Joel - యోవేలు 1 | View All

1. పెతూయేలు కూమారుడైన యోవేలునకు ప్రత్యక్షమైన యోహోవా వాక్కు

“వచ్చిన వాక్కు”– హోషేయ 1:1 యోవేలు అంటే “యెహోవాయే దేవుడు” అని అర్థం.

2. పెద్దలారా, ఆలకించుడి దేశపు కాపురస్థులారా, మీరందరు చెవియొగ్గి వినుడి ఈలాటి సంగతి మీ దినములలో గాని మీ పితరుల దినములలోగాని జరిగినదా?

బైబిల్లో మరి కొన్ని చోట్ల చెప్పిన మిడతల దండు దేవుని నుంచి వచ్చిన తీర్పుగా ఎంచబడింది (నిర్గమకాండము 10:13-15; ద్వితీయోపదేశకాండము 28:38, ద్వితీయోపదేశకాండము 28:42; 2 దినవృత్తాంతములు 7:13) ఇక్కడ యోవేలు వివరిస్తున్న మిడతల దాడి ఇస్రాయేల్ దేశంలో చాలా కాలంనుంచి లేనంత తీవ్రంగా ఉంది. ఈ మిడతలు భారత దేశంలో కనిపించే మిడతలను పోలి ఉన్నాయి గాని కొన్ని తేడాలు ఉన్నాయి. 4 వ వచనంలో హీబ్రూ భాషలో ఈ మిడతలకు నాలుగు వేరు వేరు పేర్లు ఉన్నాయి. ఇవి నాలుగు వేరు వేరు రకాలై ఉండవచ్చు, లేదా ఒకే జాతి మిడత ఎదుగుదలలో నాలుగు దశలై ఉండవచ్చు.

3. ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయుడి. వారు తమ బిడ్డలకును ఆ బిడ్డలు రాబోవు తరము వారికిని తెలియజేయుదురు.

4. గొంగళిపురుగులు విడిచినదానిని మిడుతలు తినివేసి యున్నవి మిడుతలు విడిచినదానిని పసరుపురుగులు తినివేసి యున్నవి.పసరుపురుగులు విడిచినదానిని చీడపురుగులు తినివేసి యున్నవి.

5. మత్తులారా, మేలుకొని కన్నీరు విడువుడి ద్రాక్షారసపానము చేయువారలారా, రోదనము చేయుడి.క్రొత్త ద్రాక్షారసము మీ నోటికి రాకుండ నాశ మాయెను,

“త్రాగుబోతులారా”– తాగు బోతుతనం గురించి నోట్ ఆదికాండము 9:21. ఆ కాలంలో ఇస్రాయేల్‌లో ఇది సాధారణ పాపం అని అర్థమౌతున్నది. “కన్నీళ్ళువిడవండి”– వ 8,11,13. దేవుడు వారి పాపాలను బట్టి వారిని శిక్షిస్తున్నాడు. అది తాగుబోతుతనానికి, నిర్లక్ష్యానికి సమయం కాదు. పశ్చాత్తాపపడి పాపాలను ఒప్పుకోవలసిన సమయం – యోవేలు 2:12-14.

6. లెక్కలేని బలమైన జనాంగము నా దేశము మీదికి వచ్చియున్నది వాటి పళ్లు సింహపు కోరలవంటివి వాటి కాటు ఆడుసింహపు కాటువంటిది.
ప్రకటన గ్రంథం 9:8

“సమూహం”– అంటే మిడతలు. యోవేలు వీటిని దండెత్తి వస్తున్న సైన్యంగా వర్ణిస్తున్నాడు. కోట్ల కొలది మిడతలు దండుగా వచ్చి మేఘంలా దేశాన్ని కమ్మి అధిక వినాశాన్ని కలిగిస్తాయి.

7. అవి నా ద్రాక్షచెట్లను పాడుచేసియున్నవి నా అంజూరపు చెట్లను తుత్తునియలుగా కొరికి యున్నవి బెరడు ఒలిచి వాటిని పారవేయగా చెట్లకొమ్మలు తెలుపాయెను

8. పెనిమిటి పోయిన ¸యౌవనురాలు గోనెపట్ట కట్టు కొని అంగలార్చునట్లు నీవు అంగలార్చుము.

“కన్య”– యోవేలు దేశం మొత్తాన్ని ఉద్దేశించి అంటున్నాడు. వారి శోకం మూడు రాత్రులకు ముందే తన భర్తను కోల్పోయిన పెళ్ళికూతురి శోకం లాంటిది కావాలి.

9. నైవేద్యమును పానార్పణమును యెహోవా మందిరములోనికి రాకుండ నిలిచి పోయెను. యెహోవాకు పరిచర్యచేయు యాజకులు అంగలార్చు చున్నారు.

“నైవేద్యాలు”– నిర్గమకాండము 29:30; లేవీయకాండము 2:1; లేవీయకాండము 23:18; సంఖ్యాకాండము 6:15; సంఖ్యాకాండము 29:16. పొలాల్లోని ద్రాక్ష తోటల్నీ ధాన్యాన్నీ మిడతలు ధ్వంసం చేసేశాయి గనుక ఆలయానికి అర్పణలు తేవడానికి ఏమీ మిగల్లేదు. వ 12 ను బట్టి మిడతల తెగులుతో బాటు దేశంలో వర్షంలేమి కూడా ఉందని తెలుస్తున్నది.

10. పొలము పాడైపోయెను భూమి అంగలార్చుచున్నది ధాన్యము నశించెను క్రొత్త ద్రాక్షారసము లేకపోయెను తైలవృక్షములు వాడిపోయెను.

11. భూమిమీది పైరు చెడిపోయెను గోధుమ కఱ్ఱలను యవల కఱ్ఱలను చూచి సేద్యగాండ్లారా, సిగ్గునొందుడి.ద్రాక్షతోట కాపరులారా, రోదనము చేయుడి.

12. ద్రాక్షచెట్లు చెడిపోయెను అంజూరపుచెట్లు వాడి పోయెను దానిమ్మచెట్లును ఈతచెట్లును జల్దరుచెట్లును తోట చెట్లన్నియు వాడిపోయినవి నరులకు సంతోషమేమియు లేకపోయెను.

13. యాజకులారా, గోనెపట్ట కట్టుకొని అంగలార్చుడి. బలిపీఠమునొద్ద పరిచర్య చేయువారలారా, రోదనము చేయుడి. నా దేవుని పరిచారకులారా, గోనెపట్ట వేసికొని రాత్రి అంతయు గడపుడి. నైవేద్యమును పానార్పణమును మీ దేవుని మందిర మునకు రాకుండ నిలిచిపోయెను.

14. ఉపవాసదినము ప్రతిష్ఠించుడి వ్రతదినము ఏర్పరచుడి. యెహోవాను బతిమాలుకొనుటకై పెద్దలను దేశములోని జనులందరిని మీదేవుడైన యెహోవా మందిరములో సమకూర్చుడి.

“ఉపవాసం”– యోవేలు 2:15; లేవీయకాండము 16:29; న్యాయాధిపతులు 20:26; 2 సమూయేలు 12:16; యిర్మియా 14:12; యోనా 3:4-5; మత్తయి 6:16; మత్తయి 9:15. “బ్రతిమిలాడుకోండి”– వారు పశ్చాత్తాపపడి దేవుడు తన తీర్పును వెనక్కు తీసేసుకుని దేశంలోని ప్రజలకు క్షేమం ప్రసాదించాలని ఆయనను వేడుకోవాలి.

15. ఆహా, యెహోవా దినము వచ్చెనే అది ఎంత భయంకరమైన దినము! అది ప్రళయమువలెనే సర్వశక్తునియొద్దనుండి వచ్చును.

“యెహోవా దినం”– ఈ మాటలు యోవేలు గ్రంథంలో మరి నాలుగు సార్లు కనిపిస్తాయి (యోవేలు 2:1, యోవేలు 2:11, యోవేలు 2:31; యోవేలు 3:14). అన్ని చోట్లా ఈ మాటలకు ఉన్న అర్థం ఒకటి కాదు అనుకోవడానికి సరైన కారణాలు కనిపించవు. యోవేలు గతంలో జరిగిన దాన్ని గురించి మాట్లాడుతూ హఠాత్తుగా భవిష్యత్తులో రాబోయే మరింత గొప్ప సంఘటనను చూస్తున్నాడు. గతంలో జరిగినది రాబోయే దానికి ఒక చిన్న సాదృశ్యం మాత్రమే. “యెహోవా దినం” అనే మాట బైబిలులో ఇతర పుస్తకాల్లో కూడా కనిపిస్తుంది – యెషయా 13:6, యెషయా 13:9; యెహెఙ్కేలు 13:5; యెహెఙ్కేలు 30:3; ఆమోసు 5:18, ఆమోసు 5:20; ఓబద్యా 1:15; జెఫన్యా 1:7, జెఫన్యా 1:14; మలాకీ 4:5. క్రొత్త ఒడంబడికలో రాబోయే ఆ కాలానికి “ప్రభు దినం” అనే పేరు ఇవ్వబడింది. 1 థెస్సలొనీకయులకు 5:2; 2 థెస్సలొనీకయులకు 2:2; 2 పేతురు 3:10 చూడండి. యెహోవా దినం అంటే ఈ యుగాంతంలో క్రీస్తు ఈ లోకానికి తిరిగి వచ్చే సమయంలో జరిగే సంభవాలను గురించినది. “ఆసన్నమైంది”– పైన ఇచ్చిన రిఫరెన్సుల్లో చాలా చోట్ల యెహోవా దినం దగ్గర పడిందన్న మాట ఉంది. ఆ దినం ఇప్పటికీ ఇంకా రానప్పుడు ప్రవక్తలు తమ కాలంలోనే అది అంత సమీపంగా ఉందని ఎలా చెప్పగలిగారు? దీనికి వేరు వేరు వివరణలు ఇయ్యవచ్చు. “ఆసన్నమైంది” అంటే “త్వరలో రాబోతూ ఉంది” అని అర్థం కాకపోవచ్చు. సిద్ధంగా ఉంది, కాలం పరిపక్వమైనట్టు దేవుడు భావించగానే వచ్చేందుకు సిద్ధంగా ఉంది అని అర్థం కావచ్చు. రోమీయులకు 13:11-12; ప్రకటన గ్రంథం 1:3 నోట్స్ చూడండి. లేక దేవుడు తన స్వంత విధానంలో ఆ సమయం గురించి ప్రవక్తల ద్వారా మాట్లాడుతున్నాడని చెప్పవచ్చు (2 పేతురు 3:8-9 పోల్చి చూడండి – ఆయన తన సేవకుల ద్వారా మాట్లాడాక జరిగిపోయిన సమయం ఆయన దృష్టిలో మూడు రోజుల్లాగా ఉంది). లేక మరో విధంగా చెప్పాలంటే యోవేలుకు (ఇతర ప్రవక్తలు కూడా) ఈ యుగాంతంలో జరిగే సంభవాల గురించిన దర్శనం వచ్చింది. వారు యుగాంతంలో ఉన్నట్టున్నారు. ఆ దృష్టితో చూస్తే యెహోవా దినం దగ్గర పడింది (హబక్కూకు 2:3 పోల్చి చూడండి). “నాశనంగా”– యెహోవా దినం గురించి మరిన్ని వర్ణనలు యెషయా 2:10-21; యెషయా 24:1-13; ప్రకటన 15—16 అధ్యాయాలు చూడండి.

16. మనము చూచుచుండగా మన దేవుని మందిరములో ఇక సంతోషమును ఉత్సవమును నిలిచిపోయెను మన ఆహారము నాశనమాయెను.

తరువాతి కాలంలో రాబోయే భయంకర మహా దినమైన యెహోవా దినానికి చిన్న సాదృశ్యంగా ఉన్న తన కాలంలోని సంభవాలను మళ్ళీ వర్ణిస్తున్నాడు యోవేలు.

17. విత్తనము మంటిపెడ్డల క్రింద కుళ్లిపోవుచున్నది పైరు మాడిపోయినందున ధాన్యపుకొట్లు వట్టి వాయెను కళ్లపుకొట్లు నేలపడియున్నవి.

18. మేతలేక పశువులు బహుగా మూల్గుచున్నవి ఎడ్లు మందలుగా కూడి ఆకలికి అల్లాడుచున్నవి గొఱ్ఱమందలు చెడిపోవుచున్నవి.

19. అగ్ని చేత అరణ్యములోని మేతస్థలములు కాలిపోయినవి మంట తోటచెట్లన్నిటిని కాల్చివేసెను యెహోవా, నీకే నేను మొఱ్ఱ పెట్టుచున్నాను.

“మంటలు”– గొప్ప అగ్ని దహించివేసినట్టుగా మిడతలు, వర్షంలేమి కలిసి సమస్తాన్నీ నాశనం చేసేశాయి. “మొరపెట్టుకొంటున్నాను”– విపత్తు కాలం దేవునికి విరోధంగా సణుగుకునే కాలం కాదు. నిరాశ చెందే కాలం కాదు. మన హృదయాలను కఠినం చేసుకునే కాలం కాదు. ప్రార్థనకూ దేవుని ముఖాన్ని వెదికేందుకూ అది మనల్ని పురిగొల్పాలి.

20. నదులు ఎండిపోవుటయు అగ్నిచేత మేతస్థలములు కాలిపోవుటయు చూచి పశువులును నీకు మొఱ్ఱ పెట్టుచున్నవి.Shortcut Links
యోవేలు - Joel : 1 | 2 | 3 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |