1. అయితే యాకోబూ, నిన్ను సృజించినవాడగు యెహోవా ఇశ్రాయేలూ, నిన్ను నిర్మించినవాడు ఈలాగు సెల విచ్చుచున్నాడు నేను నిన్ను విమోచించియున్నాను భయపడకుము, పేరుపెట్టి నిన్ను పిలిచియున్నాను నీవు నా సొత్తు.
ఇస్రాయేల్ప్రజలతో దేవునికున్న సంబంధాన్ని ఈ అధ్యాయం వివరిస్తున్నది. ఆయన వారి సృష్టికర్త (వ 1), వారి విమోచకుడు (వ 1,14), వారి రక్షకుడు (వ 3), రాజు (వ 15), సంరక్షకుడు (వ 2), వారిని ప్రేమించేవాడు (వ 4), వారికి వారి పూర్వ క్షేమస్థితిని మళ్ళీ కలిగించేవాడు (వ 5,6), క్షమించేవాడు (వ 25). ఇస్రాయేల్వారు తాము చేయవలసినది చేయలేదు (వ 22-24). అందువల్ల దేవుడు వారిని శిక్షించవలసి వచ్చింది (వ 28). అయితే దేవుడు తాను చెయ్యవలసినది చేస్తాడు (వ 25). దేవునితో ఈ సంబంధం విషయంలో ఇస్రాయేల్ వారి విధి ఏమిటంటే సాక్షులుగాను (వ 10,12), దేవుణ్ణి మహిమ పరచేవారుగాను (వ 21) ఉండాలి. ఇస్రాయేల్ దేవుణ్ణి తమ దేవుడుగా, రక్షకుడుగా నమ్మినవారికి ఈ అధ్యాయంలో మధురమైన సత్యం ఉంది.
“సృజించిన”– ఒక ప్రత్యేకమైన ప్రయోజనం నిమిత్తం దేవుడు ఇస్రాయేల్ జాతిని ప్రత్యేకంగా సృష్టించాడు (వ 7, 21).
“విడిపించాను”– కీర్తనల గ్రంథము 78:35 నోట్.
“భయంతో ఉండబోకు”– యెషయా 41:10 నోట్.