Ezekiel - యెహెఙ్కేలు 5 | View All

1. మరియు నరపుత్రుడా, నీవు మంగలకత్తివంటి వాడిగల కత్తియొకటి తీసికొని నీ తలను గడ్డమును క్షౌరముచేసికొని, త్రాసు తీసికొని ఆ వెండ్రుకలను తూచి భాగములు చేయుము.

1. 'Son of man, take a sharp sword and use it as a razor to shave your head and beard. Use a scale to weigh the hair into three equal parts.

2. పట్టణమును ముట్టడి వేసిన దినములు సంపూర్ణమైనప్పుడు నీవు పట్టణములో వాటి మూడవ భాగమును కాల్చి, రెండవ భాగమును తీసి ఖడ్గముచేత హతముచేయు రీతిగా దానిని చుట్టు విసిరికొట్టి మిగిలిన భాగము గాలికి ఎగిరిపోనిమ్ము; నేను ఖడ్గముదూసి వాటిని తరుముదును.

2. Place a third of it at the center of your map of Jerusalem. After acting out the siege, burn it there. Scatter another third across your map and chop it with a sword. Scatter the last third to the wind, for I will scatter my people with the sword.

3. అయితే వాటిలో కొన్నిటిని తీసికొని నీ చెంగున కట్టుకొనుము;

3. Keep just a bit of the hair and tie it up in your robe.

4. పిమ్మట వాటిలో కొన్నిటిని మరల తీసి అగ్నిలోవేసి కాల్చుము; దానినుండి అగ్ని బయలుదేరి ఇశ్రాయేలు వారినందరిని తగులబెట్టును.

4. Then take some of these hairs out and throw them into the fire, burning them up. A fire will then spread from this remnant and destroy all of Israel.

5. మరియు ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చెను ఇది యెరూషలేమే గదా, అన్యజనులమధ్య నేను దాని నుంచితిని, దానిచుట్టు రాజ్యములున్నవి.

5. 'This is what the Sovereign LORD says: This is an illustration of what will happen to Jerusalem. I placed her at the center of the nations,

6. అయితే వారు నా విధులను తృణీకరించి, నా కట్టడల ననుసరింపక దుర్మార్గత ననుసరించుచు, నా విధులను కట్టడలను త్రోసి వేసి తమ చుట్టునున్న అన్యజనుల కంటెను దేశస్థులకంటెను మరి యధికముగా దుర్మార్గులైరి

6. but she has rebelled against my regulations and decrees and has been even more wicked than the surrounding nations. She has refused to obey the regulations and decrees I gave her to follow.

7. కాబట్టి ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నా కట్టడల ననుసరింపకయు నా విధులను గైకొనకయు నుండువారై, మీ చుట్టునున్న అన్యజనులకు కలిగియున్న విధులనైనను అనుసరింపక, మీరు మీ చుట్టునున్న దేశస్థులకంటె మరి యధికముగా కఠినహృదయులైతిరి.

7. 'Therefore, this is what the Sovereign LORD says: You people have behaved worse than your neighbors and have refused to obey my decrees and regulations. You have not even lived up to the standards of the nations around you.

8. కావున ప్రభువైన యెహోవానగు నేను నీకు విరోధినైతిని, అన్యజనులు చూచుచుండగా నీకు శిక్ష విధింతును.

8. Therefore, I myself, the Sovereign LORD, am now your enemy. I will punish you publicly while all the nations watch.

9. నీ హేయ కృత్యములను బట్టి పూర్వమందు నేను చేయనికార్యమును, ఇక మీదట నేను చేయబూనుకొనని కార్యమును నీ మధ్య జరిగింతును.

9. Because of your detestable idols, I will punish you like I have never punished anyone before or ever will again.

10. కావున నీ మధ్య తండ్రులు తమ కుమారులను భక్షింతురు, కుమారులు తమ తండ్రులను భక్షింతురు, ఈ ప్రకారము నేను నీకు శిక్ష విధించి నీలో శేషించిన వారిని నలుదిశల చెదరగొట్టుదును.

10. Parents will eat their own children, and children will eat their parents. I will punish you and scatter to the winds the few who survive.

11. నీ హేయదేవత లన్నిటిని పూజించి నీవు చేసిన హేయమైన క్రియలన్నిటి చేత నా పరిశుద్ధస్థలమును అపవిత్ర పరచితివి గనుక కరుణా దృష్టియైనను జాలియైనను లేక నేను నిన్ను క్షీణింప జేసెదనని నా జీవముతోడు ప్రమాణము చేయుచున్నాను; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు

11. 'As surely as I live, says the Sovereign LORD, I will cut you off completely. I will show you no pity at all because you have defiled my Temple with your vile images and detestable sins.

12. కరవు వచ్చి యుండగా నీలో మూడవ భాగము తెగులుచేత మరణ మవును, మూడవ భాగము ఖడ్గముచేత నీ చుట్టు కూలును, నేను కత్తి దూసిి మిగిలిన భాగమును నలుదిశల చెదరగొట్టి తరుముదును.
ప్రకటన గ్రంథం 6:8

12. A third of your people will die in the city from disease and famine. A third of them will be slaughtered by the enemy outside the city walls. And I will scatter a third to the winds, chasing them with my sword.

13. నా కోపము తీరును, వారిమీద నా ఉగ్రత తీర్చుకొని నన్ను ఓదార్చుకొందును, నేను వారి మీద నా ఉగ్రత తీర్చుకొనుకాలమున యెహోవానైన నేను ఆసక్తిగలవాడనై ఆలాగు సెలవిచ్చితినని వారు తెలిసి కొందురు

13. Then at last my anger will be spent, and I will be satisfied. And when my fury against them has subsided, all Israel will know that I, the LORD, have spoken to them in my jealous anger.

14. ఆలాగు నీ చుట్టునున్న అన్యజనులలో నిన్ను చూచు వారందరి దృష్టికి పాడుగాను నిందాస్పదముగాను నేను నిన్ను చేయుదును.

14. 'So I will turn you into a ruin, a mockery in the eyes of the surrounding nations and to all who pass by.

15. కావున నీ పోషణాధారము తీసివేసి, నీమీదికి నేను మహా క్షామము రప్పించి, నీవారు క్షయమగునట్లుగా వారిని క్షయపరచు మహాక్షామమును పంపించి, కోపముచేతను క్రోధముచేతను కఠినమైన గద్దింపులచేతను నేను నిన్ను శిక్షింపగా

15. You will become an object of mockery and taunting and horror. You will be a warning to all the nations around you. They will see what happens when the LORD punishes a nation in anger and rebukes it, says the LORD.

16. నీ చుట్టునున్న అన్య జనులకు నీవు నిందకును ఎగతాళికిని హెచ్చరికకును విస్మయ మునకును ఆస్పదముగా ఉందువు; యెహోవానగు నేనే ఆజ్ఞ ఇచ్చియున్నాను.

16. 'I will shower you with the deadly arrows of famine to destroy you. The famine will become more and more severe until every crumb of food is gone.

17. ఈ ప్రకారము నేను నీమీదికి క్షామమును దుష్టమృగములను పంపుదును, అవి నీకు పుత్ర హీనత కలుగజేయును, తెగులును ప్రాణహానియు నీకు కలుగును, మరియు నీమీదికి ఖడ్గమును రప్పించెదను; యెహోవానగు నేనే యీలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాను.
ప్రకటన గ్రంథం 6:8

17. And along with the famine, wild animals will attack you and rob you of your children. Disease and war will stalk your land, and I will bring the sword of the enemy against you. I, the LORD, have spoken!'



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Ezekiel - యెహెఙ్కేలు 5 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

ఒక రకమైన జుట్టు, యూదులపై రాబోయే తీర్పులను చూపుతుంది. (1-4) 
ప్రవక్త తన తల మరియు గడ్డం నుండి అన్ని వెంట్రుకలను తీసివేయాలి, ఇది దేవుని యొక్క పూర్తి తిరస్కరణ మరియు ప్రజలను విడిచిపెట్టడాన్ని సూచిస్తుంది. ఈ వెంట్రుకలలో ఒక భాగాన్ని నగరం మధ్యలో కాల్చివేయాలి, ఇది కరువు మరియు తెగులు కారణంగా నశించే అనేకమందిని సూచిస్తుంది. మరొక భాగాన్ని ముక్కలుగా కట్ చేయాలి, కత్తితో చంపబడే వారికి ప్రాతినిధ్యం వహిస్తుంది. మూడవ భాగం గాలిలో చెల్లాచెదురుగా ఉంటుంది, ఇది కొంతమందిని జయించినవారి భూమికి బలవంతంగా మార్చడాన్ని సూచిస్తుంది మరియు మరికొందరు భద్రత కోసం పొరుగు దేశాలకు పారిపోవడాన్ని సూచిస్తుంది. మూడవ భాగం యొక్క చిన్న మొత్తాన్ని ప్రవక్త దుస్తులలో జాగ్రత్తగా కట్టివేయాలి, ఆశ్రయం పొందే వారి అరుదు. అయితే, పాపాత్ములు ఎక్కడ ఆశ్రయించినా, అగ్ని మరియు ఖడ్గ రూపంలో ఉన్న దేవుని ఉగ్రత చివరికి వారిని దహిస్తుంది.

ఈ భయంకరమైన తీర్పులు ప్రకటించబడ్డాయి. (5-17)
జెరూసలేంపై తీర్పు చాలా అరిష్టమైనది మరియు అది వ్యక్తీకరించబడిన విధానం దాని తీవ్రతను పెంచుతుంది. దేవుని కోపము ఎదుట ఎవరు కదలకుండా ఉండగలరు? జీవితం మరియు మరణం రెండింటిలోనూ పశ్చాత్తాపాన్ని కొనసాగించేవారు కనికరం లేకుండా శాశ్వతమైన నాశనాన్ని ఎదుర్కొంటారు. ప్రభువు కరుణించని రోజు వస్తుంది. ప్రభువు కమాండ్మెంట్స్ నుండి వైదొలిగే వ్యక్తులు లేదా మతపరమైన సంఘాలు జెరూసలేంకు సమానమైన విధిని తప్పించుకోకూడదు. బదులుగా, మన రక్షకుడైన దేవుని బోధలను మన జీవితంలోని అన్ని అంశాలలో ఉదహరించేందుకు కృషి చేద్దాం. త్వరలో లేదా తరువాత, దేవుని వాక్యం దాని స్వంత వాస్తవికతను ప్రదర్శిస్తుంది.



Shortcut Links
యెహెఙ్కేలు - Ezekiel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |