ఇక్కడ మళ్ళీ యోనా తన సౌఖ్యం గురించే పూర్తిగా ఆలోచిస్తూ, తాను ఎవరికి పరిచర్య చేసేందుకు పంపబడ్డాడో ఆ ప్రజల గురించి పట్టించుకోకపోవడం చూస్తున్నాం. ఇప్పటికీ అతనికి చనిపోవాలనే ఉంది – ఆ సొరచెట్టు గురించి కాదు, దేవుని విధానాలతోను, ఆయన హృదయంతోను ఇంకా ఏకీభావం అతనికి లేనందువల్లే.