Judges - న్యాయాధిపతులు 6 | View All

1. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా యేడేండ్లు వారిని మిద్యానీయుల కప్ప గించెను.

1. ishraayēleeyulu yehōvaa drushṭiki dōshulainanduna yehōvaa yēḍēṇḍlu vaarini midyaaneeyula kappa gin̄chenu.

2. మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలీయుల మీద హెచ్చాయెను గనుక వారు మిద్యానీయులయెదుట నిలువలేక కొండలోనున్న వాగులను గుహలను దుర్గములను తమకు సిద్ధపరచుకొనిరి.

2. midyaaneeyula cheyyi ishraayēleeyula meeda hecchaayenu ganuka vaaru midyaaneeyulayeduṭa niluvalēka koṇḍalōnunna vaagulanu guhalanu durgamulanu thamaku siddhaparachukoniri.

3. ఇశ్రాయేలీయులు విత్తనములు విత్తిన తరువాత మిద్యా నీయులును అమాలేకీయులును తూర్పుననుండు వారును తమ పశువులను గుడారములను తీసికొని మిడతల దండంత విస్తారముగా వారిమీదికి వచ్చి

3. ishraayēleeyulu vitthanamulu vitthina tharuvaatha midyaa neeyulunu amaalēkeeyulunu thoorpunanuṇḍu vaarunu thama pashuvulanu guḍaaramulanu theesikoni miḍathala daṇḍantha visthaaramugaa vaarimeediki vachi

4. వారి యెదుట దిగి, గాజాకు పోవునంతదూరము భూమి పంటను పాడుచేసి, ఒక గొఱ్ఱెనుగాని యెద్దునుగాని గాడిదనుగాని జీవనసాధన మైన మరిదేనినిగాని ఇశ్రాయేలీయులకు ఉండనీయ లేదు.

4. vaari yeduṭa digi, gaajaaku pōvunanthadooramu bhoomi paṇṭanu paaḍuchesi, oka gorranugaani yeddunugaani gaaḍidhanugaani jeevanasaadhana maina maridheninigaani ishraayēleeyulaku uṇḍaneeya lēdu.

5. వారును వారి ఒంటెలును లెక్కలేకయుండెను.

5. vaarunu vaari oṇṭelunu lekkalēkayuṇḍenu.

6. దేశమును పాడుచేయుటకు వారు దానిలోనికి వచ్చిరి ఇశ్రాయేలీయులు మిద్యానీయులవలన మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొఱ్ఱ పెట్టిరి.

6. dheshamunu paaḍucheyuṭaku vaaru daanilōniki vachiri ishraayēleeyulu midyaaneeyulavalana mikkili heenadashaku vachinappuḍu vaaru yehōvaaku morra peṭṭiri.

7. మిద్యానీయులవలని బాధనుబట్టి ఇశ్రాయేలీయులు యెహోవాకు మొఱ్ఱపెట్టగా

7. midyaaneeyulavalani baadhanubaṭṭi ishraayēleeyulu yehōvaaku morrapeṭṭagaa

8. యెహోవా ఇశ్రాయేలీ యులయొద్దకు ప్రవక్తనొకని పంపెను. అతడు వారితో ఈలాగు ప్రకటించెనుఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగానేను ఐగుప్తులోనుండి మిమ్మును రప్పించి, దాసుల గృహములోనుండి మిమ్మును తోడుకొని వచ్చితిని.

8. yehōvaa ishraayēlee yulayoddhaku pravakthanokani pampenu. Athaḍu vaarithoo eelaagu prakaṭin̄chenu'ishraayēleeyula dhevuḍaina yehōvaa selavichinadhemanagaanēnu aigupthulōnuṇḍi mimmunu rappin̄chi, daasula gruhamulōnuṇḍi mimmunu thooḍukoni vachithini.

9. ఐగుప్తీయుల చేతిలో నుండియు మిమ్మును బాధించిన వారందరిచేతిలోనుండియు మిమ్మును విడిపించి, మీ యెదుటనుండి వారిని తోలివేసి వారి దేశమును మీకిచ్చితిని; మీ దేవుడనైన యెహోవాను నేనే.

9. aiguptheeyula chethilō nuṇḍiyu mimmunu baadhin̄china vaarandarichethilōnuṇḍiyu mimmunu viḍipin̄chi, mee yeduṭanuṇḍi vaarini thoolivēsi vaari dheshamunu meekichithini; mee dhevuḍanaina yehōvaanu nēnē.

10. మీరు అమోరీయుల దేశమున నివసించు చున్నారు, వారి దేవతలకు భయపడకుడి అని మీతో చెప్పితిని గాని మీరు నా మాట వినకపోతిరి.

10. meeru amōreeyula dheshamuna nivasin̄chu chunnaaru, vaari dhevathalaku bhayapaḍakuḍi ani meethoo cheppithini gaani meeru naa maaṭa vinakapōthiri.

11. యెహోవా దూత వచ్చి అబీయెజ్రీయుడైన యోవా షునకు కలిగిన ఒఫ్రాలోని మస్తకివృక్షము క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైయుండునట్లు గానుగ చాటున గోధుమలను దుళ్లగొట్టుచుండగా

11. yehōvaa dootha vachi abeeyejreeyuḍaina yōvaa shunaku kaligina ophraalōni masthakivrukshamu krinda koorchuṇḍenu. Yōvaashu kumaaruḍaina gidyōnu midyaaneeyulaku marugaiyuṇḍunaṭlu gaanuga chaaṭuna gōdhumalanu duḷlagoṭṭuchuṇḍagaa

12. యెహోవా దూత అతనికి కనబడిపరాక్రమముగల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై యున్నాడని అతనితో అనగా

12. yehōvaa dootha athaniki kanabaḍiparaakramamugala balaaḍhyuḍaa, yehōvaa neeku thooḍai yunnaaḍani athanithoo anagaa

13. గిద్యోనుచిత్తము నా యేలినవాడా, యెహోవా మాకు తోడైయుండినయెడల ఇదంతయు మాకేల సంభవిం చెను? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మును రప్పించెనని చెప్పుచు, మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుతకార్యములన్నియు ఏ మాయెను? యెహోవా మమ్మును విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మును అప్పగించెనని అతనితో చెప్పెను.

13. gidyōnuchitthamu naa yēlinavaaḍaa, yehōvaa maaku thooḍaiyuṇḍinayeḍala idanthayu maakēla sambhaviṁ chenu? Yehōvaa aigupthulō nuṇḍi mammunu rappin̄chenani cheppuchu, maa pitharulu maaku vivarin̄china aayana adbhuthakaaryamulanniyu ē maayenu? Yehōvaa mammunu viḍichipeṭṭi midyaaneeyula chethiki mammunu appagin̄chenani athanithoo cheppenu.

14. అంతట యెహోవా అతనితట్టు తిరిగిబలము తెచ్చుకొని వెళ్లి మిద్యానీయుల చేతిలోనుండి ఇశ్రాయేలీయులను రక్షిం పుము, నిన్ను పంపినవాడను నేనే అని చెప్పగా

14. anthaṭa yehōvaa athanithaṭṭu thirigibalamu techukoni veḷli midyaaneeyula chethilōnuṇḍi ishraayēleeyulanu rakshiṁ pumu, ninnu pampinavaaḍanu nēnē ani cheppagaa

15. అతడు చిత్తము నా యేలిన వాడా, దేని సహాయముచేత నేను ఇశ్రాయేలీయులను రక్షింపగలను? నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నికలేనిదే. నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడనై యున్నానని ఆయనతో చెప్పెను. అందుకు యెహోవా అయిన నేమి?

15. athaḍu chitthamu naa yēlina vaaḍaa, dheni sahaayamuchetha nēnu ishraayēleeyulanu rakshimpagalanu? Naa kuṭumbamu manashshē gōtramulō ennikalēnidhe. Naa pitharula kuṭumbamulō nēnu kanishṭhuḍanai yunnaanani aayanathoo cheppenu. Anduku yehōvaa ayina nēmi?

16. నేను నీకు తోడై యుందును గనుక ఒకే మనుష్యుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతముచేయుదువని సెలవిచ్చెను.

16. nēnu neeku thooḍai yundunu ganuka okē manushyuni hathamu chesinaṭlu midyaaneeyulanu neevu hathamucheyuduvani selavicchenu.

17. అందుకతడునాయెడల నీకు కటాక్షము కలిగినయెడల నాతో మాటలాడుచున్న వాడవు నీవే అని నేను తెలిసి కొనునట్లు ఒక సూచన కనుపరచుము.

17. andukathaḍunaayeḍala neeku kaṭaakshamu kaliginayeḍala naathoo maaṭalaaḍuchunna vaaḍavu neevē ani nēnu telisi konunaṭlu oka soochana kanuparachumu.

18. నేను నీయొద్దకు వచ్చి నా అర్పణమును బయటికి తెచ్చి నీ సన్నిధిని దానిని పెట్టువరకు ఇక్కడనుండి వెళ్లకుమీ అని వేడుకొనగా ఆయననీవు తిరిగి వచ్చువరకు నేను ఉండెదననెను.

18. nēnu neeyoddhaku vachi naa arpaṇamunu bayaṭiki techi nee sannidhini daanini peṭṭuvaraku ikkaḍanuṇḍi veḷlakumee ani vēḍukonagaa aayananeevu thirigi vachuvaraku nēnu uṇḍedhananenu.

19. అప్పుడు గిద్యోను లోపలికి పోయి ఒక మేక పిల్లను తూమెడు పిండితో పొంగని భక్ష్యములను సిద్ధపరచి ఆ మాంసమును గంపలో ఉంచి అది వండిన నీళ్లను కుండలో పోసి ఆయనకొరకు ఆ మస్తకివృక్షముక్రిందికి దానిని తీసికొనివచ్చి దగ్గర ఉంచగా

19. appuḍu gidyōnu lōpaliki pōyi oka mēka pillanu thoomeḍu piṇḍithoo poṅgani bhakshyamulanu siddhaparachi aa maansamunu gampalō un̄chi adhi vaṇḍina neeḷlanu kuṇḍalō pōsi aayanakoraku aa masthakivrukshamukrindiki daanini theesikonivachi daggara un̄chagaa

20. దేవుని దూత ఆ మాంసమును పొంగని భక్ష్యములను పట్టుకొని రాతి మీద పెట్టినీళ్లు పోయుమని అతనితో చెప్పెను.

20. dhevuni dootha aa maansamunu poṅgani bhakshyamulanu paṭṭukoni raathi meeda peṭṭineeḷlu pōyumani athanithoo cheppenu.

21. అతడాలాగు చేయగా యెహోవా దూత తన చేత నున్న కఱ్ఱను చాపి దాని కొనతో ఆ మాంసమును ఆ పొంగని భక్ష్యములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలోనుండి వెడలి ఆ మాంస మును పొంగని భక్ష్యములను కాల్చి వేసెను, అంతట యెహోవా దూత అతనికి అదృశ్య మాయెను.

21. athaḍaalaagu cheyagaa yehōvaa dootha thana chetha nunna karranu chaapi daani konathoo aa maansamunu aa poṅgani bhakshyamulanu muṭṭinappuḍu agni aa raathilōnuṇḍi veḍali aa maansa munu poṅgani bhakshyamulanu kaalchi vēsenu, anthaṭa yehōvaa dootha athaniki adrushya maayenu.

22. గిద్యోను ఆయన యెహోవా దూత అని తెలిసికొని అహహా నా యేలినవాడా, యెహోవా, ఇందుకే గదా నేను ముఖా ముఖిగా యెహోవా దూతను చూచితిననెను.

22. gidyōnu aayana yehōvaa dootha ani telisikoni ahahaa naa yēlinavaaḍaa, yehōvaa, indukē gadaa nēnu mukhaa mukhigaa yehōvaa doothanu chuchithinanenu.

23. అప్పుడు యెహోవానీకు సమాధానము, భయపడకుము, నీవు చావవని అతనితో సెలవిచ్చెను.

23. appuḍu yehōvaaneeku samaadhaanamu, bhayapaḍakumu, neevu chaavavani athanithoo selavicchenu.

24. అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠము కట్టి, దానికి యెహోవా సమాధానకర్తయను పేరుపెట్టెను. నేటివరకు అది అబీ యెజ్రీయుల ఒఫ్రాలో ఉన్నది.

24. akkaḍa gidyōnu yehōvaa naamamuna balipeeṭhamu kaṭṭi, daaniki yehōvaa samaadhaanakarthayanu pērupeṭṭenu. Nēṭivaraku adhi abee yejreeyula ophraalō unnadhi.

25. మరియు ఆ రాత్రియందే యెహోవానీ తండ్రి కోడెను, అనగా ఏడేండ్ల రెండవ యెద్దును తీసికొని వచ్చి, నీ తండ్రికట్టిన బయలుయొక్క బలిపీఠమును పడగొట్టి, దానికి పైగానున్న దేవతాస్తంభమును నరికివేసి

25. mariyu aa raatriyandhe yehōvaanee thaṇḍri kōḍenu, anagaa ēḍēṇḍla reṇḍava yeddunu theesikoni vachi, nee thaṇḍrikaṭṭina bayaluyokka balipeeṭamunu paḍagoṭṭi, daaniki paigaanunna dhevathaasthambhamunu narikivēsi

26. తగిన యేర్పాటుతో ఈ బండ కొనను నీ దేవుడైన యెహో వాకు బలిపీఠము కట్టి, ఆ రెండవ కోడెను తీసికొనివచ్చి నీవు నరికిన ప్రతిమయొక్క కఱ్ఱతో దహనబలి నర్పించు మని అతనితో చెప్పెను.

26. thagina yērpaaṭuthoo ee baṇḍa konanu nee dhevuḍaina yehō vaaku balipeeṭhamu kaṭṭi, aa reṇḍava kōḍenu theesikonivachi neevu narikina prathimayokka karrathoo dahanabali narpin̄chu mani athanithoo cheppenu.

27. కాబట్టి గిద్యోను తన పని వారిలో పదిమందిని తీసికొనివచ్చి యెహోవా తనతో చెప్పినట్లు చేసెను. అతడు తన పితరుల కుటుంబమునకును ఆ ఊరివారికిని భయపడినందున పగలు దానిని చేయలేక రాత్రివేళ చేసెను.

27. kaabaṭṭi gidyōnu thana pani vaarilō padhimandhini theesikonivachi yehōvaa thanathoo cheppinaṭlu chesenu. Athaḍu thana pitharula kuṭumbamunakunu aa oorivaarikini bhayapaḍinanduna pagalu daanini cheyalēka raatrivēḷa chesenu.

28. ఆ ఊరివారు వేకువనే లేచినప్పుడు బయలుయొక్క బలిపీఠము విరుగగొట్టబడియుండెను, దానికి పైగా నున్న దేవతాస్తంభమును పడద్రోయబడి యుండెను, కట్టబడిన ఆ బలిపీఠముమీద ఆ రెండవ యెద్దు అర్పింప బడి యుండెను.

28. aa oorivaaru vēkuvanē lēchinappuḍu bayaluyokka balipeeṭhamu virugagoṭṭabaḍiyuṇḍenu, daaniki paigaa nunna dhevathaasthambhamunu paḍadrōyabaḍi yuṇḍenu, kaṭṭabaḍina aa balipeeṭhamumeeda aa reṇḍava yeddu arpimpa baḍi yuṇḍenu.

29. అప్పుడు వారుఈ పని యెవరు చేసినదని ఒకరితోనొకరు చెప్పుకొనుచు విచారణచేసి వెదకి, యోవాషు కుమారుడైన గిద్యోను ఆ పనిచేసినట్టు తెలిసికొనిరి.

29. appuḍu vaaru'ee pani yevaru chesinadani okarithoonokaru cheppukonuchu vichaaraṇachesi vedaki, yōvaashu kumaaruḍaina gidyōnu aa panichesinaṭṭu telisikoniri.

30. కాబట్టి ఆ ఊరివారునీ కుమారుడు బయలుయొక్క బలిపీఠమును పడగొట్టి దానికి పైగానున్న దేవతాస్తంభమును పడద్రోసెను గనుక అతడు చావవలెను, వానిని బయటికి తెమ్మని యోవాషుతో చెప్పగా

30. kaabaṭṭi aa oorivaarunee kumaaruḍu bayaluyokka balipeeṭamunu paḍagoṭṭi daaniki paigaanunna dhevathaasthambhamunu paḍadrōsenu ganuka athaḍu chaavavalenu, vaanini bayaṭiki temmani yōvaashuthoo cheppagaa

31. యోవాషు తనకు ఎదురుగా నిలిచిన వారందరితోమీరు బయలు పక్షముగా వాదింతురా? మీరు వాని రక్షించు దురా? వానిపక్షముగా వాదించువాడు ఈ ప్రొద్దుననే చావవలెను; ఎవడో వాని బలిపీఠమును విరుగగొట్టెను గనుక, వాడు దేవతయైనందున తన పక్షమున తానేవాదించ వచ్చును.

31. yōvaashu thanaku edurugaa nilichina vaarandarithoomeeru bayalu pakshamugaa vaadhinthuraa? meeru vaani rakshin̄chu duraa? Vaanipakshamugaa vaadhin̄chuvaaḍu ee proddunanē chaavavalenu; evaḍō vaani balipeeṭamunu virugagoṭṭenu ganuka, vaaḍu dhevathayainanduna thana pakshamuna thaanēvaadhin̄cha vachunu.

32. ఒకడు తన బలిపీఠమును విరుగ గొట్టినందున అతనితో బయలు వాదించుకొననిమ్మని చెప్పి ఆ దినమున అతనికి యెరుబ్బయలను పేరు పెట్టెను.

32. okaḍu thana balipeeṭamunu viruga goṭṭinanduna athanithoo bayalu vaadhin̄chukonanimmani cheppi aa dinamuna athaniki yerubbayalanu pēru peṭṭenu.

33. మిద్యానీయులందరును అమాలేకీయులందరును తూర్పు వారందరును కూడి వచ్చి నది దాటి యెజ్రెయేలు మైదా నములో దిగగా

33. midyaaneeyulandarunu amaalēkeeyulandarunu thoorpu vaarandarunu kooḍi vachi nadhi daaṭi yejreyēlu maidaa namulō digagaa

34. యెహోవా ఆత్మ గిద్యోనును ఆవే శించెను. అతడు బూర ఊదినప్పుడు అబీయెజెరు కుటుంబపువారు అతని యొద్దకు వచ్చిరి.

34. yehōvaa aatma gidyōnunu aavē shin̄chenu. Athaḍu boora oodinappuḍu abeeyejeru kuṭumbapuvaaru athani yoddhaku vachiri.

35. అతడు మనష్షీ యులందరియొద్దకు దూతలను పంపగా వారును కూడు కొని అతనియొద్దకు వచ్చిరి. అతడు ఆషేరు జెబూలూను నఫ్తాలి గోత్రములవారియొద్దకు దూతలను పంపగా వారును కూడినవారిని ఎదుర్కొనుటకు వచ్చిరి.

35. athaḍu manashshee yulandariyoddhaku doothalanu pampagaa vaarunu kooḍu koni athaniyoddhaku vachiri. Athaḍu aashēru jebooloonu naphthaali gōtramulavaariyoddhaku doothalanu pampagaa vaarunu kooḍinavaarini edurkonuṭaku vachiri.

36. అప్పుడు గిద్యోను నీవు సెలవిచ్చినట్లు నాచేత ఇశ్రాయేలీయులను రక్షింప నుద్దేశించిన యెడల

36. appuḍu gidyōnu neevu selavichinaṭlu naachetha ishraayēleeyulanu rakshimpa nuddheshin̄china yeḍala

37. నేను కళ్లమున గొఱ్ఱెబొచ్చు ఉంచినతరువాత నేల అంతయు ఆరియుండగా ఆ గొఱ్ఱె బొచ్చుమీద మాత్రమే మంచుపడు నెడల నీవు సెల విచ్చినట్లు ఇశ్రాయేలీయులను నా మూలముగా రక్షించెదవని నేను నిశ్చయించుకొందునని దేవునితో అనెను.

37. nēnu kaḷlamuna gorrabochu un̄chinatharuvaatha nēla anthayu aariyuṇḍagaa aa gorra bochumeeda maatramē man̄chupaḍu neḍala neevu sela vichinaṭlu ishraayēleeyulanu naa moolamugaa rakshin̄chedavani nēnu nishchayin̄chukondunani dhevunithoo anenu.

38. ఆలాగున జరిగెను; అతడు ప్రొద్దుట లేచి ఆ బొచ్చును పిడిచి నీళ్లతో పాత్ర నిండువరకు ఆ బొచ్చునుండి మంచును పిండెను.

38. aalaaguna jarigenu; athaḍu prodduṭa lēchi aa bochunu piḍichi neeḷlathoo paatra niṇḍuvaraku aa bochunuṇḍi man̄chunu piṇḍenu.

39. అప్పుడు గిద్యోనునీ కోపము నా మీద మండనియ్యకుము; ఇంకొక మారే ఆ బొచ్చుచేత శోధింప సెలవిమ్ము. నేల అంతటిమీద మంచు పడి యుండగా ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండనిమ్మని దేవునితో అనగా

39. appuḍu gidyōnunee kōpamu naa meeda maṇḍaniyyakumu; iṅkoka maarē aa bochuchetha shōdhimpa selavimmu. Nēla anthaṭimeeda man̄chu paḍi yuṇḍagaa aa bochu maatramē poḍigaa uṇḍanimmani dhevunithoo anagaa

40. ఆ రాత్రి దేవుడు ఆలాగున చేసెను; నేల అంతటి మీద మంచు పడినను ఆ బొచ్చుమాత్రమే పొడిగానుండెను.

40. aa raatri dhevuḍu aalaaguna chesenu; nēla anthaṭi meeda man̄chu paḍinanu aa bochumaatramē poḍigaanuṇḍenu.


Shortcut Links
న్యాయాధిపతులు - Judges : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |

Support & Donate Us | Google Play Store | సజీవ వాహిని - Sajeeva Vahini 2009-2023. info@sajeevavahini.com
Sajeeva Vahini, Hyderabad & Chennai, India. SajeevaVahini.org Email: , . Whatsapp: 8898 318 318 or call us: +918898318318
Content on this website is prepared manually by Sajeeva Vahini, India. Our Content is free and open to use for any kind of distrubution. We request to carry a physical bible to churches rather than using bible on mobile or tablets. Please email any information for any suspected content/audio subject to piracy/copyright act on this website can be considered/removed. Which can help us to improve better. Note: we dont have any data/content related to Life Way Study Bible as a part of Sajeeva Vahini Notes or Verse Explanations.