Timothy II - 2 తిమోతికి 3 | View All

1. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలిసికొనుము.

“చివరి రోజులలో”– యాకోబు 5:3; 1 పేతురు 1:5; యూదా 18 – అంటే ఈ యుగాంత కాలంలో. కష్టమైన సమయాలూ, వ 2-4లో పౌలు వివరించిన మనుషులూ ప్రపంచంలో ఎప్పుడూ ఉంటూనే ఉన్నారు. రోమీయులకు 1:28-32 పోల్చి చూడండి. అయితే రోజులు ఇంకా ఘోరంగా తయారవుతాయనీ ఇలాంటి ప్రజలు పైకి కనబడే క్రైస్తవ సంఘాలలో ఉంటారనీ (5వ వచనం) పౌలు భావం.

2. ఏలాగనగా మనుష్యులు స్వార్థ ప్రియులు ధనాపేక్షులు బింకములాడువారు అహంకారులు దూషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు

“స్వార్థప్రియులు”– మత్తయి 10:38; లూకా 14:26. “డబ్బంటే వ్యామోహంగలవారు”– లూకా 16:14; 1 తిమోతికి 6:10.

3. అనురాగరహితులు అతిద్వేషులు అపవాదకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జనద్వేషులు

“ప్రేమ”– ఈ వచనాల్లోని ముఖ్య పదం. ఆ భయంకర సమయంలోని భయంకర ప్రజలకు ఒక విధమైన ప్రేమ ఉంటుంది గానీ ఉండవలసిన ప్రేమ మాత్రం ఉండదు. వారి స్వభావం దేవుని వాక్కులోని స్పష్టమైన ఉపదేశానికి వ్యతిరేకంగా ఉంటుంది.

4. ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవునికంటె సుఖాను భవము నెక్కువగా ప్రేమించువారు,

“సుఖాన్నే ప్రేమించేవారు”– లూకా 8:14; 1 తిమోతికి 5:6; తీతుకు 3:3; హెబ్రీయులకు 11:25; యాకోబు 4:3; 2 పేతురు 2:13. వారు మంచి మీద, న్యాయం మీద, తల్లిదండ్రుల మీద, ఇరుగుపొరుగువారి మీద, దేవుని మీద “ప్రేమ లేనివారై” ఉంటారు. క్రీస్తుకోసం వారి పాపిష్టి విలాసాలను వదులుకోవడానికి సిద్ధంగా ఉండరు. డబ్బు విషయంలో క్రీస్తుకు లోబడరు. వారికి నిజంగా కావలసినదేదైనా విడిచిపెట్టరు. వాళ్ళ మనస్తత్వం ద్వారా, పనుల ద్వారా వారిలో ఉండవలసిన అసలైన ప్రేమ లేదని నిరూపించుకుంటారు – అదే దేవుని మీద ప్రేమ (1 యోహాను 2:15-16; మత్తయి 22:37-40; 1 కోరింథీయులకు 13:1-3; 1 కోరింథీయులకు 16:22). ఈ కారణాన్ని బట్టే ఈ వచనాల్లో చెప్పిన దుర్మార్గాలన్నీ వాళ్ళ హృదయాలలోనూ మనసుల్లోనూ గూడుకట్టుకుంటాయి. ప్రజలందరిలోకీ గొప్పలు చెప్పుకోవడానికి కారణాలు వాళ్ళకు చాలా తక్కువ ఉంటాయి. అయినా గొప్పలు చెప్పుకుంటారు. వాళ్ళను మందలిస్తే దూషిస్తారు. రోమీయులకు 2:21 లోని వారి లాగానే వీరు కృతజ్ఞత లేనివారై ఉంటారు. ఇతరులను క్షమించకుండా ఉండడం మూలాన తాము దేవుని నుంచి క్షమాపణ పొందలేదని కనపరచుకుంటారు. నిజ విశ్వాసులు వారిమీద ఆధారపడడానికీ, వారు చెప్పేదాన్ని దేన్నైనా నమ్మడానికీ వీలు ఉండదు. ఆధ్యాత్మికంగా వారు గ్రుడ్డివారై, అజ్ఞానులై ఉంటారు, అయినా తమకే అంతా తెలుసని భావిస్తూ దేవుని ఉపదేశకులు చెప్పేవి వినిపించుకోరు. ఇప్పుడు సహా మన సంఘాల్లో ఇలాంటివారు కొందరు లేరా?

5. పైకి భక్తిగలవారివలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించనివారునై యుందురు. ఇట్టివారికి విముఖుడవై యుండుము.

“భక్తిపరులలాగా”– వారు బయటికి క్రైస్తవులు, లోలోపల క్రూరమైన తోడేళ్ళలాంటివారు (మత్తయి 7:15). ఇంకో మాటలో చెప్పాలంటే వారు వేషధారులు, కపటులు. క్రైస్తవ భాషను ఉపయోగించగలరు గానీ నిజంగా దాని అర్థం వారికి తెలియదు. పాపులకు విముక్తి ఇవ్వడంలో శుభవార్తకున్న శక్తి (రోమీయులకు 1:16), మనుషులను కొత్తగా చేయడంలో క్రీస్తు ఆత్మకున్న శక్తి (యోహాను 3:5-8) అనుభవ పూర్వకంగా వారికేమీ తెలియదు. వాళ్ళ జీవితంలో ఈ శక్తిని అనుభవించలేదు గనుక దాన్ని పూర్తిగా కాదంటారు. “ఇలాంటివారి నుండి వైదొలగు”– 2 తిమోతికి 2:21; మత్తయి 18:17; 1 కోరింథీయులకు 5:11, 1 కోరింథీయులకు 5:13; 2 కోరింథీయులకు 6:17; 2 థెస్సలొనీకయులకు 3:6; తీతుకు 3:10 పోల్చి చూడండి. వారికి దూరంగా ఉండాలని పౌలు తిమోతికి చెప్తున్నాడంటే ఆ రోజుల్లో కూడా ఇలాంటి వారున్నారన్నమాట. ఇలాంటివారు ప్రతి తరంలోనూ ఉన్నారు. అయితే ఈ యుగాంతం సమీపించేకొద్దీ ఇలాంటివారి సంఖ్య బహుశా ఎక్కువవుతుంది (మత్తయి 24:10-14; 2 థెస్సలొనీకయులకు 2:1-12).

6. పాపభరితులై నానావిధములైన దురాశలవలన నడిపింపబడి, యెల్లప్పుడును నేర్చుకొనుచున్నను,

ఇలాంటి కపట భక్తులు కొందరు ప్రజలలో కొంతమందిని మోసం చేసి తమ ఆధీనంలో ఉంచుకోవాలని చూస్తారు. ముఖ్యంగా వీరి కళ్ళు సంఘంలో ఉన్న స్త్రీల మీద ఉంటాయి. పురుషులకంటే స్త్రీలు త్వరగా లొంగుతారనే తలంపు వీరికున్నట్టు కనబడుతుంది.

7. సత్యవిషయమైన అనుభవజ్ఞానము ఎప్పుడును పొందలేని అవివేక స్త్రీలయొక్క యిండ్లలో చొచ్చి, వారిని చెరపట్టుకొని పోవువారు వీరిలో చేరినవారు.

చాలామంది విషాదకరమైన స్థితి ఇదే. వారు సత్యాన్ని పదే పదే వింటారు, అంతేగాక సత్యం కావాలని తమకు ఆశ ఉందని అనుకోవచ్చు కూడా. కానీ నిజానికి ఆ ఆశ వారికి లేదు గనుక వారు వినేది వారికి అర్థం కాదు. సత్యాన్ని ఎదిరించేవారు వీరిని తప్పుదారి పట్టిస్తున్నారు అంటే దానికి కారణం ఇదే (2 థెస్సలొనీకయులకు 2:10).

8. యన్నే, యంబ్రే అనువారు మోషేను ఎదిరించినట్టు వీరును చెడిన మనస్సు కలిగి విశ్వాసవిషయములో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు.
నిర్గమకాండము 7:11, నిర్గమకాండము 7:22

యన్నేస్, యంబ్రేస్ అనే పేర్లు ఇక్కడ తప్ప బైబిల్లో ఎక్కడా కనబడవు. కానీ మోషేకు వచ్చిన వ్యతిరేకత మాత్రం నిర్గమకాండము 7:10-23; మొ।। చోట్ల ఉంది. “భ్రష్టమైపోయిన మనసు గలవారు”– 1 తిమోతికి 6:5.

9. అయినను వారి అవివేకమేలాగు తేటపడెనో ఆలాగే వీరిదికూడ అందరికి తేటపడును గనుక వీరు ఇకముందుకు సాగరు.

సత్యం, శక్తి వారిలో లేదనే విషయాన్ని వారు ఎల్లకాలం దాచలేదు. యన్నేస్, యంబ్రేస్ బయటపడిపోయారు (నిర్గమకాండము 8:18). అలాగే ఈ కపట భక్తులు కూడా బయటపడతారు.

10. అయితే నీవు నా బోధను నా ప్రవర్తనను నా ఉద్దేశమును నా విశ్వాసమును నా దీర్ఘశాంతమును నా ప్రేమను నా ఓర్పును,

పౌలు తనకు ఘనత కలగాలని ప్రయత్నించడం లేదు. అయితే అతడు ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్నాడంటే, విశ్వాసులూ క్రైస్తవ సేవకులూ ఎలా జీవించాలి అనేదానికి మాదిరిగా దేవుడు తనను ఏర్పాటు చేసుకున్నాడని తనకు తెలుసు. తిమోతి తనను అనుసరించాలని కోరుతున్నాడు (వ 14; 1 కోరింథీయులకు 11:1; ఫిలిప్పీయులకు 3:17; 2 థెస్సలొనీకయులకు 3:7; అపో. కార్యములు 20:18-35 కూడా చూడండి).

11. అంతి యొకయ ఈకొనియ లుస్త్ర అను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను, తెలిసికొనినవాడైవై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించితిని గాని, వాటన్నిటిలోనుండి ప్రభువు నన్ను తప్పించెను.
కీర్తనల గ్రంథము 34:19

12. క్రీస్తుయేసునందు సద్భక్తితో బ్రదకనుద్దేశించు వారందరు హింసపొందుదురు.

యోహాను 15:18-21; యోహాను 16:33; అపో. కార్యములు 14:22; 1 పేతురు 4:1, 1 పేతురు 14:12; రోమీయులకు 8:17. “క్రీస్తు యేసులో”– ప్రదేశాలను బట్టి, సమయాలను బట్టి వ్యక్తులను బట్టి కష్టాలు, హింసలు వేరు వేరుగా ఉంటాయి. హింసలు కొన్ని సార్లు శారీరక బాధల రూపంలో వస్తాయి. కొన్ని సార్లు ద్వేషానికీ భేదభావానికీ గురి కావడం ద్వారా వస్తాయి. అయితే దేవుని విశ్వాసులందరూ ఏదో ఒక విధంగా, ఏదో ఒక సమయంలో వీటిని ఎదుర్కోవలసి వస్తుంది.

13. అయితే దుర్జనులును వంచకులును ఇతరులను మోసపరచుచు తామును మోసపోవుచు అంత కంతకు చెడిపోవుదురు.

వీరు తమ ఎదుట దుర్మార్గమైన గమ్యం ఉంచుకుంటారు, చాలావరకు ఆ గమ్యం చేరుతారు.

14. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసముద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధలేఖనములను బాల్యమునుండి నీ వెరుగుదువు గనుక,

15. నీవు నేర్చుకొని రూఢియని తెలిసికొన్నవి యెవరివలన నేర్చుకొంటివో ఆ సంగతి తెలిసికొని, వాటియందు నిలుకడగా ఉండుము.

“చిన్నప్పటినుంచీ”– 2 తిమోతికి 1:5. బహుశా దీని అర్థం ఇది: వారు క్రైస్తవులు కాకముందే తిమోతి తల్లి, అమ్మమ్మ అతనికి పాత ఒడంబడిక గ్రంథాన్ని (“పవిత్ర లేఖనాలు”) నేర్పారు. ద్వితీయోపదేశకాండము 6:6-7; మొ।। వచనాల్లో దేవుడు ఇచ్చిన ఆజ్ఞను శిరసావహించారు. ఈ రోజుల్లోని క్రైస్తవ తల్లిదండ్రులు ఇంతకన్నా తక్కువ చేయవచ్చా? – ఎఫెసీయులకు 6:4. ఇప్పుడు “పవిత్ర లేఖనాలు” అంటే పాత, క్రొత్త ఒడంబడికల గ్రంథాలు రెండూ కలిసివున్న ఒకే పవిత్ర బైబిలు గ్రంథం. పాత ఒడంబడికను సరిగా అర్థం చేసుకున్నప్పుడు అది మనుషులకు “మోక్షం కోసమైన జ్ఞానాన్ని” కలిగిస్తుంది. లూకా 24:25-27, లూకా 24:45-47; యోహాను 5:39, యోహాను 5:46 పోల్చి చూడండి. “క్రీస్తు యేసులో ఉంచిన నమ్మకం”– పాత ఒడంబడిక అంతం కాదు. అందులో దేవుని సంపూర్ణ సత్యం వెల్లడి కాలేదు. అది క్రీస్తువైపుకు చూపిస్తూ “ఆయనలో నమ్మకముంచాలి” అని ప్రజలకు ప్రకటిస్తుంది.

16. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి యుండునట్లు దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనము ఉపదేశించుటకును,

“లేఖనాలన్నీ”– ప్రపంచంలోని వివిధ మతాల పవిత్రమైన పుస్తకాలనీ దేవుడిచ్చిన రాతలనీ ఎంచిన లేఖనాలన్నిటి గురించి కాదు పౌలిక్కడ రాస్తున్నది. బైబిలు గురించే మాట్లాడుతున్నాడు. 2 పేతురు 1:20-21; మత్తయి 4:4; మత్తయి 5:17-18; మత్తయి 15:3-4; మత్తయి 22:43; మార్కు 12:36; లూకా 24:44; యోహాను 10:35; అపో. కార్యములు 4:35; Chor 2:13; హెబ్రీయులకు 1:5-13; 1 పేతురు 1:11; ప్రకటన గ్రంథం 1:1; ప్రకటన గ్రంథం 2:1; ప్రకటన గ్రంథం 22:18-19 కూడా చూడండి. యిర్మియా 1:2, యిర్మియా 1:9; మొ।। పోల్చి చూడండి. “దైవావేశంవల్ల”– ఇలా అనువదించిన గ్రీకు పదానికి అర్థం “దేవుడు ఊపిరి పోయడం”. ఇది సృష్టించడం, లేదా ప్రాణాన్ని ఇవ్వడం, లేదా దేవుని ఆత్మ ఇచ్చిన ప్రేరేపణ అని అర్థం ఇస్తుంది. ఆదికాండము 2:7; కీర్తనల గ్రంథము 33:6; యెహెఙ్కేలు 37:5; యోహాను 20:22; హెబ్రీయులకు 4:12. బైబిలు దేవుని నోటినుంచి వచ్చింది (మత్తయి 4:4). ఇది ఆయన సృష్టి. ఆయన తన సత్యాన్నీ ఆలోచనలనూ మాటలనూ తన సేవకులైన ప్రవక్తల హృదయాలలో, మనసులలో “ఊదాడు”, వారు రాశారు. దేవుడు ఇలా ఎందుకు చేశాడో గమనించండి. మనుషులు లేఖనాలను ఆరాధించాలనీ లేదా వాటిని పవిత్రంగా ఎంచి వాటిపట్ల భక్తి పూర్వకంగా ఉండాలనీ కాదు. దేవుడు బైబిలును ఇచ్చినది మనుషులు దానిని ఉపయోగించాలని. “సంసిద్ధుడై”– బైబిలు గురించిన జ్ఞానం లేకుండా ఏ క్రైస్తవ సేవకుడైనా ఏ మంచి పనికైనా పూర్తిగా సిద్ధపడలేడు. ఇతర విషయాలు ఎన్ని నేర్చుకున్నా మన జీవితంలో బైబిలు చదువుతూ అర్థం చేసుకుంటూ ఉండడానికి ప్రముఖ స్థానం ఇవ్వాలి. “ప్రతి మంచి పనికి సమర్థుడై”– 2 తిమోతికి 2:21; ఎఫెసీయులకు 4:11-13; హెబ్రీయులకు 13:20-21. బైబిలు ఉపయోగపడే నాలుగు విధానాలను పౌలు ఇక్కడ చెప్తున్నాడు – సత్యాన్ని నేర్పించడం (దేవుణ్ణి గురించీ, క్రీస్తు, మనిషి, రక్షణ గురించీ), పాపాన్నీ అబద్ధ బోధలను గద్దించడం, తప్పు చేసేవారినీ తప్పుదారి పట్టేవారినీ సరిదిద్దడం, అన్యాయంతో నిండివున్న ఈ లోకంలో న్యాయవంతులుగా ఎలా ప్రవర్తించాలో దేవుని పిల్లలకు నేర్పడం.

17. ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమై యున్నది.Shortcut Links
2 తిమోతికి - 2 Timothy : 1 | 2 | 3 | 4 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |