Numbers - సంఖ్యాకాండము 25 | View All

1. అప్పుడు యెహోవా మోషేకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడునైన ఫీనెహాసు, ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగియుండగా ప్రజలు మోయాబురాండ్రతో వ్యభిచారము చేయసాగిరి.
1 కోరింథీయులకు 10:8, ప్రకటన గ్రంథం 2:14, ప్రకటన గ్రంథం 2:20

1. appudu yehovaa mosheku eelaagu aagna icchenuyaajakudaina aharonu manuma dunu eliyaajaru kumaarudunaina pheenehaasu,ishraayeleeyulu shittheemulo digiyundagaa prajalu moyaaburaandrathoo vyabhichaaramu cheyasaagiri.

2. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనముచేసి వారి దేవతలకు నమస్కరించిరి.
ప్రకటన గ్రంథం 2:14

2. aa streelu thama dhevathala balulaku prajalanu piluvagaa veeru bhojanamuchesi vaari dhevathalaku namaskarinchiri.

3. అట్లు ఇశ్రాయేలీయులు బయల్పెయోరుతో కలిసికొనినందున వారిమీద యెహోవా కోపము రగులుకొనెను.

3. atlu ishraayeleeyulu bayalpeyoruthoo kalisikoninanduna vaarimeeda yehovaa kopamu ragulukonenu.

4. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను నీవు ప్రజల అధిపతులనందరిని తోడుకొని, యెహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని ఉరితీయుము. అప్పుడు యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయులమీదనుండి తొలగిపోవునని చెప్పెను.

4. appudu yehovaa moshethoo itlanenuneevu prajala adhipathula nandarini thoodukoni, yehovaa sannidhini sooryuniki edurugaa vaarini uritheeyumu. Appudu yehovaa kopaagni ishraayeleeyulameedanundi tolagipovunani cheppenu.

5. కాబట్టి మోషే ఇశ్రాయేలీయుల న్యాయాధి పతులను పిలిపించి మీలో ప్రతివాడును బయల్పెయో రుతో కలిసికొనిన తన తన వశములోనివారిని చంపవలెనని చెప్పెను.

5. kaabatti moshe ishraayeleeyula nyaayaadhi pathulanu pilipinchi meelo prathivaadunu bayalpeyo ruthoo kalisikonina thana thana vashamulonivaarini champavalenani cheppenu.

6. ఇదిగో మోషే కన్నుల యెదుటను, ప్రత్య క్షపు గుడారము యొక్క ద్వారము నొద్ద ఏడ్చుచుండిన ఇశ్రాయేలీయుల సర్వసమాజము యొక్క కన్నులయెదుటను, ఇశ్రాయేలీయులలో ఒకడు తన సహోదరుల యొద్దకు ఒక మిద్యాను స్త్రీని తోడుకొనివచ్చెను.

6. idigo moshe kannula yedutanu, pratya kshapu gudaaramu yokka dvaaramu noddha edchuchundina ishraayeleeyula sarvasamaajamu yokka kannulayedu tanu, ishraayeleeyulalo okadu thana sahodarula yoddhaku oka midyaanu streeni thoodukonivacchenu.

7. యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడునైన ఫీనెహాసు అది చూచి,

7. yaajakudaina aharonu manumadunu eliyaajaru kumaa rudunaina pheenehaasu adhi chuchi,

8. సమాజమునుండి లేచి, యీటెను చేత పట్టుకొని పడకచోటికి ఆ ఇశ్రాయేలీయుని వెంబడి వెళ్లి ఆ యిద్దరిని, అనగా ఆ ఇశ్రాయేలీయుని ఆ స్త్రీని కడుపులో గుండ దూసిపోవు నట్లు పొడిచెను; అప్పుడు ఇశ్రాయేలీయులలోనుండి తెగులు నిలిచి పోయెను.

8. samaajamunundi lechi, yeetenu chetha pattukoni padakachootiki aa ishraayeleeyuni vembadi velli aa yiddarini, anagaa aa ishraayeleeyuni aa streeni kadupulo gunda doosipovu natlu podichenu; appudu ishraayeleeyulalonundi tegulu nilichi poyenu.

9. ఇరువది నాలుగువేలమంది ఆ తెగులు చేత చనిపోయిరి.
1 కోరింథీయులకు 10:8

9. iruvadhi naaluguvelamandi aa tegulu chetha chanipoyiri.

10. అప్పుడు యెహోవా మోషేకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడునైన ఫీనెహాసు,

10. appudu yehovaa mosheku eelaagu aagna icchenuyaajakudaina aharonu manuma dunu eliyaajaru kumaarudunaina pheenehaasu,

11. వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవుట వలన ఇశ్రాయేలీయుల మీదనుండి నా కోపము మళ్లించెను గనుక నేను ఓర్వలేకయుండియు ఇశ్రాయేలీయులను నశింపజేయలేదు.

11. vaari madhyanu nenu orvalenidaanini thaanu orvalekapovutavalana ishraayeleeyula meedanundi naa kopamu mallinchenu ganuka nenu orvalekayundiyu ishraayeleeyulanu nashimpajeyaledu.

12. కాబట్టి నీవు అతనితో ఇట్లనుము అతనితో నేను నా సమాధాన నిబంధనను చేయుచున్నాను.

12. kaabatti neevu athanithoo itlanumu athanithoo nenu naa samaadhaana nibandhananu cheyuchunnaanu.

13. అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికిని అతని సంతానమునకును కలిగియుండును; ఏలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తిగలవాడై ఇశ్రా యేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను.

13. adhi nityamaina yaajaka nibandhanagaa athanikini athani santhaanamunakunu kaligiyundunu; yelayanagaa athadu thana dhevuni vishayamandu aasakthigalavaadai ishraayeleeyula nimitthamu praayashchitthamu chesenu.

14. చంపబడిన వాని పేరు జిమీ, అతడు షిమ్యోనీయులలో తన పితరుల కుటుంబమునకు ప్రధానియైన సాలూ కుమారుడు.

14. champa badina vaani peru jimee, athadu shimyoneeyulalo thana pitharula kutumbamunaku pradhaaniyaina saaloo kumaarudu.

15. చంపబడిన స్త్రీ పేరు కొజ్బీ, ఆమె సూరు కుమార్తె. అతడు మిద్యానీయులలో ఒక గోత్రమునకును తన పితరుల కుటుంబమునకును ప్రధానియై యుండెను.

15. champabadina stree peru kojbee, aame sooru kumaarthe. Athadu midyaaneeyulalo oka gotramunakunu thana pitharula kutumbamunakunu pradhaaniyai yundenu.

16. మరియయెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను మిద్యానీయులు తమ తంత్రములవలన మీకు బాధకులై యున్నారు; వారిని బాధపెట్టి హతము చేయుడి;

16. mariyu yehovaa mosheku eelaagu selavicchenu midyaaneeyulu thama thantramulavalana meeku baadhakulai yunnaaru; vaarini baadhapetti hathamu cheyudi;

17. వారు తంత్రములు చేసి పెయోరు సంతతిలోను,

17. vaaru thantramulu chesi peyoru santhathilonu,

18. తెగులు దినమందు పెయోరు విషయములో చంపబడిన తమ సహోదరియు మిద్యానీయుల అధిపతి కుమార్తెయునైన కొజ్బీ సంగతిలోను, మిమ్మును మోసపుచ్చిరి.

18. tegulu dina mandu peyoru vishayamulo champabadina thama saho dariyu midyaaneeyula adhipathi kumaartheyunaina kojbee sangathilonu, mimmunu mosapuchiri.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Numbers - సంఖ్యాకాండము 25 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible
ఇశ్రాయేలీయులు మోయాబు మరియు మిద్యాను కుమార్తెలచే ప్రలోభింపబడ్డారు. (1-5) 
శత్రువుల కంటే చెడ్డ వ్యక్తులతో స్నేహం చేయడం చాలా ప్రమాదకరం ఎందుకంటే చెడు స్నేహితులు మనల్ని తప్పుడు పనులకు ప్రలోభపెడతారు. డబ్బు మరియు సరదా యొక్క టెంప్టేషన్ వలె మాయాజాలం కూడా మనల్ని బాధించదు. ఇశ్రాయేలు ప్రజలు మోయాబు మరియు మిద్యాను బాలికలచే శోధించబడినప్పుడు ఇది జరిగింది. మన ఘోర శత్రువులు మనల్ని శారీరకంగా బాధపెట్టేవారు కాదు, చెడు పనులు చేసేవారు. ఇశ్రాయేలు ప్రజలు పాపం చేసినప్పుడు, దేవుడు వారిని వ్యాధులతో శిక్షించాడు. ఇతరులను పాపంలోకి నడిపించే వ్యక్తులు ఇతరులకు ఉదాహరణగా శిక్షించబడాలి.

ఫినెహాస్ జిమ్రీ మరియు కోజ్బీలను చంపాడు. (6-15) 
ఫీనెహాస్ జిమ్రీ మరియు కొజ్బీలు ఏదో తప్పు చేసినందున వారిని శిక్షించినప్పుడు ధైర్యంగా పనిచేశాడు. అయితే మనం ఫినెహాస్‌ను కాపీ కొట్టి, ప్రజలపై మనమే పగ తీర్చుకోకూడదు లేదా వారి మతం కారణంగా ప్రజలను బాధపెట్టకూడదు. మేము దానిని నిర్వహించడానికి బాధ్యతగల వ్యక్తులను అనుమతించాలి.

మిద్యానీయులు శిక్షింపబడాలి. (16-18)
మిద్యానీయులు దేవుడిచ్చిన వ్యాధితో జబ్బుపడి చనిపోయారని మనం వినలేదు. బదులుగా, దేవుడు వారిని శత్రు సైన్యంతో శిక్షించాడు. చెడు పనులు చేసేలా చేసే వాటికి మనం దూరంగా ఉండాలి. మత్తయి 5:29-30 ఏదైనా మనల్ని చెడు పనులు చేయాలనిపిస్తే, బాధాకరమైన ముల్లులా ద్వేషించాలి. చెడు పనులు చేయడానికి ఇతరులను మోసగించే వ్యక్తులు ఎక్కువగా శిక్షించబడతారు.



Shortcut Links
సంఖ్యాకాండము - Numbers : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |