Jeremiah - యిర్మియా 7 | View All

1. యెహోవాయొద్దనుండి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు

1. The word that came to Jeremiah from the LORD, saying,

2. నీవు యెహోవా మందిర ద్వారమున నిలువ బడి ఈ మాట అచ్చటనే ప్రకటింపుము యెహోవాకు నమస్కారముచేయుటకై యీ ద్వారములలో బడి ప్రవేశించు యూదావారలారా, యెహోవా మాట వినుడి.

2. 'Stand in the gate of the LORD'S house and proclaim there this word and say, 'Hear the word of the LORD, all you of Judah, who enter by these gates to worship the LORD!''

3. సైన్యములకధిపతియు ఇశ్రాయేలుయొక్క దేవుడునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను ఈ స్థలమున మిమ్మును నివసింపజేయునట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి

3. Thus says the LORD of hosts, the God of Israel, 'Amend your ways and your deeds, and I will let you dwell in this place.

4. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుకొనుచున్నారే; యీ మోసకరమైన మాటలు ఆధారము చేసికొనకుడి.

4. 'Do not trust in deceptive words, saying, 'This is the temple of the LORD, the temple of the LORD, the temple of the LORD.'

5. ఆలాగనక, మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరచుకొని, ప్రతివాడు తన పొరుగు వానియెడల తప్పక న్యాయము జరిగించి.

5. 'For if you truly amend your ways and your deeds, if you truly practice justice between a man and his neighbor,

6. పరదేశులను తండ్రిలేని వారిని విధవరాండ్రను బాధింపకయు ఈ చోట నిర్దోషిరక్తము చిందింపకయు, మీకు కీడు కలుగజేయు అన్యదేవతలను అనుసరింపకయు నుండినయెడల

6. [if] you do not oppress the alien, the orphan, or the widow, and do not shed innocent blood in this place, nor walk after other gods to your own ruin,

7. ఈ స్థలమున తమకు నిత్యముగా నుండుటకై పూర్వకాలమున నేను మీ పితరులకిచ్చిన దేశమున మిమ్మును కాపురముంచుదును.

7. then I will let you dwell in this place, in the land that I gave to your fathers forever and ever.

8. ఇదిగో అబద్ధపుమాటలను మీరు నమ్ముకొను చున్నారు. అవి మీకు నిష్‌ప్రయోజనములు.

8. 'Behold, you are trusting in deceptive words to no avail.

9. ఇదేమి? మీరు జారచోర క్రియలను నరహత్యను చేయుచు

9. 'Will you steal, murder, and commit adultery and swear falsely, and offer sacrifices to Baal and walk after other gods that you have not known,

10. అబద్ధసాక్ష్యము పలుకుచు బయలునకు ధూపమువేయుచు మీరెరుగని దేవతలను అనుసరించుచున్నారే; అయినను నా నామము పెట్టబడిన యీ మందిరములోనికి వచ్చి నా సన్నిధిని నిలుచుచు విడుదలనొందియున్నామని మీరు చెప్పుదురు; ఈ హేయక్రియలన్నియు జరిగించుటకేనా మీరు విడుదలనొందితిరి?

10. then come and stand before Me in this house, which is called by My name, and say, 'We are delivered!'-- that you may do all these abominations?

11. నాదని చాటబడిన యీ మంది రము మీ దృష్టికి దొంగలగుహయైనదా? ఆలోచించుడి, నేనే యీ సంగతి కనుగొనుచున్నాను. ఇదే యెహోవా వాక్కు.
మత్తయి 21:13, మార్కు 11:17, లూకా 19:46

11. 'Has this house, which is called by My name, become a den of robbers in your sight? Behold, I, even I, have seen [it],' declares the LORD.

12. పూర్వమున నేను నా నామము నిలిపిన షిలోహునందున్న నా స్థలమునకు పోయి విచారణ చేయుడి, ఇశ్రాయేలీయులైన నా జనుల దుష్టత్వమును బట్టి నేను దానికి చేసిన కార్యము చూడుడి; ఇదే యెహోవా వాక్కు.

