్తత్వం”– హోషేయ 5:4. అంటే నిజ దేవుణ్ణి వదిలి అబద్ధ దేవుళ్ళవెంట, విగ్రహాల వెంట పడడం.

12. నా జనులు తాము పెట్టు కొనిన కఱ్ఱయొద్ద విచారణచేయుదురు, తమ చేతికఱ్ఱ వారికి సంగతి తెలియజేయును, వ్యభిచారమనస్సు వారిని త్రోవ తప్పింపగా వారు తమ దేవుని విసర్జించి వ్యభిచరింతురు.

13. పర్వతముల శిఖరములమీద బలులనర్పింతురు, కొండలమీద ధూపము వేయుదురు, సింధూరవృక్షముల క్రిందను చినారువృక్షముల క్రిందను మస్తకివృక్షముల క్రిందను నీడ మంచిదని అచటనే ధూపము వేయుదురు; అందువలననే మీ కుమార్తెలు వేశ్యలైరి, మీ కోడండ్లును వ్యభిచారిణులైరి.

14. జనులు తామే వ్యభిచారిణులను కూడుదురు, తామే వేశ్యలతో సాంగత్యముచేయుచు బలుల నర్పింతురు గనుక మీ కుమార్తెలు వేశ్యలగుటనుబట్టి నేను వారిని శిక్షింపను, మీ కోడండ్లు వ్యభిచరించుటను బట్టి నేను వారిని శిక్షింపను; వివేచనలేని జనము నిర్మూల మగును.

కూతుళ్ళు, కోడళ్ళు తమ చెడు ప్రవర్తన తమ మగవాళ్ళ నుండే నేర్చుకున్నారు గనుక మగవాళ్ళే వారికన్నా దోషులు. “గుళ్ళకు చెందిన వేశ్యలు”– పూజకు వచ్చిన పురుషులతో వ్యభిచారం చేసే స్త్రీలు. వీళ్ళు విగ్రహాలుండే గుళ్ళకూ “పుణ్య” స్థలాలకూ చెందినవారు. “తెలివితేటలు లేని”– వ 6. నిజ దేవుని గురించిన జ్ఞానాన్ని త్రోసిపుచ్చే ఏ ప్రజకైనా ఎక్కడైనా లభించే ఫలితం నాశనమే.

15. ఇశ్రాయేలూ, నీవు వేశ్యవైతివి; అయినను యూదా ఆ పాపములో పాలుపొందక పోవునుగాక. గిల్గాలునకు పోవద్దు; బేతావెనునకు పోవద్దు; యెహోవా జీవముతోడని ప్రమాణముచేయవద్దు.

ఉత్తర రాజ్యానికీ దక్షిణ రాజ్యానికీ ఉన్న తేడాను గమనించండి. గిల్గాల్, బేత్ ఆవెను ఉత్తర రాజ్యంలో విగ్రహ పూజ స్థలాలుగా ఉన్నాయి. “యెహోవా జీవంతోడు”– ఇస్రాయేల్‌ప్రజలు విగ్రహాలు పట్ల భక్తి చూపుతున్నారు కాబట్టి ఇలా శపథం చెయ్యడం కపటంతో కూడిన పనే.

16. పెయ్య మొండి తనము చూపునట్టు ఇశ్రాయేలువారు మొండితనము చూపియున్నారు గనుక విశాలస్థలమందు మేయు గొఱ్ఱ పిల్లకు సంభవించునట్లు దేవుడు వారికి సంభవింపజేయును.

“మొండి”– ద్వితీయోపదేశకాండము 9:7; 1 సమూయేలు 15:23; కీర్తనల గ్రంథము 78:8; కీర్తనల గ్రంథము 81:12; యెషయా 1:5; యిర్మియా 5:23; యిర్మియా 7:24 పోల్చి చూడండి. “గొర్రెపిల్లలు”– ప్రజలు తిరగబడే పశువుల్లో ఉంటే దేవుడు వారిని తన గొర్రెపిల్లల్లాగా ఎలా చూడగలడు?

17. ఎఫ్రాయిము విగ్రహములతో కలసికొనెను, వానిని ఆలాగుననే యుండనిమ్ము.

“ఎఫ్రాయిం”– ఇస్రాయేల్ ఉత్తర రాజ్యమంతటినీ ఉద్దేశించి ఈ మాట వాడారు. యెషయా 7:2, యెషయా 7:5, యెషయా 7:8-9, యెషయా 7:17; యెషయా 11:13; యిర్మియా 7:15 చూడండి. “ఆ స్థితిలో ఉండనియ్యి”– దేవుణ్ణి లెక్క చెయ్యక విగ్రహాల్ని పూజించడానికి ఆ రాజ్యం ఎంత ఆసక్తితో ఉందంటే ఇక దానికోసం ఏం చెయ్యడానికీ లేదు (హోషేయ 1:4-6; సామెతలు 29:1).

18. వారికి ద్రాక్షారసము చేదాయెను, ఒళ్లు తెలియనివారు; మానక వ్యభిచారముచేయు వారు; వారి అధికారులు సిగ్గుమాలినవారై అవమానకర మైన దానిని ప్రేమింతురు.

పాపంలో ఓలలాడాలంటే వాళ్ళు తప్పనిసరిగా మద్యపానమే చెయ్యవలసిన అవసరమేమీ లేదు.

19. సుడిగాలి జనులను చుట్టి కొట్టుకొనిపోవును; తాము అర్పించిన బలులనుబట్టి వారు సిగ్గునొందుదురు.

“సుడిగాలి”– హోషేయ 8:7; హోషేయ 13:15; కీర్తనల గ్రంథము 1:4; సామెతలు 1:27; యెషయా 40:24 పోల్చిచూడండి. “ఆశాభంగం”– యెషయా 1:29. విగ్రహాలను పూజించడంద్వారా తమకు శాంతి సౌభాగ్యాలు కలుగుతాయను కున్నారు. అయితే వారు పాడైపోయి నాశనం పాలవుతారు – వ 6,14.Shortcut Links
హోషేయ - Hosea : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |