Ezekiel - యెహెఙ్కేలు 21 | View All

1. అప్పుడు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

1. And the Word of Jehovah came to me, saying,

2. నరపుత్రుడా, యెరూషలేము తట్టు నీ ముఖము త్రిప్పుకొని, పరిశుద్ధ స్థలములనుబట్టి ఇశ్రాయేలీయులదేశమును గూర్చి ప్రవచించి ఇట్లనుము

2. Son of man, set your face toward Jerusalem, and drop a word toward the holy places, and prophesy against the land of Israel.

3. యెహోవా సెలవిచ్చునదేమనగా నేను నీకు విరోధినై తిని. నీతిపరులనేమి దుష్టులనేమి నీలో ఎవరు నుండకుండ అందరిని నిర్మూలము చేయుటకై నా ఖడ్గము ఒరదూసి యున్నాను.

3. And say to the land of Israel, So says Jehovah: Behold, I am against you, and will draw out My sword out of its sheath and will cut off from you the righteous and the wicked.

4. నీతిపరులేమి దుష్టులేమి యెవరును మీలో ఉండకుండ దక్షిణదిక్కు మొదలుకొని ఉత్తరదిక్కువరకు అందరిని నిర్మూలము చేయుటకై నా ఖడ్గము దాని ఒరలో నుండి బయలుదేరియున్నది.

4. Since then I will cut off the righteous and the wicked from you, therefore My sword shall be drawn from its sheath against all flesh from the south to the north,

5. యెహోవానైన నేను నా ఖడ్గము మరల ఒరలోపడకుండ దాని దూసియున్నానని జనులందరు తెలిసికొందురు.

5. so that all flesh may know that I Jehovah have drawn out My sword from its sheath. It shall not return any more.

6. కావున నరపుత్రుడా, నిట్టూర్పు విడువుము, వారు చూచుచుండగా నీ నడుము బద్దలగునట్లు మనోదుఃఖముతో నిట్టూర్పు విడువుము.

6. And you, son of man, groan with the breaking of your loins; and groan with bitterness before their eyes.

7. నీవు నిట్టూర్పు విడిచెదవేమని వారు నిన్నడుగగా నీవుశ్రమదినము వచ్చుచున్నదను దుర్వార్త నాకు వినబడినది, అందరి గుండెలు కరిగిపోవును, అందరి చేతులు బల హీనమవును, అందరి మనస్సులు అధైర్యపడును, అందరి మోకాళ్లు నీరవును, ఇంతగా కీడు వచ్చుచున్నది; అది వచ్చేయున్నది అని చెప్పుము; ఇదే యెహోవా వాక్కు.

7. And it will be when they say to you, Why do you groan? You shall answer, Because of the news that it is coming; and every heart shall melt, and all hands shall be feeble, and every spirit shall faint, and all knees shall be weak as water. Behold, it comes, and it shall be, says the Lord Jehovah.

8. మరియయెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.

8. And the Word of Jehovah came to me, saying,

9. నరపుత్రుడా, నీవు ఈ మాటలు ప్రకటనచేసి ఇట్లనుము యెహోవా సెలవిచ్చునదేమనగా అదిగో ఖడ్గము ఖడ్గమే కనబడుచున్నది, అది పదునుగలదై మెరుగుపెట్టియున్నది.

9. Son of man, prophesy and say, So says Jehovah. Say, A sword, a sword is sharpened and also polished.

10. అది గొప్ప వధ చేయుటకై పదును పెట్టియున్నది, తళతళలాడునట్లు అది మెరుగుపెట్టియున్నది; ఇట్లుండగా నా కుమారుని దండము ఇతర దండములన్నిటిని తృణీకరించునది అని చెప్పి మనము సంతోషించెదమా?

10. It is sharpened in order to slaughter; it is polished so that there may be a flash to it. Or shall we rejoice? You are despising the rod of My son, as if it were every tree.

11. మరియు దూయుటకు సిద్ధమగునట్లు అది మెరుగుపెట్టువానియొద్ద నుంచ బడియుండెను, హతము చేయువాడు పట్టుకొనునట్లుగా అది పదునుగలదై మెరుగు పెట్టబడియున్నది.

11. And He has given it to be polished, to be taken by the hand. The sword, it is sharpened, and it it polished, to give it into the hand of the slayer.

12. నరపుత్రుడా అంగలార్చుము, కేకలువేయుము, అది నా జనులమీదికిని ఇశ్రాయేలీయుల ప్రధానులమీదికిని వచ్చుచున్నది, ఖడ్గభయము నా జనులకు తటస్థించినది గనుక నీ తొడను చరచుకొనుము.

12. Cry and howl, son of man; for it shall be on My people; it shall be on all the rulers of Israel. They are thrown to the sword with My people; Therefore slap your thigh.

13. శోధనకలిగెను, తృణీకరించు దండము రాకపోయిననేమి? ఇదే యెహోవా వాక్కు.

13. Because it is a trial, and what if even the despising rod shall not be? says the Lord Jehovah.

14. నరపుత్రుడా, చేతులు చరచుకొనుచు సమాచారము ప్రవచింపుము, ఖడ్గము ముమ్మారు రెట్టింపబడినదై జనులను హతముచేయునదై యున్నది, అది గొప్పవాని అంతఃపురము చొచ్చి వాని హతము చేయునది.

14. And you, son of man, prophesy and strike your hands together; and let the sword be doubled the third time, the sword of the slain. It is the sword of the slain, the great one that surrounds them;

15. వారి గుండెలు కరిగిపోవునట్లును, పడద్రోయు అడ్డములు అధికములగునట్లును, వారి గుమ్మములలో నేను ఖడ్గము దూసెదను; అయ్యయ్యో అది తళతళలాడుచున్నది, హతము చేయుటకై అది దూయబడియున్నది.

15. so that their heart may melt, and many stumble at all their gates. I have given the threatening sword. Ah! It is made like lightning; it is wrapped for a slaughter.

16. ఖడ్గమా, సిద్ధపడియుండుము; కుడివైపు చూడుము, ఎడమవైపు తిరుగుము, ఎక్కడ నీకు పని యుండునో అక్కడికి తిరుగుము

16. Sharpen yourself on the right! Set yourself on the left, wherever your face is set.

17. నేనుకూడ నా చేతులు చరచుకొని నా క్రోధము తీర్చుకొందును; యెహోవా నగు నేనే మాట ఇచ్చి యున్నాను.

17. And also I, I will also strike My hands together, and I will cause My fury to rest. I Jehovah have spoken.

18. మరియయెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.

18. The Word of Jehovah came to me again, saying,

19. నరపుత్రుడా, బబులోను రాజు ఖడ్గమువచ్చుటకు రెండు మార్గములను ఏర్పరచుము. ఆరెండును ఒక దేశములోనుండి వచ్చునట్లు సూచించుటకై యొక హస్తరూపము గీయుము, పట్టణపు వీధి కొనను దాని గీయుము.

19. And you, son of man, set for yourself two ways, that the sword of the king of Babylon may come. Both of them shall come out of one land. And create a hand at the head of the way to the city; create it.

20. ఖడ్గమునకు అమ్మోనీయుల పట్టణమగు రబ్బాకు ఒక మార్గమును, యూదాదేశమందున్న ప్రాకారములు గల పట్టణమగు యెరూషలేమునకు ఒక మార్గమును ఏర్పరచుము.

20. You shall set a way that the sword may enter into Rabbah of the Ammonites, and into Judah, into fortified Jerusalem.

21. బాటలు చీలుచోట రెండు మార్గములు చీలు స్థలమున శకునము తెలిసికొనుటకు బబులోను రాజు నిలుచుచున్నాడు; అతడు బాణములను ఇటు అటు ఆడించుచు, విగ్రహములచేత విచారణ చేయుచు, కార్యమునుబట్టి శకునము చూచుచున్నాడు.

21. For the king of Babylon shall stand at the parting of the way, at the head of the two highways, to practice divination. He shall shake arrows; he shall ask household idols; he shall look at the liver.

22. యెరూషలేము ఎదుట గుమ్మములను పడగొట్టు యంత్ర ములు పెట్టుమనియు, హతముచేయుదమనియు, ధ్వని ఎత్తుమనియు, జయధ్వని బిగ్గరగా ఎత్తుమనియు, గుమ్మ ములకు ఎదురుగా పడగొట్టు యంత్రములు ఉంచు మనియు, దిబ్బలు వేయుమనియు, ముట్టడి దిబ్బలు కట్టు మనియు యెరూషలేమునుగూర్చి తన కుడితట్టున శకునము కనబడెను.

22. At his right shall be the divining for Jerusalem, to set battering rams, to open the mouth in the slaughter, to lift up the voice with shouting, to set battering-rams against the gates, to pour out and to build a siege wall.

23. ప్రమాణములు చేసికొనిన వారికి ఈ శకునము వ్యర్థముగా కనబడును; అయితే వారు పట్టబడునట్లు వారు చేసికొనిన పాపమును అతడు వారి జ్ఞాపకమునకు తెప్పించును.

23. And it shall be to them an empty divining before their eyes, those who have sworn oaths to them. But He will remember iniquity, that they may be taken.

24. కాబట్టి ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చు చున్నాడుమీ అతిక్రమములు బయలుపడుటవలన మీ సమస్త క్రియలలోనుండి మీ పాపములు అగుపడునట్లు మీ దోషము మీరు మనస్సునకు తెచ్చుకొనినందునను, నేను మిమ్మును జ్ఞాపకము చేసికొనినందునను మీరు చెయ్యి చిక్కియున్నారు.

24. So the Lord Jehovah says this: Because you have made your iniquity to be remembered, in that your transgressions are discovered, in that your sins are revealed in all your deeds; because you have been remembered, you shall be taken with the hand.

25. గాయపడినవాడా, దుష్టుడా, ఇశ్రాయేలీయులకు అధిపతీ, దోషసమాప్తికాలమున నీకు తీర్పువచ్చియున్నది.

25. And you, O slain, wicked king of Israel, of whom has come his day in the time of iniquity of the end.

26. ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుతలాటమును తీసివేయుము కిరీట మును ఎత్తుము, ఇది యికను ఇట్లుండదు. ఇకమీదట నీచుని ఘనునిగాను ఘనుని నీచునిగాను చేయుము.
మత్తయి 23:12

26. So says the Lord Jehovah: Remove the diadem, and take off the crown. This shall not be as it was. Lift up the low one, and put down the high one.

27. నేను దానిని పడద్రోయుదును పడద్రోయుదును పడ ద్రోయుదును; దాని స్వాస్థ్యకర్త వచ్చువరకు అదియు నిలువదు, అప్పుడు నేను దానిని అతనికిచ్చెదను.

27. Ruin, ruin, ruin, I will appoint it. Also this shall not be until the coming of Him whose is the right. And I will give it to Him.

28. మరియు నరపుత్రుడా, నీవు ప్రవచించి ఇట్లనుము అమ్మోనీయులనుగూర్చియు, వారు చేయు నిందను గూర్చియు ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగాహతము చేయుటకు ఖడ్గము ఖడ్గమే దూయబడియున్నది, తళతళలాడుచు మెరుగుపెట్టిన ఖడ్గము వధచేయుటకు దూయబడియున్నది.

28. And you, son of man, prophesy and say, So says the Lord Jehovah concerning the Ammonites, and concerning their shame. Even say: The sword, the sword is drawn, polished for slaughter to make an end, that it may be like lightning;

29. శకునగాండ్రు నీకొరకు మాయా దర్శనములు చూచుచుండగను, వారు వ్యర్థమైన వాటిని మీకు చెప్పుచుండగను, దోషసమాప్తి కాలమున శిక్షనొంది హతులైన దుర్మార్గుల మెడల ప్రక్కన అది నిన్ను పడ వేయును.

29. while they see false visions for you, while they divine a lie to you, to put you on the necks of the slain of the wicked whose day has come in the day of iniquity; it shall have an end.

30. ఖడ్గమును ఒరలోవేయుము; నీవు సృష్టింప బడిన స్థలములోనే నీవు పుట్టిన దేశములోనే నేను నీకు శిక్ష విధింతును.

30. Return it to its sheath. In the place where you were created, in the land of your origin, I will judge you.

31. అచ్చటనే నా రౌద్రమును నీమీద కుమ్మరించెదను, నా ఉగ్రతాగ్నిని నీమీద రగుల బెట్టెదను, నాశనము చేయుటయందు నేర్పరులైన క్రూరులకు నిన్ను అప్పగించెదను.

31. And I will pour out My disgust on you; with the fire of My wrath I will blow against you, and give you into the hand of burning men, able to destroy.

32. అగ్ని నిన్ను మింగును, నీ రక్తము దేశములో కారును, నీ వెన్నటికిని జ్ఞాపకమునకు రాకయుందువు; యెహోవానగు నేనే మాట ఇచ్చి యున్నాను.

32. You shall be for food to the fire. Your blood shall be in the midst of the land. You shall be remembered no more; for I Jehovah have spoken.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Ezekiel - యెహెఙ్కేలు 21 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

పదునైన కత్తి యొక్క చిహ్నం క్రింద యూదా నాశనం. (1-17) 
చివరి అధ్యాయంలో కనిపించే ఉపమానం యొక్క వివరణ ఇక్కడ ఉంది. చెడ్డ మరియు తిరుగుబాటు చేసే ప్రజలకు వ్యతిరేకంగా తన శాసనం అని ప్రతి ఒక్కరూ గుర్తించడానికి, యెరూషలేము మరియు మొత్తం భూమిపై తీర్పు తీసుకురావాలని ప్రభువు ఉద్దేశించాడని తెలియజేయబడింది. పాపులపై దేవుని తీవ్రమైన కోపాన్ని ప్రకటించే వారు దుఃఖ దినాన్ని కోరుకోరని నిరూపించాలి. ఎవరి పతనాన్ని మనం ప్రకటిస్తామో వారి కోసం దుఃఖపడాలని క్రీస్తు ఉదాహరణ మనకు బోధిస్తుంది. దేవుడు తన తీర్పులను అమలు చేయడానికి ఏ సాధనాలను ఉపయోగిస్తాడో, వారికి అప్పగించిన పనుల ప్రకారం ఆయన వారిని బలపరుస్తాడు. తళతళ మెరుస్తున్న ఖడ్గం అది లక్ష్యంగా ఉన్నవారి హృదయాల్లో భయాన్ని కలిగిస్తుంది, కొందరికి ఆయుధంగానూ, ప్రభువు ప్రజలకు దిద్దుబాటు సాధనంగానూ ఉపయోగపడుతుంది. ఈ తీర్పును ప్రకటించడంలో దేవుడు దృఢ నిశ్చయంతో ఉన్నాడు మరియు ప్రవక్త కూడా దానిని ప్రకటించడంలో అత్యంత గంభీరతను ప్రదర్శించాలి.

బాబిలోన్ రాజు యొక్క విధానం వివరించబడింది. (18-27) 
ప్రవచనం యొక్క బహుమతి ద్వారా, యెహెజ్కేలు బాబిలోన్ నుండి నెబుచాడ్నెజార్ యొక్క యాత్రను ఊహించాడు, ఇది భవిష్యవాణి ద్వారా నిర్ణయించబడుతుంది. న్యాయమైన పాలకుడు వచ్చే వరకు యూదా పాలనను ప్రభువు భంగపరుస్తాడు. ఇది యూదు దేశంలో కొనసాగుతున్న తిరుగుబాట్లను, అలాగే వివిధ రాష్ట్రాలు మరియు రాజ్యాలలో గందరగోళ సంఘటనలను ప్రవచించినట్లు కనిపిస్తుంది, ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా మెస్సీయ పాలన స్థాపనకు మార్గం సుగమం చేస్తాయి. ప్రభువు తన తెలివైన ప్రణాళికల నెరవేర్పు వైపు అందరినీ వివేకంతో నడిపిస్తాడు. దైవిక కోపం యొక్క అత్యంత తీవ్రమైన హెచ్చరికల మధ్య కూడా, దయ మరియు పాపభరిత మానవాళికి దయ విస్తరించబడిన వ్యక్తి గురించి ప్రస్తావన ఉంది.

అమ్మోనీయుల నాశనం. (28-32)
అమ్మోనైట్ సోత్‌సేయర్‌లు విజయం గురించి మోసపూరిత అంచనాలను అందించారు. వారు చివరికి తమ ప్రభావాన్ని కోల్పోతారు మరియు మరుగున పడిపోతారు. కనికరం యొక్క ఏజెంట్లుగా ఉపయోగించబడుతున్నందుకు మనం కృతజ్ఞతలు తెలియజేయాలి, దయతో కూడిన ప్రయోజనాల కోసం మన తెలివితేటలను ఉపయోగించుకోవాలి మరియు హాని కలిగించడంలో మాత్రమే రాణించే వ్యక్తుల నుండి మన దూరం ఉంచాలి.



Shortcut Links
యెహెఙ్కేలు - Ezekiel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |