Judges - న్యాయాధిపతులు 13 | View All

1. ఇశ్రాయేలీయులు మరల యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా నలువది సంవత్సరములు వారిని ఫిలిష్తీ యులచేతికి అప్పగించెను.

2. ఆ కాలమున దానువంశస్థుడును జొర్యాపట్టణస్థుడు నైన మానోహ అను నొకడుండెను. అతని భార్య గొడ్రాలై కానుపులేకయుండెను.

“జోర్యా”– ఫిలిష్తీయవాళ్ళు ఆక్రమించుకున్న ప్రాంతానికి సమీపంలో ఉన్న దాను ప్రాంతంలో ఒక ఊరు. “గొడ్రాలు”– ఆదికాండము 11:30 ఆదికాండము 16:1 ఆదికాండము 25:21 1 సమూయేలు 1:2 లూకా 1:7.

3. యెహోవా దూత ఆస్త్రీకి ప్రత్యక్షమైఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపులేకపోయెను; అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు.
లూకా 1:31

“యెహోవా దూత”– ఆదికాండము 16:7 నోట్.

4. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి, ద్రాక్షారస మునేగాని మద్యమునేగాని త్రాగకుండుము, అపవిత్ర మైన దేనినైనను తినకుండుము.
లూకా 1:15

5. నీవు గర్భవతివై కుమా రుని కందువు. అతని తలమీద మంగలకత్తి వేయకూడదు; ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడినవాడై ఫిలిష్తీయుల చేతిలోనుండి ఇశ్రాయేలీ యులను రక్షింప మొదలుపెట్టునని ఆమెతో అనగా
మత్తయి 2:23

“నాజీర్”– సంఖ్యాకాండము 6:2-5.

6. ఆ స్త్రీ తన పెనిమిటియొద్దకు వచ్చి దైవజనుడొకడు నా యొద్దకు వచ్చెను; అతని రూపము దేవదూత రూపమును పోలినదై మిక్కిలి భీకరముగా ఉండెను. అతడు ఎక్కడనుండి వచ్చెనో నేనడుగలేదు, అతడు తనపేరు నాతోచెప్పలేదు

దేవదూత ఆమెకు మానవ రూపంలో ప్రత్యక్షమయ్యాడు.

7. గానిఆలకించుము, నీవు గర్భవతివై కుమా రుని కందువు. కాబట్టి నీవు ద్రాక్షారసమునేగాని మద్య మునేగాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనను తిన కుండుము, ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని చని పోవువరకు దేవునికి నాజీరు చేయబడిన వాడై యుండునని నాతో చెప్పెననెను.
మత్తయి 2:23

8. అందుకు మానోహనా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరల మా యొద్దకువచ్చి, పుట్ట బోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలెనో దానిని మాకు నేర్పునట్లు దయచేయు మని యెహోవాను వేడు కొనగా

“మాకు చెప్పమను”– తమ పిల్లలను ఎలా పెంచాలో తెలుసుకోవడం కోసం తల్లిదండ్రులందరూ దేవుని వైపు చూడాలి. మాకు తెలుసులే అని భావించకూడదు (ఎఫెసీయులకు 6:4).

9. దేవుడు మానోహ ప్రార్థన నాలకించెను గనుక, ఆ స్త్రీ పొలములో కూర్చుండగా దేవునిదూత ఆమెను దర్శించెను.

10. ఆ సమయమున ఆమె పెనిమిటియైన మానోహ ఆమె యొద్దయుండలేదు గనుక ఆ స్త్రీ త్వరగా పరుగెత్తిఆనాడు నాయొద్దకు వచ్చిన పురుషుడు నాకు కనబడెనని అతనితో చెప్పెను.

11. అప్పుడు మానోహ లేచి తన భార్య వెంబడి వెళ్లి ఆ మనుష్యునియొద్దకు వచ్చిఈ స్త్రీతో మాటలాడినవాడవు నీవేనా అని అతని నడుగగా అతడునేనే అనెను.

12. అందుకు మానోహకావున నీ మాట నెరవేరునప్పుడు ఆ బిడ్డ ఎట్టివాడగునో అతడు చేయ వలసిన కార్యమేమిటో తెలుపుమని మనవిచేయగా

13. యెహోవా దూతనేను ఆ స్త్రీతో చెప్పినదంతయు ఆమె చేకొనవలెను; ఆమె ద్రాక్షావల్లినుండి పుట్టినదేదియు తినకూడదు,

దేవదూత చెప్పిన సంగతులన్నీ పుట్టబోయే కొడుకు కోసం కాక, తల్లికోసమే కావడం గమనించతగ్గది. అంటే పిల్లల పెంపకంలో అతి ప్రాముఖ్యమైన సంగతి ఏమంటే మొదట తల్లిదండ్రులు దేవునికి విధేయులై, ఆయన తమను ఎలా ఉండాలని కోరుతాడో దాన్ని పాటించడం.

14. ఆమె ద్రాక్షారసమునైనను మద్యమునైనను త్రాగకూడదు, అపవిత్రమైన దేనినైనను తినకూడదు, నేను ఆమె కాజ్ఞాపించినదంతయు ఆమె చేకొనవలెనని మానోహతో చెప్పెను.

15. అప్పుడు మానోహమేము ఒక మేకపిల్లను సిద్ధపరచి నీ సన్నిధిని ఉంచువరకు నీవు ఆగుమని మనవి చేసికొనుచున్నామని యెహోవా దూతతో చెప్పగా

16. యెహోవా దూతనీవు నన్ను నిలిపినను నీ భోజనము నేను తినను; నీవు దహనబలి అర్పించ నుద్దేశించిన యెడల యెహోవాకు దాని నర్పింపవలెనని మానోహతో చెప్పెను. అతడు యెహోవా దూత అని మానోహకు తెలియలేదు.

17. మానోహనీ మాటలు నెరవేరిన తరువాత మేము నిన్ను సన్మానించునట్లు నీ పేరేమని యెహోవా దూతను అడుగగా

“జరిగాక”– ద్వితీయోపదేశకాండము 18:21-22. “పేరు”– ఆదికాండము 32:29. తానొక మానవ మాత్రుడైన ప్రవక్తతో మాట్లాడుతున్నానని మానోహ అనుకుంటున్నాడు.

18. యెహోవా దూతనీ వేల నాపేరు అడుగుచున్నావు? అది చెప్పశక్యముకాని దనెను.

“ఆశ్చర్యకరం”– యెషయా 9:6 చూడండి. దీన్నే “గ్రహించ శక్యం కానిది” అని కూడా అనువదించవచ్చు. యెహోవాదేవుడే యెహోవా దూతగా వచ్చాడు. తన పేరంతటినీ అంటే తన స్వభావాన్నీ, లక్షణాలనూ మానోహకు పూర్తిగా చెప్పడం వీలుకాదు. నిర్గమకాండము 34:5-7 లో వాటిని సాధ్యమైనంత సూక్ష్మంగా తెలియజెప్ప

19. అంతట మానోహ నైవేద్యముగా నొక మేకపిల్లను తీసికొని యొక రాతిమీద యెహోవాకు అర్పించెను. మానోహయు అతని భార్యయు చూచుచుండగా ఆ దూత యొక ఆశ్చర్య కార్యము చేసెను.

20. ఎట్లనగా, జ్వాలలు బలిపీఠము మీదనుండి ఆకాశమునకు లేచుచుండగా యెహోవా దూత బలిపీఠముమీదనున్న ఆ జ్వాలలలో పరమునకు ఆరో హణమాయెను. మానోహయు అతని భార్యయు దానిని చూచి నేలకు సాగిలపడిరి.

21. ఆ తరువాత యెహోవా దూత మరల మానోహకును అతని భార్యకును ఇక ప్రత్య క్షము కాలేదు.

22. ఆయన యెహోవా దూత అని మానోహ తెలిసికొనిమనము దేవుని చూచితివిు గనుక మనము నిశ్చయముగా చనిపోదుమని తన భార్యతో అనగా

“దేవుణ్ణి”– ఈ కాలంలో బైబిలు చదివేవారు కొందరు గ్రహించలేనిదాన్ని మానోహ గ్రహించగలిగాడు – యెహోవా దూత అంటే సాక్షాత్తు దేవుడే అన్న విషయం. ఆయన్ను చూచినందువల్ల తమకు చావు తప్పదనుకున్నాడు. న్యాయాధిపతులు 6:23 నిర్గమకాండము 33:20 చూడండి.

23. అతని భార్యయెహోవా మనలను చంపగోరినయెడల ఆయన దహనబలిని నైవేద్యమును మనచేత అంగీకరింపడు, ఈ సంగతులన్నిటిని మనకు చూపింపడు, ఈ కాలమున ఇట్టి సంగతులను మనకు వినిపింపడని అతనితో చెప్పెను.

కొన్నిసార్లు భర్తలకంటే వారి భార్యల్లోనే ఎక్కువ వివేకం ఉంటుంది.

24. తరువాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సమ్సోను అను పేరు పెట్టెను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతని నాశీర్వదించెను.

“సమ్సోను”– “ప్రొద్దు” లేదా “ప్రకాశం” అనే అర్థాన్నిచ్చే హీబ్రూ పదంలోనుంచి ఈ పేరు వచ్చింది.

25. మరియయెహోవా ఆత్మజొర్యా కును ఎష్తాయోలుకును మధ్యనున్న మహనెదానులో అతని రేపుటకు మొదలు పెట్టెను.

“యెహోవా ఆత్మ”– న్యాయాధిపతులు 3:10 న్యాయాధిపతులు 6:34 న్యాయాధిపతులు 11:29 న్యాయాధిపతులు 14:6 న్యాయాధిపతులు 14:19. ఆదికాండము 1:2 మత్తయి 3:16 యోహాను 14:16-17 మొదలైన చోట్ల పవిత్రాత్మను గురించి నోట్స్, రిఫరెన్సులు చూడండి.



Shortcut Links
న్యాయాధిపతులు - Judges : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |