Jeremiah - యిర్మియా 23 | View All

1. యెహోవా వాక్కు ఇదే నా మందలో చేరిన గొఱ్ఱెలను నశింపజేయుచు చెదరగొట్టు కాపరులకు శ్రమ.
యోహాను 10:8

1. Woe to the shepherds who destroy and scatter the sheep of My pasture, says Jehovah.

2. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తన జనులను మేపు కాపరులనుగూర్చి యీలాగున సెలవిచ్చుచున్నాడు మీరు నా గొఱ్ఱెలనుగూర్చి విచారణచేయక, నేను మేపుచున్న గొఱ్ఱెలను చెదరగొట్టి పారదోలితిరి; ఇదిగో మీ దుష్‌క్రియలనుబట్టి మిమ్మును శిక్షింపబోవుచున్నాను; ఇదే యెహోవా వాక్కు.
యోహాను 10:8

2. Therefore so says Jehovah, the God of Israel, against the shepherds who feed My people, You have scattered My flock, and have driven them away, and have not visited them. Behold, I will bring on you the evil of your doings, says Jehovah.

3. మరియు నేను వాటిని తోలి వేసిన దేశములన్నిటిలోనుండి నా గొఱ్ఱెల శేషమును సమకూర్చి తమ దొడ్లకు వాటిని రప్పించెదను; అవి అభివృద్ధిపొంది విస్తరించును.

3. And I will gather the remnant of My flock out of all countries where I have driven them, and will bring them again to their fold. And they shall be fruitful and multiply.

4. నేను వాటి మీద కాపరులను నియమించెదను; ఇకమీదట అవి భయపడకుండను బెదరి పోకుండను వాటిలో ఒకటైనను తప్పిపోకుండను వీరు నా గొఱ్ఱెలను మేపెదరు; ఇదే యెహోవా వాక్కు.

4. And I will set up shepherds over them who will feed them. And they shall fear no more, nor be afraid; nor shall they lack anything, says Jehovah.

5. యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను; అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమిమీద నీతి న్యాయములను జరిగించును.
యోహాను 7:42, 1 కోరింథీయులకు 1:30

5. Behold, the days come, says Jehovah, that I will raise to David a righteous Branch, and a King shall reign and act wisely, and shall do judgment and justice in the earth.

6. అతని దినములలో యూదా రక్షణనొందును, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును, యెహోవా మనకు నీతియని అతనికి పేరు పెట్టుదురు.
యోహాను 7:42

6. In his days Judah shall be saved, and Israel shall dwell safely. And this is His name by which He shall be called, JEHOVAH, OUR RIGHTEOUSNESS.

7. కాబట్టి రాబోవు దినములలో జనులు ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశములోనుండి రప్పించిన యెహోవా జీవము తోడని యిక ప్రమాణముచేయక

7. Therefore, behold, the days come, says Jehovah, that they shall no more say, Jehovah lives, who brought the sons of Israel up out of the land of Egypt;

8. ఉత్తర దేశములో నుండియు, నేను వారిని చెదరగొట్టిన దేశములన్నిటిలో నుండియు వారిని రప్పించిన యెహోవానగు నాతోడని ప్రమాణము చేతురని యెహోవా సెలవిచ్చుచున్నాడు; మరియు వారు తమ దేశములో నివసింతురు.

8. but, Jehovah lives, who brought up and led the seed of the house of Israel out of the north country, and from all countries where I have driven them. And they shall dwell in their own land.

9. ప్రవక్తలను గూర్చినది. యెహోవాను గూర్చియు ఆయన పరిశుద్ధమైన మాటలను గూర్చియు నా గుండె నాలో పగులుచున్నది, నా యెముకలన్నియు కదలు చున్నవి, నేను మత్తిల్లినవానివలెను ద్రాక్షారసవశుడైన బలాఢ్యునివలెను ఉన్నాను.

9. My heart within me is broken because of the prophets; all my bones shake. I am like a drunken man, and like a man whom wine has overcome, because of Jehovah, and because of the Words of His holiness.

10. దేశము వ్యభిచారులతో నిండియున్నది, జనుల నడవడి చెడ్డదాయెను, వారి శౌర్యము అన్యాయమున కుపయోగించుచున్నది గనుక శాపగ్రస్తమై దేశము దుఃఖపడుచున్నది; అడవిబీళ్లు ఎండిపోయెను.

10. For the land is full of adulterers. Yes, because of cursing the land mourns; the pleasant places of the wilderness are dried up, and their course is evil, and their power is not right.

11. ప్రవక్తలేమి యాజకులేమి అందరును అపవిత్రులు; నా మందిరములో వారి చెడుతనము నాకు కనబడెను; ఇదే యెహోవా వాక్కు.

11. For both prophet and priest are ungodly; yes, in My house I have found their evil, says Jehovah.

12. వారి దండన సంవత్సరమున వారి మీదికి నేను కీడు రప్పించుచున్నాను గనుక గాఢాంధకారములో నడుచువానికి జారుడు నేలవలె వారి మార్గముండును; దానిలో వారు తరుమబడి పడిపోయెదరు; ఇదే యెహోవా వాక్కు.

12. So their way shall be to them as slippery ways in the darkness; they shall be driven on, and fall in them; for I will bring evil on them, even the year of their judgment, says Jehovah.

13. షోమ్రోను ప్రవక్తలు అవివేక క్రియలు చేయగా చూచితిని; వారు బయలు పేరట ప్రవచనము చెప్పి నా జనమైన ఇశ్రాయేలును త్రోవ తప్పించిరి.

13. And I have seen frivolity in the prophets of Samaria; they prophesied by Baal and caused My people Israel to go astray.

14. యెరూషలేము ప్రవక్తలు ఘోరమైన క్రియలు చేయగా నేను చూచితిని, వారు వ్యభిచారులు అసత్య వర్తనులు, ఎవడును తన దుర్మార్గతనుండి మరలక దుర్మార్గుల చేతులను బలపరచుదురు, వారందరు నా దృష్టికి సొదొమ వలెనైరి, దాని నివాసులు గొమొఱ్ఱావలెనైరి.

14. I have also seen in the prophets of Jerusalem a horrible thing; they commit adultery and walk in falsehood. They also strengthen to the hands of evildoers, so that none returns from his evil; they are all of them like Sodom to Me, and its inhabitants like Gomorrah.

15. కావున సైన్యములకధిపతియగు యెహోవా ఈ ప్రవక్తలనుగూర్చి సెలవిచ్చునదేమనగా యెరూషలేము ప్రవక్తల అపవిత్రత దేశమంతట వ్యాపించెను గనుక తినుటకు మాచిపత్రియు త్రాగుటకు చేదునీళ్లును నేను వారి కిచ్చుచున్నాను.

15. So Jehovah of Hosts says this concerning the prophets: Behold, I will feed them wormwood, and make them drink poisonous water; for from the prophets of Jerusalem ungodliness has gone forth into all the land.

16. సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు మీకు ప్రచనములు ప్రకటించు ప్రవక్తల మాటలను ఆలకింపకుడి, వారు మిమ్మును భ్రమ పెట్టుదురు.

16. So says Jehovah of Hosts, Do not listen to the words of the prophets who prophesy to you. They make you vain; they speak a vision from their own heart, not out of the mouth of Jehovah.

17. వారు నన్ను తృణీకరించు వారితో మీకు క్షేమము కలుగునని యెహోవా సెలవిచ్చెననియు; ఒకడు తన హృదయ మూర్ఖత చొప్పున నడవగా వానితో మీకు కీడు రాదనియు చెప్పుచు, యెహోవా ఆజ్ఞనుబట్టి మాటలాడక తమకు తోచిన దర్శనమునుబట్టి పలుకుదురు.

17. They still say to those who despise Me, Jehovah has said, You shall have peace! And they say to everyone who walks after the stubbornness of his own heart, No evil shall come on you!

18. యెహోవా మాట విని గ్రహించునట్లు ఆయన సభలో నిలుచువాడెవడు? నా మాటను గ్రహించునట్లు దాని లక్ష్యము చేసినవాడెవడు?
రోమీయులకు 11:34

18. For who has stood in the counsel of Jehovah, and hears His Word? Who has listened to His Word and heard it?

19. ఇదిగో యెహోవాయొక్క మహోగ్రతయను పెనుగాలి బయలువెళ్లుచున్నది; అది భీకరమైన పెనుగాలి అది దుష్టుల తలమీదికి పెళ్లున దిగును.

19. Behold, the tempest of Jehovah has gone forth in fury, a whirling tempest. It shall whirl on the head of the wicked.

20. తన కార్యమును సఫలపరచువరకును తన హృదయా లోచనలను నెరవేర్చువరకును యెహోవా కోపము చల్లారదు; అంత్యదినములలో ఈ సంగతిని మీరు బాగుగా గ్రహించుదురు.

20. The anger of Jehovah shall not return, until He has done and until He has set up the purposes of His heart; in later days you shall understand it perfectly.

21. నేను ఈ ప్రవక్తలను పంపకుండినను వారు పరుగెత్తి వచ్చెదరు, నేను వారితో మాటలాడకుండినను వారు ప్రకటించెదరు.

21. I have not sent these prophets, yet they ran; I have not spoken to them, yet they prophesied.

22. వారు నా సభలో చేరిన వారైన యెడల వారు నా మాటలు నా ప్రజలకు తెలియ జేతురు, దుష్‌క్రియలు చేయక వారు దుర్మార్గమును విడిచి పెట్టునట్లు వారిని త్రిప్పియుందురు; ఇదే యెహోవా వాక్కు.

22. But if they had stood in My wisdom and had caused My people to hear My Words, then they would have turned them from their evil way and from the evil of their doings.

23. నేను సమీపముననుండు దేవుడను మాత్ర మేనా? దూరముననుండు దేవుడనుకానా?
అపో. కార్యములు 17:27

23. Am I a God near, says Jehovah, and not a God afar off?

24. యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా నాకు కనబడకుండ రహస్య స్థలములలో దాగగలవాడెవడైన కలడా? నేను భూమ్యాకాశములయందంతట నున్నవాడను కానా? యిదే యెహోవా వాక్కు.

24. Can anyone hide himself in secret places so that I shall not see him? says Jehovah. Do I not fill the heavens and earth? says Jehovah.

25. కలకంటిని కలకంటిని అని చెప్పుచు నా నామమున అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు పలికిన మాట నేను వినియున్నాను.

25. I have heard what the prophets said, who prophesy lies in My name, saying, I have dreamed, I have dreamed.

26. ఇక నెప్పటివరకు ఈలాగున జరుగుచుండును? తమ హృదయకాపట్యమును బట్టి అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు దీని నాలోచింపరా?

26. How long shall this be in the heart of the prophets who prophesy lies? But they are prophets of the deceit of their own heart,

27. బయలును పూజింపవలెనని తమ పితరులు నా నామమును మరచినట్లు వీరందరు తమ పొరుగువారితో చెప్పు కలలచేత నా జనులు నా నామమును మరచునట్లు చేయవలెనని యోచించుచున్నారా?

27. who plot to cause My people to forget My name by their dreams which they tell, each one to his neighbor, as their fathers have forgotten My name for Baal.

28. కలకనిన ప్రవక్త ఆ కలను చెప్పవలెను; నా వాక్కు ఎవనికుండునో వాడు సత్యమునుబట్టి నా మాట చెప్పవలెను; ధాన్యముతో చెత్తకు ఏమి సంబంధము? ఇదే యెహోవా వాక్కు.

28. The prophet who has a dream, let him tell a dream. And he who has My Word, let him speak My Word faithfully. What is the chaff to the wheat? says Jehovah.

29. నా మాట అగ్నివంటిదికాదా? బండను బద్దలుచేయు సుత్తెవంటిది కాదా?

29. Is not My Word like a fire? says Jehovah; and like a hammer that breaks the rock in pieces?

30. కాబట్టి తమ జతవానియొద్దనుండి నా మాటలను దొంగి లించు ప్రవక్తలకు నేను విరోధిని; ఇదే యెహోవా వాక్కు.

30. So Jehovah says, Behold, I am against the prophets who steal My Words each one from his neighbor.

31. స్వేచ్ఛగా నాలుకల నాడించుకొనుచు దేవో క్తులను ప్రకటించు ప్రవక్తలకు నేను విరోధిని; ఇదే యెహోవా వాక్కు.

31. Jehovah says, Behold, I am against the prophets who use their tongues and say, He says.

32. మాయా స్వప్నములను ప్రకటించి వాటిని చెప్పుచు, అబద్ధములచేతను, మాయాప్రగల్భత చేతను నా ప్రజలను దారి తొలగించువారికి నేను విరో ధినై యున్నాను; ఇదే యెహోవా వాక్కు. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారు ఈ జనులకు ఏమాత్రమును ప్రయోజనకారులు కారు; ఇదే యెహోవా వాక్కు.

32. Jehovah says, Behold, I am against those who prophesy false dreams and tell them, and cause My people to go astray by their lies and by their lightness. Yet I did not send them nor command them; therefore they shall not profit this people at all, says Jehovah.

33. మరియు ఈ జనులలో ఒకడు ప్రవక్తయే గాని యాజకుడే గాని యెహోవా భారమేమి అని నిన్నడుగునప్పుడు నీవు వారితో ఇట్లనుముమీరే ఆయనకు భారము; మిమ్మును ఎత్తి పారవేతును; ఇదే యెహోవా వాక్కు. మరియ

33. And when this people, or the prophet, or a priest, shall ask you, saying, What is the burden of Jehovah? You shall then say to them, What burden? I will even forsake you, says Jehovah.

34. ప్రవక్తయే గాని యాజకుడే గాని సామాన్యుడే గాని యెహోవా భారమను మాట ఎత్తువాడెవడైనను, వానిని వాని యింటివారిని నేను దండించెదను.

34. And as for the prophet, and the priest, and the people, who shall say, The burden of Jehovah, I will even punish that man and his house.

35. అయితే యెహోవా ప్రత్యుత్తరమేది? యెహోవా యేమని చెప్పుచున్నాడు? అని మీరు మీ పొరుగువారితోను సహోదరులతోను ప్రశంసించవలెను.

35. So you shall say each one to his neighbor, and each one to his brother, What has Jehovah answered? And what has Jehovah spoken?

36. యెహోవా భారమను మాట మీరిక మీదట జ్ఞాపకము చేసికొనవద్దు; జీవముగల మన దేవుని మాటలను, సైన్యముల కధిపతియు దేవుడునగు యెహోవా మాటలను, మీరు అపార్థముచేసితిరి; కాగా ఎవనిమాట వానికే భారమగును.

36. And you shall mention the burden of Jehovah no more. For every man's word shall be his burden; for you have perverted the Words of the living God, of Jehovah of Hosts our God.

37. యెహోవా నీకేమని ప్రత్యుత్తర మిచ్చుచున్నాడనియు, యెహోవా యేమి చెప్పుచున్నాడనియు మీరు ప్రవక్తను అడుగవలెను గాని యెహోవా భారమను మాట మీరెత్తిన యెడల

37. So you shall say to the prophet, What has Jehovah answered you? And what has Jehovah spoken?

38. అందునుగూర్చి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు మీరు యెహోవా భారమను మాట యెత్తవద్దని నేను మీకు ఆజ్ఞ ఇచ్చినను మీరు యెహోవా భారమను మాట యెత్తుచునే యున్నారు.

38. But since you say, The burden of Jehovah; therefore so says Jehovah, Because you say this word; the burden of Jehovah; and I have sent to you saying, You shall not say, The burden of Jehovah;

39. కాగా నేను మిమ్మును ఎత్తివేయుచున్నాను, మీకును మీ పితరులకును నేనిచ్చిన పట్టణమును నా సన్నిధినుండి పారవేయుచున్నాను.

39. therefore, behold, I, even I, will completely forget you, and I will forsake you and the city that I gave you and your fathers, and cast you out of My presence.

40. ఎన్నడును మరువబడని నిత్యాపవాదమును నిత్యావమానమును మీమీదికి రప్పించెదను.

40. And I will bring an everlasting reproach on you, and a never-ending shame, which shall not be forgotten.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Jeremiah - యిర్మియా 23 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

యూదులను వారి స్వంత భూమికి పునరుద్ధరించడం. (1-8) 
దేవుని ప్రజలను పోషించే పనిలో ఉన్నప్పటికీ వారి శ్రేయస్సు పట్ల శ్రద్ధ చూపని వారు శాపగ్రస్తులు! పట్టించుకోని గొర్రెలకు ఓదార్పు సందేశం ఇక్కడ ఉంది. దేవుని మందలో ఒక శేషం మాత్రమే మిగిలిపోయినప్పటికీ, ఆయన వారిని వెదకి వారి పూర్వ నివాసాలకు తిరిగి తీసుకువెళతాడు. క్రీస్తు డేవిడ్ వంశం నుండి వచ్చిన వారసుడిగా వర్ణించబడింది. అతను స్వాభావికంగా నీతిమంతుడు, మరియు అతని ద్వారా, అతని అనుచరులందరూ నీతిమంతులుగా మార్చబడ్డారు. సాతాను అక్రమ ఆధిపత్యాన్ని క్రీస్తు ఛిద్రం చేస్తాడు. విశ్వాసపాత్రుడైన అబ్రహం మరియు ప్రార్థనాపరుడైన యాకోబు యొక్క ఆధ్యాత్మిక వారసులందరూ పాపం యొక్క అపరాధం మరియు పాండిత్యం నుండి రక్షించబడతారు మరియు విముక్తి పొందుతారు. ఆత్మలో క్రీస్తు పాలనలో, శాంతి లోపల నివసిస్తుంది. అతను ఇక్కడ "ప్రభువు మన నీతి" అని సూచించబడ్డాడు, ఇది భూమిపై ఉన్న ఏ ప్రాణికైనా మించిన నీతి. మరణం వరకు అతని విధేయత విశ్వాసులకు మరియు స్వర్గపు ఆనందానికి వారి దావాను సమర్థించే నీతిగా పనిచేస్తుంది. వారి పవిత్రీకరణ, వారి వ్యక్తిగత విధేయత యొక్క మూలం, ఆయనతో వారి ఐక్యత మరియు అతని ఆత్మ యొక్క సదుపాయం నుండి ప్రవహిస్తుంది. ప్రతి నిజమైన విశ్వాసి ఈ పేరుతో ఆయనను పిలుస్తాడు. ఇది తప్ప మనకు మనవి లేదు: క్రీస్తు చనిపోయాడు, ఇంకా ఎక్కువగా, అతను మళ్లీ లేచాడు మరియు మేము ఆయనను మన ప్రభువుగా అంగీకరించాము. చట్టం మరియు న్యాయం యొక్క డిమాండ్లను సంతృప్తి పరచడానికి స్థాపించబడిన ఈ నీతి మనది - దేవుని ఆత్మ ద్వారా మనకు అందించబడిన ఉచిత బహుమతి, ఇది మనలను కప్పివేస్తుంది, దానిని గ్రహించడానికి మనకు శక్తినిస్తుంది మరియు దానిలో మనకు వాటాను ఇస్తుంది. "ప్రభువు మన నీతిమంతుడు" అనేది నేరారోపణ చేయబడిన పాపికి ఓదార్పునిచ్చే పేరు, తన మనస్సాక్షిలో పాపపు బరువును అనుభవించి, ఆ నీతి కోసం వారి అవసరాన్ని గుర్తించి, దాని అమూల్యమైన విలువను అర్థం చేసుకున్న వ్యక్తి. ఈ గొప్ప మోక్షం అతని చర్చి యొక్క మునుపటి అన్ని విమోచనలను అధిగమించింది. మన ఆత్మలు ఆయన వైపుకు ఆకర్షించబడాలి మరియు ఆయనలో కనుగొనబడాలి.

యూదా పూజారులు మరియు ప్రవక్తల దుష్టత్వం, ప్రజలు తప్పుడు వాగ్దానాలను వినవద్దని ఉద్బోధించారు. (9-22) 
సమరయలోని మోసపూరిత ప్రవక్తలు ఇశ్రాయేలీయులను విగ్రహారాధనలో చిక్కుకున్నారు. అయినప్పటికీ, యెరూషలేములోని తప్పుడు ప్రవక్తలను ప్రభువు వారి ఘోరమైన తప్పులకు మరింత దోషులుగా పరిగణించాడు, ఇది వారి పాపపు మార్గాల్లో ప్రజలను ధైర్యపరిచింది. ఈ మోసపూరిత బోధకులు చివరికి లార్డ్ యొక్క తీర్పు యొక్క కఠినమైన కోపాన్ని ఎదుర్కొంటారు. పాపం ఎటువంటి ఫలితాన్ని ఇవ్వదని వారు తమను తాము ఒప్పించుకున్నారు మరియు తదనుగుణంగా ప్రవర్తించారు, తర్వాత అదే నమ్మకాన్ని స్వీకరించడానికి ఇతరులను ఒప్పించారు. పాపపు మార్గాలలో కొనసాగాలని నిశ్చయించుకున్న వారు శక్తివంతమైన భ్రమలను స్వీకరించడానికి సరిగ్గా అప్పగించబడతారు. అయినప్పటికీ, ఈ అబద్ధ ప్రవక్తలలో ఎవరూ ఎలాంటి దైవిక ప్రత్యక్షతను పొందలేదు లేదా దేవుని వాక్యం గురించి ఏమీ అర్థం చేసుకోలేదు. వారు తమ మూర్ఖత్వాన్ని మరియు అవిశ్వాసాన్ని పశ్చాత్తాపంతో తిరిగి చూసుకునే సమయం వస్తుంది.
దీనికి విరుద్ధంగా, నిజమైన ప్రవక్తల బోధన మరియు ఉదాహరణ ప్రజలను పశ్చాత్తాపం, విశ్వాసం మరియు నీతి వైపు నడిపించింది. తప్పుడు ప్రవక్తలు, మరోవైపు, ప్రజలు తమ పాపాలలో ఆత్మసంతృప్తితో ఉండేందుకు వీలుగా ఆచారాలు మరియు శూన్య విశ్వాసాలలో ఓదార్పుని పొందేలా చేశారు. అధర్మ మార్గాన్ని అనుసరించకుండా జాగ్రత్తపడదాం.

స్పూర్తిగా నటించేవారు బెదిరించారు. (23-32) 
దేవుని శ్రద్దగల దృష్టి నుండి ఎవరూ తప్పించుకోలేరు. తమ చర్యల ద్వారా తమపై తాము తెచ్చుకుంటున్న పరిణామాలను వారు ఎప్పటికీ గుర్తించలేరా? ఈ ప్రవచనాలకు మరియు ప్రభువు యొక్క నిజమైన ప్రవక్తలు అందించిన వాటికి మధ్య ఉన్న విస్తారమైన అసమానతలను వారు ప్రతిబింబించాలి. వారు తమ మూర్ఖపు కల్పనలను దైవిక ద్యోతకాలుగా పేర్కొనడం మానుకోవాలి. ఈ ప్రవక్తలు చేసిన శాంతి వాగ్దానాలు దేవుని వాగ్దానాలతో సారూప్యతను కలిగి ఉండవు, అలాగే గోధుమలకు పొట్టు భిన్నంగా ఉంటుంది.
మానవత్వం యొక్క పశ్చాత్తాపపడని హృదయం రాయిలా లొంగనిది; అగ్నిలా దేవుని వాక్యానికి గురైనప్పుడు అది కరగకపోతే, సుత్తిలా కొట్టినప్పుడు అది పగిలిపోతుంది. వారిపై అపరిమితమైన శక్తిగల దేవుడు ఉన్నప్పుడు వారు శాశ్వతమైన భద్రతను లేదా నిజమైన శాంతిని ఎలా పొందగలరు? దేవుని వాక్యం ఓదార్పు, మోసపూరిత సందేశం కాదు. దాని విశ్వసనీయత దానిని తప్పుడు సిద్ధాంతాల నుండి ఖచ్చితంగా వేరు చేస్తుంది.

నిజమైన ప్రవచనాన్ని అపహాస్యం చేసేవారు. (33-40)
దేవునిచే వదిలివేయబడిన మరియు నిర్లక్ష్యం చేయబడిన వారు నిజంగా దురదృష్టవంతులు, మరియు దేవుని తీర్పులను తేలికగా చేసే వ్యక్తులు పరిణామాల నుండి తప్పించుకోలేరు. దేవుడు ఒకప్పుడు ఇజ్రాయెల్‌ను సన్నిహిత మరియు ప్రతిష్టాత్మకమైన ప్రజలుగా భావించాడు, కానీ ఇప్పుడు వారు అతని సన్నిధి నుండి బహిష్కరించబడతారు. ఇది వ్యక్తులు దేవుని మాటలను అపహాస్యం చేయడానికి అపారమైన మరియు సాహసోపేతమైన అసంబద్ధతను ప్రదర్శిస్తుంది. ప్రతి ఆలోచనా రహితమైన మరియు దూషణాత్మకమైన ఉచ్చారణ, శాశ్వతమైన అవమానం వారి విధి అయినప్పుడు, తీర్పు రోజున పాపుల అపరాధాన్ని మాత్రమే పెంచుతుంది.



Shortcut Links
యిర్మియా - Jeremiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |