8. అయితే అతడు పెద్దలు తనతో చెప్పిన ఆలోచనను నిర్లక్ష్యపెట్టి, తనతో కూడ పెరిగిన ¸యౌవనులను పిలిచి ఆలోచన నడిగి, వారికీలాగు ప్రశ్నవేసెను
అనుభవం, జ్ఞానంలోనుంచి వచ్చిన ఆలోచనను రెహబాం త్రోసిపుచ్చి, హానికరమైన నిర్ణయాలు చేసే ఆలోచనకు లొంగిపోయాడు. ప్రజలపై ఉన్న భారాన్ని మరింత పెంచి, దాన్ని వారు సరిగా నెరవేర్చకపోతే మరింత కఠినంగా శిక్షించాలన్నదే అతడు అనుసరించిన సలహా. యువకులు కొన్నిసార్లు వివేకవంతులై ఉండవచ్చు (యోబు 32:6-9). అయితే ఇక్కడి సందర్భంలో మాత్రం వీరు చాలా బుద్ధి తక్కువవారు. అయితే వారు, రెహబాం ప్రదర్శించిన బుద్ధిహీనతను వాడుకొని దేవుడు తన ఉద్దేశాలను నెరవేర్చుకొన్నాడు (వ 15).