12. 'But go now to My place which was in Shiloh, where I made My name dwell at the first, and see what I did to it because of the wickedness of My people Israel.

13. నేను మీతో మాటలాడినను పెందలకడ లేచి మీతో మాటలాడినను మీరు వినకయు, మిమ్మును పిలిచినను మీరు ఉత్తరమియ్యకయు నుండినవారై యీ క్రియలన్నిటిని చేసితిరి గనుక

13. 'And now, because you have done all these things,' declares the LORD, 'and I spoke to you, rising up early and speaking, but you did not hear, and I called you but you did not answer,

14. నేను షిలోహునకు చేసినట్లు మీకు ఆశ్రయమై నా నామముపెట్టబడిన యీ మందిరమునకును మీకును మీ తండ్రులకును నేనిచ్చిన స్థలమునకును నేను ఆలాగే చేయుదును.

14. therefore, I will do to the house which is called by My name, in which you trust, and to the place which I gave you and your fathers, as I did to Shiloh.

15. ఎఫ్రాయిము సంతానమగు మీ సహోదరులనందరిని నేను వెళ్లగొట్టినట్లు మిమ్మును నా సన్నిధినుండి వెళ్లగొట్టుదును.

15. 'I will cast you out of My sight, as I have cast out all your brothers, all the offspring of Ephraim.

16. కాబట్టి నీవు ఈ జనము కొరకు ప్రార్థనచేయకుము, వారికొరకు మొఱ్ఱ నైనను ప్రార్థననైనను చేయకుము, నన్ను బతిమాలుకొనకుము, నేను నీ మాట వినను.

16. 'As for you, do not pray for this people, and do not lift up cry or prayer for them, and do not intercede with Me; for I do not hear you.

17. యూదాపట్టణములలోను యెరూషలేము వీధులలోను వారు చేయుచున్న క్రియలను నీవు చూచుచున్నావు గదా.

17. 'Do you not see what they are doing in the cities of Judah and in the streets of Jerusalem?

18. నాకు కోపము పుట్టించునట్లు ఆకాశరాణి దేవతకు పిండివంటలు చేయవలెననియు, అన్య దేవతలకు పానార్పణములు పోయవలెననియు పిల్లలు కట్టెలు ఏరుచున్నారు తండ్రులు అగ్ని రాజ బెట్టుచున్నారు స్త్రీలు పిండి పిసుకుచున్నారు.
అపో. కార్యములు 7:42

18. 'The children gather wood, and the fathers kindle the fire, and the women knead dough to make cakes for the queen of heaven; and [they] pour out drink offerings to other gods in order to spite Me.

19. నాకే కోపము పుట్టించునంతగా వారు దాని చేయుచున్నారా? తమకే అవమానము కలుగు నంతగా చేయుచున్నారు గదా, యిదే యెహోవా వాక్కు.

19. 'Do they spite Me?' declares the LORD. 'Is it not themselves [they spite], to their own shame?'

20. అందువలన ప్రభువగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఈ స్థలముమీదను నరులమీదను జంతువులమీదను పొలముల చెట్లమీదను భూమిపంట మీదను నా కోపమును నా ఉగ్రతను కుమ్మరించెదను, ఆర్పశక్యము కాకుండ అది మండును.

20. Therefore thus says the Lord GOD, 'Behold, My anger and My wrath will be poured out on this place, on man and on beast and on the trees of the field and on the fruit of the ground; and it will burn and not be quenched.'

21. సైన్యములకధిపతియు ఇశ్రాయేలు దేవుడునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు మీ దహన బలులను మీ బలులను కలిపి మాంసము భక్షించుడి.

21. Thus says the LORD of hosts, the God of Israel, 'Add your burnt offerings to your sacrifices and eat flesh.

22. నేను ఐగుప్తు దేశములోనుండి మీ పితరులను రప్పించిన దినమున దహనబలులనుగూర్చిగాని బలులనుగూర్చిగాని నేను వారితో చెప్పలేదు, అట్టి వాటినిగూర్చి నేను ఏ ఆజ్ఞయు ఇయ్యలేదు, ఈ ఆజ్ఞను మాత్రమే నేను వానికిచ్చి తిని

22. 'For I did not speak to your fathers, or command them in the day that I brought them out of the land of Egypt, concerning burnt offerings and sacrifices.

23. ఏదనగానా మాటలు మీరు అంగీకరించినయెడల నేను మీకు దేవుడనై యుందును మీరు నాకు జనులై యుందురు; మీకు క్షేమము కలుగునట్లు నేను మీకాజ్ఞా పించుచున్న మార్గమంతటియందు మీరు నడుచుకొనుడి.

23. 'But this is what I commanded them, saying, 'Obey My voice, and I will be your God, and you will be My people; and you will walk in all the way which I command you, that it may be well with you.'

24. అయితే వారు వినకపోయిరి, చెవియొగ్గకుండిరి, ముందుకు సాగక వెనుకదీయుచు తమ ఆలోచనలనుబట్టి తమ దుష్ట హృదయకాఠిన్యము ననుసరించి నడుచుచు వచ్చిరి.

24. 'Yet they did not obey or incline their ear, but walked in [their own] counsels [and] in the stubbornness of their evil heart, and went backward and not forward.

25. మీ పితరులు ఐగుప్తు దేశములోనుండి బయలుదేరి వచ్చిన దినము మొదలుకొని నేటివరకు మీరు వెనుకదీయుచు వచ్చిన వారే; నేను అనుదినము పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకులనందరిని మీ యొద్దకు పంపుచు వచ్చితిని.

25. 'Since the day that your fathers came out of the land of Egypt until this day, I have sent you all My servants the prophets, daily rising early and sending [them].

26. వారు నా మాట వినకయున్నారు చెవియొగ్గకయున్నారు తమ మెడను వంచక మనస్సును కఠినపరచుకొనుచున్నారు; వారు తమ పితరులకంటె మరి దుష్టులైరి.

26. 'Yet they did not listen to Me or incline their ear, but stiffened their neck; they did more evil than their fathers.

27. నీవు ఈ మాటలన్నియు వారితో చెప్పినను వారు నీ మాటలంగీకరింపరు, నీవు వారిని పిలిచినను వారు నీకుత్తరమియ్యరు

27. 'You shall speak all these words to them, but they will not listen to you; and you shall call to them, but they will not answer you.

28. గనుక నీవు వారితో ఈలాగు చెప్పుము - వీరు తమ దేవుడైన యెహోవా మాట విననివారు, శిక్షకు లోబడనొల్లనివారు, కాబట్టి నమ్మకము వారిలోనుండి తొలగిపోయియున్నది, అది వారి నోట నుండకుండ కొట్టి వేయబడియున్నది.

28. 'You shall say to them, 'This is the nation that did not obey the voice of the LORD their God or accept correction; truth has perished and has been cut off from their mouth.

29. తనకు కోపము తెప్పించు తరమువారిని యెహోవా విసర్జించి వెళ్లగొట్టుచున్నాడు; సీయోనూ నీ తలవెండ్రు కలను కత్తిరించుకొనుము, వాటిని పారవేయుము, చెట్లులేని మెట్టలమీద ప్రలాపవాక్య మెత్తుము.

29. 'Cut off your hair and cast [it] away, And take up a lamentation on the bare heights; For the LORD has rejected and forsaken The generation of His wrath.'

30. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుయూదా వారు నా దృష్టికి చెడ్డక్రియలు చేయుచున్నారు, నా నామముపెట్టబడిన మందిరము అపవిత్రపడునట్లు వారు దానిలో హేయ వస్తువులను ఉంచియున్నారు.

30. 'For the sons of Judah have done that which is evil in My sight,' declares the LORD, 'they have set their detestable things in the house which is called by My name, to defile it.

31. నేనాజ్ఞాపించని క్రియను నాకు తోచని క్రియను వారు చేసియున్నారు, అగ్నిలో తమ కుమారులను తమ కుమార్తెలను దహించుటకు బెన్‌ హిన్నోము లోయలోనున్న తోఫెతునందు బలిపీఠములను కట్టుకొనియున్నారు.

31. 'They have built the high places of Topheth, which is in the valley of the son of Hinnom, to burn their sons and their daughters in the fire, which I did not command, and it did not come into My mind.

32. కాలము సమీపించుచున్నది; అప్పుడు అది తోఫెతు అనియైనను బెన్‌హిన్నోము లోయ అనియైనను అనబడక వధలోయ అనబడును; పాతిపెట్టు టకు స్థలము లేకపోవువరకు తోఫెతులో శవములు పాతి పెట్టబడును; ఇదే యెహోవా వాక్కు.

32. 'Therefore, behold, days are coming,' declares the LORD, 'when it will no longer be called Topheth, or the valley of the son of Hinnom, but the valley of the Slaughter; for they will bury in Topheth because there is no [other] place.

33. ఈ జనుల శవములు ఆకాశపక్షులకును భూజంతువులకును ఆహారమగును, వాటిని తోలివేయువాడు లేకపోవును.

33. 'The dead bodies of this people will be food for the birds of the sky and for the beasts of the earth; and no one will frighten [them away].

34. ఉల్లాస ధ్వనియు ఆనందధ్వనియు పెండ్లికుమారుని స్వరమును పెండ్లికుమార్తె స్వరమును యూదా పట్టణములలోను యెరూషలేము వీధులలోను లేకుండచేసెదను; ఈ దేశము తప్పక పాడైపోవును.
ప్రకటన గ్రంథం 18:23

34. 'Then I will make to cease from the cities of Judah and from the streets of Jerusalem the voice of joy and the voice of gladness, the voice of the bridegroom and the voice of the bride; for the land will become a ruin.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Jeremiah - యిర్మియా 7 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

దేవాలయంపై నమ్మకం వృథా. (1-16) 
వ్యక్తులు తమ ప్రవర్తన మరియు చర్యలను మెరుగుపరచుకోవడానికి చిత్తశుద్ధితో కృషి చేస్తే తప్ప, మతపరమైన ఆచారాలు, వృత్తులు లేదా దైవిక ద్యోతకాల నుండి ఎటువంటి ప్రయోజనాలను పొందలేరు. తెలిసి తెలిసి పాపపు ఆచారాలలో నిమగ్నమై లేదా తమకు తెలిసిన బాధ్యతలను విస్మరించిన వారు మోక్షాన్ని కోరుకుంటున్నట్లు వాస్తవముగా చెప్పలేరు. ఆలయాన్ని అపవిత్రం చేయడం తమను కాపాడుతుందని కొందరు విశ్వసించారు, అయితే కృప దానిని కప్పిస్తుందని లేదా దయ పుష్కలంగా వస్తుందని ఆశించి పాపం చేయడం కొనసాగించే ఎవరైనా వాస్తవానికి క్రీస్తు బోధలను దుర్వినియోగం చేస్తారు. సిలువపై క్రీస్తు త్యాగం యొక్క నిజమైన ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడం అటువంటి హానికరమైన నమ్మకాలకు అత్యంత ప్రభావవంతమైన నివారణను అందిస్తుంది. దైవిక చట్టం యొక్క గొప్పతనాన్ని మరియు పాపం యొక్క దుర్మార్గాన్ని ప్రదర్శించడానికి దేవుని కుమారుడు మన పాపాల కోసం తనను తాను త్యాగం చేశాడు. మన చర్యలకు పర్యవసానాలను ఎదుర్కోకుండా మనం తప్పులో నిమగ్నమవ్వగలమని మనం ఎప్పుడూ అనుకోకూడదు.

విగ్రహారాధనలో కొనసాగడం ద్వారా రెచ్చగొట్టడం. (17-20) 
యూదులు తమ విగ్రహాల పట్ల తమ ఉత్సాహాన్ని ప్రదర్శించడంలో సంతృప్తిని పొందారు. ఈ ప్రతికూల ఉదాహరణ నుండి, దేవుని పట్ల మన భక్తిలో ఉత్సాహంగా ఉండటం యొక్క ప్రాముఖ్యత గురించి మనం పాఠాన్ని నేర్చుకోవాలి. దేవుని కోసం ఏదైనా సేవలో పాల్గొనడం మరియు మన ప్రయత్నాలలో చాలా మంది పాపభరితమైన బోధలను వ్యాప్తి చేయడంలో శ్రద్ధ చూపడం ఒక గొప్ప విషయంగా పరిగణిద్దాం. ఈ పాపపు ప్రవర్తన చివరికి దేవునికి వ్యతిరేకంగా శత్రుత్వానికి దారి తీస్తుంది, కానీ దానిలో పాల్గొనే వారికి కూడా హాని చేస్తుంది. చివరికి, దేవుని ఉగ్రత ఆర్పివేయలేని అగ్ని కాబట్టి, పరిణామాల నుండి తప్పించుకోవడానికి మార్గం లేదని వారు కనుగొంటారు.

దేవుడు వారితో తన వ్యవహారాలను సమర్థిస్తాడు. (21-28) 
వారి నుండి విధేయత ఆశిస్తున్నట్లు దేవుడు స్పష్టం చేశాడు. అతని ఆజ్ఞ సూటిగా ఉంది: "మీ దేవుడైన యెహోవా స్వరాన్ని జాగ్రత్తగా వినండి." ఈ ఆదేశంతో కూడిన వాగ్దానం చాలా భరోసానిస్తుంది. మీరు దేవుని చిత్తాన్ని మీ మార్గదర్శకంగా చేసినప్పుడు, ఆయన అనుగ్రహం మీ ఆనందానికి మూలం అవుతుంది. దేవుడు అవిధేయతతో తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. యూదులు ధర్మశాస్త్రాన్ని తప్పుగా అర్థం చేసుకున్నట్లుగా సువార్త యొక్క సారాంశాన్ని గ్రహించడంలో విఫలమవుతాము, క్రీస్తు త్యాగం మన బాధ్యతను తగ్గించిందని విశ్వసిస్తే.

మరియు ప్రతీకారాన్ని బెదిరిస్తుంది. (29-34)
దుఃఖం మరియు బందిఖానా రెండింటికి చిహ్నంగా, యెరూషలేము అధోకరణం చెందాలి, ఆమె ఇంతకుముందు దేవునికి అంకితం చేయబడినట్లే దేవుని నుండి దూరం అవుతుంది. హృదయం దేవుని కోసం నియమించబడిన నివాస స్థలం అయితే, పాపం లోపల అంతర్లీనంగా మరియు ప్రధానమైన స్థానాన్ని ఆక్రమిస్తే, అది ప్రభువు ఆలయాన్ని అపవిత్రం చేస్తుంది. జెరూసలేం యొక్క రాబోయే విధ్వంసం ఒక భయంకరమైన సంఘటనగా చిత్రీకరించబడింది. చాలా మంది తమ ప్రాణాలను పోగొట్టుకుంటారు, ఎందుకంటే వారు దానిని పాప స్థలంగా మార్చారు. పాపులు తమను తాము మరణానికి మించిన చెడును వెంబడిస్తారు. దేవుని దయను తిరస్కరించి, పనికిమాలిన ఆనందాలను కొనసాగించేవారు చివరికి దేవుని న్యాయం యొక్క పరిణామాలను అనుభవిస్తారు, వారి ఆనందాన్ని కోల్పోతారు. ధర్మబద్ధమైన ఆనందాల పట్ల అభిరుచిని పెంపొందించుకోవడం మరియు అన్ని ఇతర ఆనందాల నుండి, అనుమతించదగిన వాటి నుండి కూడా నిర్లిప్తతను కొనసాగించడం మాకు చాలా అవసరం.




Shortcut Links
యిర్మియా - Jeremiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |