Acts - అపొ. కార్యములు 12 | View All

1. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపువారిలో కొందరిని బాధపెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని

ఈ హేరోదు మత్తయి 2:1 లోని హేరోదు మనుమడు. రాజులైన హేరోదులందరిలాగే ఇతడు దుర్మార్గుడు.

2. యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను.

ఈ యాకోబు ఆది రాయబారులలో ఒకడు (మత్తయి 10:2). ఈ ఇద్దరు రాయబారులపట్ల హేరోదు వేరువేరు విధాలుగా వ్యవహరించడంలో గల కారణం రాసి లేదు. అందరికీ పైగా పరిపాలిస్తున్న దేవుని రహస్య ఆలోచనల్లో ఈ సంగతి దాచబడి ఉంది. హేరోదు యూదులకు సంతోషం కలిగించడానికి ప్రయత్నం చేశాడు. అతడేమో ఎదోంవాడు (ఏశావు సంతతివాడు – ఆదికాండము 25:29-30), గాని రాజులైన హేరోదులందరినీ అసహ్యించుకొనే యూదుల మీద తన పరిపాలన విజయవంతంగా ఉండాలని హేరోదు కోరాడు.

3. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలిసికొని పేతురునుకూడ పట్టుకొనెను. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు.

“పొంగని రొట్టెల పండుగ”– లేవీయకాండము 23:4-8.

4. అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి, పస్కా పండుగైన పిమ్మట ప్రజలయొద్దకు అతని తేవలెనని ఉద్దేశించి, అతనికి కావలియుండుటకు నాలుగు చతుష్టయముల సైని కులకు అతనిని అప్పగించెను.

బహుశా అతడు అబద్ధ సాక్షులను తయారు చేసి పేతురు దేవదూషణ చేశాడనే నేరం మోపదలచాడేమో (అపో. కార్యములు 6:11-15; మత్తయి 26:64-65 పోల్చి చూడండి).

5. పేతురు చెరసాలలో ఉంచ బడెను, సంఘమయితే అతనికొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థనచేయుచుండెను.

వారు హృదయ పూర్వకంగా ప్రార్థన చేశారు గాని 15,16 వచనాలను బట్టి చూస్తే ఎక్కువ విశ్వాసంతో ప్రార్థన చేయలేదని అర్థమౌతుంది. అయినా అల్ప విశ్వాసంతో చేసిన వీరి ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడు. నిజ దేవునికి ప్రార్థన చేసేవారందరికీ ఇది ప్రోత్సాహకరంగా ఉండాలి. బొత్తిగా ప్రార్థన చేయకుండా ఉండడంకంటే అల్ప విశ్వాసంతో ప్రార్థన చేయడం ఎంతో మంచిది.

6. హేరోదు అతనిని వెలుపలికి తీసికొని రావలెననియుండగా, ఆ రాత్రియే పేతురు రెండు సంకెళ్లతో బంధింపబడి యిద్దరు సైనికుల మధ్య నిద్రించు చుండెను; మరియు కావలివారు తలుపు ఎదుట చెరసాల కాచుకొనుచుండిరి.

పేతురు ఏ మాత్రం తప్పించుకోకూడదని హేరోదు గట్టి ఉద్దేశం.

7. ఇదిగో ప్రభువు దూత అతనిదగ్గర నిలిచెను; అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కను తట్టిత్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్లు అతని చేతులనుండి ఊడిపడెను.

అపో. కార్యములు 5:18-24 పోల్చి చూడండి. దేవదూతకు పేతురును చెరనుంచి విడిపించడం ఎంత సులభమో యాకోబును ఖడ్గధార నుంచి తప్పించడం అంతే సులభం. అయితే దేవదూత అలా చేయలేదు.

8. అప్పుడు దూత అతనితో నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొనుమనెను. అతడాలాగు చేసిన తరువాత దూత నీ వస్త్రము పైన వేసికొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పెను.

9. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్లి, దూతవలన జరిగినది నిజముగా జరిగెనని గ్రహింపక, తనకు దర్శనము కలిగెనని తలంచెను.

10. మొదటి కావలిని రెండవ కావలిని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవినియొద్దకు వచ్చినప్పుడు దానంతట అదే వారికి తెరచుకొనెను. వారు బయలుదేరి యొక వీధి దాటినవెంటనే దూత అతనిని విడిచిపోయెను.

11. పేతురుకు తెలివివచ్చి ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతిలోనుండియు, యూదులను ప్రజలు నాకు చేయ నుద్దేశించిన వాటన్నిటినుండియు నన్ను తప్పించి యున్నాడని యిప్పుడు నాకు నిజముగా తెలియునని అనుకొనెను.

12. ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరుగల యోహాను తల్లియైన మరియ యింటికి వచ్చెను; అక్కడ అనే కులుకూడి ప్రార్థనచేయుచుండిరి.

వ 5. ఈ మార్కు మార్కు శుభవార్త రాసినవాడు. అతని గురించిన ఇతర రిఫరెన్సులు వ 25; అపో. కార్యములు 13:5-13; అపో. కార్యములు 15:37-39; కొలొస్సయులకు 4:10; 2 తిమోతికి 4:11; ఫిలేమోనుకు 1:24; 1 పేతురు 5:13.

13. అతడు తలవాకిటి తలుపు తట్టుచుండగా, రొదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను.

దేవుడు వారి ప్రార్థనలకు జవాబిచ్చాడని ఈ పనిపిల్ల నమ్మినందుచేత ఆమెకు మతి తప్పింది అనుకోవడం, పేతురును చూచినప్పుడు వారికి గొప్ప ఆశ్చర్యం ఇవి వారి అవిశ్వాసాన్ని సూచిస్తున్నాయి.

14. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి, సంతోషముచేత తలుపుతీయక లోపలికి పరుగెతికొని పోయిపేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపెను.

15. అందుకు వారునీవు పిచ్చిదానవనిరి; అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతని దూత అనిరి.

“అతని దేవదూత”– మత్తయి 18:10 పోల్చి చూడండి. ఒక దేవదూత ఒక మనిషికి ప్రతినిధిగా ఆ మనిషి రూపాన్ని ధరించి అతనిలాగా కనబడగలడని వారు నమ్మినట్టు ఉంది. ఈ నమ్మకానికి బైబిలులో ఏమి ఆధారం లేదు.

16. పేతురు ఇంకను తట్టుచున్నందున వారు తలుపు తీసి అతనిని చూచి విభ్రాంతి నొందిరి.

17. అతడు ఊరకుండుడని వారికి చేసైగచేసి, ప్రభువు తన్ను చెరసాలలోనుండి యేలాగు తీసికొనివచ్చెనో వారికి వివరించి యాకోబుకును సహోదరులకును ఈ సంగతులు తెలియజేయుడని చెప్పి

ఈ వచనంలోని యాకోబు ప్రభువైన యేసు తల్లికి పుట్టినవాడు (అపో. కార్యములు 1:14; మత్తయి 13:55). అతడు జెరుసలంలోని క్రీస్తు సంఘానికి నాయకుడయ్యాడు.

18. తెల్లవారగనే పేతురు ఏమాయెనో అని సైనికులలో కలిగిన గలిబిలి యింతంతకాదు.

19. హేరోదు అతనికోసరము వెదకినప్పుడు అతడు కనబడనందున కావలి వారిని విమర్శించి వారిని చంప నాజ్ఞాపించెను. అటు తరువాత హేరోదు యూదయ నుండి కైసరయకు వెళ్లి అక్కడ నివసించెను.

20. తూరీయులమీదను సీదోనీయులమీదను అతనికి అత్యా గ్రహము కలిగినందున వారేకమనస్సుతో రాజునొద్దకు వచ్చి అంతఃపురమునకు పైవిచారణకర్తయగు బ్లాస్తును తమ పక్షముగా చేసికొని సమాధాన పడవలెనని వేడుకొనిరి; ఎందుకనగా రాజుయొక్క దేశమునుండి వారి దేశమునకు గ్రాసము వచ్చుచుండెను.
1 రాజులు 5:11, యెహెఙ్కేలు 27:17

“తూరు”, “సీదోను”– అపో. కార్యములు 11:19.

21. నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠము మీద కూర్చుండి వారి యెదుట ఉపన్యాసముచేయగా

22. జనులుఇది దైవస్వరమేకాని మానవస్వరముకాదని కేకలు వేసిరి.
యెహెఙ్కేలు 28:2

హేరోదుకు ఏకైక నిజ దేవుణ్ణి గురించి పాత ఒడంబడిక గ్రంథంలోని ఉపదేశాలు తెలుసు. దేవునికే చెందవలసిన గౌరవాన్ని స్వీకరించడానికి ఏ మనిషికీ హక్కు లేదని కూడా అతనికి తెలుసు (నిర్గమకాండము 20:1-6). అతని గర్వానికి తగినట్టుగా అతడు శిక్షకు గురి అయ్యాడు. అతని ప్రవర్తనతో అపో. కార్యములు 14:11-18 లో పౌలు బర్నబాల ప్రవర్తననూ అపో. కార్యములు 3:12-16 లో పేతురు ప్రవర్తననూ పోల్చి చూడండి. మనం దేవుణ్ణి గురించి, మన గురించి సరైన తలంపులు మనకు ఉండాలి. లేకపోతే మనం కూడా హేరోదు చేసిన తప్పు చేసి అతనిలాగా తీర్పుకు గురి కావచ్చు.

23. అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభువు దూత అతని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను.
దానియేలు 5:20

24. దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను.

ఈ లోకంలో ఉన్న హేరోదులాంటివారు, సత్యానికి విరోధులైనవారంతా బయలుదేరుతారు, చచ్చిపోతారు, దేవుని వాక్కు దాని పని కొనసాగిస్తూ అనంతంగా సుస్థిరమై ఉంటుంది (మత్తయి 5:18; మత్తయి 24:35; కీర్తనల గ్రంథము 37:35-36; యెషయా 40:6-8).

25. బర్నబాయు సౌలును తమ పరిచర్య నెరవేర్చిన తరువాత మార్కు అను మారు పేరుగల యోహానును వెంటబెట్టుకొని యెరూషలేమునుండి తిరిగి వచ్చిరి.

వ 12; అపో. కార్యములు 11:29-30. వారు అంతియొకయకు తిరిగి వెళ్ళారు.Shortcut Links
అపో. కార్యములు - Acts : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |