Turn Off
21st Century KJV
A Conservative Version
American King James Version (1999)
American Standard Version (1901)
Amplified Bible (1965)
Apostles' Bible Complete (2004)
Bengali Bible
Bible in Basic English (1964)
Bishop's Bible
Complementary English Version (1995)
Coverdale Bible (1535)
Easy to Read Revised Version (2005)
English Jubilee 2000 Bible (2000)
English Lo Parishuddha Grandham
English Standard Version (2001)
Geneva Bible (1599)
Hebrew Names Version
Hindi Bible
Holman Christian Standard Bible (2004)
Holy Bible Revised Version (1885)
Kannada Bible
King James Version (1769)
Literal Translation of Holy Bible (2000)
Malayalam Bible
Modern King James Version (1962)
New American Bible
New American Standard Bible (1995)
New Century Version (1991)
New English Translation (2005)
New International Reader's Version (1998)
New International Version (1984) (US)
New International Version (UK)
New King James Version (1982)
New Life Version (1969)
New Living Translation (1996)
New Revised Standard Version (1989)
Restored Name KJV
Revised Standard Version (1952)
Revised Version (1881-1885)
Revised Webster Update (1995)
Rotherhams Emphasized Bible (1902)
Tamil Bible
Telugu Bible (BSI)
Telugu Bible (WBTC)
The Complete Jewish Bible (1998)
The Darby Bible (1890)
The Douay-Rheims American Bible (1899)
The Message Bible (2002)
The New Jerusalem Bible
The Webster Bible (1833)
Third Millennium Bible (1998)
Today's English Version (Good News Bible) (1992)
Today's New International Version (2005)
Tyndale Bible (1534)
Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537)
Updated Bible (2006)
Voice In Wilderness (2006)
World English Bible
Wycliffe Bible (1395)
Young's Literal Translation (1898)
Telugu Bible Verse by Verse Explanation
పరిశుద్ధ గ్రంథ వివరణ
Telugu Bible Commentary
1. ఆ దేశమందు కరవు భారముగా ఉండెను గనుక
1. aa dheshamandu karavu bhaaramugaa uṇḍenu ganuka
2. వారు ఐగుప్తునుండి తెచ్చిన ధాన్యము తినివేసిన తరువాత వారి తండ్రి-మీరు మరల వెళ్లి మనకొరకు కొంచెము ఆహారము కొనుడని వారితో అనగా
2. vaaru aigupthunuṇḍi techina dhaanyamu thinivēsina tharuvaatha vaari thaṇḍri-meeru marala veḷli manakoraku kon̄chemu aahaaramu konuḍani vaarithoo anagaa
3. యూదా అతని చూచి-ఆ మనుష్యుడు మీ తమ్ముడు మీతో ఉంటేనే గాని మీరు నా ముఖము చూడకూడదని మాతో గట్టిగా చెప్పెను.
3. yoodhaa athani chuchi-aa manushyuḍu mee thammuḍu meethoo uṇṭēnē gaani meeru naa mukhamu chooḍakooḍadani maathoo gaṭṭigaa cheppenu.
4. కాబట్టి నీవు మాతమ్ముని మాతో కూడ పంపిన యెడల మేము వెళ్లి నీకొరకు ఆహారము కొందుము.
4. kaabaṭṭi neevu maathammuni maathoo kooḍa pampina yeḍala mēmu veḷli neekoraku aahaaramu kondumu.
5. నీవు వానిని పంపనొల్లనియెడల మేము వెళ్లము; ఆ మనుష్యుడు-మీ తమ్ముడు మీతో లేనియెడల మీరు నా ముఖము చూడకూడదని మాతో చెప్పెననెను.
5. neevu vaanini pampanollaniyeḍala mēmu veḷlamu; aa manushyuḍu-mee thammuḍu meethoo lēniyeḍala meeru naa mukhamu chooḍakooḍadani maathoo cheppenanenu.
6. అందుకు ఇశ్రాయేలు మీకు ఇంకొక సహోదరుడు కలడని మీరు ఆ మనుష్యునితో చెప్పి నాకు ఇంత శ్రమ కలుగజేయనేల అనగా
6. anduku ishraayēlu meeku iṅkoka sahōdaruḍu kalaḍani meeru aa manushyunithoo cheppi naaku intha shrama kalugajēyanēla anagaa
7. వారు ఆ మనుష్యుడు-మీ తండ్రి యింక సజీవుడై యున్నాడా? మీకు సహోదరుడు ఉన్నాడా అని మమ్మును గూర్చియు మా బంధువులను గూర్చియు ఖండితముగా అడిగినప్పుడు మేము ఆ ప్రశ్నలకు తగినట్టు అతనికి వాస్తవము తెలియచెప్పితివిు-మీ సహోదరుని తీసికొని రండని అతడు చెప్పునని మాకెట్లు తెలియుననిరి.
7. vaaru aa manushyuḍu-mee thaṇḍri yiṅka sajeevuḍai yunnaaḍaa? meeku sahōdaruḍu unnaaḍaa ani mammunu goorchiyu maa bandhuvulanu goorchiyu khaṇḍithamugaa aḍiginappuḍu mēmu aa prashnalaku thaginaṭṭu athaniki vaasthavamu teliyacheppithivi-mee sahōdaruni theesikoni raṇḍani athaḍu cheppunani maakeṭlu teliyunaniri.
8. యూదా తన తండ్రియైన ఇశ్రాయేలును చూచిఆ చిన్న వానిని నాతో కూడ పంపుము, మేము లేచి వెళ్లుదుము, అప్పుడు మేమే కాదు నీవును మా పిల్లలును చావక బ్రదుకుదుము;
8. yoodhaa thana thaṇḍriyaina ishraayēlunu chuchi'aa chinna vaanini naathoo kooḍa pampumu, mēmu lēchi veḷludumu, appuḍu mēmē kaadu neevunu maa pillalunu chaavaka bradukudumu;
9. నేను అతనిగూర్చి పూటపడుదును, నీవు అతనిగూర్చి నన్ను అడుగవలెను; నేను అతని తిరిగి నీయొద్దకు తీసికొనివచ్చి నీయెదుట నిలువబెట్టని యెడల ఆ నింద నా మీద ఎల్లప్పుడును ఉండును.
9. nēnu athanigoorchi pooṭapaḍudunu, neevu athanigoorchi nannu aḍugavalenu; nēnu athani thirigi neeyoddhaku theesikonivachi neeyeduṭa niluvabeṭṭani yeḍala aa ninda naa meeda ellappuḍunu uṇḍunu.
10. మాకు తడవు కాక పోయినయెడల ఈపాటికి రెండవ మారు తిరిగి వచ్చి యుందుమని చెప్పగా
10. maaku thaḍavu kaaka pōyinayeḍala eepaaṭiki reṇḍava maaru thirigi vachi yundumani cheppagaa
11. వారి తండ్రియైన ఇశ్రాయేలు వారితొ అట్లయిన మీ రీలాగు చేయుడి; ఈ దేశమందు ప్రసిద్ధములైనవి, అనగా కొంచెము మస్తకి కొంచెము తేనె సుగంధ ద్రవ్యములు బోళము పిస్తాచకాయలు బాదము కాయలు మీ గోనెలలో వేసికొని ఆ మనుష్యునికి కానుకగా తీసికొని పోవుడి.
11. vaari thaṇḍriyaina ishraayēlu vaarito aṭlayina mee reelaagu cheyuḍi; ee dheshamandu prasiddhamulainavi, anagaa kon̄chemu masthaki kon̄chemu thēne sugandha dravyamulu bōḷamu pisthaachakaayalu baadamu kaayalu mee gōnelalō vēsikoni aa manushyuniki kaanukagaa theesikoni pōvuḍi.
12. రెట్టింపు రూకలు మీరు తీసికొనుడి, మీ గోనెల మూతిలో ఉంచబడి తిరిగివచ్చిన రూకలు కూడ చేత పట్టు కొనిపోయి మరల ఇచ్చివేయుడి; ఒకవేళ అది పొరబాటై యుండును;
12. reṭṭimpu rookalu meeru theesikonuḍi, mee gōnela moothilō un̄chabaḍi thirigivachina rookalu kooḍa chetha paṭṭu konipōyi marala ichivēyuḍi; okavēḷa adhi porabaaṭai yuṇḍunu;
13. మీ తమ్ముని తీసికొని లేచి ఆ మనుష్యుని యొద్దకు తిరిగి వెళ్లుడి.
13. mee thammuni theesikoni lēchi aa manushyuni yoddhaku thirigi veḷluḍi.
14. ఆ మనుష్యుడు మీ యితర సహోదరుని బెన్యామీనును మీ కప్పగించునట్లు సర్వశక్తుడైన దేవుడు ఆ మనుష్యుని యెదుట మిమ్మును కరుణించును గాక. నేను పుత్రహీను డనై యుండవలసిన యెడల పుత్రహీనుడనగుదునని వారితో చెప్పెను.
14. aa manushyuḍu mee yithara sahōdaruni benyaameenunu mee kappagin̄chunaṭlu sarvashakthuḍaina dhevuḍu aa manushyuni yeduṭa mimmunu karuṇin̄chunu gaaka. Nēnu putraheenu ḍanai yuṇḍavalasina yeḍala putraheenuḍanagudunani vaarithoo cheppenu.
15. ఆ మనుష్యులు ఆ కానుకను తీసికొని, చేతులలో రెట్టింపు రూకలను తమవెంట బెన్యామీనును తీసికొని లేచి ఐగుప్తునకు వెళ్లి యోసేపు యెదుట నిలిచిరి.
15. aa manushyulu aa kaanukanu theesikoni, chethulalō reṭṭimpu rookalanu thamaveṇṭa benyaameenunu theesikoni lēchi aigupthunaku veḷli yōsēpu yeduṭa nilichiri.
16. యోసేపు వారితో నున్న బెన్యామీనును చూచి తన గృహనిర్వాహకునితో-ఈ మనుష్యులను ఇంటికి తీసికొనిపోయి ఒక వేటను కోసి వంట సిద్ధము చేయించుము; మధ్యాహ్నమందు ఈ మనుష్యులు నాతో భోజనము చేయుదురని చెప్పెను.
16. yōsēpu vaarithoo nunna benyaameenunu chuchi thana gruhanirvaahakunithoo-ee manushyulanu iṇṭiki theesikonipōyi oka vēṭanu kōsi vaṇṭa siddhamu cheyin̄chumu; madhyaahnamandu ee manushyulu naathoo bhōjanamu cheyudurani cheppenu.
17. యోసేపు చెప్పినట్లు అతడు చేసి ఆ మనుష్యు లను యోసేపు ఇంటికి తీసికొనిపోయెను.
17. yōsēpu cheppinaṭlu athaḍu chesi aa manushyu lanu yōsēpu iṇṭiki theesikonipōyenu.
18. ఆ మనుష్యులు యోసేపు ఇంటికి రప్పింపబడినందున వారు భయపడిమొదట మన గోనెలలో తిరిగి పెట్టబడిన రూకల నిమిత్తము అతడు మన మీదికి అకస్మాత్తుగా వచ్చి మీదపడి మనలను దాసులుగా చెరపట్టి మన గాడిదలను తీసికొనుటకు లోపలికి తెప్పించెననుకొనిరి.
18. aa manushyulu yōsēpu iṇṭiki rappimpabaḍinanduna vaaru bhayapaḍimodaṭa mana gōnelalō thirigi peṭṭabaḍina rookala nimitthamu athaḍu mana meediki akasmaatthugaa vachi meedapaḍi manalanu daasulugaa cherapaṭṭi mana gaaḍidalanu theesikonuṭaku lōpaliki teppin̄chenanukoniri.
19. వారు యోసేపు గృహనిర్వాహకునియొద్దకు వచ్చి యింటి ద్వారమున అతనితో మాటలాడి
19. vaaru yōsēpu gruhanirvaahakuniyoddhaku vachi yiṇṭi dvaaramuna athanithoo maaṭalaaḍi
20. అయ్యా ఒక మనవి; మొదట మేము ఆహారము కొనుటకే వచ్చితివిు.
20. ayyaa oka manavi; modaṭa mēmu aahaaramu konuṭakē vachithivi.
21. అయితే మేము దిగినచోటికి వచ్చి మా గోనెలను విప్పి నప్పుడు, ఇదిగో మా మా రూకల తూనికెకు సరిగా ఎవరి రూకలు వారి గోనెమూతిలో నుండెను. అవి చేతపట్టుకొని వచ్చితివిు.
21. ayithē mēmu diginachooṭiki vachi maa gōnelanu vippi nappuḍu, idigō maa maa rookala thoonikeku sarigaa evari rookalu vaari gōnemoothilō nuṇḍenu. Avi chethapaṭṭukoni vachithivi.
22. ఆహారము కొనుటకు మరి రూకలను తీసికొని వచ్చితివిు; మా రూకలను మా గోనెలలో నెవరు వేసిరో మాకు తెలియదని చెప్పిరి.
22. aahaaramu konuṭaku mari rookalanu theesikoni vachithivi; maa rookalanu maa gōnelalō nevaru vēsirō maaku teliyadani cheppiri.
23. అందుకతడుమీకు క్షేమమగును గాక భయపడకుడి; మీ పితరుల దేవుడైన మీ దేవుడు మీకు మీ గోనెలలో ధనమిచ్చెను. మీ రూకలు నాకు ముట్టినవని చెప్పి షిమ్యోనును వారియొద్ద కు తీసికొని వచ్చెను.
23. andukathaḍumeeku kshēmamagunu gaaka bhayapaḍakuḍi; mee pitharula dhevuḍaina mee dhevuḍu meeku mee gōnelalō dhanamicchenu. mee rookalu naaku muṭṭinavani cheppi shimyōnunu vaariyoddha ku theesikoni vacchenu.
24. ఆ మనుష్యుడు వారిని యోసేపు ఇంటికి తీసికొని వచ్చి వారికి నీళ్లియ్యగా వారు కాళ్లు కడుగుకొనిరి. మరియు అతడు వారి గాడిదలకు మేత వేయించెను.
24. aa manushyuḍu vaarini yōsēpu iṇṭiki theesikoni vachi vaariki neeḷliyyagaa vaaru kaaḷlu kaḍugukoniri. Mariyu athaḍu vaari gaaḍidalaku mētha vēyin̄chenu.
25. అక్కడ తాము భోజనము చేయవలెనని వినిరి గనుక మధ్యాహ్నమందు యోసేపు వచ్చు వేళకు తమ కానుకను సిద్ధముచేసిరి.
25. akkaḍa thaamu bhōjanamu cheyavalenani viniri ganuka madhyaahnamandu yōsēpu vachu vēḷaku thama kaanukanu siddhamuchesiri.
26. యోసేపు ఇంటికి వచ్చినప్పుడు వారు తమ చేతులలోనున్న కానుకను ఇంటిలోనికి తెచ్చి అతనికిచ్చి, అతనికి నేలను సాగిలపడిరి.
26. yōsēpu iṇṭiki vachinappuḍu vaaru thama chethulalōnunna kaanukanu iṇṭilōniki techi athanikichi, athaniki nēlanu saagilapaḍiri.
27. అప్పుడుమీరు చెప్పిన ముసలివాడైన మీ తండ్రి క్షేమముగా ఉన్నాడా? అత డు ఇంక బ్రతికి యున్నాడా? అని వారి క్షేమసమాచారము అడిగి నందుకు వారు
27. appuḍumeeru cheppina musalivaaḍaina mee thaṇḍri kshēmamugaa unnaaḍaa? Atha ḍu iṅka brathiki yunnaaḍaa? Ani vaari kshēmasamaachaaramu aḍigi nanduku vaaru
28. నీ దాసుడైన మా తండ్రి ఇంక బ్రదికియున్నాడు క్షేమముగానున్నాడని చెప్పి వంగి సాగిలపడిరి.
28. nee daasuḍaina maa thaṇḍri iṅka bradhikiyunnaaḍu kshēmamugaanunnaaḍani cheppi vaṅgi saagilapaḍiri.
29. అప్పుడతడు కన్నులెత్తి తన తల్లి కుమారుడును తన తమ్ముడైన బెన్యామీనును చూచి-మీరు నాతో చెప్పిన మీ తమ్ముడు ఇతడేనా? అని అడిగి-నా కుమారుడా, దేవుడు నిన్ను కరుణించును గాక
29. appuḍathaḍu kannuletthi thana thalli kumaaruḍunu thana thammuḍaina benyaameenunu chuchi-meeru naathoo cheppina mee thammuḍu ithaḍēnaa? Ani aḍigi-naa kumaaruḍaa, dhevuḍu ninnu karuṇin̄chunu gaaka
30. అప్పుడు తన తమ్మునిమీద యోసేపునకు ప్రేమ పొర్లుకొని వచ్చెను గనుక అతడు త్వరపడి యేడ్చుటకు చోటు వెదకి లోపలి గదిలోనికి వెళ్లి అక్కడ ఏడ్చెను.
30. appuḍu thana thammunimeeda yōsēpunaku prēma porlukoni vacchenu ganuka athaḍu tvarapaḍi yēḍchuṭaku chooṭu vedaki lōpali gadhilōniki veḷli akkaḍa ēḍchenu.
31. అప్పుడు అతడు ముఖము కడుగుకొని వెలుపలికి వచ్చి తన్ను తాను అణచుకొని, భోజనము వడ్డించుడని చెప్పెను.
31. appuḍu athaḍu mukhamu kaḍugukoni velupaliki vachi thannu thaanu aṇachukoni, bhōjanamu vaḍḍin̄chuḍani cheppenu.
32. అతనికిని వారికిని అతనితో భోజనము చేయుచున్న ఐగుప్తీయులకును వేరు వేరుగా వడ్డించిరి. ఐగుప్తీయులు హెబ్రీయులతో కలిసి భోజనము చేయరు; అది ఐగుప్తీయులకు హేయము.
32. athanikini vaarikini athanithoo bhōjanamu cheyuchunna aiguptheeyulakunu vēru vērugaa vaḍḍin̄chiri. Aiguptheeyulu hebreeyulathoo kalisi bhōjanamu cheyaru; adhi aiguptheeyulaku hēyamu.
33. జ్యేష్ఠుడు మొదలుకొని కనిష్ఠుని వరకు వారు అతని యెదుట తమ తమ యీడు చొప్పున కూర్చుండిరి గనుక ఆ మనుష్యులు ఒకనివైపు ఒకడు చూచి ఆశ్చర్యపడిరి.
33. jyēshṭhuḍu modalukoni kanishṭuni varaku vaaru athani yeduṭa thama thama yeeḍu choppuna koorchuṇḍiri ganuka aa manushyulu okanivaipu okaḍu chuchi aashcharyapaḍiri.
34. మరియు అతడు తనయెదుటనుండి వారికి వంతులెత్తి పంపెను. బెన్యామీను వంతు వారందరి వంతులకంటె అయిదంతలు గొప్పది. వారు విందు ఆరగించి అతనితో కలిసి సంతుష్టిగా త్రాగిరి.
34. mariyu athaḍu thanayeduṭanuṇḍi vaariki vanthuletthi pampenu. Benyaameenu vanthu vaarandari vanthulakaṇṭe ayidanthalu goppadhi. Vaaru vindu aaragin̄chi athanithoo kalisi santhushṭigaa traagiri.