12. మనము దానిని విని గైకొనునట్లు, ఎవడు ఆకాశమునకు ఎక్కిపోయి మనయొద్దకు దాని తెచ్చును? అని నీ వను కొనుటకు అది ఆకాశమందు ఉండునది కాదు;రోమా 10:6-9 అయితే విశ్వాసమూలమగు నీతి యీలాగు చెప్పుచున్నది ఎవడు పరలోకములోనికి ఎక్కి పోవును? అనగా క్రీస్తును క్రిందికి తెచ్చుటకు;లేక ఎవడు అగాధములోనికి దిగిపోవును? అనగా క్రీస్తును మృతులలోనుండి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయములో అనుకొనవద్దు.అదేమని చెప్పుచున్నది? వాక్యము నీయొద్దను, నీ నోటను నీ హృదయములోను ఉన్నది; అది మేము ప్రకటించు విశ్వాసవాక్యమే.అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలోనుండి ఆయనను లేపెనని నీ హృదయ మందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు.