Ezekiel - యెహెఙ్కేలు 4 | View All

1. నరపుత్రుడా, పెంకు ఒకటి తీసికొనివచ్చి నీ ముందర ఉంచుకొని యెరూషలేము పట్టణపు రూపమును దాని మీద వ్రాయుము.

ఈ అధ్యాయం, 5వ అధ్యాయం మొదటి నాలుగు వచనాల్లో దేవుడు యెహెజ్కేలును ప్రజలకు గుణపాఠం తెలిపే ఉదాహరణగా, సాదృశ్య రూపకమైన పాఠంగా ఎలా ఉంచాడో కనిపిస్తున్నది. జెరుసలంకు జరగబోయేదాన్ని ప్రత్యక్షంగా చూపుతున్నాడు యెహెజ్కేలు. ఆ నగరం నేలమట్టం అవుతుందని ప్రజలు నమ్మలేదు (యెహెఙ్కేలు 3:11). యెహెఙ్కేలు 5:5 నుంచి ఆరంభమౌతున్న దేవుని సందేశం, యెహెజ్కేలు చేష్టలూ కలిసి ప్రజల మనసున నాటేలా పని చేశాయి. ఇలాంటి సాదృశ్య రూపకమైన పాఠాలు ఇంకా 1 రాజులు 11:29-31; 2 రాజులు 13:14-19; యెషయా 8:3-4, యెషయా 8:18; యిర్మియా 13:1, యిర్మియా 13:7లో కూడా కనిపిస్తాయి.

2. మరియు అది ముట్టడి వేయబడి నట్లును దానియెదుట బురుజులను కట్టినట్లును దిబ్బ వేసి నట్లును దాని చుట్టునున్న ప్రాకారములను కూలగొట్టు యంత్రములున్నట్లును నీవు వ్రాయుము.

3. మరియు ఇనుపరేకొకటి తెచ్చి, నీకును పట్టణమునకును మధ్య ఇనుప గోడగా దానిని నిలువబెట్టి, నీ ముఖ దృష్టిని పట్టణము మీద ఉంచుకొనుము; పట్టణము ముట్టడి వేయబడినట్లుగా ఉండును, నీవు దానిని ముట్టడివేయువాడవుగా ఉందువు; అది ఇశ్రాయేలీయులకు సూచనగా ఉండును.

జెరుసలంకు ఎదురుగా ఇనుప రేకును ముఖానికి అడ్డంగా పెట్టుకుని యెహెజ్కేలు నిలిచి ఉండడం బహుశా ప్రజలకు ఈ అర్థాన్ని తెలియజేసింది – ఇనుము బలానికీ దృఢ సంకల్పానికీ గుర్తుగా ఉంది. జెరుసలంమీద ముట్టడి తప్పనిసరిగా జరుగుతుంది. యెహెజ్కేలు ప్రవక్త జెరుసలంకు వ్యతిరేకంగా నిలిచి దాన్ని ముట్టడించనున్న దేవునికి ప్రతినిధిగా ఉన్నాడు.

4. మరియు నీ యెడమప్రక్కను పండుకొనియుండి ఇశ్రాయేలువారి దోషమును దానిమీద మోపవలెను; ఎన్ని దినములు నీవు ఆ తట్టు పండుకొందువో అన్ని దినములు నీవు వారి దోషమును భరింతువు.

ఇక్కడ ఇస్రాయేల్ అంటే సొలొమోను మరణం తరువాత యూదానుండి వేరైపోయిన ఉత్తర రాజ్యం (1 రాజులు 12వ అధ్యాయం). యూదా అంటే దక్షిణ రాజ్యం. ఆదినుండి ఉత్తర రాజ్యం ఇస్రాయేల్ దేవునికి లోబడకుండా విగ్రహాలను పూజిస్తూ వచ్చింది (1 రాజులు 12:28-30). కాబట్టి వారు అపరాధం చేస్తూ వచ్చిన సంవత్సరాలు 390 అని లెక్కగట్టబడింది. ఇది బహుశా యరొబాం కాలంనుండి యెహెజ్కేలు కాలందాకా అయి ఉండవచ్చు. యూదా ప్రజల అపరాధ సంవత్సరాలు 40. వారు చాలా కాలం వరకు దేవుని నుండి పూర్తిగా తొలగిపోలేదు. కొందరు మంచి రాజులు యూదాను ఏలారు. కొన్ని సార్లు ఉజ్జీవం కలిగింది. కనీసం బహిరంగంగానైనా నిజ దేవుని విషయంలో ఆయన ఆలయంలో ఆరాధన ఆచారాలను పాటించారు. “భరిస్తూ ఉంటావు”– అంటే వారి పాపాలకు ప్రాయశ్చిత్తం చెయ్యి అని గానీ వాటిని తొలగించి వెయ్యి అని గానీ కాదు. యెహెజ్కేలు కేవలం ఆ రెండు రాజ్యాలకు ప్రతినిధిగా ఉండి తన చర్యల ద్వారా దేవునికి విరుద్ధంగా వారు ఘోర పాప కృత్యాలు జరిగించిన సమయాలను సూచిస్తూ ఉన్నాడు.

5. ఇశ్రాయేలు వారి దోషమును నీవు భరించునట్లుగా వారు దోషము చేసిన సంవత్సరముల లెక్కచొప్పున నీకు మూడువందల తొంబది దినములు నిర్ణయించియున్నాను.

6. ఆ దినములు గడచిన తరువాత కుడిప్రక్కను పండుకొనియుండి నలువది దినములు యూదావారి దోషమును భరింపవలెను, సంవత్సర మొకటింటికి ఒక దినము చొప్పున నేను నిర్ణయించి యున్నాను.

7. ఈలాగు నీవుండగా యెరూషలేము ముట్టడివేయబడినట్లు తేరిచూచుచు, చొక్కాయిని తీసివేసిన బాహువు చాపి దానినిగూర్చి ప్రకటింపవలెను.

“బాహువు”– దేవుడు చర్య తీసుకోబోతున్నాడని తెలియజేసే సూచన. యెషయా 52:10 చూడండి. “ప్రకటించాలి”– బహుశా యెహెఙ్కేలు 5:5-17 లో ఉన్న విషయాలను ప్రకటించాడు. యెహెజ్కేలు వింతైన చర్యలు, మాటల గురించి అక్కడి ప్రవాసుల సమాజమంతటిలోనూ చర్చించడం జరిగి ఉంటుంది. వాళ్ళంతా అతణ్ణి చూచి అతని మాటలు వినేందుకు వచ్చి ఉంటారు. రాకుండా ఎవరుండగలరు?

8. పట్టణము ముట్టడివేయబడినట్లుండు దినములు నీవు రెండవ ప్రక్కను తిరుగక అదేపాటున ఉండునట్లు నిన్నుకట్లతో బంధింతును.

9. మరియు నీవు గోధుమలును యవలును కాయధాన్యములును చోళ్లును సజ్జలును తెల్ల జిలకరను తెచ్చుకొని, యొక పాత్రలో ఉంచి, నీవు ఆ ప్రక్కమీద పండుకొను దినముల లెక్కచొప్పున రొట్టెలు కాల్చుకొనవలెను, మూడువందల తొంబది దినములు నీవు ఈలాగున భోజనము చేయుచు రావలెను;

చాలా కాలం నిలవ ఉండేవి యెహెజ్కేలుకు ఆహారం. తాజా కూరగాయలు, మాంసం, పాలుపెరుగులు అతడు తినలేదు. అనుదినాహారం, నీరు కొద్దికొద్దిగా కొలతప్రకారం తీసుకోవాలి. ఇవన్నీ ముట్టడి పరిస్థితులను సూచించేవి.

10. నీవు తూనికె ప్రకారము, అనగా దినమొకటింటికి ఇరువది తులముల యెత్తుచొప్పున భుజింపవలెను, వేళవేళకు తినవలెను,

11. నీళ్లు కొలప్రకారము అరపడిచొప్పున ప్రతిదినము త్రాగ వలెను, వేళవేళకు త్రాగవలెను;

12. యవల అప్పములు చేసి వారు చూచుచుండగా దానిని మనుష్య మలముతో కాల్చి భుజింపవలెను;

మామూలుగా వాడుకునే వంట చెరకు కూడా దొరకని గడ్డు స్థితిని తెలియజేస్తున్నది.

13. నేను వారిని తోలివేయు జనము లలో ఇశ్రాయేలీయులు ఈ ప్రకారము అపవిత్రమైన ఆహారమును భుజింతురని యెహోవా నాకు సెలవిచ్చెను.

14. అందుకు అయ్యో, ప్రభువా, యెహోవా, నేనెన్నడును అపవిత్రత నొందినవాడను కానే, బాల్యమునుండి నేటి వరకును చచ్చినదానినైనను మృగములు చీల్చినదానినైనను నేను తినినవాడను కానే, నిషిద్ధమైన మాంసము నా నోట ఎన్నడును పడలేదే అని నేననగా
అపో. కార్యములు 10:14

అపో. కార్యములు 10:14 పొల్చిచూడండి. యెహెజ్కేలు లేవీ గోత్రం వాడు (యెహెఙ్కేలు 1:3). మోషే ధర్మశాస్త్రంలో ఉన్న ఆహార నియమ నిబంధనలన్నిటినీ తు.చ. తప్పక పాటిస్తూ వచ్చాడు (లేవీ 11వ అధ్యాయం).

15. ఆయనచూడుము, మనుష్య మలమునకు మారుగా నీకు గోమలము నేను నిర్ణయించి యున్నాను; దీనితో నీవు నీ భోజనము సిద్ధ పరుచుకొనుమని సెలవిచ్చి

16. నరపుత్రుడా, ఇదిగో యెరూషలేములో రొట్టెయను ఆధారమును నేను లేకుండ చేసినందున వారు తూనికె ప్రకారముగా బహు చింతతో రొట్టె భుజింతురు, నీళ్లు కొలచొప్పున త్రాగుచు విస్మయ మొందుదురు.

17. అన్నపానములు లేకపోయినందున వారు శ్రమనొంది విభ్రాంతిపడి యొకనినొకడు చూచుచు తాము కలుగజేసికొనిన దోషమువలన నశించిపోవుదురు.Shortcut Links
యెహెఙ్కేలు - Ezekiel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |