Numbers - సంఖ్యాకాండము 29 | View All

1. ఏడవ నెల మొదటి తేదిన మీరు పరిశుద్ధసంఘముగా కూడవలెను.

1. In the seventh month, on the first day of the month, let there be a holy meeting; on it you may do no field-work; let the day be marked by the blowing of horns;

2. మీరు జీవనోపాధియైన పనులేమియు చేయకూడదు; అది మీకు శృంగధ్వని దినము.

2. And give to the Lord a burned offering for a sweet smell; one ox, one male sheep, seven he-lambs of the first year, without any mark on them:

3. నిర్దోషమైన ఒక కోడెదూడను ఒక పొట్టేలును యెహోవాకు ఇంపైన సువాసనగల దహనబలిగా అర్పింపవలెను.

3. And their meal offering, the best meal mixed with oil, three tenth parts for an ox, two tenth parts for a male sheep,

4. వాటి వాటి విధిప్రకారముగా అమావాస్యకు అర్పించు దహన బలియు దాని నైవేద్యమును, నిత్య మైన దహనబలియు దాని నైవేద్యమును వాటి పానార్పణములును గాక మీరు నిర్దోషమైన యేడాదివగు ఏడు మగ గొఱ్ఱెపిల్లలను యెహో వాకు, ఇంపైన సువాసనగల దహనబలిగా అర్పింపవలెను.

4. And a separate tenth part for every one of the seven lambs;

5. వాటి నైవేద్యము నూనెతో కలుపబడిన గోధుమపిండి ప్రతి కోడెదూడతో తూములో మూడు పదియవవంతులను, పొట్టేలుకు రెండు పదియవవంతులను,

5. And one he-goat for a sin-offering, to take away your sin:

6. ఏడు గొఱ్ఱె పిల్లలలో ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క పదియవ వంతును మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడుటకై పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను.

6. In addition to the burned offering of the new moon, and its meal offering, and the regular burned offering and its meal offering, and their drink offerings, as they are ordered, for a sweet smell, an offering made by fire to the Lord.

7. ఈ యేడవ నెల పదియవ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అప్పుడు మిమ్మును మీరు దుఃఖపరచుకొనవలెను; ఏపనియు చేయకూడదు.

7. And on the tenth day of this seventh month there will be a holy meeting; keep yourselves from pleasure, and do no sort of work;

8. ప్రాయశ్చిత్తము కలుగుటకై పాపపరిహారార్థబలియు నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును వాటి వాటి పానార్పణములునుగాక, మీరు ఒక కోడెదూడను ఒక పొట్టేలును ఏడాదివైన యేడు గొఱ్ఱెపిల్లలను యెహోవాకు ఇంపైన సువాసనగల దహనబలిగా అర్పింపవలెను. అవి మీకున్న వాటిలో నిర్దోషమైనవై యుండవలెను.

8. And give to the Lord a burned offering for a sweet smell; one ox, one male sheep, seven he-lambs of the first year: only those without any mark on them may be used:

9. నూనెతో కలుపబడిన పిండిని నైవేద్యముగాను ప్రతి కోడెతో తూములో మూడు పదియవ వంతులను ఒక పొట్టేలుతో రెండు పది యవవంతులను

9. And their meal offering, the best meal mixed with oil, three tenth parts for an ox, two tenth parts for a male sheep,

10. ఆ యేడు గొఱ్ఱెపిల్లలలో ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క పదియవవంతును

10. A separate tenth part for every one of the seven lambs;

11. పాపపరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను అర్పింపవలెను.

11. One he-goat for a sin-offering; in addition to the offering for taking away your sin, and the regular burned offering and its meal offering, and their drink offerings.

12. మరియు ఏడవ నెల పదునయిదవ దినమున మీరు పరిశుద్ధసంఘముగా కూడవలెను. అప్పుడు మీరు జీవనో పాధియైన పనులేమియు చేయక యేడు దినములు యెహోవాకు పండుగ ఆచరింపవలెను.

12. And on the fifteenth day of the seventh month let there be a holy meeting; do no field-work, and keep a feast to the Lord for seven days;

13. నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును దాని పానార్పణమును గాక, యెహోవాకు ఇంపైన సువాసనగల దహనబలిగా పదమూడు కోడెదూడలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదునాలుగు గొఱ్ఱె పిల్లలను అర్పింపవలెను. అవి నిర్దోషమైనవై యుండవలెను.

13. And give a burned offering, an offering made by fire of a sweet smell to the Lord, thirteen oxen, two male sheep, fourteen he-lambs of the first year, all without any mark on them;

14. నూనెతో కలుపబడిన గోధుమపిండిని నైవేద్యముగాను ఆ పదమూడు కోడెదూడలలో ప్రతి దూడతో తూములో మూడు పదియవవంతులను ఆ రెండు పొట్టేళ్లలో ప్రతి పొట్టేలుతో రెండు పదియవవంతులను

14. And their meal offering, the best meal mixed with oil, three tenth parts for every one of the thirteen oxen, two tenth parts for every male sheep,

15. ఆ పదునాలుగు గొఱ్ఱెపిల్లలలో ప్రతి పిల్లతో ఒక్కొక్క పదియవవంతును పాపపరిహారార్థబలిగా

15. And a separate tenth part for every one of the fourteen lambs;

16. ఒక మేక పిల్లను అర్పింవలెను.

16. And one he-goat for a sin-offering; in addition to the regular burned offering, and its meal offering, and its drink offering.

17. రెండవ దినమున నిత్యమైన దహనబలియు దాని నైవేద్య మును వాటి పానార్పణములును గాక మీరు నిర్దోషమైన పండ్రెండుకోడెదూడలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదునాలుగు గొఱ్ఱె పిల్లలను విధిప్రకారముగా,

17. On the second day of the feast give an offering of twelve oxen, two male sheep, fourteen he-lambs of the first year, without any mark on them;

18. వాటి వాటి లెక్కచొప్పున, ఆ కోడెలతోను పొట్టేళ్లతోను గొఱ్ఱెపిల్లలతోను వాటి వాటి నైవేద్యమును

18. And their meal offering and their drink offerings for the oxen and the sheep and the lambs, in relation to their number, as it is ordered:

19. పానార్పణములను పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను.

19. And one he-goat for a sin-offering in addition to the regular burned offering, and its meal offering, and their drink offerings.

20. మూడవ దినమున నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును దాని పానార్పణమును గాక నిర్దోషమైన పదకొండు కోడెలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదునాలుగు గొఱ్ఱెపిల్లలను

20. And on the third day eleven oxen, two male sheep, fourteen he-lambs of the first year, without any mark;

21. విధి ప్రకారముగా వాటి వాటి లెక్కచొప్పున, ఆ కోడెలతోను పొట్టేళ్లతోను గొఱ్ఱె పిల్లలతోను వాటి నైవేద్యమును పానార్పణములను

21. And their meal offering and drink offerings for the oxen, for the male sheep, and for the lambs, in relation to their number, as it is ordered:

22. పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను.

22. And one he-goat for a sin-offering; in addition to the regular burned offering, and its meal offering, and its drink offering.

23. నాలుగవ దినమున నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును పానార్పణమును గాక నిర్దోషమైన పది కోడెలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదునాలుగు గొఱ్ఱెపిల్లలను విధి ప్రకారముగా, వాటి వాటి లెక్క చొప్పున,

23. And on the fourth day ten oxen, two male sheep, fourteen he-lambs of the first year, without any mark:

24. ఆ కోడెలతోను పొట్టేళ్లతోను గొఱ్ఱెపిల్లల తోను వాటి నైవేద్యమును పానార్పణములను

24. And their meal offering and their drink offerings for the oxen, for the male sheep, and for the lambs, in relation to their number, as it is ordered.

25. పాప పరిహారార్థబలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను.

25. And one he-goat for a sin-offering; in addition to the regular burned offering, and its meal offering, and its drink offering.

26. అయిదవ దినమున నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును పానార్పణమును గాక నిర్దోషమైన తొమ్మిది కోడెలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదునాలుగు గొఱ్ఱెపిల్లలను విధి ప్రకారముగా, వాటి వాటి లెక్కచొప్పున,

26. And on the fifth day nine oxen, two male sheep, fourteen he-lambs of the first year, without any mark:

27. ఆ కోడెలతోను పొట్టేళ్లతోను గొఱ్ఱె పిల్లలతోను

27. And their meal offering and their drink offerings for the oxen, for the male sheep, and for the lambs, in relation to their number, as it is ordered:

28. వాటి వాటి నైవేద్యమును పానార్పణములను పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను.

28. And one he-goat for a sin-offering; in addition to the regular burned offering, and its meal offering, and its drink offering.

29. ఆరవ దినమున నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును పానార్పణమును గాక నిర్దోషమైన యెనిమిది కోడెలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదునాలుగు గొఱ్ఱె పిల్లలను విధి ప్రకారముగా, వాటి వాటి లెక్కచొప్పున,

29. And on the sixth day eight oxen, two male sheep, fourteen he-lambs of the first year, without any mark:

30. ఆ కోడెలతోను పొట్టేళ్లతోను గొఱ్ఱెపిల్లలతోను వాటి వాటి నైవేద్యమును పానార్పణములను

30. And their meal offering and their drink offerings for the oxen, for the male sheep, and for the lambs, in relation to their number, as it is ordered:

31. పాపపరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను అర్పింపవలెను.

31. And one he-goat for a sin-offering; in addition to the regular burned offering, its meal offering, and its drink offerings.

32. ఏడవ దినమున నిత్యమైన దహనబలియు దాని నైవేద్య మును పానార్పణమును గాక నిర్దోషమైన యేడు దూడలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదునాలుగు గొఱ్ఱె పిల్లలను విధి ప్రకారముగా, వాటి వాటి లెక్కచొప్పున,

32. And on the seventh day seven oxen, two male sheep, fourteen he-lambs of the first year, without any mark:

33. ఆ కోడెలతోను పొట్టేళ్లతోను గొఱ్ఱెపిల్లల తోను వాటి వాటి నైవేద్యమును పానార్పణములను

33. And their meal offering and their drink offerings for the oxen, for the male sheep, and for the lambs, in relation to their number, as it is ordered:

34. పాపపరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను అర్పింపవలెను.

34. And one he-goat for a sin-offering; in addition to the regular burned offering, its meal offering, and its drink offering.

35. ఎనిమిదవ దినము మీకు వ్రతదినముగానుండును. అప్పుడు మీరు జీవనోపాధియైన పనులనేమియు చేయకూడదు.

35. On the eighth day let there be a holy meeting: you may do no field-work;

36. అందులో నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును పానార్పణమును గాక మీరు యెహోవాకు ఇంపైన సువాసనగల దహనబలిగా నిర్దోషమైన యొక కోడెదూడను ఒక పొట్టేలును ఏడాదివైన యేడు గొఱ్ఱెపిల్లలను విధి ప్రకారముగా, వాటి వాటి లెక్కచొప్పున,

36. And give a burned offering, an offering made by fire of a sweet smell to the Lord: one ox, one male sheep, seven he-lambs of the first year, without any mark:

37. ఆ కోడెదూడతోను పొట్టేలుతోను గొఱ్ఱెపిల్లలతోను

37. With the meal offering and the drink offerings for the ox, the male sheep, and the lambs, in relation to their number, as it is ordered:

38. వాటి వాటి నైవేద్యమును పానార్పణములను పాపపరి హారార్థబలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను.

38. And one he-goat for a sin-offering; in addition to the regular burned offering, and its meal offering, and its drink offering.

39. మీ మ్రొక్కుబళ్లను మీ స్వేచ్ఛార్పణములను మీ దహనబలులను మీ నైవేద్యములను మీ పానార్పణములను మీ సమాధానబలులను గాక వీటిని నియామక కాలములందు యెహోవాకు అర్పింవలెను.

39. These are the offerings which you are to give to the Lord at your regular feasts, in addition to the offerings for an oath, and the free offerings you give, for your burned offerings and your drink offerings and your peace-offerings.

40. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే ఇశ్రాయేలీయులతో సమస్తమును తెలియజెప్పెను.

40. So Moses gave the children of Israel all these directions as the Lord had given him orders.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Numbers - సంఖ్యాకాండము 29 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible
బాకాలు విందులో మరియు ప్రాయశ్చిత్తం రోజున అర్పణ. (1-11) 
ఏడవ నెలలో, ప్రజలు దేవుణ్ణి ఆరాధించే మరియు గౌరవించే ప్రత్యేక సమయాలు ఉన్నాయి. ఈ మాసం పంటలు కోసిన తర్వాత, కొత్త విత్తనాలు వేయకముందే. ఈ విశ్రాంతి కాలంలో దేవునిపై దృష్టి పెట్టడానికి సమయాన్ని వెచ్చించడం చాలా ముఖ్యం. ప్రజలు దీన్ని చేసే ఒక మార్గం బాకాలు ఊదడం. Lev 22:24 ఈ భాగం ప్రజలు ప్రత్యేకమైన రోజున నైవేద్యంగా ఏమి ఇవ్వాలో తెలియజేస్తుంది. దేవుడు ఏమి కోరుకుంటున్నాడో అర్థం చేసుకోవడానికి, లేఖనాలలోని వివిధ భాగాలను చూడటం మరియు వాటిని పోల్చడం ముఖ్యం. మనం దేవుని గురించి మరింత తెలుసుకున్నప్పుడు, అంతకుముందు గందరగోళంగా ఉన్న విషయాలను మనం అర్థం చేసుకోవచ్చు మరియు దేవుని మంచి అనుచరులుగా మారవచ్చు.

గుడారాల విందులో అర్పణలు. (12-40)
ప్రజలు తమ తప్పుల గురించి ఆలోచించి విచారంగా ఉండాల్సిన ఒక ప్రత్యేక రోజు తర్వాత, వారు సంతోషంగా ఉండాల్సిన మరియు దేవునితో జరుపుకోవాల్సిన మరో ప్రత్యేక రోజు వచ్చింది. ఈ సంతోషకరమైన రోజులలో, వారు దేవునికి కానుకలు ఇవ్వవలసి వచ్చింది. మనం దేవునికి మంచి పనులు చేస్తున్నప్పుడు సంతోషంగా ఉండటం మంచిది. వారు తాత్కాలిక గృహాలలో నివసించే సమయంలో, వారు దేవునికి కానుకలు ఇవ్వవలసి ఉంటుంది. వారిలాగే మనం కూడా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు, మనం ఎల్లప్పుడూ దేవునితో మాట్లాడటానికి మరియు ఆయనకు దగ్గరగా ఉండటానికి ప్రయత్నించాలి. ఈ ప్రత్యేక సమయంలో, మనం చేసిన తప్పులకు చింతిస్తున్నామని దేవునికి చూపించడానికి మనం ప్రతిరోజూ చేయవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. మన కోసం తనను తాను త్యాగం చేసిన యేసు ద్వారా మాత్రమే మనం దేవునితో మంచి సంబంధాన్ని కలిగి ఉండగలమని కూడా గుర్తుంచుకోవాలి. మనకు ఇతర విషయాలు జరుగుతున్నప్పటికీ, మన ప్రార్థనలు మరియు ఆరాధనల కోసం మనం ఇంకా సమయం కేటాయించాలి. మన చుట్టూ ఉన్న ప్రతిదీ మనం పరిపూర్ణులం కాదని గుర్తుచేస్తుంది, అయితే మనం మంచి జీవితాన్ని గడపడానికి యేసుపై విశ్వాసం ఉంచవచ్చు. ఒక రోజు, మనం యేసుతో ఉంటాము మరియు ఆయన ప్రేమ మరియు క్షమాపణ కోసం ఆయనను స్తుతిస్తాము. 



Shortcut Links
సంఖ్యాకాండము - Numbers : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |