Luke - లూకా సువార్త 14 | View All

1. విశ్రాంతిదినమున ఆయన భోజనము చేయుటకు పరిసయ్యుల అధికారులలో ఒకని యింటిలోనికి వెళ్లినప్పుడు, ఆయన ఏమి చేయునో అని వారాయనను కనిపెట్టు చుండిరి.

“విశ్రాంతి దినం”– నిర్గమకాండము 20:8-11. “పరిసయ్యులు”– మత్తయి 3:7. లూకా 13:10-17లో జరిగిన విషయాన్ని బట్టి వారంతా యేసును జాగ్రత్తగా కనిపెట్టి చూస్తూ ఉన్నారు లూకా 13:10-17.

2. అప్పుడు జలోదర రోగముగల యొకడు ఆయన యెదుట ఉండెను.

3. యేసు విశ్రాంతిదినమున స్వస్థపరచుట న్యాయమా కాదా?

యేసుకు జవాబు తెలుసు – లూకా 13:15-16; మత్తయి 12:11-12. వారు కాస్తంత బుద్ధిని ఉపయోగించి ఆలోచించేలా చెయ్యాలని ఆయన ప్రయత్నం.

4. అని ధర్మశాస్త్రోపదేశ కులను పరిసయ్యులను అడుగగా వారూరకుండిరి. అప్పు డాయన వానిని చేరదీసి స్వస్థపరచి పంపివేసి

5. మీలో ఎవని గాడిదయైనను ఎద్దయినను గుంటలో పడినయెడల విశ్రాంతిదినమున దానిని పైకి తీయడా? అని వారి నడి గెను.

6. ఈ మాటలకు వారు ఉత్తరము చెప్పలేకపోయిరి.

7. పిలువబడినవారు భోజనపంక్తిని అగ్రపీఠములు ఏర్పరచు కొనుట చూచి ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను.

8. నిన్నెవరైనను పెండ్లివిందుకు పిలిచినప్పుడు అగ్రపీఠము మీద కూర్చుండవద్దు; ఒకవేళ నీకంటె ఘనుడు అతని చేత పిలువబడగా

9. నిన్నును అతనిని పిలిచినవాడు వచ్చి ఇతనికి చోటిమ్మని నీతో చెప్పును, అప్పుడు నీవు సిగ్గు పడి కడపటి చోటున కూర్చుండసాగుదువు.

10. అయితే నీవు పిలువబడి నప్పుడు, నిన్ను పిలిచినవాడు వచ్చిస్నేహి తుడా, పైచోటికి పొమ్మని నీతో చెప్పులాగున నీవు పోయి కడపటి చోటున కూర్చుండుము; అప్పుడు నీతోకూడ కూర్చుండు
సామెతలు 25:7

11. తన్ను తాను హెచ్చించుకొను ప్రతివాడును తగ్గింపబడును; తన్నుతాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడునని చెప్పెను.

పై సంగతిలోని ఆధ్యాత్మిక పాఠాన్ని యేసుప్రభువు చెప్తున్నాడు. మనుషులను దిగజార్చేదీ, హెచ్చించేదీ దేవుడే. వారి గుణశీలాలు, మనస్తత్వం ఆధారంగా చేసుకుని ఆయన అలా చేస్తాడు – లూకా 11:43; లూకా 18:14; లూకా 20:46; సామెతలు 3:34; సామెతలు 25:6-7; మత్తయి 18:4; మత్తయి 23:12; యాకోబు 4:10; 1 పేతురు 5:6.

12. మరియు ఆయన తన్ను పిలిచినవానితో ఇట్లనెను నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయునప్పుడు, నీ స్నేహితులనైనను నీ సహోదరులనైనను నీ బంధువుల నైనను ధనవంతులగు నీ పొరుగువారినైనను పిలువవద్దు; వారు ఒకవేళ నిన్ను మరల పిలుతురు గనుక నీకు ప్రత్యుప కారము కలుగును.

మనం అనుసరించవలసిన మంచి సూత్రాన్ని యేసు ఇక్కడ చెప్తున్నాడు. అయితే దీన్ని పాటించేదెవరు? ఎక్కువమందికి దీన్ని వినడమే ఇష్టం గాని ఆచరించడం ఇష్టం ఉండదు.

13. అయితే నీవు విందు చేయునప్పుడు బీదలను అంగహీనులను కుంటివాండ్రను గ్రుడ్డివాండ్రను పిలువుము.

14. నీకు ప్రత్యుపకారము చేయుటకు వారి కేమియు లేదు గనుక నీవు ధన్యుడవగుదువు; నీతిమంతుల పునరుత్థానమందు నీవు ప్రత్యుపకారము పొందుదువని చెప్పెను.

“న్యాయవంతులు...లేచేటప్పుడు”– యోహాను 5:28-29; 1 కోరింథీయులకు 15:22-23, 1 కోరింథీయులకు 15:51-52; 1 థెస్సలొనీకయులకు 4:16; ప్రకటన గ్రంథం 20:4-6. “ప్రతిఫలం కలుగుతుంది”– దేవుడే ప్రతిఫలమిస్తాడు – సామెతలు 19:17; సామెతలు 14:21; మత్తయి 10:42.

15. ఆయనతో కూడ భోజనపంక్తిని కూర్చుండినవారిలో ఒకడు ఈ మాటలు వినిదేవుని రాజ్యములో భోజనము చేయువాడు ధన్యుడని ఆయనతో చెప్పగా

“భోజనానికి”– యెషయా 25:6; మత్తయి 8:11; మత్తయి 25:1-10; మత్తయి 26:29; ప్రకటన గ్రంథం 19:9. “దేవుని రాజ్యం”– మత్తయి 4:17. అందులో భోజనానికి కూర్చునేవారంతా నిజంగా ధన్యజీవులు. అయితే తరువాత చెప్తున్న ఉదాహరణలో యేసుప్రభువు చాలమంది దీన్ని అర్థం చేసుకోరనీ, ఆ విందుకు రమ్మని వచ్చిన ప్రతి ఆహ్వానాన్నీ నిరాకరిస్తారనీ చెప్పాడు. మత్తయి 22:1-14 పోల్చి చూడండి.

16. ఆయన అతనితో నిట్లనెను ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను.

“ఒక మనిషి”అంటే దేవుడే. క్రీస్తు ఎవరి దగ్గరికి వచ్చాడో ఆ యూదులకు ముందుగా ఆయన ఆహ్వానం పంపించాడు – మత్తయి 10:6; మత్తయి 15:24; రోమీయులకు 1:16. ఇప్పుడు లోకమంతటా ఉన్న ప్రజలందరినీ ఆహ్వానిస్తున్నాడు – మత్తయి 28:18-20; మార్కు 16:15; లూకా 24:46-47.

17. విందుకాలమందు అతడు ఇప్పుడు సిద్ధమైయున్నది, రండని పిలువబడినవారితో చెప్పుటకు తన దాసుని పంపెను.

పాప విముక్తికీ, దేవుని రాజ్యానికీ సంబంధించిన వాటన్నిటినీ దేవుడు తానే సిద్ధం చేశాడు. దేవుడు సిద్ధపరచిన విందు యేసు క్రీస్తే. యోహాను 6:27, యోహాను 6:33, యోహాను 6:35, యోహాను 6:53-58 పోల్చి చూడండి. మనుషులు చేయవలసినదల్లా దేవుని ఆహ్వానాన్ని అంగీకరించి నమ్మకంతో క్రీస్తు చెంతకు రావడమే.

18. అయితే వారందరు ఏకమనస్సుతో నెపములు చెప్ప సాగిరి. మొదటివాడు నేనొక పొలము కొనియున్నాను, అవశ్యముగా వెళ్లిదాని చూడవలెను, నన్ను క్షమింపవలెనని నిన్ను వేడు కొనుచున్నాన

ఇది విచిత్రమైన సంగతి. గొప్ప విందుకు వెళ్ళకుండా ఎవరుంటారు? ఏ విధంగానైనా తప్పించుకోదగిన అప్రియమైన చోటికి రమ్మని తమను ఆహ్వానించినట్టు వీరంతా ప్రవర్తిస్తున్నారు. ఈ ప్రవర్తనకు కారణం యోహాను 7:7; యోహాను 15:18; రోమీయులకు 8:6-7; 2 కోరింథీయులకు 4:3-4; ఎఫెసీయులకు 4:18 మొదలైన చోట్ల కనిపిస్తున్నది. క్రీస్తును తమ ప్రభువుగా రక్షకుడుగా అంగీకరించకుండా ఉండేందుకు మనుషులు చెప్పే సాకులన్నీ ఇక్కడున్న సాకులంత బుద్ధిలేనివే. పొలాన్ని ముందుగా చూచుకొకుండా ఏ బుద్ధిలేనివాడు దాన్ని కొంటాడు? ఎద్దుల్ని ముందు చూచుకుని పరీక్ష చేయకుండా ఎవరు కొంటారు? (వ 19). బహుశా తన భార్య కూడా తనతోపాటు విందుకు రావాలనుకుంటుందని కాస్త తెలివితేటలున్నవాడెవడికైనా ఆలోచన వస్తుంది కదా (వ 20). అసలు సంగతేమిటంటే విందుకు వెళ్ళడం వీళ్ళకి ఇష్టం లేదు అంతే. ఎన్ని సాకులు చెప్పినా ఈ సత్యాన్ని దాచలేవు.

19. మరియెకడు నేను అయిదు జతల యెడ్లను కొనియున్నాను, వాటిని పరీక్షింప వెళ్లుచున్నాను, నన్ను క్షమింపవలెనని వేడుకొనుచున్నాననెను.

20. మరి యొకడునేనొక స్త్రీని వివాహము చేసికొన్నాను; అందుచేత నేను రాలేననెను.

21. అప్పుడా దాసుడు తిరిగి వచ్చి యీ మాటలు తన యజమానునికి తెలియజేయగా, ఆ యింటి యజ మానుడు కోపపడినీవు త్వరగాపట్టణపు వీధులలోనికిని సందులలోనికిని వెళ్లి, బీదలను అంగహీను లను కుంటివారిని గ్రుడ్డివారిని ఇక్కడికి తోడుకొనిరమ్మని ఆ దాసునితో చెప్పెను

ఆ మనిషికి కోపం రావడం సహజమే. అతని ఆహ్వానాన్ని మన్నించకపోవడం ద్వారా వారు అతణ్ణి ఘోరంగా అవమానించారు. పాపవిముక్తి, పరలోక ధన్యతలనిస్తానని దేవుడు ఆహ్వానిస్తుంటే నిరాకరించేవారు ఆయన్ను అవమానిస్తున్నారు. అయితే చివర్లో ఆయన ఇల్లు అతిథులతో నిండిపోతుంది. వారు పేదలు, అంగహీనులు అయినప్పటికీ విందులోకి వస్తారు 1 కోరింథీయులకు 1:26-29 పోల్చి చూడండి.

22. అంతట దాసుడు ప్రభువా,నీ వాజ్ఞాపించినట్టు చేసితినిగాని యింకను చోటున్నదని చెప్పెను.

23. అందుకు యజమానుడు-నా యిల్లు నిండు నట్లు నీవు రాజమార్గములలోనికిని కంచెలలోనికిని వెళ్లి లోపలికి వచ్చుటకు అక్కడివారిని బలవంతము చేయుము;

మనుషుల పాప విముక్తికోసం దేవుడెంత తహతహ లాడుతాడో ఇది తెలియజేస్తున్నది. ఆయన క్రీస్తులో ఆ విందునంతా సిద్ధం చేయడంతో, క్రీస్తు సేవకులద్వారా అన్ని చోట్లకీ ఆహ్వానం పంపడంతో అయిపోలేదు. పాపవిముక్తి పొందేందుకు మనుషులకున్న సంకోచాన్ని తొలగించేందుకు అవసరమైనదంతా ఆయన చేస్తాడు. మనుషులు ఆత్రుతగా పరిగెడుతూ వచ్చి పొందదగిన దీవెనలను వారికిచ్చేందుకు సృష్టికర్త తాను సృష్టించిన జీవులను బ్రతిమాలుతున్నాడు.

24. ఏలయనగా పిలువబడిన ఆ మనుష్యులలో ఒకడును నా విందు రుచిచూడడని మీతో చెప్పుచున్నాననెను.

ఆయన్ను తిరస్కరిస్తున్న యూద జాతికి ఇది ఒక హెచ్చరిక (మత్తయి 21:43). అంతేగాక క్రీస్తుచెంతకు రమ్మన్న ఆహ్వానాన్ని లెక్క చెయ్యకుండా ఉంటున్న ప్రతి వ్యక్తికీ ఇది హెచ్చరిక.

25. బహు జనసమూహములు ఆయనతో కూడ వెళ్లు చున్నప్పుడు ఆయన వారితట్టు తిరిగి

అలాంటి జనసమూహంలో అనేకమంది తనను నిజంగా అనుసరించేవారు కారని యేసుకు తెలుసు. అంతేగాక అనేకమంది 16-23 వచనాల్లోని ఉదాహరణల్లాంటివాటిని అపార్థం చేసుకుని శిష్యరికం చెయ్యడానికి గల నియమాలు అంత కష్టతరమైనవి కాదనుకుంటారు కూడా. ఇలాంటి అపార్థాలేవైనా ఉంటే ఇప్పుడు యేసుప్రభువు వాటిని సవరించబూను కుంటున్నాడు. తనను అనుసరిస్తూ తనదగ్గర నేర్చుకోగోరే వారు తప్పనిసరిగా పాటించవలసిన మూడు నియమాలను ఇక్కడ చెప్తున్నాడు. ఇతరులపట్ల ఒక శిష్యుని మనస్తత్వం సరిగా ఉండాలి (వ 26), తనపట్ల తనకు సరైన అభిప్రాయం ఉండాలి (వ 26, 27), ఇహలోక విషయాలపట్ల అతని మనస్తత్వం సరిగా ఉండాలి (వ 33), నియమాలన్నీ అంతరంగంలో ఉండే స్థితికి సంబంధించినవి, ఆత్మలో దేవుడు జరిగించిన కార్యాన్ని వెల్లడించేవి. తెలివి, చదువు, ఈ లోకంలోని స్థానం, జాతి మొదలైనవాటికి మనుషులు చాలా ప్రాధాన్యత ఇస్తారు గాని పై విషయాలు ఇలాంటివాటిపై ఆధారపడి లేవు. ఈ మనస్తత్వాలు సహజసిద్ధంగా ఎవరిలోనూ ఉండవు. ఇవి దేవుని కృపవల్ల పవిత్రాత్మ పని ద్వారా కలిగేవి.

26. ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్న దమ్ములను అక్కచెల్లెండ్రను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు.
ద్వితీయోపదేశకాండము 33:9

తన శిష్యుని విషయంలో యేసు ప్రథమ స్థానం కోరుతున్నాడు. మత్తయి 10:37 చూడండి. క్రీస్తు మొదట, ఇతరులు తరువాత, తాను చివర (లేక “నేను” అనేదానికి అసలు స్థానం ఉండకూడదు) – ఇదీ అసలైన క్రమం. అయ్యో, క్రైస్తవులమని చెప్పుకునేవారిలో ఈ క్రమం తలక్రిందులుగా ఉంటుంది. “నేను” మొదట, ఇతరులు తరువాత, క్రీస్తు చివర. “ద్వేషించకపోతే”– తక్కువగా ప్రేమించడం అని అర్థం (మత్తయి 10:37 పోల్చి చూడండి). శిష్యులు అక్షరాలా ఎవరినీ ద్వేషించకూడదు – మత్తయి 5:43-48; మత్తయి 22:37-38. అయితే క్రీస్తు పట్ల మన ప్రేమతో పోల్చుకుంటే మన కుటుంబ సభ్యులపట్ల మనం చూపే ప్రేమ కొన్ని సార్లు ద్వేషంలాగా కనిపించాలి. ఆయనపై మనకున్న ప్రేమ మనల్ని అవసరమైతే వారిని వదిలి ఆయన్ను అనుసరించేలా, వారికి బదులుగా క్రీస్తుకే మన ప్రాణాలు సైతం ఇవ్వగలిగేలా చెయ్యాలి. శిష్యుడు తన స్వార్థంకోసమే బ్రతకరాదు. క్రీస్తు కోసం అతని ప్రేమ ఎలా ఉండాలంటే అతడు తనను తాను ప్రేమించుకునేది ద్వేషంలాగా కనిపించాలి. ఆ ప్రేమ తన స్వార్థాన్నంతా చంపేసుకునే ప్రయత్నం చెయ్యడానికి అతణ్ణి పురిగొల్పాలి. “శిష్యుడు”– మత్తయి 10:1 నోట్ చూడండి.

27. మరియు ఎవడైనను తన సిలువను మోసికొని నన్ను వెంబడింపని యెడల వాడు నా శిష్యుడు కానేరడు.

28. మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింప గోరిన యెడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్కచూచుకొనడా?

శిష్యత్వం అంటే ఒక బ్రతుకును కట్టడం. అంటే దేవునికోసం ఒక వ్యక్తి ఆధ్యాత్మిక జీవితాన్ని నిర్మించడం (మత్తయి 7:24). పై చెప్పిన నియమాలను అనుసరించని వ్యక్తి ఇలా కట్టి పూర్తి చేయలేడు. చాలమంది ఆరంభం బాగానే ఉంటుంది. గాని కొనసాగరు. ముందునుంచీ వారి హృదయం సరైనది కాదు కాబట్టే ఇలా జరుగుతుంది.

29. చూచుకొననియెడల అతడు దాని పునాదివేసి, ఒకవేళ దానిని కొనసాగింప లేక పోయినందున

30. చూచువారందరు ఈ మనుష్యుడు కట్ట మొదలుపెట్టెను గాని కొన సాగింపలేక పోయెనని అతని చూచి యెగతాళి చేయ సాగుదురు.

31. మరియు ఏ రాజైనను మరియొక రాజుతో యుద్ధము చేయబోవునప్పుడు తనమీదికి ఇరువదివేల మందితో వచ్చువానిని పదివేలమందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా?

శిష్యత్వమంటే యుద్ధం లాంటిది – ఆధ్యాత్మిక పోరాటం జరుగుతుంది (ఎఫెసీయులకు 6:10-18). క్రీస్తు చెప్పిన ప్రకారం చేయనివారు జయించలేరు. సైతానును జయించడానికి ఏకైక మార్గం అన్నిటికంటే ఎక్కువగా క్రీస్తును ప్రేమించడం. ప్రకటన గ్రంథం 12:11 పోల్చి చూడండి. క్రీస్తుకు శిష్యులుగా ఉండగోరినవారు తాము ఎలా ముగించాలో, ఎలా విజయం సాధించాలో ముందుగానే జాగ్రత్తగా గమనించి తెలుసుకొంటే మంచిది.

32. శక్తి లేనియెడల అతడింకను దూరముగా ఉన్నప్పుడే రాయబారము పంపి సమాధానము చేసికొన చూచును గదా.

33. ఆ ప్రకారమే మీలో తనకు కలిగిన దంతయు విడిచి పెట్టనివాడు నా శిష్యుడు కానేరడు.

ఇహలోక వస్తువులపట్ల శిష్యుడి మనస్తత్వం సరిగా ఉండాలి (లూకా 6:20-24; లూకా 12:15; మత్తయి 6:19; 1 తిమోతికి 6:6-11). లేకపోతే దేవుడు ఆ ఆధ్యాత్మిక నిర్మాణం పూర్తి చేయగలిగేందుకు అవసరమైన వనరులను మనకు ఇవ్వడు. క్రీస్తుకోసం మనకున్న వాటినన్నిటినీ వదిలి పెట్టడానికి ఇష్టపడకపోతే పోరాటంలో జయం ఇవ్వడు. ఫిలిప్పీయులకు 3:7-8 పోల్చి చూడండి. ఇది ఎన్నటికీ విఫలం కాని సూత్రం – విడిచిపెట్టిన వాడికి దొరుకుతుంది. ఆత్రంగా అన్నిటినీ కోరుకునేవాడు అన్నిటినీ కోల్పోతాడు (లూకా 9:24; లూకా 17:33; మత్తయి 10:39; యోహాను 12:25 పోల్చి చూడండి).

34. ఉప్పు మంచిదేగాని ఉప్పు నిస్సారమైతే దేనివలన దానికి సారము కలుగును?

మత్తయి 5:13; మార్కు 9:50. క్రీస్తును అనుసరించేవారమని చెప్పుకొంటూ, శిష్యులనబడ్డవారిలో ఉండవలసిన మనస్తత్వాలు లేకపోతే అది రుచిలేని ఉప్పులాటిది. ఉప్పదనం లేని ఉప్పులాగా అది నిరుపయోగం, దేనికీ పనికి రాదు. బయట పారవేయడానికి అది తగినది (మత్తయి 25:30 పోల్చి చూడండి).

35. అది భూమికైనను ఎరువుకైనను పనికిరాదు గనుక దానిని బయట పారవేయుదురు. వినుటకు చెవులుగలవాడు వినునుగాక అని వారితో చెప్పెను.Shortcut Links
లూకా - Luke : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |