Samuel II - 2 సమూయేలు 12 | View All

1. కావున యెహోవా నాతానును దావీదునొద్దకు పంపెను; అతడు వచ్చి దావీదుతో ఇట్లనెనుఒకానొక పట్టణమందు ఇద్దరు మనుష్యులు ఉండిరి.

“నాతాను”– అంతకుముందు ఒక సారి నాతాను గొప్ప దీవెనతో కూడిన మాటను దేవునినుంచి తెచ్చాడు (2 సమూయేలు 7:4-17). ఈ సందేశమైతే తీర్పు, విపత్తులకు సంబంధించినది. దేవుడు తమకు ఏ సందేశాన్ని ఇస్తాడో దాన్నే పలికేందుకు దేవుని ప్రవక్తలు సిద్ధంగా ఉండాలి. రాజుకు అతడి పాపాన్ని గురించి తెలియజెప్పడానికి సమ్మతించిన నిజమైన ఆత్మ సంబంధమైన గుణం గల వ్యక్తి నాతాను. మన జీవితాల్లో ఉన్న పొరపాట్లను గురించి నిర్భయంగా చెప్పగల నాతానువంటి వాళ్ళు మనకు అవసరం.

2. ఒకడు ఐశ్వర్య వంతుడు ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొఱ్ఱెలును గొడ్లును కలిగియుండెను.

కథలు, ఉదాహరణలు కొన్ని సార్లు సత్యాలను మనసుకు హత్తుకుపోయేలా చేయగలవు. ఆ కథ చెప్తున్నది తమ గురించేనని వింటున్నవారికి తెలియక ముందే అది వారిని పట్టుకుని ఒప్పిస్తుంది. యేసుప్రభువు తరచుగా ఈ పద్ధతిని ఉపయోగించాడు.

3. అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కొనిన యొక చిన్న ఆడు గొఱ్ఱ పిల్ల తప్ప ఏమియు లేకపోయెను. వాడు దానిని పెంచు కొనుచుండగా అది వానియొద్దను వాని బిడ్డలయొద్దను ఉండి పెరిగి వాని చేతిముద్దలు తినుచు వాని గిన్నెలోనిది త్రాగుచు వాని కౌగిట పండుకొనుచు వానికి కుమార్తెవలె ఉండెను.

4. అట్లుండగా మార్గస్థుడొకడు ఐశ్వర్యవంతుని యొద్దకు వచ్చెను. అతడు తనయొద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయత్తము చేయుటకు తన గొఱ్ఱెలలోగాని గొడ్లలోగాని దేనిని ముట్టనొల్లక, ఆ దరిద్రుని గొఱ్ఱపిల్లను పట్టుకొని, తన యొద్దకు వచ్చినవానికి ఆయత్తము చేసెను.

5. దావీదు ఈ మాట విని ఆ మనుష్యునిమీద బహుగా కోపించు కొనియెహోవా జీవముతోడు నిశ్చయముగా ఈ కార్యము చేసినవాడు మరణపాత్రుడు.

ఇతరుల్లోని తప్పుల్ని గమనించి మనలో ఉన్న అదే తప్పులను పట్టించుకోకపోవడం చాలా తేలిక. ఇతరులను దోషులని ఎంచి తమ విషయంలో ఏవో సాకులు చెప్పడానికి మనుషులెప్పుడూ సిద్ధమే (రోమీయులకు 2:1 రోమీయులకు 2:21-24). దావీదుకు తీక్షణమైన, చురుకైన న్యాయ దృష్టి ఉంది (2 సమూయేలు 8:15; 1 సమూయేలు 24:11-15). అయితే ఈ కథ సహాయంతో నాతాను దాన్ని రేకెత్తించేవరకూ అది నిద్రపోతూ ఉంది.

6. వాడు కని కరము లేక యీ కార్యము చేసెను గనుక ఆ గొఱ్ఱ పిల్లకు ప్రతిగా నాలుగు గొఱ్ఱపిల్లల నియ్యవలెనని నాతానుతో అనెను.

నిర్గమకాండము 22:1. ధర్మశాస్త్రంలోని శిక్ష పడాలని ఇతరుల విషయంలో గట్టిగా చెప్తున్నాడు దావీదు.

7. నాతాను దావీదును చూచిఆ మనుష్యుడవు నీవే. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చునదేమ నగాఇశ్రాయేలీయులమీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకముచేసి సౌలు చేతిలోనుండి నిన్ను విడిపించి నీ యజమానుని నగరిని నీకను గ్రహించి

“ఆ మనిషివి”– దావీదు ఆ కలలో తనను తాను చూసుకోలేకపోయాడు కాబట్టి నాతాను నిర్భయంగా నమ్మకంగా అది ఎవరి గురించో తెలియజేస్తున్నాడు.

8. నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇశ్రాయేలువారిని యూదా వారిని నీ కప్పగించితిని. ఇది చాలదని నీవనుకొనినయెడల నేను మరి ఎక్కువగా నీకిచ్చియుందును.

“అతడి స్త్రీలను”– సౌలు ఉంపుడుగత్తెలు బహుశా దావీదు వశం అయ్యారన్న సంగతి కావచ్చు. బత్‌షెబను తెచ్చుకోకముందు దావీదుకు ఏడుగురు భార్యలున్నారు (2 సమూయేలు 3:2-5; 1 సమూయేలు 19:11). అయితే మరి కొంతమందిని అతడు ఆశించకుండా ఇది ఆపలేకపోయింది. కామవికారానికి అడ్డుకట్ట వేయాలంటే అనేకమందిని పెళ్ళాడ్డం మార్గం కాదు. నిజానికి ఇందువల్ల కామవాంఛ ఇంకా పెరగవచ్చు. “యూదా”– 2 సమూయేలు 2:4; 2 సమూయేలు 5:2-3

9. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితి వేమి? హిత్తీయుడగు ఊరియాను కత్తిచేత చంపించి అతని భార్యను నీకు భార్య యగునట్లుగా నీవు పట్టుకొని యున్నావు; అమ్మోనీయులచేత నీవతని చంపించితివి గదా?

దావీదు పాపం అతనిపట్ల ఎడతెగని కృప చూపిన దేవునికి వ్యతిరేకంగా చేసినట్టే (వ 7,8). “తృణీకరించావు”– యెషయా 5:24; యెహోషువ 20:13; ఆమోసు 2:4; మలాకీ 1:6. తన చర్యల మూలంగా దేవుని వాక్కు పట్ల దావీదు ఈ తృణీకార భావాన్ని చూపించాడు (సంఖ్యాకాండము 15:31 పోల్చిచూడండి). దావీదును గనుక అడిగితే దేవుని వాక్కు అంటే తనకు ప్రీతి అని నిస్సందేహంగా బదులు చెప్పేవాడే గానీ దానినుంచి వెనక్కు జారాడు. “గురి చేశావు”– ఊరియా యుద్ధంలో కూలాడు. అయితే అలా ఆదేశించినది దావీదే.

10. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్య యగునట్లు తీసికొనినందున నీ యింటివారికి సదాకాలము యుద్ధము కలుగును.

“ఖడ్గం”– దావీదు కొడుకుల్లో ముగ్గురు ఇలా చనిపోయారు (2 సమూయేలు 13:28; 2 సమూయేలు 18:14-15; 1 రాజులు 2:25). మనుషులు ఏ విత్తనాలు చల్లుతారో ఆ పంటనే కోస్తారనడానికి ఇది మరో ఉదాహరణ (గలతియులకు 6:7).

11. నా మాట ఆలకించుము; యెహోవానగు నేను సెలవిచ్చున దేమనగానీ యింటివారి మూలముననే నేను నీకు అపా యము పుట్టింతును; నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువ వానికప్పగించెదను.

“ఇంటివారు”– దావీదు ఒక ఇంటికి వ్యతిరేకంగా పాపం చేశాడు. తన ఇంట్లో నుంచే ఆపద వస్తుంది. “విపత్తు”– పాపానికి ఫలితాలు తప్పకుండా ఉంటాయి. ఈ జీవితంలో కూడా వాటిని తప్పించుకోలేము. మన పాపాలకు దేవుడు మనల్ని శిక్షించకపోతే మనం ఆయనకు చెందిన వాళ్ళం కాదన్న మాట (హెబ్రీయులకు 12:6-8).

12. పగటియందు వాడు వారితో శయనించును. నీవు ఈ కార్యము రహస్యముగా చేసితివిగాని ఇశ్రాయేలీయులందరు చూచుచుండగా పగటియందే నేను చెప్పినదానిని చేయింతును అనెను.

అబ్‌షాలోం మూలంగా ఇది నెరవేరింది – 2 సమూయేలు 16:20-22

13. నేను పాపముచేసితినని దావీదు నాతానుతో అనగా నాతానునీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను.

“పాపం చేశాను”– ఒప్పుకోవడం గురించి 1 సమూయేలు 26:21 నోట్ చూడండి. తన గురించిన వాస్తవాన్ని దావీదు అంగీకరించి పశ్చాత్తాపపడ్డాడు. ఈ సమయంలో అతడు రాసిన 51 వ కీర్తనవల్ల ఈ పశ్చాత్తాపం నిజమైనదే అని అర్థం అవుతున్నది. సత్యం చెప్పినందుకు నాతానును తన శత్రువుగా ఎంచలేదు దావీదు. కీర్తనల గ్రంథము 141:5 కూడా చూడండి. భయం, పక్షపాతం లేకుండా సత్యం చెప్పే ఒకరు ఉండడం తనకు లాభదాయకమని అతనికి తెలుసు. ఏలీయా, మీకాయాల పట్ల ఆహాబు ప్రవర్తనను దీనితో పోల్చిచూడండి (1 రాజులు 21:20; 1 రాజులు 22:8). గలతియులకు 4:16 కూడా చూడండి. “చనిపోవు”– దేవుని కరుణ వల్ల దావీదుకు క్షమాపణ దొరికింది. తన పాపానికి ధర్మశాస్త్రం విధించిన శిక్షను అతడు పొందలేదు.

14. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగజేసితివి

“దూషించడానికి”– దేవుని ప్రజల పాపాలపట్ల కలిగే విచారకరమైన ఫలితాల్లో ఇదొకటి (యెహెఙ్కేలు 36:22; రోమీయులకు 2:24). 1 తిమోతికి 5:14; 1 తిమోతికి 6:1; తీతుకు 2:5 తీతుకు 2:8; 1 పేతురు 2:12 కూడా చూడండి. “చూస్తాడు”– దావీదు క్షమించబడి, ధర్మశాస్త్రంలోని శిక్ష అంతటికీ గురి కాకపోయిప్పటికీ అతడు ఆ పాపం వల్ల కలిగిన కొన్ని ఫలితాలను అనుభవించవలసి ఉంది. వ 10,11 కూడా చూడండి. మనకిష్టం వచ్చినట్టు చేసి వచ్చిన ఫలితాలనుంచి దేవుడు మనల్ని కాపాడాలనుకుంటే కుదరదు.

15. గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన యింటికి వెళ్లెను.

16. యెహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బుపడెను.

దేవుడు తన మనస్సు మార్చుకుంటాడని దావీదు ఆశించాడు (వ 22).

17. దావీదు ఉప వాసముండి లోపలికి పోయి రాత్రి అంతయు నేలపడి యుండి బిడ్డకొరకు దేవుని బతిమాలగా, ఇంటిలో ఎన్నిక యైనవారు లేచి అతనిని నేలనుండి లేవనెత్తుటకు వచ్చిరిగాని అతడు సమ్మతింపక వారితోకూడ భోజనము చేయక యుండెను.

18. ఏడవ దినమున బిడ్డ చావగాబిడ్డ ప్రాణముతో ఉండగా మేము అతనితో మాటిలాడినప్పుడు అతడు మా మాటలు వినక యుండెను.

19. ఇప్పుడు బిడ్డ చనిపోయెనని మనము అతనితో చెప్పినయెడల తనకుతాను హాని చేసికొనునేమో యనుకొని, దావీదు సేవకులు బిడ్డ చనిపోయెనను సంగతి అతనితో చెప్ప వెరచిరి. అయితే దావీదు తన సేవకులు గుసగుసలాడుట చూచి బిడ్డ చనిపోయెనను సంగతి గ్రహించిబిడ్డ చనిపోయెనా అని తన సేవకుల నడుగగా వారుచని పోయెననిరి.

20. అప్పుడు దావీదు నేలనుండి లేచి స్నానముచేసి తైలము పూసికొని వేరు వస్త్రములు ధరించి యెహోవా మందిరములో ప్రవేశించి మ్రొక్కి తన యింటికి తిరిగి వచ్చి భోజనము తెమ్మనగా వారు వడ్డించిరి; అప్పుడు అతడు భోజనము చేసెను.

దేవుని శిక్షను దావీదు విధేయతతో స్వీకరించాడు.

21. అతని సేవకులుబిడ్డ జీవముతో ఉండగా ఉప వాసముండి దానికొరకు ఏడ్చుచుంటివి గాని అది మరణ మైనప్పుడు లేచి భోజనము చేసితివి. నీవీలాగున చేయుట ఏమని దావీదు నడుగగా

22. అతడుబిడ్డ ప్రాణముతో ఉన్నప్పుడు దేవుడు నాయందు కనికరించి వాని బ్రదికించునేమో యనుకొని నేను ఉపవాసముండి యేడ్చు చుంటిని.

23. ఇప్పుడు చనిపోయెను గనుక నేనెందుకు ఉప వాసముండవలెను? వానిని తిరిగి రప్పించగలనా? నేను వానియొద్దకు పోవుదును గాని వాడు నాయొద్దకు మరల రాడని వారితో చెప్పెను.

“వాడి దగ్గరికి”– తాను కూడా మృత్యులోకానికి వెళ్ళిపోతానని దావీదు భావం. ఆదికాండము 37:35; 1 సమూయేలు 28:19; యోబు 7:8-10.

24. తరువాత దావీదు తన భార్యయైన బత్షెబను ఓదార్చి ఆమెయొద్దకు పోయి ఆమెను కూడగా ఆమె యొక కుమారుని కనెను. దావీదు అతనికి సొలొమోను అని పేరు పెట్టెను.
మత్తయి 1:6

“సొలొమోను”– 1 దినవృత్తాంతములు 22:9-10. దావీదుకున్న అనేకమంది కొడుకులందరిలోకీ ఇతని పై దేవునికి ప్రత్యేకమైన ప్రేమ ఉన్న కారణమెందుకో చెప్పలేదు. ద్వితీయోపదేశకాండము 7:7-8; రోమీయులకు 9:10-13 పోల్చి చూడండి.

25. యెహోవా అతనిని ప్రేమించి నాతాను అను ప్రవక్తను పంపగా అతడు యెహోవా ఆజ్ఞనుబట్టి యదీద్యా అని అతనికి పేరు పెట్టెను.

యదీద్యా అంటే “యెహోవా ప్రేమించినవాడు”. సొలొమోను అనే పేరు బహుశా శాంతి అనే అర్థాన్నిచ్చే హీబ్రూ పదంనుంచి వచ్చివుండవచ్చు.

26. యోవాబు రబ్బా అను అమ్మోనీయుల పట్టణముమీద యుద్ధము చేసి రాజనగరిని పట్టుకొనెను.

11 వ అధ్యాయంలో జరిగిన యుద్ధం ముగింపు ఈ వచనాల్లో కనిపిస్తుంది. ఇది దావీదు వ్యభిచారానికీ నాతాను అతని తప్పు బయట పెట్టిన సమయానికీ మధ్య కాలంలో జరిగింది.

27. దావీదునొద్దకు అతడు దూతలను పంపినేను రబ్బామీద యుద్ధముచేసి జలములమీది పట్టణమును పట్టుకొంటిని;

28. నేను పట్టణమును పట్టుకొని నా పేరు దానికి పెట్టకుండునట్లు మిగిలిన దండువారిని సమకూర్చి నీవు పట్టణమును పట్టుకొనవలెనని వర్తమానము చేయగా

29. దావీదు యోధులను సమకూర్చి రబ్బాకు వచ్చి దానిమీద యుద్ధముచేసి దానిని పట్టుకొని, వారి రాజు కిరీటమును అతని తలమీదనుండి తీయించగా అది దావీదు తలమీద పెట్టబడెను. అది విలువగల రత్నములు చెక్కినదై రెండు బంగారు మనుగులంత యెత్తుండెను.

30. మరియు అతడు పట్టణములోనుండి బహు విస్తారమైన దోపుసొమ్ము పట్టుకొని పోయెను.

“తలమీద”– దావీదు తల పై ఆ కిరీటాన్ని పెట్టడమంటే ఆ దేశానికి అతడు పరిపాలకుడని సూచన ప్రాయంగా తెలియజేయడమే.

31. పట్టణములో ఉన్నవారిని బయటికి తెప్పించి రంపములచేతను పదును గల యినుప పనిముట్లచేతను ఇనుప గొడ్డండ్లచేతను వారిని తుత్తునియలుగా చేయించి వారిని ఇటుక ఆవములో వేసెను. అమ్మోనీయుల పట్టణములన్నిటికి అతడు ఈలాగు చేసెను. ఆ తరువాత దావీదును జనులందరును తిరిగి యెరూషలేమునకు వచ్చిరి.Shortcut Links
2 సమూయేలు - 2 Samuel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |