Jeremiah - యిర్మియా 16 | View All

1. మరియయెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

1. GOD's Message to me:

2. ఈస్థలమందు నీకు కుమారులైనను కుమార్తెలైనను పుట్టకుండునట్లు నీవు వివాహము చేసికొన కూడదు.

2. 'Jeremiah, don't get married. Don't raise a family here.

3. ఈ స్థలమందు పుట్టు కుమారులను గూర్చియు, కుమార్తెలనుగూర్చియు, వారిని కనిన తల్లులనుగూర్చియు, ఈ దేశములో వారిని కనిన తండ్రులను గూర్చియు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు

3. I have signed the death warrant on all the children born in this country, the mothers who bear them and the fathers who beget them--

4. వారు ఘోరమైన మరణము నొందెదరు; వారినిగూర్చి రోదనము చేయబడదు, వారు పాతిపెట్టబడక భూమిమీద పెంట వలె పడియుండెదరు, వారు ఖడ్గముచేతను క్షామముచేతను నశించెదరు; వారి శవములు ఆకాశపక్షులకును భూజంతువులకును ఆహారముగా ఉండును.

4. an epidemic of death. Death unlamented, the dead unburied, dead bodies decomposing and stinking like dung, all the killed and starved corpses served up as meals for carrion crows and mongrel dogs!'

5. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడునేను ఈ ప్రజలకు నా సమాధానము కలుగనియ్యకయు వారియెడల నా కృపావాత్సల్యములను చూపకయు ఉన్నాను గనుక రోదనముచేయు ఇంటిలోనికి నీవు పోకుము, వారినిగూర్చి అంగలార్చుటకు పోకుము, ఎవరినిని ఓదార్చుటకు వెళ్లకుము; ఇదే యెహోవా వాక్కు

5. GOD continued: 'Don't enter a house where there's mourning. Don't go to the funeral. Don't sympathize. I've quit caring about what happens to this people.' GOD's Decree. 'No more loyal love on my part, no more compassion.

6. ఘనులేమి అల్పులేమి యీ దేశమందున్నవారు చనిపోయి పాతిపెట్టబడరు, వారి నిమిత్తము ఎవరును అంగలార్చకుందురు, ఎవరును తమ్మును తాము కోసికొన కుందురు, వారి నిమిత్తము ఎవరును తమ్మును తాము బోడి చేసికొనకుందురు.

6. The famous and obscure will die alike here, unlamented and unburied. No funerals will be conducted, no one will give them a second thought,

7. చచ్చినవారినిగూర్చి జనులను ఓదార్చుటకు అంగలార్పు ఆహారము ఎవరును పంచిపెట్టరు; ఒకని తండ్రి యైనను తల్లియైనను చనిపోయెనని యెవరును వారికి ఓదార్పు పాత్రను త్రాగనియ్యకుందురు.

7. no one will care, no one will say, 'I'm sorry,' no one will so much as offer a cup of tea, not even for the mother or father.

8. వారియొద్ద కూర్చుండి అన్నపానములు పుచ్చుకొనుటకు నీవు విందు శాలలో ప్రవేశింపకూడదు.

8. 'And if there happens to be a feast celebrated, don't go there either to enjoy the festivities.'

9. సైన్యములకధిపతియు ఇశ్రాయేలు దేవుడునైన యెహోవా ఈలాగు సెలవిచ్చు చున్నాడు మీ కన్నుల ఎదుటనే మీ దినములలోనే సంతోషధ్వనిని ఆనందధ్వనిని పెండ్లికుమారుని స్వరమును పెండ్లికుమార్తె స్వరమును ఈ చోట వినబడకుండ మాన్పించెదను.
ప్రకటన గ్రంథం 18:23

9. GOD-of-the-Angel-Armies, the God of Israel, says, 'Watch this! I'm about to banish smiles and laughter from this place. No more brides and bridegrooms celebrating. And I'm doing it in your lifetime, before your very eyes.

10. నీవు ఈ మాటలన్నియు ఈ ప్రజలకు తెలియ జెప్పిన తరువాత వారుదేనిబట్టి యెహోవా మాకు ఈ ఘోరబాధ అంతయు నియమించెను? మా దేవుడైన యెహోవాకు విరోధముగా మా దోషమేమి? మాపాప మేమి? అని నిన్నడుగగా

10. 'When you tell this to the people and they ask, 'Why is GOD talking this way, threatening us with all these calamities? We're not criminals, after all. What have we done to our GOD to be treated like this?'

11. నీవు వారితో ఇట్లనుము యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు మీ పితరులు నన్ను విడిచి అన్య దేవతలను అనుసరించి పూజించి వాటికి నమస్కారము చేయుటను బట్టియే గదా వారు నా ధర్మశాస్త్రమును గైకొనక నన్ను విసర్జించిరి.

11. tell them this: 'It's because your ancestors left me, walked off and never looked back. They took up with the no-gods, worshiped and doted on them, and ignored me and wouldn't do a thing I told them.

12. ఆలకించుడి; మీరందరు నా మాట వినకుండ కఠినమైన మీ దుష్ట హృదయ కాఠిన్యము చొప్పున నడుచుకొనుచున్నారు; మీరు మీ పితరులకంటె విస్తారముగా చెడుతనము చేసి యున్నారు.

12. And you're even worse! Take a good look in the mirror--each of you doing whatever you want, whenever you want, refusing to pay attention to me.

13. కాబట్టి నేను మీయందు ఏమాత్రమును దయయుంచక, యీ దేశమునుండి మీరైనను మీ పితరు లైనను ఎరుగని దేశమునకు మిమ్మును వెళ్లగొట్టుచున్నాను; అక్కడ మీరు దివారాత్రము అన్యదేవతలను కొలుచుదురు.

13. And for this I'm getting rid of you, throwing you out in the cold, into a far and strange country. You can worship your precious no-gods there to your heart's content. Rest assured, I won't bother you anymore.'

14. యెహోవా సెలవిచ్చు మాట ఏదనగా నేను వారి పితరులకిచ్చిన దేశమునకు వారిని మరల రప్పించెదను గనుక రాబోవు దినములలో ఐగుప్తు దేశములో నుండి ఇశ్రాయేలీయులను రప్పించిన యెహోవా జీవముతోడని ఇకమీదట

14. 'On the other hand, don't miss this: The time is coming when no one will say any longer, 'As sure as GOD lives, the God who delivered Israel from Egypt.'

15. అనక ఉత్తరదేశములో నుండియు ఆయన వారిని తరిమిన దేశములన్నిటిలో నుండియు ఇశ్రాయేలీయులను రప్పించిన యెహోవా జీవముతోడని జనులు ప్రమాణము చేయుదురు.

15. What they'll say is, 'As sure as GOD lives, the God who brought Israel back from the land of the north, brought them back from all the places where he'd scattered them.' That's right, I'm going to bring them back to the land I first gave to their ancestors.

16. ఇదే యెహోవా వాక్కు వారిని పట్టుకొనుటకు నేను చాల మంది జాలరులను పిలిపించెదను. తరువాత ప్రతి పర్వతముమీదనుండియు ప్రతి కొండమీద నుండియు మెట్టల సందులలోనుండియు వారిని వేటాడి తోలివేయుటకై అనేకులైన వేటగాండ్రను పిలిపించెదను.

16. 'Now, watch for what comes next: I'm going to assemble a bunch of fishermen.' GOD's Decree! 'They'll go fishing for my people and pull them in for judgment. Then I'll send out a party of hunters, and they'll hunt them out in all the mountains, hills, and caves.

17. ఏలయనగా వారు పోయిన త్రోవలన్నిటి మీద దృష్టి యుంచితిని, ఏదియు నా కన్నులకు మరుగు కాలేదు, వారి దోషమును నాకు మరుగైయుండదు.

17. I'm watching their every move. I haven't lost track of a single one of them, neither them nor their sins.

18. వారు తమ హేయదేవతల కళేబరములచేత నా దేశమును అపవిత్ర పరచియున్నారు, తమ హేయక్రియలతో నా స్వాస్థ్యమును నింపియున్నారు గనుక నేను మొదట వారి దోషమును బట్టియు వారి పాపమును బట్టియు రెండంతలుగా వారికి ప్రతికారము చేసెదను.

18. 'They won't get by with a thing. They'll pay double for everything they did wrong. They've made a complete mess of things, littering their lives with their obscene no-gods, leaving piles of stinking god-junk all over the place.'

19. యెహోవా, నా బలమా, నా దుర్గమా, ఆపత్కాలమందు నా ఆశ్రయమా, భూదిగంతములనుండి జనములు నీ యొద్దకు వచ్చిమా పితరులు వ్యర్థమును మాయా రూపమును నిష్‌ప్రయో జనమునగు వాటిని మాత్రము స్వతంత్రించుకొనిరని చెప్పుదురు.
రోమీయులకు 1:25

19. GOD, my strength, my stronghold, my safe retreat when trouble descends: The godless nations will come from earth's four corners, saying, 'Our ancestors lived on lies, useless illusions, all smoke.'

20. నరులు తమకు దేవతలను కల్పించుకొందురా? అయినను అవి దైవములు కావు.

20. Can mortals manufacture gods? Their factories turn out no-gods!

21. కాబట్టి నా నామము యెహోవా అని వారు తెలిసికొనునట్లు నేను ఈ సారి వారికి అనుభవము కలుగజేతును, నా బలమును నా శౌర్యమును ఎంతటివో వారికి తెలియజేతును.

21. 'Watch closely now. I'm going to teach these wrongheaded people. Starting right now, I'm going to teach them Who I am and what I do, teach them the meaning of my name, GOD--'I AM.'



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Jeremiah - యిర్మియా 16 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

ప్రవక్తపై నిషేధాలు విధించబడ్డాయి. (1-9) 
ప్రవక్త తన దేశం యొక్క ఆసన్నమైన నాశనాన్ని ఊహించినట్లుగా ప్రవర్తించాలి. రాబోయే దుఃఖ సమయాలలో, అతను వివాహం, మరణించిన వారి కోసం దుఃఖించడం మరియు ఆనందాన్ని కోరుకోవడం మానుకోవాలి. దేవుని సత్యాలను ఇతరులను ఒప్పించాలనే లక్ష్యంతో ఉన్నవారు తమ స్వీయ-క్రమశిక్షణ ద్వారా ఈ సత్యాలను తాము యథార్థంగా విశ్వసిస్తున్నారని నిరూపించుకోవాలి. కుటుంబంలో లేదా సమాజంలో అంతర్గత మరియు బాహ్య శాంతి అనేది పూర్తిగా దేవుని పని మరియు అతని ప్రేమపూర్వక దయ మరియు దయ యొక్క ఫలితం. దేవుడు తన శాంతిని ప్రజల నుండి ఉపసంహరించుకున్నప్పుడు, కష్టాలు ఖచ్చితంగా వస్తాయి. మన కర్తవ్యంగా పరిగణించబడే వాటిని నివారించాల్సిన సందర్భాలు ఉండవచ్చు మరియు ఈ జీవితంలోని ఆనందాలు మరియు ప్రాపంచిక విషయాల పట్ల మనం ఎల్లప్పుడూ నిర్లిప్త వైఖరిని కలిగి ఉండాలి.

ఈ తీర్పులలో దేవుని న్యాయం. (10-13) 
ఇది దేవుని వాక్య బోధలకు సంబంధించి వివాదాలలో నిమగ్నమైన వారి ప్రసంగంగా కనిపిస్తుంది. వినయం మరియు స్వీయ-ఖండనను స్వీకరించడానికి బదులుగా, వారు దేవుడు తమకు అన్యాయం చేసినట్లు తమను తాము రక్షించుకోవడానికి ప్రయత్నిస్తారు. సూటిగా మరియు సమగ్రమైన ప్రతిస్పందన అందించబడుతుంది. వారు తమ పూర్వీకుల కంటే తమ పాపపు మార్గాలలో ఎక్కువ మొండితనాన్ని ప్రదర్శిస్తారు, ప్రతి వ్యక్తి వారి స్వంత కోరికలను అనుసరిస్తారు. వారు వినడానికి నిరాకరిస్తారు కాబట్టి, వారిని బలవంతంగా సుదూర ప్రదేశానికి తీసుకువెళతారు, వారికి తెలియనిది. వారు దేవుని అనుగ్రహాన్ని పొందాలంటే, వారి చెరలో ఉన్న స్థలం కూడా ఓదార్పునిస్తుంది.

యూదుల భవిష్యత్తు పునరుద్ధరణ, మరియు అన్యుల మార్పిడి. (14-21)
బాబిలోనియన్ ప్రవాసం తరువాత పునరుద్ధరణ ఈజిప్ట్ నుండి ఎక్సోడస్ జ్ఞాపకశక్తిని భర్తీ చేస్తుంది. ఇది ఆధ్యాత్మిక విముక్తి మరియు క్రైస్తవ వ్యతిరేక అణచివేత నుండి చర్చి యొక్క భవిష్యత్తు విముక్తిని కూడా సూచిస్తుంది. అయితే, పాపులు చేసిన అతిక్రమాలు ఏవీ దేవుని దృష్టికి తప్పించుకోలేవు లేదా శిక్షించబడవు. అతను వారి పాపాలను వెలికితీస్తాడు మరియు తన కోపానికి సంబంధించిన సాధనాలను లేవనెత్తాడు, ఇది యూదు ప్రజలను నాశనం చేస్తుంది-కొంతమంది మోసపూరితంగా, జాలరుల వలె మరియు మరికొందరు పూర్తి శక్తి ద్వారా, వేటగాళ్ళ వలె.
రాబోయే దయ కోసం నిరీక్షణతో నిండిన ప్రవక్త, ప్రభువును తన బలం మరియు ఆశ్రయం యొక్క మూలంగా సంబోధించాడు. బందిఖానా నుండి విడుదల మెస్సీయ ద్వారా సాధించబడే అద్భుతమైన మోక్షానికి నాందిగా ఉపయోగపడుతుంది. దేశాలు తరచూ యెహోవా ఉగ్రతను అనుభవిస్తున్నప్పటికీ, వారు ఆయన ప్రజల బలమని మరియు కష్ట సమయాల్లో వారి ఆశ్రయం అని తెలుసుకుంటారు.



Shortcut Links
యిర్మియా - Jeremiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |