Joel - యోవేలు 1 | View All

1. పెతూయేలు కూమారుడైన యోవేలునకు ప్రత్యక్షమైన యోహోవా వాక్కు

1. పెతూయేలు కుమారుడైన యోవేలు ఈ సందేశాన్ని యెహోవా దగ్గరనుండి అందుకొన్నాడు:

2. పెద్దలారా, ఆలకించుడి దేశపు కాపురస్థులారా, మీరందరు చెవియొగ్గి వినుడి ఈలాటి సంగతి మీ దినములలో గాని మీ పితరుల దినములలోగాని జరిగినదా?

2. నాయకులారా, ఈ సందేశం వినండి! దేశంలోనివసించే మనుష్యులారా, మీరందరూ నామాట వినండి. మీ జీవితకాలలంలో ఇలాంటిదిఏదైనా ఇదివరకు జరిగిందా? లేదు! మీతండ్రుల కాలంలో ఇలాంటిది ఎదైనా జరిగిందా? లేదు!

3. ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయుడి. వారు తమ బిడ్డలకును ఆ బిడ్డలు రాబోవు తరము వారికిని తెలియజేయుదురు.

3. ఈ సంగతులను గూర్చి మీరు మీ పిల్లలతో చెపుతారు. మీపిల్లలు వారి పిల్లలతో చెపుతారు. మీ మనుమలు, మనుమరాండ్రు తమ తరువాత తరమువారితో చెపుతారు.

4. గొంగళిపురుగులు విడిచినదానిని మిడుతలు తినివేసి యున్నవి మిడుతలు విడిచినదానిని పసరుపురుగులు తినివేసి యున్నవి.పసరుపురుగులు విడిచినదానిని చీడపురుగులు తినివేసి యున్నవి.

4. కోతమిడుతలు విడిచిపెట్టిన దానిని దండు మిడుతలు తినేస్తాయి దండు మిడుతలు విడిచిపెట్టిన దానిని దూకుడు మిడుతలు తినేస్తాయి. దూకుడు మిడుతలు విడిచి పెట్టిన దానిని వినాశ మిడుతలు తినేశాయి!

5. మత్తులారా, మేలుకొని కన్నీరు విడువుడి ద్రాక్షారసపానము చేయువారలారా, రోదనము చేయుడి.క్రొత్త ద్రాక్షారసము మీ నోటికి రాకుండ నాశ మాయెను,

5. మద్యపానమత్తులారా మేల్కొని, ఏడ్వండి! ద్రాక్షామద్యం తాగే మీరందరూ ఏడ్వండి. ఎందుకంటే మీ క్రొత్త ద్రాక్షామద్యం అయిపొయింది. ఆ ద్రాక్షామద్యం మరోగుక్కెడు మీకు దొరకదు.

6. లెక్కలేని బలమైన జనాంగము నా దేశము మీదికి వచ్చియున్నది వాటి పళ్లు సింహపు కోరలవంటివి వాటి కాటు ఆడుసింహపు కాటువంటిది.
ప్రకటన గ్రంథం 9:8

6. నా రాజ్యం మీద యుద్ధం చేయటానికి, ఒకపెద్ద శక్తిగల రాజ్యం వస్తోంది. వారు లెక్కించ శక్యంకానంత మంది సైనికులు ఉన్నారు. ఆమిడుతలు (శత్రుసైనికులు) మిమ్మల్ని నిలువునా చీల్చివేయగలవు! అది వారికి సింహపుకోరలు ఉన్నట్టుగా ఉంట్టుంది.

7. అవి నా ద్రాక్షచెట్లను పాడుచేసియున్నవి నా అంజూరపు చెట్లను తుత్తునియలుగా కొరికి యున్నవి బెరడు ఒలిచి వాటిని పారవేయగా చెట్లకొమ్మలు తెలుపాయెను

7. నా ద్రాక్షావల్లుల నుండి ద్రాక్షాపళ్ళు అన్నింటినీ ఆ “మిడుతలు”తినేస్తాయి! అవి నా అంజూరపు చెట్లను నాశనం చేస్తాయి. మిడుతలు నా చె ట్లబెరడును తినేస్తాయి. కొమ్మలు తెల్లబారి పోతాయి. చెట్లు నాశనం చేయబడతాయి.

8. పెనిమిటి పోయిన ¸యౌవనురాలు గోనెపట్ట కట్టు కొని అంగలార్చునట్లు నీవు అంగలార్చుము.

8. పెళ్లికి సిద్ధంగా ఉండి తనకు కాబోయే భర్త అప్పుడే చంపి వేయబడిన ఒక యువతిలా ఏడ్వండి.

9. నైవేద్యమును పానార్పణమును యెహోవా మందిరములోనికి రాకుండ నిలిచి పోయెను. యెహోవాకు పరిచర్యచేయు యాజకులు అంగలార్చు చున్నారు.

9. యాజకులారా! యెహోవా సేవకులారా! ఏడ్వండి. ఎందుకంటే యెహోవా ఆలయంలో ధాన్యార్పణం, పానీయార్పణం ఇక ఉండవు.

10. పొలము పాడైపోయెను భూమి అంగలార్చుచున్నది ధాన్యము నశించెను క్రొత్త ద్రాక్షారసము లేకపోయెను తైలవృక్షములు వాడిపోయెను.

10. పొలాలు పాడు చేయబడ్డాయి. చివరికి నేలకూడా విలపిస్తుంది. ఎందుకనగా ధాన్యం పాడైపొయింది.కొత్త ద్రాక్షారసం ఎండిపోయింది. ఒలీవ నూనె ఇకలేదు.

11. భూమిమీది పైరు చెడిపోయెను గోధుమ కఱ్ఱలను యవల కఱ్ఱలను చూచి సేద్యగాండ్లారా, సిగ్గునొందుడి.ద్రాక్షతోట కాపరులారా, రోదనము చేయుడి.

11. రైతులారా విచారించండి! ద్రాక్షాతోట రైతులారా గట్టిగా ఏడ్వండి. గోధుమ, బార్లీ కోసం ఏడ్వండి! ఎందుకంటే పొలంలోని పంట నష్టమైంది.

12. ద్రాక్షచెట్లు చెడిపోయెను అంజూరపుచెట్లు వాడి పోయెను దానిమ్మచెట్లును ఈతచెట్లును జల్దరుచెట్లును తోట చెట్లన్నియు వాడిపోయినవి నరులకు సంతోషమేమియు లేకపోయెను.

12. ద్రాక్షా వల్లులు ఎండియాయి. అంజూరపుచెట్టు చస్తోంది.దానిమ్మ చెట్టు, ఖర్జూరపుచెట్టు, ఆపిల్ చెట్టు, పొలములోని చెట్లు అన్నీ ఎండి పోయాయి. ప్రజల్లో సంతోషం చచ్చింది.

13. యాజకులారా, గోనెపట్ట కట్టుకొని అంగలార్చుడి. బలిపీఠమునొద్ద పరిచర్య చేయువారలారా, రోదనము చేయుడి. నా దేవుని పరిచారకులారా, గోనెపట్ట వేసికొని రాత్రి అంతయు గడపుడి. నైవేద్యమును పానార్పణమును మీ దేవుని మందిర మునకు రాకుండ నిలిచిపోయెను.

13. యాజకులారా, మీ విచార సూచక వస్త్రాలు ధరించి గట్టిగా ఏడ్వండి. బలిపీఠపు సేవకులారా, నా దేవుని సేవకులారా, మీరు మీ విచారసూచక వస్త్రాలతోనే నిద్రపోతారు. ఎందుకంటే దేవుని ఆలయంలో ధాన్యార్పణం, పానీయార్పణం ఇకమీదట ఉండవు. మా వేశ పరచు నీ దేవుడైన సమయం ఉయెహోవా ఆలయానికి వారిని తీసుకొని వచ్చి యెహోవాకు ప్రార్థించండి.

14. ఉపవాసదినము ప్రతిష్ఠించుడి వ్రతదినము ఏర్పరచుడి. యెహోవాను బతిమాలుకొనుటకై పెద్దలను దేశములోని జనులందరిని మీదేవుడైన యెహోవా మందిరములో సమకూర్చుడి.

14. ఉపవాసం ఉండాల్సిన ఒక ప్రత్యేక సమయం ఉంటుందని ప్రజలతో చెప్పు. ప్రత్యేకమైన ఒక సమావేశం కోసర ప్రజల్నిపిలువుము. దేశంలో నివసిస్తున్న నాయకులను, ప్రజలందరిని సమావేశ పరచు. నీదేవుడైన యెహోవా ఆలయాని కివారిని తీసుకొనివచ్చి యెహోవాకు ప్రార్థించండి.

15. ఆహా, యెహోవా దినము వచ్చెనే అది ఎంత భయంకరమైన దినము! అది ప్రళయమువలెనే సర్వశక్తునియొద్దనుండి వచ్చును.

15. దుఃఖపడండి! ఎందుకంటే యెహోవా ప్రత్యేకదినం సమీపంగా ఉంది. ఆ సమయంలో సర్వశక్తిమంతుడైన దేవుని దగ్గర నుండి శిక్ష ఒక దాడిలా వస్తుంది.

16. మనము చూచుచుండగా మన దేవుని మందిరములో ఇక సంతోషమును ఉత్సవమును నిలిచిపోయెను మన ఆహారము నాశనమాయెను.

16. మన ఆహారం పోయింది. మన దేవుని ఆలయం నుండి ఆనందం, సంతోషం పోయాయి.

17. విత్తనము మంటిపెడ్డల క్రింద కుళ్లిపోవుచున్నది పైరు మాడిపోయినందున ధాన్యపుకొట్లు వట్టి వాయెను కళ్లపుకొట్లు నేలపడియున్నవి.

17. మనం విత్తనాలు విత్తాం, కాని ఆ విత్తనాలు ఎండిపోయి చచ్చి మట్టిలో పడివున్నాయి. మన మొక్కలు ఎండపోయి చచ్చిపోయాయి. మన కొట్టాలు ఖాళీ అయిపోయి పడిపోతున్నాయి.

18. మేతలేక పశువులు బహుగా మూల్గుచున్నవి ఎడ్లు మందలుగా కూడి ఆకలికి అల్లాడుచున్నవి గొఱ్ఱమందలు చెడిపోవుచున్నవి.

18. జంతువులు ఆకలితో మూలుగుతున్నాయి. పశువుల మందలు గందరగోళంగా తిరుగుతున్నాయి. అవి మేసేందుకు గడ్డి లేదు. గొర్రెలు చస్తున్నాయి.

19. అగ్ని చేత అరణ్యములోని మేతస్థలములు కాలిపోయినవి మంట తోటచెట్లన్నిటిని కాల్చివేసెను యెహోవా, నీకే నేను మొఱ్ఱ పెట్టుచున్నాను.

19. యెహోవా, సహయంకోసం నీకు నేను మొరపెడుతున్నాను. అగ్ని మా పచ్చటి పొలాలను ఎడారిగా మార్చేసింది. పొలంలొని చెట్లన్నింటినీ జ్వాలలు కాల్చి వేశాయి.

20. నదులు ఎండిపోవుటయు అగ్నిచేత మేతస్థలములు కాలిపోవుటయు చూచి పశువులును నీకు మొఱ్ఱ పెట్టుచున్నవి.

20. అడవి జంతువులకు కూడ నీ సహాయం కావాలి. కాలువలు ఎండిపోయాయి, నీళ్ళు లేవు! మా పచ్చటి పొలాలను అగ్ని ఎడారిగా మార్చివేసింది.Shortcut Links
యోవేలు - Joel : 1 | 2 | 3 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |