Turn Off
21st Century KJV
A Conservative Version
American King James Version (1999)
American Standard Version (1901)
Amplified Bible (1965)
Apostles' Bible Complete (2004)
Bengali Bible
Bible in Basic English (1964)
Bishop's Bible
Complementary English Version (1995)
Coverdale Bible (1535)
Easy to Read Revised Version (2005)
English Jubilee 2000 Bible (2000)
English Lo Parishuddha Grandham
English Standard Version (2001)
Geneva Bible (1599)
Hebrew Names Version
Hindi Bible
Holman Christian Standard Bible (2004)
Holy Bible Revised Version (1885)
Kannada Bible
King James Version (1769)
Literal Translation of Holy Bible (2000)
Malayalam Bible
Modern King James Version (1962)
New American Bible
New American Standard Bible (1995)
New Century Version (1991)
New English Translation (2005)
New International Reader's Version (1998)
New International Version (1984) (US)
New International Version (UK)
New King James Version (1982)
New Life Version (1969)
New Living Translation (1996)
New Revised Standard Version (1989)
Restored Name KJV
Revised Standard Version (1952)
Revised Version (1881-1885)
Revised Webster Update (1995)
Rotherhams Emphasized Bible (1902)
Tamil Bible
Telugu Bible (BSI)
Telugu Bible (WBTC)
The Complete Jewish Bible (1998)
The Darby Bible (1890)
The Douay-Rheims American Bible (1899)
The Message Bible (2002)
The New Jerusalem Bible
The Webster Bible (1833)
Third Millennium Bible (1998)
Today's English Version (Good News Bible) (1992)
Today's New International Version (2005)
Tyndale Bible (1534)
Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537)
Updated Bible (2006)
Voice In Wilderness (2006)
World English Bible
Wycliffe Bible (1395)
Young's Literal Translation (1898)
Telugu Bible Verse by Verse Explanation
పరిశుద్ధ గ్రంథ వివరణ
Telugu Bible Commentary
1. తూరునుగూర్చిన దేవోక్తి తర్షీషు ఓడలారా, అంగలార్చుడి తూరు పాడైపోయెను ఇల్లయినను లేదు ప్రవేశమార్గమైనను లేదు కిత్తీయుల దేశమునుండి ఆ సంగతి వారికి వెల్లడి చేయబడెను. మత్తయి 11:21-22
1. thoorunugoorchina dhevōkthi tharsheeshu ōḍalaaraa, aṅgalaarchuḍi thooru paaḍaipōyenu illayinanu lēdu pravēshamaargamainanu lēdu kittheeyula dheshamunuṇḍi aa saṅgathi vaariki vellaḍi cheyabaḍenu.
2. సముద్రతీరవాసులారా, అంగలార్చుడి సముద్రము దాటుచుండు సీదోను వర్తకులు తమ సరకులతో నిన్ను నింపిరి.
2. samudratheeravaasulaaraa, aṅgalaarchuḍi samudramu daaṭuchuṇḍu seedōnu varthakulu thama sarakulathoo ninnu nimpiri.
3. షీహోరు నది ధాన్యము నైలునది పంట సముద్రముమీద నీలోనికి తేబడుచుండెను తూరువలన జనములకు లాభము వచ్చెను.
3. sheehōru nadhi dhaanyamu nailunadhi paṇṭa samudramumeeda neelōniki thēbaḍuchuṇḍenu thooruvalana janamulaku laabhamu vacchenu.
4. సీదోనూ, సిగ్గుపడుము, సముద్రము సముద్రదుర్గము మాటలాడుచున్నది నేను ప్రసవవేదనపడనిదానను పిల్లలు కననిదానను ¸యౌవనస్థులను పోషింపనిదానను కన్యకలను పెంచనిదానను.
4. seedōnoo, siggupaḍumu, samudramu samudradurgamu maaṭalaaḍuchunnadhi nēnu prasavavēdhanapaḍanidaananu pillalu kananidaananu ¸yauvanasthulanu pōshimpanidaananu kanyakalanu pen̄chanidaananu.
5. ఆ వర్తమానము ఐగుప్తీయులు విని తూరును గూర్చి మిక్కిలి దుఃఖింతురు.
5. aa varthamaanamu aiguptheeyulu vini thoorunu goorchi mikkili duḥkhinthuru.
6. తర్షీషునకు వెళ్లుడి సముద్రతీరవాసులారా, అంగ లార్చుడి.
6. tharsheeshunaku veḷluḍi samudratheeravaasulaaraa, aṅga laarchuḍi.
7. నీకు సంతోషము కలుగజేసిన పట్టణమిదేనా? ప్రాచీన కాలముననుండిన పట్టణమిదేనా? పరదేశనివాసముచేయుటకు దూరప్రయాణముచేసిన దిదేనా?
7. neeku santhooshamu kalugajēsina paṭṭaṇamidhenaa? Praachina kaalamunanuṇḍina paṭṭaṇamidhenaa? Paradheshanivaasamucheyuṭaku dooraprayaaṇamuchesina didhenaa?
8. దాని వర్తకులు రాజసమానులు దాని వ్యాపారులు భూనివాసులలో ఘనులు కిరీటముల నిచ్చుచుండు తూరుకు ఈలాగు చేయ నెవడు ఉద్దేశించెను?ప్రకటన గ్రంథం 18:23
8. daani varthakulu raajasamaanulu daani vyaapaarulu bhoonivaasulalō ghanulu kireeṭamula nichuchuṇḍu thooruku eelaagu cheya nevaḍu uddheshin̄chenu?
9. సర్వసౌందర్య గర్వాతిశయమును అపవిత్రపరచుట కును భూమిమీదనున్న సర్వఘనులను అవమానపరచుటకును సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు చేయ నుద్దేశించెను.
9. sarvasaundarya garvaathishayamunu apavitraparachuṭa kunu bhoomimeedanunna sarvaghanulanu avamaanaparachuṭakunu sainyamulakadhipathiyagu yehōvaa eelaagu cheya nuddheshin̄chenu.
10. తర్షీషుకుమారీ, నీ దేశమునకిక నడికట్టు లేకపోయెను నైలునది ప్రవహించునట్లు దానిమీద ప్రవహించుము.
10. tharsheeshukumaaree, nee dheshamunakika naḍikaṭṭu lēkapōyenu nailunadhi pravahin̄chunaṭlu daanimeeda pravahin̄chumu.
11. ఆయన సముద్రముమీద తన చెయ్యి చాపెను రాజ్యములను కంపింపజేసెను కనానుకోటలను నశింపజేయుటకు యెహోవా దాని గూర్చి ఆజ్ఞాపించెను.
11. aayana samudramumeeda thana cheyyi chaapenu raajyamulanu kampimpajēsenu kanaanukōṭalanu nashimpajēyuṭaku yehōvaa daani goorchi aagnaapin̄chenu.
12. మరియు ఆయన సీదోను కన్యకా, చెరపబడినదానా, నీకికను సంతోషముండదు నీవు లేచి కిత్తీముకు దాటి పొమ్ము అక్కడనైనను నీకు నెమ్మది కలుగదు
12. mariyu aayana seedōnu kanyakaa, cherapabaḍinadaanaa, neekikanu santhooshamuṇḍadu neevu lēchi kittheemuku daaṭi pommu akkaḍanainanu neeku nemmadhi kalugadu
13. ఇదిగో కల్దీయుల దేశమును చూడుము వారికను జనముగా ఉండరు అష్షూరీయులు దానిని అడవిమృగములకు నివాసముగా చేసియున్నారు. వారు కోటలు కట్టించి దాని నగరులను పడగొట్టి యున్నారు.
13. idigō kaldeeyula dheshamunu chooḍumu vaarikanu janamugaa uṇḍaru ashshooreeyulu daanini aḍavimrugamulaku nivaasamugaa chesiyunnaaru. Vaaru kōṭalu kaṭṭin̄chi daani nagarulanu paḍagoṭṭi yunnaaru.
14. తర్షీషు ఓడలారా, అంగలార్చుడి, మీ దుర్గము పాడై పోయెను.
14. tharsheeshu ōḍalaaraa, aṅgalaarchuḍi, mee durgamu paaḍai pōyenu.
15. ఒక రాజు ఏలుబడిలో జరిగినట్లు తూరు ఆ దినమున డెబ్బది సంవత్సరములు మరవబడును డెబ్బది సంవత్సరములైన తరువాత వేశ్యల కీర్తనలో ఉన్నట్లు జరుగును, ఏమనగా
15. oka raaju ēlubaḍilō jariginaṭlu thooru aa dinamuna ḍebbadhi samvatsaramulu maravabaḍunu ḍebbadhi samvatsaramulaina tharuvaatha vēshyala keerthanalō unnaṭlu jarugunu, ēmanagaa
16. మరవబడిన వేశ్యా, సితారాతీసికొని పట్టణములో తిరుగులాడుము నీవు జ్ఞాపకమునకు వచ్చునట్లు ఇంపుగా వాయిం చుము అనేక కీర్తనలు పాడుము.
16. maravabaḍina vēshyaa, sithaaraatheesikoni paṭṭaṇamulō thirugulaaḍumu neevu gnaapakamunaku vachunaṭlu impugaa vaayiṁ chumu anēka keerthanalu paaḍumu.
17. డెబ్బది సంవత్సరముల అంతమున యెహోవా తూరును దర్శించును అది వేశ్యజీతమునకు మరల భూమిమీదనున్న సమస్త లోక రాజ్యములతో వ్యభిచారము చేయును. ప్రకటన గ్రంథం 17:2, ప్రకటన గ్రంథం 18:4
17. ḍebbadhi samvatsaramula anthamuna yehōvaa thoorunu darshin̄chunu adhi vēshyajeethamunaku marala bhoomimeedanunna samastha lōka raajyamulathoo vyabhichaaramu cheyunu.
18. వేశ్యజీతముగా ఉన్నదాని వర్తకలాభము యెహోవాకు ప్రతిష్ఠితమగును అది కూర్చబడదు ధననిధిలో వేయబడదు యెహోవా సన్నిధిని నివసించువారికి సంతుష్టి ఇచ్చు భోజనమునకును ప్రశస్త వస్త్రములకును ఆ పట్టణపు లాభము ఆధారముగా నుండును.
18. vēshyajeethamugaa unnadaani varthakalaabhamu yehōvaaku prathishṭhithamagunu adhi koorchabaḍadu dhananidhilō vēyabaḍadu yehōvaa sannidhini nivasin̄chuvaariki santhushṭi ichu bhōjanamunakunu prashastha vastramulakunu aa paṭṭaṇapu laabhamu aadhaaramugaa nuṇḍunu.