Galatians - గలతీయులకు 1 | View All

1. మనుష్యుల మూలముగానైనను ఏ మనుష్యునివలననైనను కాక, యేసుక్రీస్తు వలనను, ఆయనను మృతులలోనుండి లేపిన తండ్రియైన దేవునివలనను అపొస్తలుడుగా నియ మింపబడిన పౌలను నేనును,

“క్రీస్తు రాయబారి”– మత్తయి 10:2; రోమీయులకు 1:3. గలతీయ ప్రస్తుతం టర్కీ దేశంలోని ఒక ప్రాంతం. ఈకొనియ, లుస్త్ర, దెర్బే అనేవి గలలీయలో ఉన్న పట్టణాలు (అపో. కార్యములు 14:1-20).

2. నాతో కూడనున్న సహో దరులందరును, గలతీయలోనున్న సంఘములకు శుభమని చెప్పి వ్రాయునది.

“చనిపోయినవారిలోనుంచి”– మత్తయి 28:6. యేసు క్రీస్తును, తండ్రి అయిన దేవుణ్ణి పౌలు వేరువేరుగా చెప్పడం గమనించండి. ఈ ఇద్దరూ ఒకే దేవత్వం లోనివారు గాని వేరు వేరు వ్యక్తులు. మత్తయి 3:16-17; యోహాను 17:1 నోట్స్.

3. తండ్రియైన దేవునినుండియు మన ప్రభువైన యేసుక్రీస్తునుండియు మీకు కృపయు సమాధానమును కలుగును గాక.

రోమీయులకు 1:2. “అనుగ్రహం”– ఈ అంశం ఈ లేఖలో చాలా ప్రధానమైనది – గలతియులకు 1:3, గలతియులకు 1:6, గలతియులకు 1:15; గలతియులకు 2:9, గలతియులకు 2:21; గలతియులకు 5:4; గలతియులకు 6:18. ఇందులో పౌలు కృప శుభవార్త అంటే ఏమిటో స్పష్టంగా వివరిస్తున్నాడు.

4. మన తండ్రియైన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములోనుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను.

“చెడు యుగం”– ఈ లోకం కోరికలు, ఉద్దేశాలు, పనులు, అనుసరించే మాదిరులు అన్నీ చెడ్డవే. యోహాను 3:19; యోహాను 7:17; రోమీయులకు 3:19, రోమీయులకు 3:23; రోమీయులకు 12:2; 1 యోహాను 2:16; 1 యోహాను 5:19 చూడండి. మనల్ని వీటినుంచి విడిపించడం ఈ విధంగా జరిగింది – మన పాపాలను తీసివేయడానికీ, మనల్ని శిక్షనుండి తప్పించడానికీ క్రీస్తు చనిపోయాడు (రోమీయులకు 8:1). మనం పశ్చాత్తాపపడి ఆయనలో నమ్మకం ఉంచినప్పుడు ఆయన మనల్ని క్షమిస్తాడు, దేవుని ఆత్మ వచ్చి మనలో నివసించసాగుతాడు. అప్పుడు ఈ లోకాన్ని కాదని దేవుని కోసం జీవించగలిగే శక్తి సామర్థ్యాలు మనకు కలుగుతాయి. అప్పుడు ఈ లోకంలో మనలను దుర్మార్గతకు బంధించే దానంతటినుంచీ మనల్ని శుద్ధీకరించే కార్యక్రమాన్ని క్రీస్తు ఆరంభిస్తాడు. చివరకు ఒక రోజున ఆయన వచ్చి ఆ దుర్మార్గత నుంచి మనల్ని పూర్తిగా వేరు చేస్తాడు. దీనంతటికీ పునాది పాపాల స్థానంలో క్రీస్తు మరణమే. అది లేకుండా మనల్ని విడిపించడమనేది సాధ్యం అయ్యేది కాదు. “విడిపించడానికి”– క్రీస్తు చనిపోవడానికి ఇది చాలా ప్రాముఖ్యమైన కారణం. ఈ లోకంలో దుర్మార్గత ప్రభావం నుంచీ మనుషులను కట్టి ఉంచిన బంధకాల నుంచీ విడిపించడానికి దేవుడు నియమించిన మార్గమిది. రోమీయులకు 11:26 లో క్రీస్తుకు ఇవ్వబడిన బిరుదు “విమోచకుడు”. మత్తయి 1:21; లూకా 4:18; కొలొస్సయులకు 1:13; తీతుకు 2:14; హెబ్రీయులకు 2:15. మనుషులను దేవునికి దూరంగా ఉంచే ప్రతిదాని నుంచీ ఆయన వారిని విడిపిస్తాడు – గలతియులకు 5:1; యోహాను 8:36; రోమీయులకు 6:17-18. “మన పాపాలకోసం”– యెషయా 53:6, యెషయా 53:8, యెషయా 53:10; మత్తయి 26:28; యోహాను 1:29; రోమీయులకు 3:24-25; 1 కోరింథీయులకు 15:3; 2 కోరింథీయులకు 5:21; హెబ్రీయులకు 9:28; 1 పేతురు 2:24; 1 పేతురు 3:18.

6. క్రీస్తు కృపనుబట్టి మిమ్మును పిలిచినవానిని విడిచి, భిన్నమైన సువార్తతట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకాశ్చర్యమగుచున్నది.

“మిమ్ములను పిలిచినవాని”– రోమీయులకు 1:1; రోమీయులకు 8:30. “వైపునుంచి”– వారు దేవుని సత్యం నుంచీ దేవునినుంచీ దూరమైపోవడం ఆరంభించారు. ఎందుకంటే దుర్మార్గులైన మనుషుల మాయలో వారు పడిపోయారు. కానీ ఇంకా పూర్తిగా దూరమైపోలేదు. “వేరొక శుభవార్త”– అంటే మోషే ధర్మశాస్త్రంలోని ఆజ్ఞలను పాటించడం ద్వారా పాపవిముక్తి, రక్షణకు మార్గమనే ఉపదేశం (గలతియులకు 3:1-5; గలతియులకు 4:9-11, గలతియులకు 4:21; గలతియులకు 5:2-4. అపో. కార్యములు 15:1-5 చూడండి). క్రీస్తు నిజమైన శుభవార్తను పౌలు వారికి ఉపదేశించాడు – పాపవిముక్తి, రక్షణ అంటే దేవుడు ఉచితంగా ఇచ్చేదే. నమ్మకం ద్వారా దాన్ని స్వీకరించాలి (గలతియులకు 2:16; గలతియులకు 3:6-9, గలతియులకు 3:26; గలతియులకు 5:5-6. రోమీయులకు 4:5; రోమీయులకు 6:23; ఎఫెసీయులకు 2:8-9 పోల్చి చూడండి). తప్పు శుభవార్తను ఉపదేశించే అబద్ధ ఉపదేశకులు వచ్చి క్రీస్తుపై నమ్మకం పెట్టుకోవడం మాత్రమే చాలదు, మోషే ధర్మశాస్త్రాన్ని కూడా పాటించాలని చెప్పారు. ఒక వ్యక్తి పాపవిముక్తి, రక్షణలో సొంతగా చేసే ప్రయత్నాలకు కూడా ప్రాముఖ్యమైన స్థానం ఉంది అని వారు బోధించారు. గలతీయలోని క్రైస్తవులు మెల్లగా ఆ అబద్ధ బోధవైపు తిరుగుతున్నారు (ఇంకా పూర్తిగా తిరగలేదు).

7. అది మరియొక సువార్త కాదుగాని, క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు.

“శుభవార్త కానే కాదు”– క్రైస్తవులు ధర్మశాస్త్రం కింద ఉన్నారనీ దాన్ని పాటించాలనీ చెప్పడం శుభవార్త ఏమీ కాదు (గలతియులకు 3:10; అపో. కార్యములు 15:10). లోకంలో శుభవార్తలు అనబడినవి చాలా ఉన్నాయి. కానీ క్రీస్తులో నమ్మకం మూలంగా కాక వేరే విధంగా కూడా విముక్తి, రక్షణ రాగలవని చెప్పేది శుభవార్త కాదు. పాపవిముక్తి, రక్షణ కోసం నమ్మకంతో బాటు వేరొకదాన్ని – అది మతాచారం, మంచి పని, సొంత ప్రయత్నం ఏదైనా సరే కలపడానికి ప్రయత్నం చేయబూనుకోవడం క్రీస్తు నిజ శుభవార్తను తారుమారు చేయడమే. “కొందరు”– గలతియులకు 4:17; గలతియులకు 5:10, గలతియులకు 5:12; గలతియులకు 6:12-13. “తారుమారు”– ఈ లోకంలో క్రీస్తు శుభవార్తను ఉన్నదున్నట్టుగా స్వీకరించి, దాన్ని తమకు సరిపడే విధంగా మార్చే ప్రయత్నం చెయ్యనివారు అలా చేసేవారితో పోల్చుకుంటే చాలా కొద్దిమంది. “కలవరపరుస్తున్నారు”– అబద్ధ బోధనకు ఫలితం ఎప్పుడైనా ఇదే.

8. మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరియొక సువార్తను మేమైనను పరలోకమునుండి వచ్చిన యొక దూతయైనను మీకు ప్రకటించినయెడల అతడు శాపగ్రస్తుడవును గాక.

“శాపగ్రస్థుడు”– తాను ఉపదేశించిన శుభవార్త అత్యంత ప్రాధాన్యతను చెప్పేందుకూ, దాన్ని తారుమారు చేసేలా ప్రయత్నించే వారి పాపాన్ని తెలిపేందుకూ ఈ కఠినమైన పదజాలాన్ని పౌలు ఉపయోగిస్తున్నాడు. క్రీస్తే స్వయంగా తనకు ఆ శుభవార్తను వెల్లడి చేశాడని పౌలుకు తెలుసు (వ 11,12). పాపవిముక్తి, రక్షణ కలిగించే దేవుని శక్తి దానికి మాత్రమే ఉందనీ తెలుసు (రోమీయులకు 1:16). దాన్ని మార్చేందుకు ప్రయత్నించే వారెవరైనా, తెలిసో తెలియకో మనుషులకు అందుబాటులో ఉన్న ఏకైక ముక్తి మార్గాన్ని తొలగించజూస్తున్నారు. మత్తయి 23:13; లూకా 11:52 పోల్చి చూడండి. ఇది మానవ జాతికీ, దేవునికీ వ్యతిరేకంగా గొప్ప నేరం. దీన్ని ఖండించేందుకు ఎంత కఠినమైన భాష ఉపయోగించినా చాలదు. ఈ విషయంలో దోషులైనవారు తమ మూర్ఖత, దుర్మార్గతల గురించి పశ్చాత్తాపపడకపోతే ఈ గొప్ప నేరానికి తగిన శిక్ష అనుభవిస్తారు.

9. మేమిది వరకు చెప్పిన ప్రకారమిప్పుడును మరల చెప్పుచున్నాము; మీరు అంగీకరించిన సువార్త గాక మరియొకటి యెవడైనను మీకు ప్రకటించిన యెడల వాడు శాపగ్రస్తుడవును గాక.

గట్టిగా నొక్కి చెప్పేందుకు ముందు చెప్పిన దాన్నే మళ్ళీ చెప్తున్నాడు పౌలు. దేవుడు వెల్లడి చేసిన సత్యంతో ఆటలాడుకోవడం ఎంత దుష్టత్వమో అన్న విషయంలో ఎవరికీ సందేహం ఉండకూడదని అతని ఉద్దేశం. ప్రకటన గ్రంథం 22:18-19 పోల్చి చూడండి. అబద్ధ బోధకుల గురించి ఇతర రిఫరెన్సులు మత్తయి 7:15; మత్తయి 24:11; అపో. కార్యములు 20:29-30; రోమీయులకు 16:17-18; 2 కోరింథీయులకు 11:13-15; 1 తిమోతికి 4:1-2; 2 తిమోతికి 4:3-4; 2 పేతురు 2:1; యూదా 1:4.

10. ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించు కొన జూచుచున్నానా దేవుని దయను సంపాదించుకొన జూచుచున్నానా? నేను మనుష్యులను సంతోషపెట్టగోరుచు న్నానా? నేనిప్పటికిని మనుష్యులను సంతోష పెట్టువాడనైతే క్రీస్తుదాసుడను కాకయేపోవుదును.

మనుషులకు ఏమి వినాలని ఉంటుందని పౌలు ఉద్దేశమో దాన్నే అతడు ఉపదేశిస్తున్నాడని పౌలు శత్రువులు అతనిపై నేరం మోపారా? వ 6-9 బట్టి అది నిజం కాదనీ, దీనికి వ్యతిరేకమే నిజమనీ వారికి అర్థమై ఉండాలి. దేవుడు వెల్లడి చేసిన సత్యాన్నే పౌలు ఎప్పుడూ ఉపదేశించాడు. ఎవరికైనా నొప్పి కలుగు తుందేమోనని దేన్నీ దాచిపెట్టలేదు (అపో. కార్యములు 20:20, అపో. కార్యములు 20:26-27). అతని ఉపదేశానికి సంబంధించినంత వరకు క్రీస్తును తప్ప వేరెవరినీ సంతోషపెట్టేందుకు అతడు ప్రయత్నించలేదు. మనుషులకు నచ్చినా నచ్చకపోయినా క్రీస్తు సందేశాన్ని పూర్తిగా ఉపదేశించడానికి సిద్ధపడకపోతే ఎవరూ ఆయనకు నిజ సేవకులు కాలేరని అతనికి తెలుసు. కాబట్టి అతడు దేవుని కొరకు సత్యాన్ని బోధించడానికి వెనుకాడలేదు. కానీ ఇతర విషయాల్లో మాత్రం మనుషులను క్రీస్తుకోసం సంపాదించేందుకూ, వారు క్రీస్తులో ఎదిగేలా సహాయం చేసేందుకూ అతడు మనుషులను సంతోషపెట్టడానికి సిద్ధమే. రోమీయులకు 15:1-3; 1 కోరింథీయులకు 9:19-23; 1 కోరింథీయులకు 10:33. ఈ రెండు విషయాల్లోనూ మనం పౌలును అనుసరించాలి.

11. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుష్యుని యోచనప్రకారమైనది కాదని మీకు తెలియ జెప్పు చున్నాను.

12. మనుష్యునివలన దానిని నేను పొందలేదు, నాకెవడును దాని బోధింపనులేదు గాని యేసుక్రీస్తు బయలుపరచుటవలననే అది నాకు లభించినది.

ఎఫెసీయులకు 3:2-5; రోమీయులకు 16:25-27; 1 కోరింథీయులకు 15:3; అపో. కార్యములు 24:14-15; అపో. కార్యములు 26:15-16. ఇది అత్యంత ప్రాముఖ్యమైన సంగతి. గలతీయకు వెళ్ళిన అబద్ధ బోధకులు దీన్ని కాదంటున్నారు కాబట్టి దీన్నే గట్టిగా నొక్కి చెప్తున్నాడు పౌలు. ఆ సత్యం గురించి తాను ఊహించి చెప్పడం లేదని అతనికి తెలుసు. మనుషుల నుంచి విన్నది, తాను ఒకవేళ అపార్థం చేసుకున్నది ఇతరులకు అందించడం లేదు. క్రీస్తు తానే ఆ సత్యాన్ని అతనికి వెల్లడి చేశాడు కాబట్టి పూర్తి అధికారంతో అతడు మాట్లాడగలడు. తన శుభవార్త నిజమా కాదా అని చూడాలని శుభవార్త అనబడిన దేనితోనూ పోల్చి చూడవలసిన అవసరం లేదు (కానీ మనం మాత్రం మనం ప్రకటించే శుభవార్తను పౌలు ప్రకటించిన శుభవార్తతో పోల్చి చూసుకుంటూ ఉండాలి. మనది పౌలు శుభవార్త కాకపోతే మనది నిజమైన శుభవార్త కాదన్నమాట).

13. పూర్వ మందు యూదమతస్థుడనై యున్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనముచేయుచు

14. నా పితరుల పారంపర్యాచారమందు విశేషాసక్తి గలవాడనై, నా స్వజాతీయులలో నా సమానవయస్కులైన అనేకులకంటె యూదుల మతములో ఆధిక్యతనొందితినని నా నడవడినిగూర్చి మీరు వింటిరి.

15. అయినను తల్లిగర్భము నందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి, తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్య జనులలో తన కుమారుని ప్రకటింపవలెనని
యెషయా 49:1, యిర్మియా 1:5

“ఇతర జనాలు”– గలతియులకు 2:7; అపో. కార్యములు 22:21; అపో. కార్యములు 26:17-18; ఎఫెసీయులకు 3:8. క్రొత్త ఒడంబడిక గ్రంథంలో ఇతర జనాలు అంటే యూదులు కానివారు అని అర్థం. “పుట్టుకతోనే”– యిర్మియా 1:5; యోహాను 15:16 పోల్చి చూడండి. “కృపచేత పిలిచిన”– వ 6. పౌలు పుట్టిన తరువాత అనేక సంవత్సరాలకు దేవుడు ఈ పిలుపు ఇచ్చాడు, అతని పుట్టుక సమయంలోనే అతణ్ణి ఏ ఉద్దేశాల కోసం ప్రత్యేకించుకున్నాడో దాన్ని నెరవేర్చడం ఆరంభించాడు.

16. ఆయనను నాయందు బయలుపరప ననుగ్రహించినప్పుడు మనుష్యమాత్రులతో నేను సంప్రతింపలేదు.

క్రీస్తు పౌలుకు ప్రత్యక్షమయ్యాడు (అపో. కార్యములు 9:3-4; 1 కోరింథీయులకు 9:1). కానీ ఇక్కడ క్రీస్తును తనలో ప్రత్యక్షపరచాలన్న దేవుని ఉద్దేశాన్ని గురించి అతడు మాట్లాడుతున్నాడు. క్రీస్తు తనలో జీవిస్తూ తనలో పని చేస్తున్నాడని పౌలు అర్థం చేసుకున్నాడు (గలతియులకు 2:20; 2 కోరింథీయులకు 4:10-11; కొలొస్సయులకు 1:29). విశ్వాసులందరి విషయంలోనూ దేవుని ఉద్దేశమిదే.

17. నాకంటె ముందుగా అపొస్తలులైన వారియొద్దకు యెరూషలేమునకైనను వెళ్లనులేదు గాని వెంటనే అరేబియా దేశములోనికి వెళ్లితిని;పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చితిని.

పౌలు అరేబియాకు వెళ్ళిన సంగతి క్రొత్త ఒడంబడిక గ్రంథంలో ఇక్కడ మాత్రమే రాసి ఉంది. అపో. కార్యములు 9:19-22 లో వర్ణించిన సంఘటనలు జరుగుతున్న సమయంలో ఇది జరిగింది. తానక్కడికి ఎందుకు వెళ్ళాడో పౌలు చెప్పడం లేదు గాని ప్రార్థన, క్రీస్తుతో సహవాసం, ధ్యానం కోసం వెళ్ళానని చూచాయగా తెలియజేస్తున్నట్టు తోస్తున్నది. అతడు ఏ మనిషినీ సంప్రదించలేదు (వ 16). దేవుణ్ణే సంప్రదించాలనుకున్నాడు.

18. అటుపైని మూడు సంవత్సరములైన తరువాత కేఫాను పరిచయము చేసికొనవలెనని యెరూషలేమునకు వచ్చి అతనితోకూడ పదునయిదు దినములుంటిని.

అపో. కార్యములు 9:26-30. ఇతర రాయబారులు బహుశా ఆ సమయంలో జెరుసలంలో లేరు. పేతురు, యాకోబు పౌలును ఆహ్వానించారంటే ఇతర రాయబారులు ఉంటే అలానే చేసే వారనుకోవచ్చు.

19. అతనిని తప్ప అపొస్తలులలో మరి ఎవనిని నేను చూడలేదు గాని, ప్రభువుయొక్క సహోదరుడైన యాకోబును మాత్రము చూచితిని.

20. నేను మీకు వ్రాయుచున్న యీ సంగతుల విషయమై, యిదిగో దేవుని యెదుట నేను అబద్ధమాడుట లేదు.

గలతీయవారు నిజమైన శుభవార్తను అంగీకరించడ మన్నది ఇప్పుడు ప్రమాదంలో పడింది కాబట్టి ఈ సంగతిని అతడు గంబీరంగా రాస్తున్నాడు. వారు అతణ్ణి నమ్మకపోతే వారు ఆరంభించినదానినే (వ 6) కొనసాగించవచ్చు.

21. పిమ్మట సిరియ, కిలికియ ప్రాంతములలోనికి వచ్చి తిని.

అపో. కార్యములు 9:30; అపో. కార్యములు 11:25-26 తార్సు పట్టణం కిలికియలో ఉంది (ఇది ప్రస్తుత టర్కీ దేశంలో ఒక భాగం).

22. క్రీస్తునందున్న యూదయసంఘములవారికి నా ముఖపరిచయము లేకుండెను గాని

పౌలు జెరుసలంలో గడిపిన సమయం చాల తక్కువ. అతని పరిచర్య అంతా ఇతర ప్రాంతాల్లోనే. అందువల్ల యూదయ ప్రాంతాల్లో క్రైస్తవులు అతణ్ణి వ్యక్తిగతంగా ఎరుగరు.

23. మునుపు మనలను హింసపెట్టినవాడు తాను పూర్వమందు పాడుచేయుచు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడను సంగతిమాత్రమే విని,

పౌలులో కలిగిన మార్పు వారికి తెలుసు. అందుకు వారు పౌలును మెచ్చుకోవడం లేదు గాని అతణ్ణి మార్చిన దేవుణ్ణే స్తుతిస్తున్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా పౌలు కోరినదీ ఇదే (1 కోరింథీయులకు 3:4-7; ఎఫెసీయులకు 1:6, ఎఫెసీయులకు 1:12, ఎఫెసీయులకు 1:14; ఫిలిప్పీయులకు 1:11).

24. వారు నన్ను బట్టి దేవుని మహిమ పరచిరి.Shortcut Links
గలతియులకు - Galatians : 1 | 2 | 3 | 4 | 5 | 6 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |